ఇప్పటి వరకు మన తెలుగు మీడియా వార్తా ఛానల్స్ చూసి చూసి విసుగెత్తి పోయి ఉన్నాం... గత కొన్ని రోజులుగా అయితే, మరీ ఘోరంగా, కత్తులు, సుత్తులతో నింపేశారు... శ్రీదేవి ఎపిసోడ్ అయితే హైలైట్... ప్రపంచం మొత్తం తిట్టుకున్నారు... కాని గత రెండు రోజులుగా, మన రాష్ట్రం గురించి నేషనల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తుంటే, మన తెలుగు మీడియా చానల్స్ కొన్ని వేల రెట్లు నయం అనిపిస్తుంది... మనోళ్ళు కనీసం హైదరాబాద్ నుంచి మిడిమిడి జ్ఞానంతో రిపోర్ట్ చేస్తూ, ఎదో ఒకటి చెప్తారు... కొంతైనా వాస్తవం ఉంటుంది... కాని ఈ నేషనల్ మీడియా ముంబై నుంచి, ఢిల్లీ నుంచి బూతులే చెప్పారు...

natiaonal 09032018 2

ముందుగా టైమ్స్ నౌ గురించి చెప్పుకుంటే, చంద్రబాబు నాయుడు, జగన్ కు ఫోన్ చేసి మాట్లాడారు అంట... ఎలా ప్రొసీడ్ అవ్వాలో, చంద్రబాబు జగన్ దగ్గర సలహాలు తీసుకున్నారు అంట... ఈ వార్తా రాసినోడికి మెదడు ఎక్కడుందో తెలీదు కాని, దండ వేసి దండం పెట్టచ్చు.. చంద్రబాబు ఎక్కడ ర్యాగింగ్ చేస్తాడో అని, మనోడు సంవత్సరం నుంచి అసెంబ్లీకి కూడా రావట్లేదు, అలాంటి వాడితో చంద్రబాబు మాట్లాడాడు అంట...

natiaonal 09032018 3

రిపబ్లిక్ టీవీ అయితే, ప్రధాని ఫోన్ చేసి మీకు స్పెషల్ స్టేటస్ ఇస్తున్నాము, మీరు బయటకు వెళ్ళవద్దు అని చెప్పారంట.... న్యూస్ x అనే ఛానల్ అయితే, ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ అని కాకుండా, తెలంగాణా స్పెషల్ స్టేటస్ అంటూ వార్తలు రాసింది... ndtv అయితే చంద్రబాబు ఎదో సర్వే చేసారు అంట, అందులో వైసిపీ, బీజేపీ కలిస్తే, తెలుగుదేశం ఓడిపోతుంది అనే రిపోర్ట్ వచ్చింది అంట.. అందుకే బీజేపీని దోషిగా చూపిస్తున్నారు అంట... ఈ వైసిపీ, బీజేపీ అనే రెండు పార్టీలు, రాష్ట్రంలో ఏ స్థానంలో ఉన్నాయో, ప్రజల అభిప్రాయం ఏంటో తెలుసుకోకుండా వీళ్ళు వార్తలు వేసేస్తున్నారు... ఇవన్నీ చుసిన తరువాత, మన తెలుగు ఛానల్స్ చాలా నయం అనిపిస్తుంది...

కేంద్ర ప్రబుత్వం దేశంలోని తూర్పు - దక్షిణం - పడమర మూడు వైపుల ఉన్న సముద్ర తీర ప్రాంతాన్ని పటిష్ట పరిచి, పారిశ్రామిక, పర్యాటక రంగాలలో దూసుకుపోయే విదంగా, "సాగరమాల ప్రాజెక్ట్ " ద్వార భారత దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుంది... కేంద్ర ప్రభుత్వం సాగరమాల ప్రాజెక్టును 12 లక్షల కోట్ల రూపాయలతో చేపడుతుంది. ఇందులో 4 లక్షల కోట్ల రూపాయలను రహదారుల నిర్మాణం వంటి సౌకర్యాల అభివృద్దికి, మిగిలిన 8 లక్షల కోట్ల రూపాయలతో దేశంలోని వివిధ పోర్టుల ఆధునీకరణ సహా, 27 ఇండస్ట్రియల్ క్లస్టర్లను అభివృద్ధి చెయ్యాలనే ఆలోచన.

