రాయలసీమకు అన్యాయం జరుగుతోందంటూ భాజపా ప్రవేశపెట్టిన కర్నూలు డిక్లరేషన్‌ పై ఐటి మంత్రి లోకేష్ స్పందించారు. రాయలసీమను గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశామని చెప్పారు... కనీవినీ ఎరుగని రీతిలో సీమకు నీరు అందించామని తెలిపారు... బీజేపీకి ఇప్పుడు రాయలసీమ గుర్తొచ్చిందా? అని ప్రశ్నించారు.. ఎన్నడూ కవివినీ ఎరుగని రీతిలో రాయలసీమకు నీళ్లందించామన్నారు... అనంతలో కియా, చిత్తూరులో ఫాక్స్ కాన్ కంపెనీలను ఏర్పాటు చేస్తోంది తెదేపా ప్రభుత్వమేనని ప్రజలు గుర్తించారని లోకేష్ అన్నారు... ఇదే సందర్భంలో రెండో రాజధాని అంటూ, బీజేపీ చేస్తున్న హడావిడి పై, వారికి అదిరిపోయే పంచ్ వేసారు లోకేష్...

lokesh 06032018 2

“కర్నూలుని రెండో రాజధానిగా చేయాలని భాజపా నాయకులు అంటున్నారు. వారి డిమాండ్ తో నేనూ ఏకీభవిస్తాను. ఈ దేశానికి రెండో రాజధానిగా కర్నూలుని చేయాలి. దక్షిణ భారతంలో దేశానికి రెండో రాజధాని ఏర్పాటు చేయా లన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అదేదో కర్నూ లులో ఏర్పాటు చేస్తే వాళ్లు కోరుకున్నదీ జరుగుతుంది. మనం కోరుకున్నదీ జరుగుతుంది. రాష్ట్రానికి ఒక రాజధాని కట్టుకోవడానికే నిధుల్లేక ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది కర్నూలులో రాష్ట్ర రెండో రాజధాని ఏర్పాటు చేయాలనడంలో అర్ధం లేదు. రాయలసీమ డిక్లరేషన్ అప్రస్తుతం” అని మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు.

lokesh 06032018 3

సోషల్ మీడియాలో కూడా బీజేపీ వైఖరి పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు విరుచుకుపడుతున్నారు... మీరు పాలించే అన్ని రాష్ట్రాల్లో రెండు రాజధానులూ రెండు అసెంబ్లీలూ పెట్టారా? అసలు అమరావతి రాజధానికే దిక్కు లేదు... రెండోది కట్టాలా? ముందు చెయ్యాల్సినవి చెయ్యండి, లేకపోతే మీరే రాయలసీమలో కట్టండి.... దక్షణ భారత నినాదాలు చేస్తుంటే, ఇలా మాట్లాడకూడదు అన్న మీరే, ఇలా ఎందుకు చేస్తున్నారు ? సర్దార్ వల్లభాయ్ పటేల్ నాడు సంస్థానాలని కలిపితే....ఆయన వారసులు అని చెప్పుకునే మీరు ప్రాంతీయతను రెచ్చగొట్టి పబ్బమ్ గడుపుకోవాలి అని చూస్తున్నారు,నిస్సిగ్గుగా... ఆంధ్రులుగా మా హక్కును అడిగితే ప్రాంతీయతను రెచ్చగొట్టి కుక్కలు చింపిన విస్తరి చెయ్యలనుకుంటారా? అంటూ సోషల్ మీడియాలో బీజేపీ వైఖరి పై పోస్ట్ లు పడుతున్నాయి..

