ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక అంశాలలో స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో భావోద్వేగాలు అధికం.వారి మనోభావాలను గుర్తించాలి,గౌరవించాలి.విభజన సమయంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఒక్క సారిగా రోడ్ల పైకి వచ్చారు. తరువాత మౌనంగా ఉన్నా ఎన్నికల్లో చేయాల్సింది చేశారు,కాంగ్రెస్ పార్టీని ఘోరంగా శిక్షించారు...125ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా దక్కకపోవటమే ఇందుకు ఉదాహరణ. విభజన హామీలపై ఒక్కోపార్టీ ఒక్కో అజెండాతో ముందుకు వెళ్తున్నాయి.వ్యక్తిగత అజెండాలు,పార్టీగత అజెండాలు అమలుచేస్తున్నారు.

telugu 20022018 2

ఏ పార్టీల అజెండా ఎలా ఉన్నా.... మనం మాత్రం ప్రజల మనోభావాలకు అనుగుణంగా వెళ్దాం. రాష్ట్ర ప్రయోజనాలే మన ప్రధాన అజెండా...ఎవరిపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దు.ప్రతి వేదికపై మనం చేస్తున్న పోరాటం,మూడేళ్లుగా మనం చేసిన కృషిని గురించి వివరించండి. విభజన సమయంలో 8రోజులు ఏపి భవన్ లో దీక్షచేశాను.ఇరు ప్రాంతాలకు సమాన న్యాయం చేయమంటే ఎగతాళి చేశారు. అందరినీ కూర్చోబెట్టి నచ్చజెప్పి ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్య పరిష్కారం చేయమంటే పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ నన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేసింది.ఫలితం అనుభవించింది.ఆ పరిస్థితి ఎవరికీ రాకూడదు.

telugu 20022018 3

ఇక్కడ మనలను విమర్శించే పార్టీలు వాళ్ల జాతీయ కార్యవర్గాల మీద ఎందుకు ఒత్తిడి తేలేకపోతున్నాయి.వాళ్ల ఎంపిలతో ఏపికి మద్ధతుగా పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడించలేక పోతున్నాయి? జాతీయ స్థాయిలో ఆయా పార్టీలు ఎందుకని ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం గురించి గొంతెత్తడంలేదు..? 29 రాష్ట్రాలకు జరిగిన అన్యాయంపై అవిశ్వాసం పెడతామని రాహుల్ అంటున్నారు. దానివల్ల ఆంధ్రప్రదేశ్ కు ఏవిధంగా ప్రయోజనం..? అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. పార్లమెంట్ లో తెలుగుదేశం ఎంపీలు అంత గొడవ చేస్తుంటే సోనియా గాని, రాహుల్ గాని కనీసం నోరువిప్పి మాట్లాడలేదు. రాజ్యసభలో కేవిపి ప్లకార్డులు పట్టుకుంటే మాకు సంబంధం లేదు సస్పెండ్ చేసుకోండని ఆజాద్ అనడం ఆపార్టీ చిత్తశుద్దికి నిదర్శనం. వైకాపా చివరలో రాజీనామాలు చేస్తామనటం వల్ల ఉపయోగం లేదు...., చివరి ఏడాది కాబట్టి ఉపఎన్నికలు రావనే దుర్బుద్దితో వైకాపా రాజకీయాలు చేస్తోంది.

వైకాపా హోదా తప్ప వేరే అంశం మాట్లాడటం లేదు..హోదా సెంటిమెంట్ తో రాజకీయలాభం పొందాలని చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు... విభజన చట్టం లోని 18 అంశాలను, మన్మోహన్ సింగ్ ఇచ్చిన 6హామీలలో 5 వదిలేసి హోదాను మాత్రమే సెంటిమెంట్ గా పెంచి లబ్ది పొందాలని ప్రయత్నం చేస్తోంది. ఉండవల్లిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు టీడీపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. వైకాపా రోజుకో మాట మాట్లాడుతోంది. ఒకరోజు ఎంపీల రాజీనామాలు అంది. రాజీనామా చేస్తే సీట్లు ఖాళీ అవుతాయి, ఏడాదికూడా సమయం లేదుకాబట్టి ఉప ఎన్నికలు రావనే విమర్శ రావడంతో ప్లేటు మార్చింది. 

