వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వై విజయసాయిరెడ్డికి, తెలుగుదేశం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఢిల్లీ వేదికగా సవాల్ విసిరారు. విజసాయి రెడ్డి, నేను రాజీనామాకు సిద్ధం, వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేస్తా, నాతొ పాటు వచ్చి తన పదవికి రాజీనామా చెయ్యి... ఇద్దరం ప్రజల్లోకి వెళ్దాం, ఎవరు ఏంటో ప్రజలే చెప్తారు అంటూ, జేసీ దివాకర్ రెడ్డి, విజసాయి రెడ్డికి సవాల్ విసిరారు... ఊరికే రాజీనామాలు అంటూ మీడియాలో హడావిడి కాదు, జైట్లీ స్పష్టం చెయ్యగానే మా మంత్రులు రాజీనామా చేసారు, వీరు మాత్రం ఏప్రిల్ 6 దాకా ఆగుతారంట, అంటూ ఎద్దేవా చేసారు...

diwakar 09032018

ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విజయసాయికి చిత్తశుద్ధి, రాష్ట్రంపై ప్రేమ ఉంటే వెంటనే రాజీనామాకు కలిసిరావాలని అన్నారు. టీడీపీ, బీజేపీల మధ్య ట్రిపుల్ తలాక్ అయిపోయిందని, వారి పిల్లల గురించి ఇప్పుడు ఆలోచించాలని అన్నారు. తాము వదిలేసిన బీజేపీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిఖాకు సిద్ధమైందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పిన థర్డ్ ఫ్రంట్ వెనుక చంద్రబాబు వెళ్లాల్సిన అవసరం లేదని, చంద్రబాబు వెనుకే అందరూ రావాల్సి వుంటుందని అన్నారు.

diwakar 09032018

మరో పక్క, టీడీపీ ఎంపీ శివప్రసాద్ రోజుకో విధంగా వేషం వేస్తూ తమ నిరసనను తెలియజేస్తున్నారు. మొదటి కృష్ణుడిగా, ఆపై ఎన్టీఆర్ వేషధారణలో మొన్న రైతులా వచ్చిన ఎంపీ నేడు కోయదొర వేషంలో పార్లమెంటుకు వచ్చారు. పార్లమెంటు ఆవరణలో కుర్రోకుర్రు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ‘‘చెప్పినవాట వింటే హుర్రో హుర్రు...వినకపోతే పుర్రోపుర్రు. ఇందిరాగాంధీకి చెప్పినా...ఎన్టీఆర్‌తో పెట్టుకోవద్దని. నా మాట వినలేదు. దాంతో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సోనియాతో చెప్పినా... తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయొద్దని...నా మాట వినకుండా విభజన చేశారు. ఇప్పుడు ఆ పార్టీ ఎన్ని కష్టాలు పడుతుందో అందరికి తెలుసు. మోదీ...సఖ్యంగా ఉండేది ఇష్టాం లేదా?...మీకు మూడిందా ఏంది? తెలుగు ప్రజల ఆత్మగౌరవ నాడి తెలియలేదా ఏంది? ఇలానే ఉంటే మీ పని పుర్రోపుర్రు. దీని అర్థం ఆంగ్లంలో ‘అవుట్’ అని కోయదొర వేషంలో ఎంపీ శివప్రసాద్ వ్యాఖ్యలు చేశారు.

టీడీపీ ఎంపీలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తనతో ప్రధాని ఫోన్‌ సంభాషణను ఎంపీలకు సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో పార్టీల అభిప్రాయాలను చంద్రబాబు, ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. మిగతా జాతీయ పార్టీలు కూడా మన కోసం కలిసి వచ్చి పోరాడేలా, మనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని చెప్పారు.. ఇదే సందర్భంలో నిన్న జగన్ చేసిన సూచన పై చంద్రబాబు స్పందించారు... మంత్రుల రాజీనామాతో ఏమీ కాదు, మంత్రులు రాజీనామా చెయ్యాలి, అవిస్వాసం పెట్టాలి, నన్ను ఫాలో అవ్వండి అంటూ, నిన్న జగన్ చేసిన సూచన పై చంద్రబాబు ఒకింత విస్మయం వ్యక్తం చేసారు...

