టీడీపీ కేంద్రమంత్రులు ఎన్డీయే నుంచి తప్పుకుంటారని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు... ఈ సందర్భంలో కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు తన కార్యాలయానికి చేరుకున్నారు... అయితే, ఇక్కడ ఒక అరుదైన సంఘటన చోటు చేసుకుంది... ఆయన తన కార్యాలయంలో తన సీటులో కూర్చోకుండా, పక్కనేఉన్న విజిటర్ కుర్చీలో కూర్చుని తన రాజీనామా లేఖ రెడీ చేసుకుంటూ కనిపించారు... కొన్ని టీవీ చానల్స్ లో పదే పదే అశోక్ గజపతి రాజు గారి క్రెడిబిలిటీ దెబ్బతీస్తూ కధనాలు వెయ్యటం చూసాం... కాని ఇది ఆయనకు ఉన్న విలువలు, మంత్రులురాజీనామా చేయమని చంద్రన్న చెప్పగానే, మంత్రి రాజుగారు తన కార్యాలయం లొనే, విజిటర్ కుర్చీలో కూర్చున్నారు. అది నీతంటే....

ashok 08032018 2

మరో పక్క ప్రధానమంత్రి నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్‌ కోసం కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ ప్రస్తుతం రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు. సాయంత్రం 4గంటలకు పార్లమెంట్ కు రానుండడంతో అప్పుడే తమ రాజీనామాలను ప్రధానికే ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై టీడీపీ తరపున కేంద్రమంత్రి వర్గంలో కొనసాగుతున్న ఇరువురు తమ పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు.

ashok 08032018 3

ఇప్పటికే ఏపీ రాష్ట్ర మంత్రివర్గంలో బీజేపీ తరుపున కొనసాగుతున్న కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు ఇప్పటికే మంత్రి పదవుకు రాజీనామాలు చేశారు. అయితే... కేంద్రంలో కొనసాగుతున్న ఇరువురు టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేందుకు లేఖలను సిద్ధం చేశారు... కేంద్రం నుంచి బయటకు రావటం మొదటి అడుగు అని, ఇప్పుడు కేంద్రం ఏమన్నా స్పందిస్తుందో లేదో చూస్తామని, అదీ కాకుండా, ఎన్డీఏ నుంచి కూడా వైదొలుగుతామని చెప్పిన సంగతి తెలిసిందే...

రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం పై, కేంద్ర మంత్రి వర్గం నుంచి రాజేనామాలు చెయ్యలాని నిర్ణయం తీసుకోవటంతో, ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి... నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేసిన వెంటనే, వైసిపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఆ చర్యను కూడా విమర్శించారు... కేంద్రకేబినెట్ నుంచి టీడీపీ మంత్రులు రాజీనామా చేయడం ఓ డ్రామా అన్నారు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి. వారిపదవులకోసం నాలుగేళ్ళుగా రాష్ర్ట ప్రయోజనాలను తాకట్టుపెట్టారని తీవ్రంగ మండిపడ్డారు. రాజీనామాలంటూనే... ఈ వ్యాఖ్యల పై, విమర్శలు కూడా వచ్చాయి... రాష్ట్రం కోసం చేస్తున్న పనులుకి కూడా రాజకీయం ఏంటి అంటూ, విమర్శలు వచ్చాయి...

jc diwakar 08032018 2

అయితే, ఈ రోజు ప్రతి రోజు లాగానే, వైసిపీ ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేస్తున్నారు... ప్లే కార్డులు పట్టుకుని, వైసిపీ ఎంపీలు ధర్నా చేస్తున్న సమయంలో, జేసి దివాకర్ రెడ్డి వాళ్ళ దగ్గరకు వచ్చి, నిన్న నువ్వు మాట్లింది ఏంటయ్యా అంటూ రాయలసీమ యాసలో, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిని ప్రశ్నిస్తూ, మీకు దమ్ము ఉంటే ఏప్రిల్ 6 కాదు, ఇప్పుడు రాజీనామా చెయ్యండి, మేము రాజీనామా చేస్తాం..మళ్ళీ పోటీ చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ, నీకు దమ్ము ఉందా అంటూ, మీసం మెలేసి, తొడ కొట్టి, సవాల్ చేస్తూ, వారిని రమ్మంటూ ఛాలెంజ్ చేసారు..

jc diwakar 08032018 3

అంతే కాదు, మీరు ఫోటోలకి ఫోజులు ఇవ్వటం తప్ప, మీరు మీ నాయకుడు చేసేది ఏమి లేదు అని ఎద్దావా చేసారు.. ఈ సమయంలో పార్లమెంట్ సిబ్బంది ఏమన్నా గొడవ అవుతుంది ఏమో అని ఖంగారు పడ్డారు... అయితే, దివాకర్ రెడ్డి అక్కడ నుంచి పార్లమెంట్ కు వెళ్ళిపోయారు... అయితే నిన్న అరుణ్ జైట్లీ స్పష్టంగా ప్రకటన చెయ్యగానే, చంద్రబాబు తన మంత్రుల చేత రాజీనామా చేపించారు... ఇంత స్పష్టంగా చెప్పినా, జగన్ మాత్రం, ఏప్రిల్ 6 వరకు రాజీనామా చేసేది లేదని చెప్పటం, ఆశ్చర్యంగా ఉందంటూ విశ్లేషకులు చెప్తున్నారు...

