రాష్ట్ర గవర్నర్ నరసింహన్ గురించి గత నెల రోజులుగా కొన్ని కధనాలు వస్తున్నాయి... గత రెండు రోజుల నుంచి, మీడియాలో కధనాలు విస్తృతంగా వస్తున్నాయి... ఇవన్నీ చూస్తున్న, తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు ధన్యవాదాలు చెప్తున్నారు... ఈ కధనాల సారంశం, గవర్నర్ నివేదికలతోనే, తెలుగుదేశం పార్టీకి, బీజేపీ కి గ్యాప్ పరిగింది... అదే విధంగా, పవన్ కళ్యాణ్ విషయంలో కూడా, గవర్నర్ సూచన మేరకే, పవన్ తెలుగుదేశం పార్టీకి దూరం అయ్యాడు అని... అయితే, ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం శ్రేణులు మాత్రం, నిజంగా గవర్నర్ నరసింహన్ కు రుణ పడి ఉంటామని చెప్తున్నారు...
ఎందుకంటే, చంద్రబాబు ఎవరినీ అంత తొందరగా వదులుకోరు... బీజీపీ వాళ్ళు ఏమో, మోడీ ఇమేజ్ వల్లే మేము గెలిచాం అని చెప్తున్నారు.. పవన్ అభిమానులు కూడా, పవన్ వల్లే తెలుగుదేశం గెలించింది అని చెప్తున్నారు... మరో పక్క, చంద్రబాబు నైజం ఇది కాదు, కేవలం రాష్ట్రం కోసం, కంప్రోమైజ్ అయ్యి పరిపాలన చేస్తున్నారు... ఇలా ఉంటే చంద్రబాబు భయపడుతున్నారని ప్రచారం చేస్తున్నారు... ఇలా అనేక ప్రచారాలతో, చంద్రబాబుని అవహేళన చేస్తుంటే, ఏమి చెయ్యాలని పరిస్థితి తెలుగుదేశం కార్యకర్తలది... అయితే, ఇప్పుడు పరిస్థితి వేరు... 1999లో ఉన్న చంద్రబాబు దూకుడు మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది... మోడీని ఒక ఆట ఆడుకుంటున్నారు... మరో పక్క ఇక పవన్ తో కాని, బీజేపీ తో కాని పొత్తు ఉండదు అనే వార్త తెలుసుకుని, ఇక ఇప్పుడు చంద్రబాబు సత్తా ఏంటో తెలుస్తుంది అని అంటున్నాయి టిడిపి శ్రేణులు... మొత్తానికి, గవర్నర్ పుణ్యమా అని, ఇవి అన్నీ జరిగాయి అని, అందుకే గవర్నర్ కు ధ్యానవాదాలు అని చెప్తున్నారు...
రాష్ట్రంలో పరిస్థితులు జగన్మోహన్రెడ్డికి అనుకూలంగా ఉన్నాయనీ, పవన్ కల్యాణ్ ఎదురుతిరిగితే చంద్రబాబు మరింత బలహీనపడతారనీ కూడా గవర్నర్ నివేదిక ఇచ్చారట! కేంద్ర పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ రావడంతో గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలుపెట్టడం మొదలుపెట్టారు. పవన్ కల్యాణ్‌ను పిలిపించుకుని మాట్లాడారు. ఐ.వై.ఆర్. కృష్ణారావు వంటివారితో కూడా సంప్రదింపులు జరిపారట.. గవర్నర్ నరసింహన్ చెబుతున్న మాటలు, ఇస్తున్న నివేదికలను నమ్మిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై దురభిప్రాయం ఏర్పరచుకున్నారు. ఈ కారణంగానే చంద్రబాబుకు ఆయన చాలా రోజులు అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేది ఆ కధనాల సారాంశం...