sagaramala 09032018 2

సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు లాభం ఏంటి ?: ఆంధ్రప్రదేశ్ కు తీరప్రాంతం 974 కి.మీలుతో, బారతదేశం లో రెండవ స్థానంలో ఉంది... అంటే ఎలా చూసుకున్నా, "సాగరమాల ప్రాజెక్ట్ " కేటాయింపుల్లో సింహ భాగం మన రాష్ట్రానికి రావాలి... దీంతో పాటు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విబజన చట్టంలో విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడారును అబివృద్ది పరచడానికి హామీ ఉంది... అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో, " విశాఖపట్నం - చెన్నై పారిశ్రామిక కారిడారును" కేంద్ర ప్రబుత్వం ప్రతిపాదించిన " సాగరమాల ప్రాజెక్ట్ " లో అంతర్బాగం కాబట్టి. ఆ ప్రాజెక్ట్ లోని అంశాలన్నీ ఏ విదంగా మిళితం చేసుకోవాలనే దాని పై 11-09-2015న, కేంద్రానికి నివేదిక ఇచ్చారు..

సాగరమాల ప్రాజెక్ట్ ప్రతిపాదించినప్పుడు కేంద్రం ఏమి చెప్పింది ?: సాగరమాల ప్రాజెక్టు కింద ఆంధ్రప్రదేశ్ వద్ద కాకినాడ వద్ద 3000 కోట్ల రూపాయలతో ఎల్ అండ్ జి టెర్మినల్‌ను, మిగిలిన నిధులతో విశాఖలో అదనపు ఆయిల్ జెట్టీ, మరో స్టాక్ యార్డు నిర్మాణం, కాకినాడ వద్ద కోస్టల్ ఫుడ్ ఎక్స్‌పోర్టు బెర్త్ ఉన్నాయన్నారు. వాడ్రేవు, మచిలీపట్నం వద్ద కొత్తగా ఓడరేవులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. సాగరమాల ప్రాజెక్టు అమలును పర్యవేక్షించేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దేశంలో విశాఖ పోర్టు చాల కీలకమైనదని, దీనిని దృష్టిలో ఉంచుకుని దాదాపు 2000 కోట్ల రూపాయలతో ఆధునీకరిస్తున్నట్లు తెలిపారు.

sagaramala 09032018 3

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు పంపింది ?: ఈ ప్రాజెక్ట్ ఎంత ప్రతిష్టాత్మికమైనదో, దీని ద్వారా రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసుకుని, స్వయంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సాగరమాల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ పోర్టులు, తీర ప్రాంత అభివృద్ధికి సంబంధించి 30 వేల కోట్ల వ్యయంతో దాదాపుగా 20 ప్రాజెక్టులను రూపొందించింది. ఈ ప్రతిపాదనలను కేంద్రానికి పంపారు. పోర్టుల ఆధునీకరణకు రూ. రూ330 కోట్లు , పోర్టులకు రైలు మార్గాల కోసం రూ. 8,810 కోట్లు, రోడ్డు మార్గాల అనుసంధానానికి రూ. 18, 503 కోట్లు, జాలరి కుటుంబాల అబివృద్ధికి రూ. 3,089 కోట్లు మంజూరు చేయాలని కోరారు. ఆ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపితే, కోస్తా తీర ప్రాంతంలో కొత్తగా 6 చేపల వేట హార్బర్‌లు వస్తాయి. దీనితో పాటు రాజధాని అమరావతి దగ్గర సరుకు రవాణా చేసే నౌకల హబ్‌, మచిలీపట్నం, విశాఖపట్నం, నెల్లూరు తదితర తీర ప్రాంతాల్లో సరుకుల రవాణాను పెంచటం ద్వారా రోడ్డు, రైలు మార్గాల్లో ట్రాఫిక్ వత్తిళ్లను తగ్గించవచ్చన్నది రాష్ట్ర ప్రభుత్వ యోచనగా వుంది. కోస్తా తీరం వెంబడి ప్రతి జిల్లాలో ట్రాక్ టెర్మినళ్లను నిర్మించాలని ప్రతిపాదించింది.

