కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం జోరు మీద ఉంది... బీజేపీ పార్టీ తరుపున, మైనింగ్ డాన్ గాలి జనార్దనరెడ్డి, ఎలక్షన్ ఫండింగ్ పుష్టిగా చేస్తున్నారు అనే ప్రచారం సాగుతుంది... అందుకే ఇదే ఊపులో, గాలి తన రాజకీయ పునఃప్రవేశానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు ఆయన సోదరుడు జి.సోమశేఖర రెడ్డి ఇటీవల ప్రకటించారు. నేరుగా ఎన్నికల్లో పోటీ చేయకపోయినా తన అన్న జనార్దనరెడ్డి తెలుగు ప్రజల ప్రాబల్యం ఉన్న చోట్ల భాజపా విజయానికి సహకరిస్తారని చెప్పారు... అమిత్ షా బళ్లారి పర్యటనలో కూడా, హడావిడి అంతా గాలి అనుచరులదే...

amit 02042018 2

అయితే, గాలి జనార్దనరెడ్డి, బీజేపీ తరుపున ఎమ్మల్యేగా పోటీ చేస్తున్నారని, వార్తలు రావటంతో, బీజేపీ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... రెండున్నరేళ్ళు జైలులు ఉండి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇస్తూ, అవినీతి పై పోరాటం అనే కధలు చెప్తున్నారని ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది... దీంతో నిఘా వర్గాల నివేదికలో కూడా ఇదే స్పష్టం అవ్వటంతో, అసలుకే మోసం వస్తుంది అని గ్రహించి, గాలి జనార్దనరెడ్డికి, భాజపాకు ఎలాంటి సంబంధం లేదని అమిత్‌షా ప్రకటించారు... బళ్లారి పరిసర జిల్లాల్లో మొత్తం 27 సీట్లు ఉన్నాయి... ఇక్కడ గాలి ప్రభావం ఎక్కువే... అయితే, లోపాయికారీ ఒప్పందంతో, ఈ ప్రకటన చేసి ఉంటారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది...

amit 02042018 3

మరో పక్క, గాలికి, బీజేపీ ఇచ్చిన షాక్ తో, ఇక్కడ జగన్ కూడా ఉలిక్కి పడ్డాడు... జగన్, బీజేపీకి దగ్గర అవ్వటానికి, గాలి జనార్ధన్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించారు అనేది అందరికీ తెలిసిన విషయమే... ఇప్పుడు గాలిని, బీజేపీ వాడుకుని ఎలా వదిలేసిందో చూసిన తరువాత, జగన్ కు గుబులు పట్టుకుంది... గాలి జనార్ధన్ రెడ్డి, జగన్ ఇద్దరూ ఒకే కోవలోకి చెందిన అవినీతి పక్షులు... ఇద్దరు రాజశేఖర్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోయిన వారే... ఇప్పుడు జగన్ తో, మాంచి దోస్తీ చేస్తున్న బీజేపీ, తనని ఒక పావుగా వాడుకుంటుంది అని, టైం చూసుకుని గాలి జనార్ధన్ రెడ్డిని గెంటినట్టు, నన్ను కూడా గెంటుతుంది ఏమో, అని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.... ఏది ఏమైనా, బీజేపీ చెప్పినట్టి నడుచుకోవాల్సిన పరిస్థితి... పాపం జగన్.. ఫ్యూచర్, ఇప్పుడే కళ్ళ ముందు కనిపిస్తుంది...

రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది పోరాడండి రా అంటే, వెళ్లి ప్రధాని కార్యాలయంలో కూర్చుంటాడు ఒకడు... ఇంకొకడు, నేను నిజాయతీ పరుడుని అని కటింగ్ ఇస్తూ, మోడీ అంటే ఇష్టం అంటాడు, ప్రేమ అంటాడు.. వీరిద్దరూ కలిసి, ఇక్కడ మోడీ పై పోరాడుతున్న చంద్రబాబుని తిడతారు.. మోడీని ఒక్క మాట అనాలంటే భయం... రాష్ట్రం కోసం, మోడీతో పోరాడాలి అంటే భాయం... ఢిల్లీలో మోడీ చుట్టూ తిరుగుతారు, ఇక్కడకు వచ్చి పోరాడుతున్నట్టు బిల్డ్ అప్ ఇస్తారు... తెలుగు చానల్స్ లో రెచ్చిపోతారు, నేషనల్ మీడియాలో మోడీ అంటే ఎంతో ఇష్టం అంటారు... అయితే ఇప్పుడు ఇంకో అడుగు ముందుకేసి, మోడీని ఏమన్నా అంటే ఊరుకునేది లేదు అంటున్నారు...

modi 02042018 1 2

విజయసాయి రెడ్డి, ప్రతి రోజు ప్రధాని మంత్రి కార్యాలయంలో కనిపిస్తూ ఉంటారు... ఎందుకో ఎవరికీ తెలియదు... ఈయన ప్రొఫైల్ ఏమన్నా మంచిదా అంటే, 11 సిబిఐ కేసులు, 5 ఈడీ కేసుల్లో A2.. ఇలాంటి వాడికి ప్రతి రోజు ప్రధాని కార్యాలయంలో ఏమి పని ? మోడీ పై అవిశ్వాసం పెడతాం అంటూ, వెళ్లి మోడీ ఆఫీస్ లోనే కూర్చుంటారు... ఇదే విషయం చంద్రబాబు పదే పదే అడుగుతున్నారు.. ప్రధాని కార్యాలయం, ఏమన్నా ఆర్ధిక నేరస్థుల అడ్డా నా అంటూ, ప్రశ్నించారు...

modi 02042018 1 3

అయితే, మొన్న విజయసాయి రెడ్డి, చంద్రబాబు మాటల పై స్పందిస్తూ, నేను రోజు వెళ్లి ప్రధానిని కలుస్తా, నా ఇష్టం అంటూ రెచ్చిపోయారు... దానికి చంద్రబాబు మాట్లాడుతూ, మీరు వెళ్లి కాపురాలు చేసుకోండి, నేను అడిగేది ప్రధాని కార్యాలయం, ఇలాంటి నేరస్థులని ప్రోత్సహిస్తుందా అంటూ ప్రశ్నించారు... దీని పై విజయసాయి రెడ్డి ఈ రోజు స్పందిస్తూ, మోడీ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న చంద్రబాబు పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తానని కొన్ని రోజుల క్రిందట చెప్పారు.. అయితే, ఈ రోజు, చంద్రబాబుకి సభాహక్కుల ఉల్లంఘన నోటీసిచ్చారు... మోడీని ఎవరన్నా ఏమన్నా అంటే, రియాక్షన్ ఇలాగే ఉంటుంది అని విజయసాయి రెడ్డి వార్నింగ్ ఇస్తున్నారు...

ఆంధ్రప్రదేశ్ విభజనపై కేంద్రం హామీల అమలుపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ సోమవారం విచారణకు వచ్చింది. విభజన హామీల అమలుకు ఆదేశాలు ఇవ్వాలంటూ గతంలో తెలంగాణ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం పై, ఈ రోజు సుప్రీం కోర్ట్ విచారణ జరిపింది... నాలుగేళ్లుగా విభజన చట్టం ఎందుకు అమలు చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని జస్టిస్‌ సిక్రీ ధర్మాసనం ప్రశ్నించింది. విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. నాలుగు వారాలు గడువు కావాలని కేంద్ర ప్రభుత్వం కోరడంతో సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసింది.

supreme 02042018 1

అయితే ఈ రోజు న్యాయస్ధానం జారీ చేసిన నోటీసులకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల తరఫున న్యాయవాదులు హాజరైనా కేంద్రం స్పందించలేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై నాలుగు వారాల్లో వివరణ ఇస్తామని అడిషనల్ సొలిసిటర్ జనరల్ మణిందర్ సింగ్ ధర్మాసనాన్ని కోరారు. దీంతో ఈ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.

