మా రాష్ట్రానికి నిధులు ఇవ్వండిరా అంటే, మాత్రం చేద్దాం, చూస్తాం, చేస్తున్నాం, చేస్తూనే ఉంటాం అంటూ, కబ్రులు చెప్తారు... కాని మన రాష్ట్రానికి వస్తున్న కేంద్ర ప్రతినిధులు, మంత్రులు మాత్రం, ఆహా ఓహో మీ అంతటోడు లేడు, మిమ్మల్ని చూసి దేశం మొత్తం నేర్చుకోవాలి అంటారు... మా దమ్ము ఏంటో మాకు తెలుసు సార్, మా దమ్ముకి మీరు హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వండి అంటే మాత్రం, అదిగో ఇదిగో అంటూ నాలుగేళ్ళు టైం గడిపేశారు... ఇంత ఆందోళన చేస్తున్నా, పాడిన పాటే పాడుతున్నారు... విషయం ఏంటి అంటే, నీతి ఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ ర‌మేష్ చంద్ ఈ రోజు అమరావతిలో పర్యటించారు...

rtgs 26112017 2

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన‌ రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ వ్య‌వ‌స్థ అద్భుతంగా ప‌నిచేస్తోంద‌ని నీతి ఆయోగ్ స‌భ్యులు డాక్ట‌ర్ ర‌మేష్ చంద్ కితాబిచ్చారు. వెల‌గ‌పూడి స‌చివాల‌యంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ స్టేట్ క‌మాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఈ రోజు ఆయ‌న సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ అహ్మ‌ద్ బాబు ఆర్టీజీఎస్ ప‌నితీరును వివ‌రించారు. ప‌రిష్కార వేదిక 1100 కాల్ సెంట‌ర్ ప్ర‌జ‌ల నుంచి ఫిర్యాదులు స్వీక‌రించి వాటిని ఎలా ప‌రిష్క‌రిస్తుందో వివ‌రించారు. తొమ్మిది నెల‌ల కాలంలో ప‌రిష్కార‌వేదిక ద్వారా 1,48,50,297 ఫిర్యాదులు స్వీక‌రించామ‌ని అందులో 93 శాతం ఫిర్యాదులు ప‌రిష్క‌రించామ‌ని తెలిపారు.

rtgs 26112017 3

ఈ-ఆఫీసు ప‌నితీరు, కోర్ డ్యాష్‌బోర్డు గురించి తెలియ‌జేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన స‌ర్వైలెన్స్ కెమెరాల ద్వారా ఎలా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ది కూడా సీఈఓ బాబు వివ‌రించారు. నీతి ఆయోగ్ స‌భ్యులు ర‌మేష్ చంద్ మాట్లాడుతూ.. ఆర్టీజీఎస్ వ్య‌వ‌స్థ అద్భుతంగా ప‌నిచేస్తోంద‌ని, టెక్నాల‌జీ వినియోగం వినూత్న ఆలోచ‌న‌ల‌తో దూసుకెళుతోన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని ఆయ‌న అభినందించారు. ఏపీలో ఉన్న ఆర్టీజీఎస్ వ్య‌వ‌స్థ ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శప్రాయం కావాల‌ని అన్నారు.

నిన్న వెంకయ్య నాయడు పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా అని చెప్పిన విజయసాయి, ఈ రోజు కూడా తన రంగు మరో సారి బయటపెట్టారు... నిన్న కేంద్ర మంత్రి సుజాన చౌదరి ప్రసంగిస్తూ, విభజన హామీల పై కేంద్రం అన్యాయం చేస్తుంది అని, ఇన్ని రోజులు నుంచి ఆందోళన చేస్తున్నా, కేంద్రం స్పందించలేదు అంటూ ప్రసంగించారు... అయితే సుజనా చౌదరికి ఒక ఆంధ్రా ఎంపీగా సపోర్ట్ చెయ్యల్సింది పోయి, వైసిపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సుజనా చౌదరినే విమర్శించారు.. ఈ రోజు కూడా అలాంటి సీన్ మళ్ళీ రాజ్యసభలో రిపీట్ అయ్యింది...

vijayasai rajyasabha 09022018 2

రాజ్యసభలో టీడీపీ ఎంపీలు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఛైర్మన్ పొడియం వద్ద ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఎంపీల నిరసనతో లోక్‌సభను మార్చి 5కు వాయిదా వేశారు. దీంతో రాజ్యసభలో టీడీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. అయితే టీడీపీ నేతల నిరసనపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఉన్న స్పీకర్ తో, నేను మాట్లాడాలి మాట్లాడాలి అంటూ ఆందోళన చేసి మైక్ తీసుకున్నారు విజయసాయి...

vijayasai rajyasabha 09022018 3

అందరు ఆంధ్రప్రదేశ్ సమస్యల గురించి, కేంద్రాన్ని ఎండగడతారేమో అని అందరూ ఊహించారు... కాని విజయసాయి మోడీ మీద ఉన్న భక్తిని చాటుకున్నారు... ఎన్డీయే భాగస్వామ్యపక్షమై ఉండి.. ఎలా పోరాటం చేస్తారని ప్రశ్నించారు... ముందుగా మీరు అందరూ ఎన్డీయే నుంచి బయటకు రండి... అప్పటి వరకు ఆందోళన చెయ్యవద్దు అంటూ, వింత వాదన తీసుకొచ్చారు విజయసాయి... నిండు సభలో, ఆంధ్రప్రదేశ్ గురించి అడగకుండా, మీరు ఎన్డీయే నుంచి బయటకు రండి అనటం ఏంటో ఎవరికీ అర్ధం కావటం లేదు...