మరి కేంద్రం ఏమి చేసింది ? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిన అన్ని ప్రతిపాదనలను తిప్పి కొట్టింది... దానికి కేంద్ర ప్రభుత్వం చెప్పిన సమాధానం, హై పవర్ కమిటి ఒకటి వేసి, ఏ రాష్ట్రంలో ఏ ప్రాజెక్ట్ కావాలో మేమే తెలుసుకుంటాం అని చెప్పింది... Source:https://timesofindia.indiatimes.com/city/hyderabad/Setback-for-Andhra-Pradesh-Centre-not-to-fund-Sagaramala/articleshow/55060507.cms

గుజరాత్ కు లేని ఇబ్బంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఎందుకు ? మనం పంపిన ప్రతిపాదనలు తిప్పి కొట్టింది కేంద్రం.. సరే అనుకున్నాం... కాని, కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్రంలో కనిపించిన ఇబ్బందులు, గుజరాత్ లో మాత్రం కనపడలేదు... మే 22 2017న, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన దాని ప్రకారం " దేశం మొత్తం మీద సాగరమాల ప్రాజెక్ట్ కింద 1.37 లక్షల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి.. ఇందులో, లక్ష కోట్ల పనులు ఒక గుజరాత్ లోనే జరుగుతున్నాయి" అంటూ గర్వంగా, ప్రధాని సమక్షంలోనే ప్రకటించారు (https://www.thehindubusinessline.com/economy/logistics/port-development-key-to-nations-economic-prowess-says-pm/article9709859.ece).. అదే విషయం, ఇక్కడ స్వయంగా వినవచ్చు కూడా, https://youtu.be/Xn2mLHHBl24?t=312 ... ఏ రాష్ట్రంలో, ఏ పనులు జరుగుతున్నాయా అని సాగరమాల ప్రాజెక్ట్ వెబ్సైటు చుస్తే, పబ్లిక్ కి యాక్సెస్ లేదు http://sagarmalaprojects.gov.in/ .. ఎందుకు ఈ దాపరికం ?

దేశ ఆర్ధిక వ్యవస్థను మార్చే ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ లో, భారత దేశంలోనే, 974 కిమీతో, అతి పెద్ద తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్ కు కేటాయించింది, గుండు సున్నా... గుజరాత్ కి మాత్రం, లక్ష కోట్లతో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి... భారత దేశ ఎగుమతులలో, 90% దేశంలోని నౌఖాశ్రాయల ద్వారా జరుగుతుంది... ఆంధ్రప్రదేశ్ కు సుదీర్గమైన తీరప్రాంతం ఉన్నా, దాని ద్వార జరుగుతున్న వ్యాపారం చాల తక్కువగా ఉంది... దానికి కారణం సరైన మౌలిఖ సదుపాయాలూ లేకపోవడమే... మరి మాకు సాగరమాల ప్రాజెక్ట్ లో కేటాయింపులు ఎందుకు ఉండవు ? ఇది వివక్ష కాదా ? మేము కష్టపడతాం, దేశ అభివృద్ధికి తోడ్పాటు ఇస్తాం అనే మా ముఖ్యమంత్రి అభ్యర్ధనలు మీకు వినపడవా ?

రాష్ట్రం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై ఎదురు తిరిగింది... చివరకు ఎంతో సహనంతో ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, మిత్రపక్షం అనే ఇది కూడా లేకుండా, మోడీ చేస్తున్న పనులు అసెంబ్లీ వేదికగా ఎండగట్టారు... చివరకు టిడిపి మంత్రుల్ని రాజీనామా చేపించారు కూడా... ఢిల్లీ పై ఇక యుద్ధమే అనే సంకేతాలు పంపించారు... ఈ పరిణామాలకు ప్రధాన కారణం అరుణ్ జైట్లీ ప్రెస్ మీట్ పెట్టి, ఇంకా ఇంతకు మించి మేము సాయం చెయ్యలేము అంటూ, ఇక హోదా అనే మాటే లేదు అని తెగేసి చెప్పటం... దీంతో చంద్రబాబు ఇక కేంద్రంతో తేల్చుకునే పనిలో పడ్డారు...

vijasayi 09032018

కాని ప్రధాన ప్రతిపక్షం మాత్రం, దొంగ నాటకాలు ఆడుతుంది... తన కేసులు మాఫీ కోసం, నటనలు చేస్తూ సీన్ పండిస్తున్నారు... మోడీని ఒక్క మాట, ఒక్క ప్రశ్న అడిగే దమ్ము ఒక్కరికి కూడా లేదు... ఎంత సేపు చంద్రబాబు చంద్రబాబు అనే జపం చెయ్యటమే... తాజగా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, విజయసాయి రెడ్డి, నిస్సిగ్గుగా వాళ్ళ ప్లాన్ ఏంటో బయట పెట్టాడు... మాకు రాష్ట్రం ముఖ్యం కాదు, మా కేసులే ముఖ్యం అనే విధంగా మాట్లాడారు... ఇండియా టుడే ఇంటర్వ్యూ లో, విజయసాయిని యాంకర్ ఒక ప్రశ్న అడిగారు... "బీజేపీ హోదా ఇవ్వను అంటుంది రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇస్తాను అంటున్నాడు, మీరేమో ఎవరు హోదా ఇస్తే వారితో కలుస్తా అంటున్నారు, మరి రాహుల్ తో కలుస్తారా అని ప్రశ్నించారు"

