నవ్యాంధ్రకు జరిగిన అన్యాయం పై ఢిల్లీ పై ధిక్కారం కొనసాగించాలని, ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు... విభజన హామీల అమలు కోసం ఉభయ సభల్లో ఆందోళనను ఉధృతం చేయాలని టీడీపీ ఎంపీలను సీఎం చంద్రబాబు ఆదేశించారు. గురువారం ఎంపీలతో బాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడ్జెట్‌పై అరుణ్‌జైట్లీ సమాధానం చెప్పేటప్పుడు ఎంపీలు ఆందోళన కొనసాగించాలని సూచించారు. రాజ్యసభలోనూ నిరసన కొనసాగించాలని టీడీపీ ఎంపీలకు సీఎం సూచన చేశారు...

cbn 08022018 2

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై పార్లమెంటులో ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిన్న పార్లమెంట్ ఉభయసభల్లో మన ఎంపీలు బాగా పనిచేశారన్నారు. ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రసంగాన్ని సీఎం అభినందించారు. ఎక్కడైనా ప్రతిపక్షం ముందు ఉండి ఆందోళనలు చేయాలి... కానీ కేసుల భయంతో వైసీపీకి ఆ పరిస్థితి లేదన్నారు. ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

cbn 08022018 3

ఆంధ్రప్రదేశ్ కి సహాయం చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉందని ఆయన అన్నారు... దక్షిణాది రాష్ట్రాలతో సమానంగా ఎదిగే వరకు అండగా ఉండాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు.... భారతదేశంలో ఏపీ భాగం కాదా?... ఎందుకు ఇంత వివక్ష అని బాబు ప్రశ్నించారు.... ఇటీవల కాలంలో ఒక రాష్ట్ర సమస్య ఇంతగా నలిగిన సందర్భం లేదన్నారు... ఎంపీలంతా సభలో బలంగా వాయిస్ వినిపించాలని... మన పోరాటం జాతీయ స్థాయికి ఇంకా బలంగా వెళ్ళాలని చంద్రబాబు పిలుపునిచ్చారు...

పార్ల‌మెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్ర‌వేశ‌పెట్టిన వార్షిక‌ బ‌డ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం జరిగిందని టీడీపీ ఎంపీలు పార్లమెంటులో ఆందోళన తెలుపుతోన్న విషయం తెలిసిందే... ఈ నేపథ్యంలో లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడుతున్నారు... మరోవైపు రాజ్యసభలో టీడీపీ సభ్యులు సీఎం రమేశ్, గరికపాటి మోహన్ రావు, సీతారామ లక్ష్మి తమ ఆందోళనను కొనసాగించడంతో వారిని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సస్పెండ్ చేశారు.. బయటకు వెళ్లకపోవటంతో, మార్షల్స్ చేత బయటకు పంపించారు..

rajyasabha 07022018 2

అయితే వైసిపీ ఎంపీ విజయసాయి రెడ్డి మాత్రం, మాట మాట్లాడకుండా సీట్ లో కూర్చున్నారు... కొంచెం సేపతకి బయటకి వెళ్ళిపోయారు... ఒక పక్క సాటి ఎంపీలు ఆందోళన చేస్తున్నా, కిక్కురుమనకుండా, కూర్చుని వినోదం చూసారు... మరో వైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావుని కూడా ఉదయమే బయటకు వెళ్ళిపోమని చైర్మన్ చెప్పారు... కేవీపీ రామచంద్రారావు బుధవారం మనస్తాపానికి గురై రాజ్యసభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందంటూ కేవీపీ ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

rajyasabha 07022018 3

అయితే... బుధవారం కూడా కేవీపీ ఓ ప్లకార్డు పట్టుకుని వెల్‌లోకి వెళ్లారు. కాగా.. వెల్‌లో నుంచి వెనక్కి రావాలని కాంగ్రెస్ ఎంపీలు సూచించారు. అంతేగాక కేవీపీ ప్రవర్తనను మేము సమర్ధించబోమని విపక్ష నేత ఆజాద్ అన్నారు. దీంతో కేవీపీకి కాంగ్రెస్ సభ్యుల మద్దతు లభించలేదు. వెల్‌లోనే కేవీపీ ఉండగా 256 నిబంధన కింద బయటకు వెళ్లాలని ఆదేశిస్తామని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఆదేశిస్తామమని పేర్కొనడంతో దీనికి మనస్తాపానికి గురైన కేవీపీ బయటకు రాజ్యసభ నుంచి బయటకు వచ్చేశారు.

ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ మాట్లడారు... ఒక విధంగా చెప్పాలి అంటే, దుమ్ము దులిపేసారు.... మనం ఏమి అనుకుంటున్నామో, మన మనసులో బాధ ఏంటో, దేశం మొత్తం వినిపించారు... ప్రతి సమస్య పై మాట్లడారు... పోలవరం పై ఇప్పటి వరకు సవరించిన అంచనాలు ఆమోదించలేదు... వెంటనే వాటిని ఆమోదించండి అని అన్నారు... ఇక విజయవాడ, వైజాగ్ మెట్రో పై విరుచుకుపడ్డారు... కర్ణాటక మెట్రో కి 17 వేలు కోట్లు ఇచ్చారు, ముంబై కి 51 వేల కోట్లు ఇచ్చారు.. కాని వైజాగ్, విజయవాడ మెట్రో కోసం, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు... కర్ణాటకలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, అక్కడ ఇచ్చారా ? 

galla 07022018

మాకు ఎలక్షన్స్ వస్తే కాని ఇవ్వరా అంటూ గల్లా కేంద్రాన్ని నిలదీశారు... ఇదేమి న్యాయం... మీరే చెప్పండి, ఇదేమి న్యాయం... సబ్కా వికాస్ అంటే ఇదేనా అంటూ నిలదీశారు... డెవలప్మెంట్ విషయంలో రాజకీయలు ఉండవు అని చెప్తారు, ఇదేనా అంటూ నిలదీశారు... అలాగే వైజాగ్ రైల్వే జోన్ విషయం పై రైల్వే మంత్రి పై కూడా విమర్శలు గుప్పించారు... ఇప్పటికీ నాలుగు ఏళ్ళు అయిన తరువాత కూడా, ఇంకా సంప్రదింపులు ఏంటి ? ఇంత సీనియర్ మంత్రి అయిన పియూష్ గోయెల్ ఇప్పటికీ సంప్రదింపులు అంటున్నారు అంటే, ఇది తాత్సారం చెయ్యటం కాక ఇంకేంటి అంటూ నిలదీసారు.. అమరావతి గురించి ప్రస్తావిస్తూ, రాజధానికి అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆక్ట్ లో ఉంది... గవర్నమెంట్ బిల్డింగ్స్ వాటి ల్యాండ్ వేల్యూ, నిర్మాణ ఖర్చు, 40 వేల కోట్లు అవుతుంది అని మీకు పంపించాం... కాని ఇప్పటికి, రెండు వేల కోట్లకు మించి ఇవ్వలేదు అంటూ వచ్చే నాలుగు ఏళ్ళల్లో, ప్రతి ఏటా రాజాదానికి 10 వేల కోట్లు ఇవ్వాలి అని అన్నారు...

galla 07022018

 ఆర్ధిక లోటు విషయంలో, ఇవాళ అధికారులు సమక్షంలో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి, వాటి వివరాలు వచ్చిన తరువాత దాని గురించి మాట్లాడతాను అని చెప్పారు... అలాగే వివిధ విద్యా సంస్థలకు, ఇస్తున్న నిధులతో, అవి కట్టాలి అంటే, అవి 30 ఏళ్ళకు కూడా పూర్తి కావు అన్నారు.. ఎయిమ్స్ కి కనీసం ఒక్క రూపాయి ఇవ్వలేదు అని, మాకు ఎన్నికలు లేవు అని ఇవ్వలేదేమో అని ఎద్దేవా చేసారు... చివరగా, మాకు బడ్జెట్ లో ఇచ్చినవి, బాహుబలి సినిమా కలెక్షన్స్ అంత కూడా లేవు అని, సోషల్ మీడియాలో ప్రజలు అనుకుంటున్న విధంగా గల్లా పార్లమెంట్ లో చెప్పారు... కాంగ్రెస్ మాకు అన్యాయం చేసినందుకు, వారికి సున్నా ఇచ్చాం, మీరు ఏమి చెయ్యటం లేదు... ఇలాంటి మీతో మేము ఎందుకున్నమా అనిపిస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు... మీరు అర్ధం చేసుకోండి, మేము మీ మిత్రులం, మాకు న్యాయం చేసి, మిత్ర ధర్మం పాటించండి... ఇప్పుడు కాకపొతే, మీకు కాంగ్రెస్ గతే పడుతుంది... మా రాష్ట్ర ప్రజలు ఫూల్స్ కాదు అంటూ ముగించారు... మొత్తానికి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, గల్లా అదే, పార్లమెంట్ లో వినిపించారు... ఎక్కడ అన్యాయం జరిగిందో, అక్కడే మన ఆక్రోశం వినిపించారు...

