మోడీ మీద ఉన్న విశ్వాసం, తన సొంత ఎమ్మల్యేల మీద లేకుండా పోయింది... జగన్ ఎంత అభద్రతా భావంలో ఉన్నాడో చెప్పటానికి ఇదొక ఉదాహరణ... జగన్ అంటే, తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకే నమ్మకం లేదు అని చెప్పే ఉదంతం... తన సొంత పార్టీ ఎమ్మెల్యేలకు, తన మీద భరోసా లేదని తెలిసిన జగన్, చివరకు ఈ పని చేస్తున్నారు... సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కంట్రోల్ చెయ్యలేని జగన్, ఇక రాష్ట్రాన్ని ఏమి చెయ్యగలడు... జగన్ మీద విశ్వాసం లేక ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు వచ్చేశారు... ఇంకా దాదాపు 25 మంది వచ్చేయటానికి రెడీగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి... అయితే, రాజ్యసభ ఎన్నికలు వస్తున్న తరుణంలో, జగన్ కు ప్రస్తుతం ఉన్న 44 మంది ఎమ్మెల్యేలకు, ఒక రాజ్యసభ సీటు వస్తుంది... అయితే, జగన్ పై విశ్వాసం లేక, ఇప్పటికే కొంత మంది టిడిపిలో చేరి పోవటానికి రెడీగా ఉన్నారు..
ఈ నేపధ్యంలో, జగన్ ఇప్పటికే రాష్ట్ర బీజేపీ ఎమ్మల్యేలతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు... ముగ్గురు ఎమ్మెల్యేల టిడిపిలోకి వెళ్తే, టిడిపి రాజ్యసభ సీటు గెలుస్తుంది... అందుకే ముగ్గురు వెళ్ళినా, బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మల్యేలతో, క్రాస్ వోటింగ్ కి జగన్ ప్లాన్ చేసారు... మరో బీజేపీ ఎమ్మల్యే జగన్ కు వోట్ వెయ్యటానికి ఒప్పుకోలేదని సమాచారం... అయితే, ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం, దాదాపు 12 మంది వైసిపీ ఎమ్మల్యేలు, టిడిపిలో చేరతారనే వార్తలు వస్తున్నాయి... దీంతో, ఎలాగైనా ఒక్క రాజ్యసభ సీటు గెలిచి, మోడీ ముందు తాను బలవంతుండని అని జగన్ నిరుపించుకోవటం కోసం, క్యాంప్ రాజకీయాలకు తెర లేపారు...
ఇందులో భాగంగా పార్టీకి చెందిన 44 మంది ఎమ్మెల్యేలను విదేశాలకు తీసుకువెళ్తున్నాం అంటూ ముందుగా లీక్ ఇచ్చారు... దీంతో ఎమ్మెల్యేలు హాయిగా ఏ అమెరికానో, యూరప్ దేశాలకో, లేకపోతే ఏ సింగపూరో వెళ్ళవచ్చని కలలు కన్నారు... ఢిల్లీలో ధర్నా అంటూ అందరినీ పిలిపించి, మిమ్మల్ని విదేశాలకు తీసుకు వెళ్తున్నాం అని, పక్కనే ఉన్న నేపాల్ దేశానికి తీసుకు పోయారు... దీంతో ఎమ్మల్యేలు అవాక్కయ్యారు.. కొంత మంది జగన్ కు నమ్మిన బంట్లు అయిన ఎమ్మల్యేలు తప్పితే, దాదాపు 35 మంది ఎమ్మల్యేలు క్యాంపులో ఉన్నారు... అందరి దగ్గర, సెల్ ఫోన్ లు కూడా లేకుండా చేసారని తెలుస్తుంది... వేరే దేశాలు అయితే ఖర్చు ఎక్కువ అవుతుందని, అదీ చివరకు అందరూ తన వైపే ఉంటారనే నమ్మకం లేక, ఖర్చు తక్కువ అవుతుందని, నేపాల్ తీసుకుపోయినట్టు లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి...