ప్రపంచంలోనే అతిపెద్ద రైస్ మిల్లును ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పేందుకు దుబాయ్‌కు చెందిన ఫోనిక్స్(Phoenix) సంస్థ సన్నద్ధమైంది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో మెగా ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తామని, ఇందుకు సంబంధించి పనులు ఈ ఏడాది ఏప్రిల్‌లో మొదలుపెడతామని ఫోనిక్స్ గ్రూపు ఎగ్జిక్యూటివ్ చైర్మన్, సీఈవో గౌరవ్ థావన్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అన్నారు. ఈ నెలాఖరులో విశాఖలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు వాణిజ్య–పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించడానికి, ఆంధ్రప్రదేశ్‌కు మరింతగా పెట్టుబడులను ఆకర్షించేందుకు గురువారం ఒకరోజు పాటు దుబాయ్‌లో పర్యటించిన ముఖ్యమంత్రితో గౌరవ్ థావన్ సమావేశమయ్యారు.

rice mill 08022018 2

మెగా ఇంటిగ్రేటెడ్ రైస్ మిల్ ప్రాజెక్టుపై ఇరువురు చర్చించారు. ఉక్రెయిన్‌లో అమెరికాకు చెందిన కొన్ని సంస్థల సహకారంతో తాము నెలకొల్పుతున్న ప్రాజెక్టు త్వరలో ప్రారంభం కానుందని, దీని తర్వాత భారత్ మార్కెట్‌పై దృష్టి సారిస్తామని ముఖ్యమంత్రికి థావన్ తెలిపారు. ఏపీలో వ్యవసాయరంగంలో అనుసరిస్తున్న వినూత్న విధానాల గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారికి వివరించారు. అనంతపురము జిల్లాలో పెద్దఎత్తున వేరుశనగ సాగు చేపట్టేందుకు గల అవకాశాలు పరిశీలించాలని, వేరుశనగ నుంచి బటర్ తయారు చేసే యూనిట్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈ భేటీలో ఫోనిక్స్ గ్రూపు ఫైనాన్స్ కంట్రోలర్ నితిన్ నవంథెర్‌ కూడా వున్నారు.

rice mill 08022018 3

సామర్లకోటలో నెలకొల్పే రైస్ మిల్ ప్రాజెక్టు ఏడాదికి 3 లక్షల మెట్రిక్ టన్నుల సామర్ధ్యంతో పనిచేస్తుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే ప్రపంచంలోని అతిపెద్ద రైస్ మిల్ ప్రాజెక్టులో ఒకటిగా నిలుస్తుంది. ఇందులో లక్ష మెట్రిక్ టన్నులను దేశీయ మార్కెట్‌లో, మిగిలిన 2 లక్షల మెట్రిక్ టన్నులను విదేశాలకు ఎగుమతి చేయాలని ఫోనిక్స్ సంస్థ భావిస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 200 నుంచి 400 మందిగి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి దేశవిదేశాల్లో ఈ సంస్థ పెద్దఎత్తున క్రయవిక్రయాలు జరుపుతోంది. సుమారు 11 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తుల మేర లావాదేవీలు జరుపుతోంది. పలు దేశాలలో భారీగా భూకమతాలు ఫోనిక్స్ గ్రూపు కలిగివుంది.

ఈ రోజు ఉదయం పార్లమెంటులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.. కేంద్రం పై వివిధ మార్గాల్లో ఒత్తిడి తెస్తున్న టిడిపి ఎంపీలు, వివిధ పార్టీల మద్దతు కోసం రంగలోకి దిగారు... తెలుగుదేశం పార్టీ ఎంపీలు కేశినేని నాని, తోట నర్సింహం, రామ్మోహన్‌నాయుడు గురువారం లోక్‌సభలో సోనియా గాంధీ, జ్యోతిరాదిత్యలను కలిసారు... వారితో కొద్ది సేపు మంతనాలు జరిపారు.... ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని వారికి వివరించారు.... దీంతో ఆమె సానుకూలంగా స్పందించినట్లు సమాచారం...