వైఏస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాటకాలు ప్రజలు చూస్తున్నారు... బీజేపీ వీళ్ళ ట్రాప్ లో పడి, రాంగ్ పాత్ లో వెళ్ళకూడదు... వైఏస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మరోసారి పిచ్చోల్లని చేస్తుంది.. బడ్జెట్ అద్భుతం అని పొగిడారు, అద్భుతం అని ప్రచారం చేసారు... ఇప్పుడు బడ్జెట్ బాగోలేదు అని, కేంద్రం తప్పు ఏమి లేదు అని, అంతా రాష్ట్ర ప్రభుత్వం తప్పు అని అంటున్నారు అని గల్లా అన్నారు... ఆంధ్రప్రదేశ్ ప్రజలు పిచ్చోళ్ళు కాదు, మీ ద్వంద్వ వైఖరి గమనిస్తున్నారు... ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వీరి బుద్ధి తెలుసు... ఎవరు కేంద్రంలో పవర్ లో ఉంటే, వారితో స్నేహానికి ముందు ఉంటారు... ఎందుకంటే, వీరి నాయకుడు అవినీతి పరుడు, అందుకే జైలు నుంచి బయట ఉండాలి అంటే, వీరికి కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉండాలి... ఇవాళ మీరు(బీజేపీ)... 

galla 07022018 3

ఇలాంటి వారితో స్నేహం చేస్తూ, అపాయింట్మెంట్ ఇస్తూ, దేశానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారు... ఒక దొంగ, అవినీతిపరుడు, దేశంలోనే నెంబర్ వన్ కరప్షన్ చేసిన వాడికి, మీరు సపోర్ట్ ఇస్తారా ? ఆంధ్రప్రదేశ్ లో, వైఏస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీకు మంచి మిత్రుడు అని అనుకుంటున్నారా ? ఇది మీ మొరాలిటీకి దెబ్బ... మీకే మచ్చ... కొంత మందిని, అన్ని సార్లు మోసం చెయ్యవచ్చు... అందరినీ కొన్ని సార్లు మోసం చెయ్యవచ్చు... కాని, అందరినీ అన్ని సార్లు మోసం చెయ్యలేరు అంటూ, వైఏస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తున్న బీజేపీని గల్లా ఉతికి ఆరేసారు...

galla 07022018 2

అలాగే ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు 40 సార్లు కేంద్రంలోని పెద్దలను కలిసినా విభజన చట్టంలోని హామీలను అమలు చేయలేదన్నారు. మిత్ర పక్షంగా ఉన్న తమకే ఇలా చేస్తే ఎలా అని ప్రశ్నించారు. కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయనే కారణంగానే బెంగళూరు మెట్రోకు నిధులు కేటాయించిన కేంద్రం పెద్దలు ఏపీకి ఎలా న్యాయం చేస్తారని గల్లా జయదేవ్ నిలదీశారు. బీజేపీ కూడా కాంగ్రెస్‌లాగే స్వప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే.. ఏపీ ప్రజలేం అమాయకులు కాదని జయదేవ్ హెచ్చరించారు. ‘‘మీరిచ్చిన నిధులకంటే బాహుబలి కలెక్షన్లే ఎక్కువగా ఉన్నాయని ప్రజలు జోక్‌లు వేసుకుంటున్నారు’’ ఎంపీ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి..

Advertisements

Latest Articles

Most Read