cbn 089032018 2

జగన్ లాంటి వాడి దగ్గర నుంచి, జాతీయ జకీయాలు గురించి నేను నేర్చుకోవాలా ? జాతీయ రాజకీయాలను జగన్ దగ్గర తానిప్పుడు నేర్చుకోవాల్సిన అవసరం లేదని మండిపడ్డారు. ఆక్రమాస్తులు, క్విడ్ ప్రోకోలకు సంబంధించి 11 కేసుల్లో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తిని తాను అనుసరించడం ఏంటని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.. మేము తీసుకున్న నిర్ణయం, తీసుకోబోయే నిర్ణయాలు జగన్ లాగా సొంత ప్రయోజనాల కోసం కాదని, రాష్ట్ర ప్రయోజనల కోసమని స్పష్టం చేసారు...

cbn 089032018 3

టీడీపీ తీసుకున్న నిర్ణయంపై జాతీయ స్థాయిలో పలు పార్టీల అభిప్రాయాలను ఇప్పటికే అడిగి తెలుసుకున్నానని, ఎన్నో పార్టీలు మద్దతు పలికాయని వెల్లడించారు. పలు పార్టీలు టీడీపీకి సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మనమేమీ గొంతెమ్మ కోరికలను కోరడం లేదని, చట్టంలో ఉన్నవే అడుగుతున్నామని స్పష్టం చేశారు. నాలుగేళ్ల పాటు ఎదురుచూసినా ఫలితం రానందునే రాజీనామాలు చేశామని తెలిపారు. ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను కేంద్రం పట్టించుకోవడం లేదని, ప్రజా ప్రయోజనాల కోసమే కేంద్రం నుంచి బయటకు వచ్చామని చెప్పారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు తమ నిరసనలను కొనసాగించాలని ఆదేశించారు.

అటు నిన్న చంద్రబాబు మా మంత్రులు కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పగానే, ఇటు వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండిటికీ లింక్ అయితే ఉందో లేదో తెలియదు కాని, జరుగుతున్న రాజకీయ పరిణామాలు, కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం అయితే, జగన్ తన కేసుల ఉపసమనం కోసం, బీజేపీలో తన పార్టీని కలిపేస్తాడు అనే వార్తలు వచ్చాయి... ఇటు తెలుగుదేశం బయటకు రాగానే, వైసిపీ బీజేపీ క్యాబినెట్ లో చేరిపోతుంది అని, త్వరలో A2 విజయసాయి రెడ్డి కేంద్ర మంత్రి అవుతున్నాడు అనే ప్రచారం వైసిపీ క్యాంపు చేస్తుంది... అయితే, ఈ నేపధ్యంలో జగన్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుని..

jagan cases 08032018 2

జగతి పబ్లికేషన్‌లో ముగ్గురు వ్యాపారుల పెట్టుబడుల వ్యవహారంలో 34.64 కోట్ల రూపాయలను ఈడీ తాత్కాలిక జప్తు చేయడాన్ని అప్పీలేట్ ట్రైబ్యునల్ తప్పు పట్టింది. ఈడీ ఉత్తర్వులను కొట్టివేసింది. మోసపూరితంగా పెట్టుబడులు స్వీకరిస్తే మనీలాండరింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించింది. దీంతో జగన్ అక్రమాస్తుల కేసులో అప్పీలేట్ ట్రైబ్యునల్‌లో ఈడీకి ఎదురుదెబ్బ తగిలినట్టయింది.

jagan cases 08032018 3

జగతి పబ్లికేషన్స్‌కు సంబంధించిన రూ. 34.64 కోట్లను తాత్కాలిక జప్తు చేస్తూ 2013లో ఈడీ జారీ చేసిన ఉత్తర్వులను ట్రైబ్యునల్ కొట్టివేసింది. జగతి పబ్లికేషన్స్‌లో టీఆర్ కణ్ణన్, ఏకే దండమూడి, మాధవ్ రామచంద్రన్ అనే ముగ్గురు వ్యాపారులు 34.64 కోట్లు పెట్టబడులు పెట్టారు... మరి ఈ కేసుల్లో ఇంకా ఎన్ని వింతలు చూడాల్సి వస్తుందో... చూద్దాం.. ఇవన్నీ ఎప్పటి నుంచి అనుకున్నావేగా.. స్క్రిప్ట్ ఇప్పుడు ఇంప్లెమెంట్ చేస్తున్నారు అనుకోవాలేమో...

తెలుగుదేశం పార్టీ తరఫున కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు... శాస్త్ర, సాంకేతికశాఖ సహాయమంత్రి సుజనాచౌదరి తమ పదవులకు రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే... తరువాత ఇద్దరూ మీడియాతో మాట్లాడారు.. ఈ సందర్భంగా, అశోక్‌గజపతిరాజు ఆంధ్రప్రదేశ్ పై చేసిన కామెంట్, శభాష్ అనిపించేలా ఉన్నాయి... ‘‘ఆనాడు అసెంబ్లీ వ్యతిరేకించినా జాతీయపార్టీలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్‌ను విభజించాయి. ఆరోజు భాజపా మద్దతు ఇవ్వకపోతే విభజన జరిగి ఉండేది కాదు. అందువల్ల న్యాయం చేయాల్సిన బాధ్యత వారిపైనా ఉంది. ఇప్పుడు మళ్లీ మేం గడియారాన్ని వెనక్కు తిప్పమని అడగడం లేదు. ఇచ్చిన హామీలను గౌరవించండి." అని అన్నారు....

ashok 09032018

"మేం భారతీయులం... సోమరిపోతులంకాదు. కష్టపడి దేశానికి మా వంతు చేయూతనందిస్తాం. ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం కష్టపడుతున్నారు. ప్రభుత్వ స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేసి రాష్ట్రాభివృద్ధికి తమ వంతు కష్టం ధారపోస్తున్నారు. ఇందుకు కేంద్రం చేయూత తోడైతే రాష్ట్రం మరింత ముందుకెళ్తుంది. మా గురజాడ అన్నట్లు... దేశమంటే మట్టికాదోయ్‌, దేశమంటే మనుషులోయ్‌ అని గుర్తుంచుకుంటే చాలు. ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలి. దాన్ని ఎలా చేయగులుగుతారో చెప్పాలి...’’ అంటూ ఆంధ్రా వాడి సత్తా ఏంటో చాటి చెప్పారు...

ashok 09032018

మరో పక్క సుజనా మాట్లాడుతూ, ‘‘ఆ రోజు పూర్తి అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విడగొట్టారు. విభజన బిల్లును పాస్‌ చేసిన విధానం కూడా ప్రజాస్వామ్య ప్రక్రియగా జరగలేదు. పార్లమెంటు ఉభయసభల్లో నాడు విభజన బిల్లు ఎలా పాసైందో అందరికీ తెలుసు. అయినా ఆ గాయాలను మరిచి ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఎన్డీయేతో కలిశాం. ప్రత్యేకహోదా అంశాన్ని సరైన సమయంలో పరిష్కరించలేదు. ఇది వరకు చెప్పిన ప్రత్యేకప్యాకేజీనైనా ప్రకటించిన వెంటనే అమలు చేసి ఉంటే బాగుండేది. కనీసం అది కూడా చేయలేదు. ఒక జాతీయపార్టీ దగా చేస్తే... మరో జాతీయ పార్టీ మోసం చేసింది. దానివల్లే ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. " అంటూ కుండ బద్దలు కొట్టారు...

Advertisements

Latest Articles

Most Read