కేంద్ర మంత్రివర్గం నుంచి తాము తప్పుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వైదొలగాలని నిర్ణయించింది. మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావు గురువారం తమ పదవులకు రాజీనామా చేయనున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని తెదేపా నిర్ణయించిన కొద్దిసేపటికే భాజపా మంత్రి మాణిక్యాలరావు, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్‌, ఇతర నేతలు విజయవాడలో అత్యవసరంగా సమావేశమయ్యారు. అనంతరం బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఆకుల సత్యనారాయణ, మాధవ్‌లు విలేకరులతో మాట్లాడారు. గురువారం మా మంత్రులిద్దరూ పదవులకు రాజీనామాలు చేయబోతున్నారు అని చెప్పారు..

bjp 08032018 2

బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గం నుంచి తెదేపా వైదొలిగిన వెంటనే... రాష్ట్ర మంత్రుల పదవుల నుంచి వైదొలగాలని రాష్ట్ర భాజపా నాయకత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, మాణిక్యాలరావుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. భాజపా అధ్యక్షుడు హరిబాబు కామినేనితో ఫోనులో మాట్లాడారు.

bjp 08032018 3

మరో వైపు ఏపీ కేబినెట్ సమావేశం ఉండవల్లిలోని సీఎం నివాసంలో గురువారం ఉదయం జరిగింది. అయితే... ఈ సమావేశానికి బీజేపీ మంత్రులు కామినేని శ్రీనివాసరావు, మాణిక్యాలరావు గైర్హాజర్ అయ్యారు. ఏపీ వైద్యఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తన రాజీనామా లేఖను సిద్ధం చేశారు. ఏ క్షణమైనా స్పీకర్‌కు తన రాజీనామా లేఖను సమర్పించేందుకు కామినేని రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.

నిన్న చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే... ఈ సందర్భంలో చంద్రబాబు, మోడీ రాష్ట్రానికి చేసిన విషయాలు అన్నీ చెప్పారు...చివరకు రాజీనామాలు ప్రకటించారు... అయితే, ఈ ఉదయం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు... కేంద్రం చేస్తున్న అన్యాయం పై జగన్ స్పందన అంటూ, ప్రెస్ ని పిలిచారు జగన్... ఇంకేముంది, మిత్రపక్షంగా ఉంటూ చంద్రబాబే మోడీని ఆ రేంజ్ లో తిడితే, ఇక జగన్, మోడీ పై విరుచుకు పడతారు అంటూ విలేకరులు, పొద్దున్నే టిఫిన్ చేసి బయలుదేరారు.. కేంద్రం పై, జగన్ యుద్ధం చేస్తాడు అంటూ ప్రోమోలు కట్ చేసి రెడీగా పెట్టుకున్నారు...

.

jagan 08032018

ఇంతలో మనోడు వచ్చాడు... ముందుగా ఆంధ్రజ్యోతి, ఈనాడు విలేకరుల పై ఇంత ఎత్తున లేగిసాడు... తన మీడియా సమావేశాలకు రారాదని ఈనాడు, ఆంధ్రజ్యోతి సంస్థలకు తాను ఎన్నడో స్పష్టం చేశానని, అయినా ఆ పత్రికల ప్రతినిధులు వచ్చారని, ఇలా రావడం సరికాదని, ఇప్పటికి ఓకే, ఇకపై రావద్దని వార్నింగ్ ఇచ్చారు... అంతటితో ఆగలేదు... అక్కడ ఇందాకే కేకు కట్ చేసాను, ఎలాగూ వచ్చారుగా తిని పొండి అంటూ, ఆంధ్రజ్యోతి, ఈనాడు విలేకరులని అవమానించాడు... ఇక తన అనుకూల మీడియాని ముందు పెట్టుకుని స్టార్ట్ చేసాడు...

jagan 08032018

చంద్రబాబు.. చంద్రబాబు.. చంద్రబాబు... తన ప్రెస్ మీట్ అంతా చంద్రబాబే... ఒక్కసారి కూడా మోడీ మాట లేదు... ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడలేదు.. ఎంత సేపు రాజీనామాలు, అవిస్వాసం అంటూ రాజకీయ ఆటలే... ఇలాంటి వాడు ఎందుకు రాజకీయాల్లో ఉన్నాడో, మన ఖర్మకి మన రాష్ట్రంలో ఎందుకు ఉన్నాడో... నిన్న సాయంత్రం 5:30 జైట్లీ ప్రెస్ మీట్ పెడితే, అప్పటి నుంచి రాత్రి దాకా ఆలోచనలు జరిపి, చంద్రబాబు అర్ధరాత్రి అయినా ప్రజల అభీష్టం మేరకు నిర్ణయం ప్రకటించారు... మనోడు మాత్రం, పాదయత్ర అంటూ ప్రజల్లో ఉన్నా, 7 గంటలకు అల్లా గుడారంలో దూరి, సీరియల్స్ చూస్తూ, తన్ని పెట్టి పడుకుని, పొద్దున్నే తయారు అయ్యి, మోడీని అనే దమ్ము లేక, చంద్రబాబు నామస్మరణ చేస్తున్నాడు...

Advertisements

Latest Articles

Most Read