తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి, అలా బయటకు వచ్చిందో లేదో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి షాక్ ఇచ్చింది కేంద్రం... అది కూడా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రోజే రాష్ట్రానికి కేంద్రం షాక్‌ ఇచ్చింది... బహిరంగ మార్కెట్‌ రుణాల కోసం చేసుకున్న దరఖాస్తును కేంద్ర ఆర్థిక శాఖ తిరస్కరించింది. ఇప్పటికే మీ రుణ పరిమితి అయిపోయిందని ప్రకటించింది. ఇరకా కావాలంటే అదనపు పరిమితికి అనుమతి కోసం కేంద్రాన్ని ఆశయ్రించాలని తేల్చి చెప్పింది. అంటే, అవకాసం ఉన్నా, కేంద్ర పెద్దలు చెప్తేనే, మీకు అనుమతి ఇస్తాం అంటుంది కేంద్ర ఆర్థిక శాఖ... ఇవ్వాల్సిన నిధులు ఇవ్వక, చెయ్యాల్సిన సాయం చెయ్యక, చివరకు బయట నుంచి అప్పు తెచ్చుకుంటాం అంటే కూడా కేంద్రం ఒప్పుకోవటం లేదు...

modi 10032018 2

దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో రాష్ట్రానికి ఆర్థిక సమస్యలు చుట్టుముట్టేలా కనిపిస్తోంది. చివరి త్రైమాసికం చివరి నెల్లో రూ. 3221 కోట్లు మార్కెట్‌ బారోయింగ్‌ తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ గత నెల 26న కేంద్ర ఆర్థిక శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో కనీసం జీతాల ఖర్చు నుంచైనా గట్టెక్కేందుకు ఆస్కారం ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ భావించింది. అయితే ఈ వినతిని కేంద్రం నిర్ద్వందంగా తిరస్కరించింది. కేంద్రం నుంచి నిధులు, రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం కూడా తగ్గుతున్న తరుణంలో ఈ రుణం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని ఆర్థిక శాఖ చెబుతోంది.

modi 10032018 3

అయితే కేంద్రం మాత్రం ఈ ప్రతిపాదనను తిరస్కరిస్తోంది. జిఎస్‌డిపిలో మూడు శాతం వరకు మాత్రమే రుణాన్ని తీసుకునేందుకు ఆస్కారం ఉంది. ఈ కారణాన్ని చూపిస్తూనే రాష్ట్ర రుణ దరఖాస్తును తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాజ్యాంగం లోని ఆర్టికల్‌ 293 (3)ని అనుసరించి మూడు శాతం రుణానికి అనుమతి ఇస్తున్నారు. అయితే కొన్ని ప్రత్యేక నిబంధనల మేరకు కొన్ని రాష్ట్రాలకు గత ఏడాది 3.5 శాతం వరకు ఈ పరిమితి పెంచారు. పక్కనున్న తెలంగాణకు కూడా 3.5 శాతం వర్తింపజేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, ఇబ్బందులు ఉన్నాయని తెలిసినా, రాష్ట్రానికి 3.5 శాతాన్ని వర్తింపజేసేం దుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయడం లేదు. దీంతో రాష్ట్ర ఆర్థిక శాఖ రాసిన పలు లేఖలను కేంద్రం పక్కనపెట్టేసింది. ఇప్పుడు మార్కెట్‌ బారోయింగ్స్‌ కోసం చేసుకున్న దరఖాస్తును కూడా తిరస్కరించడంతో రాష్ట్ర ఆర్థిక శాఖకు కోలుకోలేని దెబ్బ తగిలినట్లుగానే భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని మంచి పనులు చేస్తున్నా, కనీసం అవి చెప్పుకోవటం చేతాకాదు సొంత పార్టీ నేతలకు... ఇలాంటి వాటికి మీడియాలో కూడా పెద్ద స్పేస్ ఉండదు... చంద్రబాబుకు ఎక్కడ మంచి పేరు వచ్చేస్తుందో అని ఈ మీడియా భయం... అదే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గాల్లో కబురులు చెప్పినా, మీడియా ఊదరగొడుతుంది, సినిమా వాళ్ళు ఆయన మూడు తరాలు పొగిడేస్తూ ట్వీట్ లు వేస్తారు.. అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఇద్దరు ఆడవాళ్ళు కొట్టుకున్నా, దళితులు, అగ్ర వర్ణాలు కొట్టుకున్నారు అని, వార్తలు వేసి, ఆంధ్రప్రదేశ్ పరువు తీస్తారు... ఇక సినిమా వాళ్ళ ట్వీట్ లు, నీతులు అయితే సరే సరి... ఇక విషయానికి వద్దాం...

