ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కొన్ని నేషనల్ ఛానల్స్ తో మాట్లడారు... ఈ సందర్భంగా మోడీ, గవర్నర్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు... చంద్రబాబు ముందుగా మీడియాతో మాట్లాడుతూ, థర్డ్ ఫ్రంట్, ఫెడరల్ ఫ్రంట్ లాంటి వాటి గురించి నేను ఇప్పుడేమి మాట్లాడను అని, కేవలం రాష్ట్రానికి జరిగిన అన్యాయం మాత్రమే అందరికీ చెప్పటానికి, ఇక్కడకు వచ్చాను అని చెప్పారు... గుజరాత్ అల్లర్ల తర్వాత మోదీని సీఎం పదవి నుంచి తప్పించాలని మొదట డిమాండ్ చేసింది మీరే కదా అని విలేకరలు అడగగా, అవును. ఆ విషయాన్ని చరిత్ర రికార్డుల నుంచి ఎవరూ చెరిపివేయలేరు. రాష్ట్ర అభివృద్ధి కోసం బీజేపీతో చేతులు కలిపాను. మోదీ ఇలా చేస్తారనుకోలేదు అని అన్నారు...
మీరు అప్పట్లో, మోడీకి వ్యతిరేకంగా మాట్లాడిన విషయం, ఇప్పుడు మోదీ గుర్తుపెట్టుకున్నారేమో అని అడగగా, దీనికి చంద్రబాబు నవ్వుతూ, అయ్యి ఉండొచ్చు, కాని నాకు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని అన్నారు.... ఆంధ్రప్రదేశ్ కు సాయం చేస్తే అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలను అధిగమిస్తుందని, ఆ ఘనత మీకు దక్కుతుందనే మోదీ సహాయం చేయలేదా? దీని పై మీరు ఏమి చెప్తారు అని అడగగా, దీని చంద్రబాబు సమాధానం ఇస్తూ, దీని పై నేను ఏమి చెప్తాను, ఆ విషయం మీరే గ్రహించాలి అని జవాబు చెప్పారు...
అలాగే విలేకరులు, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తీరు పై కూడా ప్రశ్నలు వేసారు... ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం పట్ల సానుకూలంగా వ్యవహరించడం లేదు కదా అని విలేకరులు అడుగగా, 'ఔను' అన్నట్టు తల ఊపారు చంద్రబాబు... అంతకు మించి, ఆ విషయంలో చెప్పటానికి ఇష్ట పడలేదు... జాతీయ స్థాయిలో మీరు పోషించే పాత్ర ఏమిటి? అన్న ప్రశ్నకు, ఏపీకి జరిగిన అన్యాయాన్ని బీజేపీ, కాంగ్రెసేతర ప్రతిపక్షాలకు వివరించేందుకే ఢిల్లీకి వచ్చాను. కాంగ్రెస్ నేతల్ని కూడా కలుసుకోవడం లేదు. ప్రస్తుతం రాజకీయాలు ముఖ్యం కాదు. ఏపీకి న్యాయం చేయాల్సిందిగా కేంద్రంపై మీ ద్వారా ఒత్తిడి చేయడమే ముఖ్యం! అయినా, ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నది కదా అని బదులు ఇచ్చారు...