supreme 02042018 1

మరో పక్క, పార్లమెంట్ లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది... సభ మొదలవగానే అన్నాడీఎంకే సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కావేరి జలాల వివాద పరిష్కారానికి బోర్డును ఏర్పాటు చేయాలని అన్నాడీఎంకే నిరసన వ్యక్తం చేశారు. సభ్యుల నిరసనల మధ్యే సభను నడిపించేందుకు స్పీకర్ సుమిత్రామహాజన్ యత్నించారు. దీంతో అన్నాడీఎంకే సభ్యులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అవిశ్వాస తీర్మానంపై పలు పార్టీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ ప్రకటించారు. సభ సజావుగా సాగితే అవిశ్వాసంపై చర్చ చేపట్టవచ్చన్నారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని సభ్యులు ఆందోళన విరమించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ సభ్యులు వెనక్కి తగ్గకపోవడంతో స్పీకర్ సభను రేపటి(మంగళవారం)కి వాయిదా వేశారు.

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ, ఈ రోజు వివిధ టీవీ చానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన అంతరంగాన్ని పంచుకున్నారు.. రెండు రోజుల క్రితం, జనసేన పార్టీలోకి వెళ్ళటం లేదు అని ప్రకటించిన విషయం తెలిసిందే... వీఆర్ఎస్‌కు ఆయన దరఖాస్తు చేసుకోగా… అది మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే... అయితే ఆయన ఆ పార్టీలో చేరతారు… ఈ పార్టీలో చేరతారనే ప్రచారం ఊపందుకుంది... ఇప్పటికే దీనిపై స్పందించిన లక్ష్మీనారాయణ… ఈరోజు మాట్లాడుతూ… నా సిద్ధాంతాలకు తగిన విధంగా నా భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని ప్రకటించారు...

lakshmi 02042018

నా రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు, నేను ఇంకా సెలవులో ఉన్నానన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ… నా రాజీనామా ఆమోదించిన తరువాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు... రాజకీయాల్లోకి వస్తున్నారా అని అడిగితె, నా సిద్ధాంతాలకు తగిన విధంగా నా భవిష్యత్ ఉంటుందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నా సేవలు సరిగా గుర్తించలేదనడం సరికాదన్నారు. తాను 20 సంవత్సరాలు మహారాష్ట్ర కేడర్‌లో పనిచేశానని… నాకు మరాఠీ చాలా బాగా వచ్చని… మరాఠీ ప్రజలు కూడా చాలా మంచి వాళ్లన్నారు లక్ష్మీనారాయణ...

lakshmi 02042018

రాజీనామా ఆమోదం పొందాక ఎందుకు చేశానన్న విషయం చెబుతానని అన్నారు... అయితే, ఈ సందర్భంలో, ప్రస్తుతం జగన్ కేసులు నడుస్తున్న తీరు గురించి స్పందించమని అడగ్గా, తాను 2013లో సీబీఐ విధుల నుంచి బదిలీ అయిన విషయాన్ని గుర్తుచేశారు. జగన్ పై సీబీఐ కేసుల విషయాన్ని ఇప్పుడున్న సిబిఐ అధికారులని అడిగితే, తెలుస్తుందని చెప్పారు... లక్ష్మీనారాయణ, ఎంతో పర్ఫెక్ట్ గా, జగన్ పై 11 చార్జ్ షీట్లు పెట్టి, 16 నెలలు జైలులో ఉంచిన సంగతి తెలిసిందే... అయితే, ఇప్పుడు జగన్ కేసులలో వేగం తగ్గింది అనే, ఆరోపణలు వస్తున్నాయి... అందుకు తగ్గటే, పరిణామాలు కూడా జరుగుతున్నాయి..

Advertisements

Latest Articles

Most Read