cbn jagan 20022018 2

ఇప్పుడు మళ్లీ అవిశ్వాసం అంటోంది. అవిశ్వాసం అనేది ఆఖరి అస్రంవి.కడపటి ఆయుధం.దానికీ మనం సిద్ధం అనడంతో మళ్లీ వెనక్కితగ్గుతోంది.మీరే పెట్టండని తప్పుకోవాలని చూస్తోంది. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టగానే బాగుంది అని తొలుత పొగిడింది..కృష్ణార్జునుల ఫొటోలు వేసి బడ్జెట్ ను భగవద్గీతగా పోల్చింది.టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో నిలదీయగానే వచ్చిన ప్రజల మద్దతు చేసి ప్లేటు ఫిరాయించింది.తమ ఎంపిలతో కూడా ఆందోళన చేపట్టింది.రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి రాజ్యసభలో ప్రస్తావించిన కేంద్రమంత్రి వై.ఎస్.చౌదరిపై చర్యలు తీసుకోవాలని రూల్ బుక్ చూపి స్పీకర్ ను కోరడం, రాష్ట్రపతికి,ప్రధానికి ఫిర్యాదులు చేసినప్పుడే వైకాపా చిత్తశుద్ది ఏమిటో బైటపడింది.

cbn jagan 20022018 3

రాజ్యసభలో సీఎం రమేష్ ను మార్షల్స్ లాక్కుపోతుంటే కూర్చుని చిద్విలాసంగా నవ్వుకున్నప్పుడే ఆ పార్టీ నైజం తెలిసిపోయింది. రాజకీయ లాభాలు తప్ప రాష్ట్ర ప్రయోజనం వారికి పట్టదనేది రుజువైంది. పునర్విభజన చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది అఖిల సంఘాల సమావేశం. అఖిల పక్ష సమావేశం కాదు. అసెంబ్లీలో టిడిపితో పాటుగా ఒక పార్టీయే వుంది. ఇంకో పార్టీ అసెంబ్లీకి రావడం లేదు. మిగిలిన పార్టీలకు ప్రాతినిధ్యం లేదు. అందుకే అఖిల సంఘాలతో సంప్రదింపులు చేస్తాం.దీనికి పార్టీలతోపాటుగా ప్రజా సంఘాలు కూడా హాజరుకావచ్చు. దీనిద్వారా విస్తృత ప్రజాభిప్రాయం తెలుసుకునే వీలుంటుంది.అసలైన జనాభిప్రాయం బైటపడుతుంది.

జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపటి ఆంధ్రప్రదేశ్ పర్యటన రద్దయింది... రేపు శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించాల్సి ఉంది... గిరిపుత్రుల హెచ్చరికతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు... మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గతంలో జనసేనాని డిమాండ్ చేశారు. వారికి మద్దతు తెల్పేందుకు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఆదివాసీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మత్స్యకారులను ఎస్టీలో చేర్చితే ఊరుకోమని హెచ్చరిస్తున్నారు. పవన్ పర్యటనను అడ్డుకుంటామని గిరిజనులు హెచ్చరించడంతో పవన్ తన పర్యటనను రద్దు చేసుకున్నారు.

pk 20022018 2

ఇది అసలు కారణం... మత్స్యకారుల సమస్యను పార్టీలకు అతీతంగా పరిష్కరించాలని, వారిని ఎస్టీ జాబితాలో ఉండాలని పవన్ అన్నారు... మత్స్యకారుల సమస్యలు తనకు తెలుసునని, వారిని ఎస్టీల్లో చేర్చే ఉద్యమానికి అండగా ఉంటానని చెప్పారు... ప్రభుత్వం వారి దీక్షను అడ్డుకోవద్దని కూడా సూచించారు...మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దానిని పరిగణలోకి తీసుకోవాలన్నారు. అయితే, పవన్ కళ్యాణ్‌ను మత్స్యకారులను కలవడం, వారు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఆదివాసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