విభజన సమస్యలపై కేంద్రమంత్రి అరుణ్‌ జైట్లీతో.. ఏపీ ఆర్థిక మంత్రి యనమల బృందం కీలక భేటీ ముగిసింది. ఈ సమావేశానికి ఆఖరి నిమిషంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా హాజరుకాలేకపోయారు. అరుణ్‌ జైట్లీ కార్యాలయంలో సుధీర్ఘ చర్చ జరిగింది. విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధులు, రైల్వేజోన్‌తో పాటు పలు విషయాలను యనమల బృందం.. జైట్లీ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సమావేశంలో కేంద్రమంత్రి సుజనా చౌదరి, ఎంపీ రామ్మోహన్‌నాయుడు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు పాల్గొన్నారు.

amitsha 05032018 3

ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగిస్తున్నప్పుడు, మాకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని డిమాండ్ చేసినట్లు తెలిపారు. రూ. 16వేల కోట్లు రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సిందేనని అడిగామని.. అయితే రెవెన్యూ లోటుపై కేంద్రం లెక్కలతో మేం ఏకీభవించడం లేదన్నారు. "పరిశ్రమలకు రాయితీలే ముఖ్యం. వీటిపై అందరితో చర్చించి నిర్ణయం చెబుతామన్నారు. ఏపీకి జరిగిన నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రైల్వే జోన్ గురించి కూడా మాట్లాడామని, రాష్ట్ర పరిస్థితులను స్పష్టంగా వివరించామని చెప్పారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు మాత్రం, ఈ సమవేశంలో చర్చించిన విషయాల పై మూడు రోజుల్లో క్లారిటీ వస్తుంది అని చెప్పారు..

amitsha 05032018 2

ఇటీవల సీఎం చంద్రబాబుకు అమిత్‌ షా ఫోన్‌ చేసి చర్చలకు రావాల్సిందిగా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యనమల బృందం ఢిల్లీకి వెళ్ళింది. సోమవారం సాయంత్రం జైట్లీ, అమిత్‌‌షాతో యనమల బృందం చర్చలు జరుపుతారని చెప్పినా, చివరి నిమిషంలో అమిత్ షా రాలేదు, జైట్లీ సమక్షంలోనే చర్చలు జరిగాయి. విభజన హామీలపై చర్చించేందుకు ఢిల్లీకి రావాలని, ఈ నెల 5న చర్చిద్దామని సీఎం చంద్రబాబుకు బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఫోన్ ద్వారా చెప్పారు. అమిత్‌షా ఫోన్‌తో స్పందించిన చంద్రబాబు... కేంద్ర మంత్రి సుజనాచౌదరి, ఎంపీ రామ్మోహన్ నాయుడు, కుటుంబరావులను చర్చలకు పంపుతామని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేదిలేదని అమిత్‌షాకు చంద్రబాబు తేల్చిచెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సహాయం.. హోదా విషయంలో పోరాటాన్ని ఆపేది లేదని, పార్లమెంట్‌లో తప్పనిసరిగా పట్టుపడతామని ఆ సందర్భంగా చంద్రబాబు స్పష్టం చేసిన విషయం తెలిసిందే...

రాష్ట్రానికి న్యాయం చెయ్యండి అయ్యా అంటే, బీజేపీ రాష్ట్ర నేతలు తట్టుకోలేక పోతున్నారు... మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అంటే అదో బూతులా చూస్తున్నారు... ఎంత సేపు మోడీకి, అమిత్ షా ని వెనుకేసుకుని రావటమే కాని, రాష్ట్రం కోసం కనీసం ఒక్క మాట మాట్లాడటం లేదు... తాజగా విజయవాడలో టీడీపీ నేత కాట్రగడ్డ బాబు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బీజేపీ ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీని కించపరిచే చర్యలను టీడీపీ మానుకోవాలని హితవు పలికారు. బీజేపీ నేతలు సోము వీర్రాజు, విష్ణుకుమార్‌ రాజు, మాధవ్‌ సోమవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. టీడీపీ నేతలు ఎక్కువ చేస్తే టిడిపి అంతు చూస్తాం అంటూ బెదిరిస్తున్నారు..

bjp 05032018 2

నిజానికి ఆ ఫ్లెక్స్ లో ఏమి అభ్యతరం లేదు "ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ తలుపులు వేసి ఆంధ్రప్రదేశ్ ను అడ్డగోలుగా అన్యాయంగా విభజించారని మీరు ఉద్వేగంతో మొన్న లోక్ సభలో చెప్పారు. దానికి మా కృతజ్ఞతలు.. మీరు ఈ రోజు బీజేపీ పాలనలో టీడీపీ తలుపులు బార్లా తెరిచి , విభజన హామీలను తుంగలో తుక్కుతున్నారు. దీంతో మా తెలుగు ప్రజలు భావోద్వేగంతో అందోళన చెందుతున్నారు. వాడవాడలా ఆవేదనతో గగ్గొలు పెడుతున్నారు. ఇప్పటికైనా మా హామీలు నెరవేర్చండి లేకుంటే జాతి మిమ్మల్ని క్షమించదు" అంటూ కాట్రగడ్డ ప్లెక్సీ ఏర్పాటు చేశారు.