లోక్‌సభలో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో భాజపా అగ్రనేత అద్వానీ సుమారు 10 నిమిషాల పాటు మాట్లాడారు. సభలో నిరసన తెలిపేందుకు గల కారణాలను తెలుగుదేశం పార్టీ ఎంపీలు అడ్వాణీకి వివరించారు. ఆంధ్రప్రదేశ్ కి కేంద్రం న్యాయం చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం... ఒకరినొకరు గౌరవించుకోవాలని, సభా మర్యాదలు కాపాడాలని అద్వానీ సూచించారు. ఇదే సందర్భంలో అద్వానీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంసం అయ్యాయి... బీజేపీ అగ్ర నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ, టిడిపి ఎంపీలతో, అద్వానీ కీలక వ్యాఖ్యలు చేసారు...

advani 09022018 2

అన్ని విషయాలు నాకు తెలుసని, ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయంతో ఎదురవుతున్న ఇబ్బందులు తెలుసని, మరి కేంద్రం ఇలా ఎందుకు వ్యవహిరిస్తుందో అర్ధం కావటం లేదు అంటూ, కేంద్రాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడారు... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ విభజన హామీలే హాట్ టాపిక్ అయ్యాయి. చట్టం ఉన్నవాటికి కేంద్రం ఏమాత్రం నిధులు కేటాయించకపోవడంతో ఎంపీలు పూర్తిస్థాయిలో నిరసన బాట పట్టారు. నాలుగు రోజుల పాటు ఉభయసభల్లోనూ ఎంపీలు ఆందోళన కొనసాగించారు...

advani 09022018 3

ఎంత తీవ్ర స్థాయిలో పోరాటం చేసినా కేంద్రం ఏమాత్రం దిగిరాకపోవడంతో కేంద్రమంత్రి సుజనాచౌదరి నేరుగా అరుణ్‌జైట్లీతో వాగ్వాదానికి దిగడం టీడీపీలో నెలకొన్న అసంతృప్తి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి బడ్జెట్ సమావేశాలు తొలివిడత కీలకమైన రాజకీయ మార్పులకు కారణమయ్యాయి. నాలుగేళ్ల పాటు విభజన హామీలను అమలు చేస్తారని ఎదురు చూస్తూ వచ్చిన టీడీపీ పోరుబాట పట్టింది. అంటే ఓ రకంగా టీడీపీ ఇక మిత్ర పక్షంగా వ్యవహరించడం కష్టమే. అదే సమయంలో దేశ రాజకీయ సమీకరణాల్లోనూ మార్పులు ప్రారంభమయ్యాయన్న ఊహాగానాలు వినిపిస్తున్నారు.

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, ఇటు రాష్ట్రంలోని ప్రజలు, అటు చట్ట సభల్లో ఎంపీలు చేస్తున్న ఆందోళనకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంఘీభావం తెలిపారు... రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో స్పందించారు... ఆంధ్రుల డిమాండ్లు న్యాయమైనవని పేర్కొన్నారు. న్యాయమైన డిమాండ్లకు పరిష్కారం లభించాలంటే అన్ని పార్టీలూ కలిసికట్టుగా పోరాడాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు పార్లమెంటులో వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు.

rahul 09022018 2

రాహుల్ ఇలా ట్వీట్ చేసారు..."The Congress Party supports the just demands of the people of Andhra Pradesh for special category status and speedy completion of the Polavaram project. It's time for all parties to unite on this issue and support this call for justice.#INCStandsWithAndhra"

rahul 09022018 3

మరో పక్క నిన్నటి జైట్లీ ప్రకటనతో, ఇక రాష్ట్రానికి ఏమి రావు అని తేలిపోయింది... ఇప్పటికీ చేస్తాం, చూస్తాం అంటూ కేంద్రం సాగదీస్తూ వస్తుంది... నిన్నటి రాష్ట్ర బంద్ నేపధ్యంలో కేంద్రం ఏమన్నా ప్రకటన చేస్తుంది అనుకున్న వారికి నిరాశే మిగిలింది... ఈ రోజుతో, పార్లమెంట్ సమావేశాలు కూడా అయిపోయాయి... మళ్ళీ మార్చ్ 5 న తరిగి ప్రారంభం అవుతాయి... అప్పటి వరకు, తెలుగుదేశం పార్టీ కేంద్రం పై ఎలాంటి వ్యుహ్యాన్ని అనుసరించబోతుంది అనేది చూడాలి...

Advertisements

Latest Articles

Most Read