vijasayi 09032018

అప్పుడు విజయసాయి మాట్లాడుతూ, రాహుల్ అంటే నమ్మకం లేదు అని చెప్పారు... కాని మోడీ మీద సంపూర్ణ నమ్మకం ఉంది అని, మోడీ తప్పకుండ హోదా ఇస్తారంటూ, విస్మయం కలిగించే సమాధానం చెప్పారు.. తన నోటితో తానే, వాళ్ళ రాజకీయ వ్యూహం బయటపెట్టారు.. అంటే కొన్ని రోజులుగా ప్రచారంలో ఉనట్టు, వైసిపీతో పొత్తు కోసం, టిడిపిని బయటకు గెంటారు... ఇప్పుడు హోదా అనో, ఎదో ఒక సోది చెప్పి, టిడిపి మీద నెపం నెడతారు... అప్పుడు జగన్ వెళ్లి బీజేపీతో చేరతాడు.. ఇదే వీరి వ్యూహం అని చెప్పకనే చెప్పారు.. ఎందుకంటే, ప్రస్తుతం, బీజేపీ హోదా అనే మాటే లేదు అంది... రాహుల్ నేను మొదటి సంతకం హోదా మీద అంటున్నాడు... మరి హోదా ఎవరు ఇస్తే వారే మాకు కావలి అనే జగన్, ఇప్పటికీ మోడీ మీద ఎలా నమ్మకం పెట్టుకున్నాడు ? రాహుల్ ఇస్తాను అంటున్నా, కనీసం ఎందుకు స్వాగాతించటం లేదు ? రాబోయే రోజుల్లో, వీరి నాటకాలు బయట పడతాయి...

విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మరోసారి కలకలం రేపాయి... వారం క్రితం, ఇలాగే పోస్టర్స్ వేస్తే, అప్పుడు రాష్ట్ర బీజేపీ నేతలు నానా హంగామా చేసారు... టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే టిడిపి అంతు చూస్తాం అంటూ బెదిరించారు... అయితే, టీవీల్లో ఈ పోస్టర్స్ వేసే నానా హంగామా సృష్టించటంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు, వెంటనే ఆ పోస్టర్స్ తీసెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు... అయితే, ఇప్పుడు తాజాగా, తెలుగుదేశం మంత్రులు, కేంద్ర క్యాబినెట్ నుంచి బయటకు వచ్చిన నేపధ్యంలో మరోసారి, కాట్రగడ్డ బాబు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసారు..

flexi 090032018 2

‘కాంగ్రెస్ తల్లిని చంపింది.. బీజేపీ బిడ్డ గొంతు నులుముతోంది. కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసిన తెలుగు ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారు’ అంటూ పోస్టర్లు వెలిశాయి... బెజవాడలో వెలసిన హోర్డింగ్‌లపై బీజేపీ నేతలు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు... ఇలాంటివి వేస్తే సహించేది లేదు అంటున్నారు... చెప్పిన దాని కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువే చేసామని, కావాలని బీజేపీని రాష్ట్రంలో నష్ట పరుస్తున్నారని, చెప్తున్నారు.. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ పోస్టర్లు మరో మారు చర్చనీయాంశమయ్యాయి...

flexi 090032018 1

పోయిన వారం ఏర్పాటు చేసిన ఫ్లెక్స్ లో ఇలా ఉంది... "ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు వేసి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా అన్యాయంగా విభజించారని మీరు ఉద్వేగంతో మొన్న లోక్ సభలో చెప్పారు. దానికి మా కృతజ్ఞతలు.. మీరు ఈ రోజు బీజేపీ పాలనలో టీడీపీ తలుపులు బార్లా తెరిచి , విభజన హామీలను తుంగలో తుక్కుతున్నారు. దీంతో మా తెలుగు ప్రజలు భావోద్వేగంతో అందోళన చెందుతున్నారు. వాడవాడలా ఆవేదనతో గగ్గొలు పెడుతున్నారు. ఇప్పటికైనా మా హామీలు నెరవేర్చండి లేకుంటే జాతి మిమ్మల్ని క్షమించదు" అంటూ కాట్రగడ్డ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.

Advertisements

Latest Articles

Most Read