గత కొన్ని రోజులుగా బీజేపీ - వైసిపీ మధ్య పొత్తు వార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే... ఈ ఇరు పార్టీల వ్యవహార శైలి కూడా అలాగే ఉంది... మరి కొన్ని రోజుల్లోనే వీరు కలిసిపోతున్నారు అనే భ్రమ ప్రజల్లో ఉంది... అయితే, దీని పై బీజేపీ మంత్రి కామినేని శ్రీనివాస్‌రావు స్పందించారు... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపాతో కలిసి పోటీ చేసే అవకాశం లేదని తేల్చిచెప్పారు. అవినీతి పార్టీతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదన్నారు. అలాంటి వారిని భాజపా దగ్గరకు తీసుకోదన్నారు...

kamineni 22022018 2

కేంద్రం ఆదేశిస్తే ఒక్క క్షణం కూడా తాను మంత్రి పదవిలో కొనసాగనని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో భాజపా, వైకాపాలు కలుస్తాయంటూ వస్తోన్న ఆరోపణల నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎయిమ్స్ నిర్మాణానికి దశలవారీగా నిధులు ఇస్తున్నామని మంత్రి చెప్పారు. పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు... మరో పక్క మంత్రి మాణిక్యాలరావు మాకు జగన్ ఉన్నాడు అంటున్నారు కదా అంటే, వారి వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని కామినేని అభిప్రాయపడ్డారు.

kamineni 22022018 3

ఇటీవల బిజెపి విజయవాడలో నిర్వహించిన సమావేశంలో 'కామినేని శ్రీనివాస్‌' అర్థంతరంగా బయటకు రావడంతో..ఆయన బిజెపిలో ఉండరని, టిడిపిలో చేరతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందిస్తూ..తాను బిజెపిలోనే ఉంటానని స్పష్టం చేశారు. బిజెపి,వైకాపా పొత్తు అయ్యే పనికాదని..అత్యంత నిజాయితీపరుడు..అత్యంత అవినీతిపరుడి మధ్య పొత్తు ఎలా కుదురుతుందని ఆయన ప్రశ్నించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్రం పై స్వరం పెంచారు... ప్రజల ఆందోళనను, 5 కోట్ల మంది ప్రజల గొంతును వినిపించారు... గురువారం అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబు మాట్లాడుతూ విభజన హామీలు సకాలంలో అమలైతే ఏపీ మరింత అభివృద్ధి జరిగేదని అన్నారు... ప్రత్యేక హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామని చెప్పి కేంద్రం మోసం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. హోదా కంటే ఎక్కువ ప్రయోజనలు ప్యాకేజీ ద్వారా ఇస్తామని ఆనాడు అరుణ్ జైట్లి ప్రకటించిన విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు...

cbn 22022018 2

ప్రత్యేకహోదా వేరే రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు ఏపీకి కూడా ఇవ్వాలని, ఏపీకి జరిగిన నష్టం చాలా ఎక్కువని చంద్రబాబు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని అడగకుండా కొన్ని పార్టీలు తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వలేదన్న సాకుతో సంక్షేమ పథకాలను ఆపబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ టీడీపీ అని, మన ఆత్మగౌరవాన్ని కించపరిస్తే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. శాంతి భద్రతలు సరిగా లేకపోతే పెట్టుబడులు రావని, శాంతియుతంగా ఆందోళనలు చెయ్యాలని చంద్రబాబు సూచించారు.

cbn 22022018 3

ప్రత్యేకహోదా ఆందోళనల సాకుతో కొంతమంది గొడవలు సృష్టించాలని చూస్తున్నారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా రాక‌పోవ‌డంపై కొంద‌రు కేంద్ర ప్రభుత్వాన్ని నిల‌దీయ‌కుండా త‌న‌ను తిడుతున్నార‌ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. కొన్ని పార్టీల నేతలు నిద్ర‌లేచిన‌ప్ప‌టి నుంచి త‌న‌ను తిట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటున్నార‌ని అన్నారు. 'ఒక న్యూస్‌ పేపరుందీ.. ఆ పేపరు పేరు నేను చెప్పలేను మీకే తెలుసు.. అసత్యాలు రాసీరాసీ అలసిపోతున్నారు.. ఆ పేపరుని ఎవరైనా నమ్ముతారా?' అని ప్రశ్నించారు.

మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణా రావు... అయ్య వారి సంగతి తెలిసిందే... పదవి ఇచ్చిన చంద్రబాబు పైనే, కొంత మంది జగన్ పైడ్ ఆర్టిస్ట్ లోతో కలిసి, సోషల్ మీడియాలో అవహేళన చెయ్యటం చూసాం... తిన్నంటి వాసాలు లెక్క పెడుతుంటే, బయటకి గెంటారు... ఈయన జగన్ ఏజెంట్ అని ప్రభుత్వానికి తెలియటానికి 6 నెలలు పట్టింది... పీడా వదిలించుకుంది... అయితే అప్పటి నుంచి, ఐ.వై.ఆర్‌ కృష్ణారావు, తను కప్పుకున్న ముసుగు పూర్తిగా తేసేసి, జగన్ ముసుగు కప్పి, లోటస్ పాండ్ స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడుతున్నారు...

iyr 22022018 2

తాజాగా ఐవైఆర్ కృష్ణారావుకు, ఏపి ప్రభుత్వం మరో ఝాలక్ ఇచ్చింది... ఏపీ అర్చకులు, ఉద్యోగుల సంక్షేమ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు ఏపీ ప్రభుత్వం ఉద్వాసన పలికింది. ఐవైఆర్ కృష్ణారావును ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది... గత కొన్ని రోజులుగా ఐవైఆర్ కృష్ణారావు మరీ చెలరేగిపోతున్నారు... దీంతో ఏ మాత్రం ఉపేక్షించకూడదు అని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది...

iyr 22022018 3

ఐవైఆర్ కృష్ణారావు చీఫ్ సెక్రటరీగా పని చేసినప్పుడు ఎంత కుట్ర పన్నారో తెలుసా ? దొనకొండ రాజధాని కావాల్సిందే అని కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు... ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పకుండా, రహస్యంగా కేంద్రానికి నివేదించారు అంటే అర్ధం ఏంటి ? దొనకొండలో రాజధాని కావాలని ఏ ఒక్కరూ కోరుకోలా... అక్కడ భూములు పెద్ద ఎత్తున కొనుకున్న జగన్ బ్యాచ్ తప్ప... అంటే, వై.ఎస్‌.జగన్‌తో సంబంధాలు కొనసాగిస్తూ, ప్రభుత్వ రహస్యాలను ఆయనకు చేరవేశారనేది ఇప్పుడు తెలుస్తుంది...

రాష్ట్ర ప్రభుత్వంలో కీలకంగా పనిచేస్తోన్న కొందరు ఐఎఎస్‌,ఐపిఎస్‌ అధికారులపై రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' ఆరోపణలకు, ఇప్పటికే ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఘాటుగా స్పందించారు... అయితే, వీరికి బాసటగా, ఏ రాజకీయ పార్టీ ఇప్పటివరకు మాట్లాడలేదు... ముఖ్యంగా తెలుగుదేశం నేతలు కూడా ఎవరూ స్పందించకపోవటం కొంచెం చర్చనీయంసం అయ్యింది... ఈ నేపధ్యంలో, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై కేసు నమోదు చేయాలని టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావు డీజీపీకి లేఖ రాశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీపై కేసు నమోదు చేయాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.

jagan vijasai 22022018 2

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కించపరిచేలా విజయసాయిరెడ్డి మాట్లాడారన్నారు. గతంలో కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌లను జగన్‌ బెదిరించారని రాయపాటి లేఖలో వివరించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనందున జగన్‌, విజయసాయిరెడ్డి ఇద్దరిపై కేసు నమోదు చేయాలన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరించిన జగన్, విజయసాయిలపై ఐపీసీ సెక్షన్ 504, 505 1 (బీ), బెదిరింపులకు పాల్పడినందుకు 506 (2), 124 (ఎ), 307 ఆర్‌డబ్ల్యూ, 511తో పాటు ఉద్రిక్తలు రెచ్చగొట్టడం.. ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి పరువు నష్టం కలిగించినందుకు ఐపీసీ సెక్షన్ 500 కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని రాయపాటి లేఖ ద్వారా డీజీపీకి విజ్ఞప్తి చేశారు.

jagan vijasai 22022018 3

అలాగే, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఖండించారు. విధి నిర్వహణలో భాగంగా అధికారులు తమ విధులను నిర్వహిస్తారని, ప్రభుత్వాలు మారుతాయి కానీ... అధికారులు మారరని, వారి పని వారు చేస్తుంటారని అన్నారు. అధికారులకు రాజకీయాలు అంటగట్టడం సరికాదని విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. అధికారంలోకి వస్తే సతీశ్‌చంద్ర సంగతి చూస్తామని హెచ్చరించడం బాధ్యతా రాహిత్యమని సంఘం రాష్ట్ర కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రానికి సతీశ్‌చంద్ర నిస్వార్థంగా సేవలందిస్తున్నారని.. అమరావతి నుంచి పాలన నడిచేలా తగిన ఏర్పాట్లు ఒక క్రమపద్ధతిలో చేసుకుంటూ వస్తున్నారని వివరించారు. అనేక సవాళ్లతో లక్ష్యాలను సాధించేందుకు శ్రమిస్తున్న సివిల్‌ సర్వీసు అధికారుల మనోధైర్యం దెబ్బతీసేలా మాట్లాడడం తగదని పేర్కొన్నారు.

Advertisements

Latest Articles

Most Read