నిన్నటి నుంచి గౌతమ్ సవాంగ్ పై ప్రభుత్వం పెట్టిన ఒత్తిడికి, ఆయన తలోగ్గారు. నిన్నటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ సవాంగ్ కి ఏపీపీఎస్సీ చైర్మెన్ పదవి ఇస్తున్నాం అని లీకులు వదిలింది. ఇదే ఫైల్ నిన్న రాష్ట్ర సచివాలయానికి ప్రభుత్వం పంపించింది. అయితే సచివాలయంలో అధికారులు, ఈ ఫైల్ ప్రాసెస్ చేసేందుకు అంగీకరించ లేదు. గౌతమ్ సవాంగ్ ఐపిఎస్ గా ఉన్నారు కాబట్టి, ఏపీపీఎస్సీ చైర్మెన్ పదవి రాజ్యాంగబద్ధ పదవి కాబట్టి, ఆయన రాజీనామా చేస్తే మాత్రమే, ఈ ఫైల్ ముందుకు వెళ్ళే అవకాసం ఉంటుందని, ఫైల్ వెనక్కు పంపించారు. దీంతో ప్రభుత్వం వెంటనే గౌతమ్ సవాంగ్ తో మాట్లాడే ప్రయత్నాలు మొదలు పెట్టింది. అయితే ఈ ప్రతిపాదనకు గౌతమ్ సవాంగ్ అంగీకరించలేదు. 17 నెలలు సర్వీస్ మిగిలి ఉండగా, రాజీనామా చేసి, ఆ పదవిలోకి వెళ్ళటం పై అసహనం వ్యక్తం చేసారు. దీంతో కీలక అధికారులను, ఆయన బ్యాచ్ మేట్స్ ని, సన్నిహితులు ద్వారా, గౌతమ్ సవాంగ్ పైన ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అయితే ఈ పదివి తీసుకోవటానికి ఒప్పుకొని గౌతమ్ సవాంగ్ , చాలా గట్టిగా ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. అయితే చివరకు ఆయనకు అన్ని వైపుల నుంచి అనేక రకాలుగా ఒత్తిడులు రావటం, అందరూ వివిధ కారణాలు చెప్పటంతో, ఆయన ఒప్పుకోక తప్పలేదు.
కొద్ది సేపటి క్రితమే, గౌతమ్ సవాంగ్ ఒత్తిడికి తలొగ్గారు. 17 నెలల సర్వీస్ ని ఆయన వాదులుకుని, ఏపీపీఎస్సీ చైర్మెన్ పదవి తీసుకోవటానికి సిద్ధం అయ్యారు. డీమ్డ్‌టూబీ రిజైన్డ్ క్లాజ్‌ను ఉపయోగించుకుని ప్రభుత్వం, మళ్ళీ ఫైల్ ముందుకు పెట్టింది. అంటే గౌతమ్ సవాంగ్ రాజీనామా చేస్తున్నారు అని అర్ధం. ఈ ఫైల్ ని ప్రాసెస్ చేసి, ఆయన రాజీనామా ఆమోదిస్తారు. ఈ ఫైల్ ఇప్పటికే రాజ్‌భవన్‌కు పంపించారు. మరికొద్ది సేపట్లోనే, దీని పైన ఆదేశాలు బయటకు వచ్చే అవకాసం ఉంది. ముఖ్యంగా గౌతమ్ సవాంగ్ ని, రాష్ట్ర ప్రభుత్వం వాడుకుని వదిలేసింది అనే అభిప్రాయం బలంగా వెళ్ళింది. మూడేళ్ళ పాటు చెప్పినవి అన్నీ చేసినా, చివరకు ఇలా చేయటం పై, వ్యతిరేకత వస్తుందని భావించిన ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ కింద, వెంటనే రంగంలోకి దిగి గౌతమ్ సవాంగ్ కు ఏపీపీఎస్సీ చైర్మెన్ పదవి ఆఫర్ చేసింది. అయితే గౌతమ్ సవాంగ్ దీన్ని కూడా అవమానంగా భావించారు. అయితే చివరకు అనేక తర్జనబర్జనలు తరువాత గౌతమ్ సవాంగ్ ఒప్పుకున్నారు.