ap nrt 10032018 2

కువైట్ లో ఎంత మంది మన రాష్ట్రానికి చెందిన వారు ఇబ్బంది పడుతున్నారో, గత కొన్నేళ్ళుగా మనం వార్తలు చూస్తూనే ఉంటున్నాం... వారికి సహాయం చెయ్యాలని ఉంటుంది, కాని మనం ఏమి చెయ్యలేని పరిస్థితి... వీరి కష్టాలు తెలుసుకున్న చంద్రబాబు రంగంలోకి దిగారు... అక్కడ ప్రభుత్వాలతో మాట్లాడి వారికి విముక్తి కలిగించే చర్యలు మొదలు పట్టారు... దాదాపు 3 వేల మందిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు... రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఏపీ ఎన్నార్తీ సొసైటీ అవిరళ కృషి ఫలితంగా కువైట్ లో వీసాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్న ఏపీకి చెందిన 25 మందిని మంగళవారం నాడు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరందరినీ ప్రత్యెక బస్సుల ద్వారా ఉభయ గోదావరి, కడప తదితర జిల్లాలోని వారి స్వస్థలాలకు తరలించారు.

ap nrt 10032018 3

ఏపీ నుంచి ఉద్యోగాలు వెతుక్కుంటూ వెళ్ళిన సుమారు మూడు వేల మంది ప్రస్తుతం వీసా కోల్పోయి అనధికారికంగా అక్కడ ఉంటూ అనేక ఇబ్బందులు పడుతున్న వారిని ఏపీ ఎన్నార్టీ సొసైటీ వారి సహకరంతో స్వదేశానికి రప్పిస్తున్నారు. వారిని స్వరాష్ట్రానికి రప్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల ముగ్గురు సభ్యులతో కూడిన ఒక ప్రతినిధి బృందాన్ని కూడా కువైట్ కు పంపించారు. వారు అక్కడ ఏపీ ఎన్నార్టీ సొసైటీ అద్యక్షులు రవి వేమూరి సహకారం తీసుకుని, స్వదేశాంకి రప్పిస్తున్నారు. విమాన చార్జీలు కూడా ప్రభుత్వమే చెల్లించి వారిని ఎపీకి రప్పిస్తుండడం గమనార్హం.

ap nrt 10032018 4

ఇటీవల ఎన్నారై మంత్రి కోళ్ళు రవీంద్ర, ఏపీ ఎన్నార్టీ సొసైటీ అద్యక్షుడు రవి వేమూరి , డైరెక్టర్ చప్పిడి రాజశేఖర్ లు కువైట్ ప్రభుత్వంతో ఈ విషయమై చర్చలు జరిపారు. వారి కృషి ఫలితంగా మొదటి బ్యాచ్ గా 25 మందిని స్వరష్ట్రానికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వారివారి వృత్తుల్లో ప్రత్యెక శిక్షణ ఇప్పించి, ఉద్యోగావకాశాలు కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. దాదాపు మూడు వేల మందికి ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వృత్తి శిక్షణ ఇవ్వడంతో పాటు వారికి అవసరమైన సర్టిపికెట్లు ఇచ్చి, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ప్రభుత్వ సహకరంతో సొంతంగా వారి కాళ్ళ మీద నిలబడేలా వ్యాపారాలు చేసుకునేందుకు కూడా రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని ప్రభుత్వం చెప్తుంది...

అశోక్‌ గజపతిరాజు... విజయనగర రాజ వంశం.. అయినా, ఏ నాడు రాజదర్పం చూపించలేదు... సామాన్యులతో కలిసి మెలిసి, అతి సాధారణ జీవితం అనుభవిస్తున్నారు.. మోదీ ప్రభుత్వంలో పౌరవిమానయాన మంత్రిగా మూడున్నరేళ్లకు పైగా పనిచేశారు... అధినేత చంద్రబాబు సూచనల మేరకు, మారు మాట్లాడకుండా, మంత్రి పదివికి రాజీనామా చేసారు... అయితే, ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ చాలా కీలకమైనది... ఎంతో క్లిష్ట పరిస్థితుల్లో చేతిలోకి తీసుకున్న రాజు గారు, ఆ శాఖను సమర్ధవంతంగా నిర్వహించారు... ఎంతో లాబయింగ్ ఉన్న శాఖలో, రూపాయి కూడా అవినీతి ఆరోపణలు రాలేదు.. ఇప్పుడు రాజీనామా చెయ్యటంతో, పౌరవిమానయాన శాఖకు కొత్త మంత్రిని తీసుకోవాల్సిన పరిస్థితి...

ashok 10032018

అయితే ప్రధాని మోడీకి, అశోక్‌ గజపతిరాజుకి మించిన సమర్ధుడు, నిజాయితీ పరుడు లేరు అనే అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది... ఈ శాఖలో అవినీతికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది, అందుకే ఎవరినీ నామ్మని మోడీ, పౌరవిమానయాన శాఖకు కొత్త మంత్రిని నియమించకుండా, తన వద్దనే ఉంచుకున్నారు...పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హాకు, ఈ శాఖ బాధ్యతలు పూర్తిగా అప్పగిస్తారు అనే వార్తలు వచ్చినా, మోడీ మాత్రం ఈ శాఖకు ఉన్న ప్రాముఖ్యత, రాజు గారి సమర్ధతకు మ్యాచ్ అయ్యేవారు దొరక్కపోవటంతో, తన వద్దే ఈ శాఖను ఉంచుకున్నారు..

