విశాఖపట్నంలో నిర్వహించిన భాగస్వామ్య సదస్సు వివరాలు వివరించటానికి, ఈ రోజు అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు... భాగస్వామ్య సదస్సు విజయవంతం అయిందని చంద్రబాబు నాయుడు అన్నారు.. ఇదే సందర్భంలో జగన్ పార్టీ చేస్తున్న ప్రచారం పై విరుచుకుపడ్డారు... ఒక పక్క 60 దేశాల నుంచి, పెట్టుబడిదారులు వస్తే, అవన్నీ తప్పుడు లెక్కలు అంటున్నారని, చంద్రబాబు మండిపడ్డారు.... అన్ని వివరాలు ఆన్లైన్ లో పెట్టమన్నారు... ఈ మూడు సంవత్సరాల నుంచి వచ్చిన కంపెనీలు, అవి ఏ స్టేజిలో ఉన్నవి, ఇప్పటికే ఆన్లైన్ లో పెట్టామని, ఇంత పారదర్శకంగా ఉంటున్నా, బురద జల్లుతున్నారని అన్నారు...
మరో పక్క, ఇన్ని పెట్టుబడులు వచ్చాయి కాబట్టే, కేంద్రం మనకు సహాయం చెయ్యటం లేదు అని ప్రచారం చెయ్యటం పై కూడా చంద్రబాబు స్పందించారు... మన కష్టం చూసి, మన మీద నమ్మకంతో, మనకు ఉన్న వనరులు చూసి కంపెనీలు వస్తున్నాయి... ఇలా వస్తుంటే, మాకు ఏ కంపెనీ రావటం లేదు అని చెప్పనా ? దేబరించుకోనా అంటూ, ఫైర్ అయ్యారు... మనకు కేంద్రం నుంచి రావాల్సింది హక్కు... అవి రావాటం లేదు... అవి సాధించుకునే క్రమంలో, ఓ క్రమపద్ధతిలో పోరాడుతూనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నా... పెట్టుబడులను సాధించడానికి తాము కృషి చేస్తుంటే తప్పుడు ప్రచారం సరికాదని పేర్కొన్నారు...
అంతే కాని, అన్నీ వదిలేసి, ఏ పెట్టుబడులు తెచ్చుకోకుండా, ఏ అభివృద్ధి జరపకుండా, ఏ సంక్షేమం చెయ్యకుండా, కేంద్రం వైపు చూడమంటరా అంటూ, జగన్ పార్టీ ప్రచారాన్ని తిప్పి కొట్టారు... కేంద్రం నుంచి రావాల్సింది, వదిలే ప్రసక్తే లేదు.. అవి సాధిస్తా, నా తెలివి తేటలతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తా అని చెప్పారు... స్టూడెంట్స్ ని కూడా చెడగొడుతున్నారని, స్టూడెంట్స్ కూడా వీరి విష ప్రచారం నమ్మకుండా, ఏది వాస్తవం, ఏది అవాస్తవం అనేది తెలుసుకోవాలని అని అన్నారు...