pk 20022018 3

మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలన్న డిమాండుకు పవన్ మద్దతివ్వడంపై వారు మండిపడ్డారు. వారిని ఎస్టీల్లో చేర్చితే తమకు అన్యాయం జరుగుతుందని వారు వాపోయారు.మత్స్యకారుల డిమాండుకు పవన్ మద్దతు పలకడంపై ఆదివాసీల నేత గుర్నాథం మండిపడ్డారు. పవన్ తన స్వార్థ ప్రయోజనాల కోసం మత్స్యకారులకు ఎస్టీ జాబితా విషయంలో మద్దతు పలికాడని మండిపడ్డారు. కులాలు, జాతుల వ్యవహారాలు, స్థితుగతులు తెలియని పవన్ పనికిమాలిన ప్రకటనలు మానుకోవాలన్నారు. అయతే, ఆ తర్వాత ఆయన తన ప్రకటనపై వివరణ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని, రోజు ఎంతో మంది కలుస్తూ ఉంటారు... ఆయా సందర్భాల్లో ఆయనకు ఎన్నో బహుమతులు ఇస్తూ ఉంటారు... అవన్నీ రొటీన్... ఈ రోజు మాత్రం, చంద్రబాబుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు... ఈ గిఫ్ట్ చూసి చంద్రబాబు కూడా ఏంటో ముచ్చటగా, సంతోష పడ్డారు... చాలా సంతోషంగా ఉంది అంటూ, ఆ జ్ఞాపికను చూసి మురిసిపోయారు... చిన్న నాటి సంగతులు గుర్తు చేసుకున్నారు... అప్పటి కష్టాలు గుర్తు తెచ్చుకుని, అవన్నీ దాటుకుని, ఎలా ఈ స్థాయికి వచ్చింది నెమరు వేసుకున్నారు... ఇంతకీ ఆ జ్ఞాపిక ఏంటో తెలుసా ? ఎవరు ఇచ్చారో తెలుసా ?

cbn gift 20022018 1

ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ రోజు సచివాలయంలో, అపురూప మెమెంటో బహూకరించారు మిస్డ్ కాల్ అండ్ ఎలైడ్ ప్రాజెక్ట్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు... చంద్రబాబు తిరుపతిలో 1958లో టి.పి.పి.ఎం స్కూలు చదువుకున్నప్పటి ఛాయాచిత్రాలతో మెమెంటో తయారు చేసి ముఖ్యమంత్రికి బహూకరించిన మిస్డ్ కాల్ అండ్ ఎలైడ్ ప్రాజెక్ట్ట్స్ సంస్థ వ్యవస్థాపకులు కిశోర్ శ్రీరామ్ భట్ల, శేషాచలపతి వేల్పుల బి. చంద్రశేఖర్, గిరిధర్ ఆలూరి, బి. రాజశేఖర్.. చంద్రబాబు ఉపాధ్యాయుడు కేవీ నరసింహం పొటోలతో జ్ఞాపిక ఉంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు.. శ్రీరామ్‌ను అభినందించారు...

cbn gift 20022018 1

అంతే కాదు, ఈ 50 ఏళ్ల క్రితం జ్ఙాపకంలో చంద్రబాబుకు ఇచ్చిన కండక్ట్ కూడా రాసి ఉంది... A well behavied above average boy with winning manners, ready to take responsibilities, acted as class leader for one year, అని ఉంది... అంటే, మన సియం, ఎలాంటి వాడు అవుతాడో, 50 ఏళ్ల క్రితం మాష్టారులు అప్పుడే చెప్పేశారు...

cbn gift 20022018 1

ఇది చంద్రబాబు క్రమశిక్షణ, కష్టపడే తత్త్వం... ఇవన్నీ చిన్నప్పటి నుంచి ఉన్నాయి కాబట్టే, చంద్రబాబు ఇప్పుడు ఇంతటి వాడు అయ్యారు... రాష్ట్రాన్ని లీడ్ చేస్తూ, దేశంలోనే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారు... కేవలం కష్టపడే తత్త్వం, చదువు పై ఆయనకు ఉన్న మక్కువ, క్రమశిక్షణతో ఇక్కడి దాకా వచ్చారు.. ఇది అప్పటి చంద్రబాబు గురువులే చెప్పిన మాట....

Advertisements

Latest Articles

Most Read