ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అసెంబ్లీలో భావోద్వేగానికి గురయ్యారు... అమరావతిని, బీజేపీ, కేంద్రంలోని ఢిల్లీ పెద్దలు ఎలా ఎగతాళి చేస్తున్నారో చెప్తూ, భావోద్వేగంతో, కళ్ళల్లో నీళ్లతో ఉద్వేగంగా మారారు... ఆయన మాటల్లో, "డ్రీమ్ సిటీ కడతారా.. గ్రీన్ సిటీ కడతారా.. ఎదో సిటీ కడతారంట, కట్టమనండి, ఏమి కట్టారు.. అని కొందరు బీజేపీ వాళ్ళు అంటున్నారు... నేను ఇంతటితో తృప్తి పడదలుచుకోలేదు... అమరావతి ఆంధ్రుల రాజధాని.. హైదరాబాద్ కంటే గొప్పగా కడతా.. చెన్నై కంటే బ్రహ్మడం గా కడతా.. బెంగుళూరు ని మించి కడతా.. ప్రపంచం లోనే గొప్ప సిటీగా అమరావతిని నిర్మిస్తా... ప్రతి తెలుగువాడు గర్వంగా చెప్పుకునేలా కడతా" అంటూ కళ్ళల్లో నీళ్లతో ఉద్వేగంగా చంద్రబాబు..
వెంటనే తమాయించుకుని, ప్రసంగం కొనసాగించారు... ‘ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించేవరకు ఆదుకోమని కేంద్రాన్ని కోరుతున్నా. కేంద్రం సాయం వల్లే రాష్ట్రం రెండంకెల వృద్ధిరేటు సాధించిందని భాజపా నేతలు అంటున్నారు. మరి భాజపా ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో ఈ వృద్ధి ఎందుకు జరగడం లేదు? మేము కష్టపడుతున్నాము కాబట్టే అభివృద్ధి సాధించగలుగుతున్నాం. రాష్ట్రం విభజన జరిగినప్పుడు మోదీ స్పందిస్తూ.. ‘కాంగ్రెస్ ప్రభుత్వం బిడ్డకు జన్మనిచ్చి తల్లిని పురిట్లోనే చంపేసింది. మేం అధికారంలో ఉంటే రెండు రాష్ట్రాలకు సమాన న్యాయం చేసేవాళ్లం’ అని వ్యాఖ్యానించారు.
విభజన చట్టం, ప్రత్యేక హోదా ఐదుకోట్ల ఆంధ్రుల హక్కు. ఎన్టీఆర్ ఆంధ్రులకు ఆత్మగౌరవం ఇస్తే.. నేను ఆత్మవిశ్వాసం ఇచ్చా. నాకు భయం లేదు. ఎలాంటి లాబీయింగ్‌కు పాల్పడలేదు. కేంద్రాన్ని గవర్నర్ పదవి అడిగానా?మంత్రి పదవి, కార్పోరేషన్ పదవి అడిగానా?. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రాన్ని అడగడానికి రాష్ట్ర భాజపా నేతలకు మొహమాటం ఉందేమో? నాకు లేదు అంటూ చంద్రబాబు మాట్లాడారు...