ashok 10032018

స్వదేశీ పౌరవిమానయాన మార్కెట్‌లో 2014లో భారత్‌ స్థానం 9 కాగా.. ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతిపెద్ద మార్కెట్‌గా గుర్తింపు పొందింది. స్వాతంత్య్రం వచ్చాక 70 ఏళ్లను తరచిచూస్తే కేవలం 70 పనిచేసే విమానాశ్రయాలు మాత్రమే ఉండగా.. ఏడాదిలో 80 అదనపు విమానాశ్రయాలను పునరుద్ధరించడమే గాక.. మరో 500 కొత్త ప్రాంతీయ మార్గాలను ప్రవేశపెట్టడంలో ఆయనదే కీలక పాత్ర...అన్నిటికన్నా ప్రధానిని ఆకర్షించింది ఆయన సంస్కరణాభిలాష. ఎయిరిండియాలో, పౌరవిమానయాన రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారు. ఇందుకు మోదీ వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన హయాంలోనే ప్రపంచంలోనే అత్యధిక శాతం మహిళా పైలట్లు భారతదేశంలో బాధ్యతలు నిర్వర్తించడం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చెప్పుకోదగ్గ విషయం... అలాగే సొంత పార్టీ వారైనా, మిత్రపక్షం ఎంపీలైనా విమాన సిబ్బంది పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఎక్కడా రాజీపడలేదు. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌, టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఉదంతాలే వీటికి ఉదాహరణ..

కేంద్రం పై తిరుగుబాటు చేసి, తన పార్టీకి చెందిన కేంద్ర మంత్రులని రాజీనామా చేపించిన చంద్రబాబు, పోయిన వారం అంట ఆ హడావిడిలో ఉన్నారు... అయితే, చంద్రబాబుకి ఇప్పుడో ఇంకో సమస్య వచ్చి పడింది... ఆయన అలా రిలాక్స్ అయ్యే అవకాసం కూడా లేకుండా, రాజ్యసభ ఎన్నికల రూపంలో మరో సమస్యని పరిష్కరించాల్సిన పరిస్థితి...సోమవారంతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుంది... ఆదివారం లోపు, ఎదో ఒకటి తేల్చాల్సిన పరిస్థితి... రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుండడంతో వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకునేందుకు మార్చి 23వ తేదీన ఎన్నిక నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

cbn 10032018 2

ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి మూడింటిలో రెండు టీడీపీకి, ఒకటి వైఎస్సార్‌ సీపీకి దక్కే పరిస్థితి ఉంది. అయితే, కేవలం బీజేపీ ఎమ్మల్యేలను కలుపుకుంటే, మరో నలుగురు ఎమ్మల్యేలు కలిసి వస్తే, మూడో సీటు కూడా తెలుగుదేశం దక్కించుకునే అవకాసం ఉంది... అయితే, చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో మూడో సీటు కోసం చూస్తారా లేదా అనేది చూడాలి.. జగన్ మీద విశ్వాసం లేదని, ఇప్పటికే 23 మంది ఎమ్మల్యేలు పార్టీ మారగా, మరో 25 మంది ఎమ్మల్యేలు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారు... అయితే, ఈ అవకాశం చంద్రబాబు ఉపయోగించుకోరు అనే వార్తలు వస్తున్నాయి.. ప్రస్తుతం కేంద్రం పై రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న చంద్రబాబు, ఇలాంటి టైంలో రాజకీయం జోలికి వెళ్ళ దలుచుకోలేదని చెప్పినట్టు సమాచారం..

cbn 10032018 3

అయితే టీడీపీకి దక్కే రెండు స్థానాల పై, భారీగా ఆశావహులు ఉన్నారు... పార్టీ సీనియర్ నేతలు ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం అధ్యక్షులు కళావెంకట్రావ్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడితో సమాలోచనలు జరుపుతున్నారు. పార్టీలోని పలువురి పేర్లను పరిశీలిస్తున్నారు. ఇవాళ సాయంత్రం లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఈ సారి ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారని ఆ సామాజిక వర్గానికి నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రమేష్, బీద మస్తాన్ రావు, వర్ల రామయ్య ప్రస్తుతం టీడీపీ తరపున అభ్యర్థుల రేసులో ఉన్నారు. ఈ ముగ్గరిలో ఇద్దరిని రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసే అవకాశం ఉంది. మరోవైపు తెలుగుదేశం పార్టీలోని రెడ్డి సామాజికవర్గం నేతలు ఈసారి తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తనను మరోసారి కొనసాగించాలని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న సీఎం రమేష్‌ గట్టిగా కోరుతున్నారు. తెలంగాణ టీడీపీ నేతలు దేవేందర్‌గౌడ్, మోత్కుపల్లి నరసింహులు, రావుల చంద్రశేఖర్‌రెడ్డిలు తమకూ అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ కసరత్తు పూర్తయ్యే సరికి, ఎవరు అలుగుతారో, ఎవరు ఎలా స్పందిస్తారో, వీరందరినీ చంద్రబాబు ఎలా సముదాయిస్తారో, చివరకు ఎవరిని రాజ్యసభకు పంపుతారో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read