bjp 05032018 3

మరి దీంట్లో అభ్యంతరం ఏముంది ? 5 కోట్ల మంది ప్రజలు ఏమంటున్నారో, అదే ఉంది.. ఎక్కడా మోడీని కించపరుస్తూ లేదు... హామీని నెరవేర్చండి అంటే కూడా తప్పా ? దానికే టిడిపి అంతు చూస్తారా ? మరి 5 కోట్ల మంది ప్రజలు కూడా ఇదే అంటున్నారు... వారి అంతు కూడా చూస్తారా ? ఇప్పటికే ఒకాయిన అన్నాడు, నా జోలికి వస్తే, రాష్ట్రాన్ని కట్ చేస్తా అని.. అలాంటిది ఎమన్నా ప్లాన్ చేస్తున్నారా ? చేతనైతే, మీ అధిష్టానం దగ్గరకు వెళ్లి, మనకు రావాల్సిన దాని పై అడగండి...

ఆంధ్రప్రదేశ్ కు రావాల్సిన అన్ని విభజన హామీల పియా పార్లమెంట్‌లో ఒత్తిడి తెస్తామని టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ చెప్పారు... పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు పట్టుపడతామని అన్నారు... ఏపీకి జరిగిన అన్యాయాన్ని యావత్ దేశం దృష్టికి తీసుకువెళ్లగలిగామని ఆయన చెప్పారు... వైఎస్ఆర్ పార్టీ ఢిల్లీకి వచ్చి సీఎం చంద్రబాబును విమర్శించడమేమిటని అవంతి మండిపడ్డారు... ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏపీలోనే ఉంచుకుందామని అన్నారు... ఢిల్లీకి వచ్చి చంద్రబాబును, టీడీపీని విమర్శిస్తే పనులు అవుతాయని అనుకుంటే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదని అన్నారు. దేశానికి ప్రధాని చంద్రబాబా? లేక మోదీనా అంటూ విజయసాయి రెడ్డికి క్లిష్ట ప్రశ్న వేసారు ఎంపీ...

delhi 05032018 2

ఒక వంద మంది వైసిపీ కార్యకర్తలను ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో ఒక మీటింగ్ పెట్టి, చంద్రబాబుని తిడుతూ, మాట్లాడారు.. ఎక్కడా మోడీ అనే పేరు ఎత్తలేదు... అన్ని ప్లే కార్డులు తెలుగులో ఉండే విధంగా జాగ్రత్త పడ్డారు... ప్రాంగాలు కూడా అన్నీ తెలుగులేనే... నేషనల్ మీడియాని కవేరేజ్ కి పిలవలేదు... చాలా జాగ్రత్తగా మోడీ పేరు, కేంద్రం పేరు ఎత్తకుండా, కేవలం చంద్రబాబుని టార్గెట్ చేస్తూ, ఆందోళన చేసారు... మనలో మనమే, ఇలా ఒక మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటే, ఎవడికి లాభం ?

delhi 05032018 3

ఢిల్లీకి వచ్చి, ఉభయసభల్లో ఆందోళన చేస్తే, మిగతా ఎంపీలకు, అదే విధంగా టీవీలలో చూస్తున్న దేశానికి తెలుస్తుంది... అప్పుడు బీజేపీ పై ఎమన్నా ఒత్తిడి వస్తుంది... అంతే కాని, ఒక చోటు చేరి, అదీ ఇక్కడ నుంచి జనాలని తోలుకుపోయి... తెలుగులో మాట్లాడుతూ, మనలో మనమే ప్రసంగించుకుంటూ, చంద్రబాబుని తిడితే, కేంద్రం పై ఏమన్నా ఒత్తిడి ఉంటుందా ?

Advertisements

Latest Articles

Most Read