parliament 08022018 2

అయితే ఆంధ్రప్రదేశ్ సమస్యలు, టిడిపి ఎంపీలకు మద్దతుగా, కాంగ్రెస్ అనూహ్య నిర్ణయం తీసుకుంది.. ఏపీ విభజన చట్టం, హోదాపై చర్చ జరపాలని లోక్‌సభలో కాంగ్రెస్ నోటీస్ ఇచ్చింది. 184 నిబంధన కింద ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ, ఓటింగ్ జరపాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కి కాంగ్రెస్ పక్షనేత మల్లిఖార్జున ఖర్గే నోటీసులు అందజేశారు... టీడీపీ ఎంపీలతో మంతనాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సమస్యల కోసం, ఎదో ఒకటి పార్లమెంట్ లో మా తరుపున చేస్తాం అని సోనియా హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ వెంటనే నోటీసులు ఇవ్వడం గమనార్హం...

parliament 08022018 3

అయితే నిన్న టిడిపి ఎంపీల ఆందోళన విషయంలో, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మల్లికార్జున ఖర్గే చేసిన విమర్శలతో, టిడిపి ఎంపీలకు, కాంగ్రెస్ ఎంపీలకు ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది... ఆ సందర్బంలో కూడా సోనియా, కేశినేని నాని మధ్య మాటలు నడిచాయి... అదే సందర్భంలో రాజ్యసభలో కూడా, కేవీపీ చేస్తున్న ఆందోళనకు మా మద్దతు లేదు అని కాంగ్రెస్ ప్రకటించింది... అయితే, ఈ రోజు టిడిపి ఎంపీలు స్వయంగా సోనియాని కలవటం, సపోర్ట్ ఇవ్వాలని, బీజేపీ ఎదో ఒక నిర్దిష్టమైన ప్రకటన ఇచ్చేలా చెయ్యటం కోసం, మీరు కూడా కలిసిరావాలని సోనియాని కోరటం, ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ప్రజా ఆందోళన వివరించటంతో, సోనియా వెంటనే రంగంలోకి దిగి, ఏపి సమస్యల పై చర్చించాలి అంటూ, మల్లికార్జున ఖర్గే నోటీసు ఇప్పించారు...

కేంద్ర బ‌డ్జెట్లో రాష్ట్రానికి జ‌రిగిన అన్యాయాన్ని నిర‌సిస్తూ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కి పిలుపు ఇచ్చాయి... ఈ పిలుపు ప్రతిపక్ష పార్టీగా జగన్ ఇస్తారు అని అందరూ అనుకున్నారు... కాని, జగన్ విచిత్ర పరిస్థితి వలన, పిలుపుకి బదులు, ఎవరో పిలుపిచ్చిన బంద్ కు మద్దతు ఇస్తున్నారు... అయితే, జగన్ మోహన్ రెడ్డి, ఈ బంద్ కోసమని, ఇవాళ కూడా పాదయాత్రకి సెలవు ఇచ్చారు... అందరు బంద్ లో పాల్గునాలని పిలుపు ఇచ్చారు... దీంతో, జగన్ కూడా బంద్ లో పాల్గుంటారని అందరూ అనుకున్నారు...

jagan 08022018 1

సెలవు ఇచ్చి మరీ, జగన్ బంద్ లో ఇరగదీస్తారని రాష్ట్రం మొత్తం ఎదురు చూసింది... అయితే జగన్ మాత్రం తన మీద నమ్మకం పెట్టుకుంటే ఏమవుతుందో, మరోసారి చూపించారు... బంద్ వలన పాదయాత్రకు సెలవు అని చెప్పి, లోటస్ పాండ్ పారిపోయారు... మడమ తిప్పని మహా వీరుడు ఇలా చేస్తాడు అని ఊహించని వైసిపీ నాయకులు పాదయాత్ర శిబిరం నుంచి నెమ్మదిగా జారుకున్నారు... కడుపు చించుకుంటే కాలు మీద పడుతుని, మీడియా వచ్చే లోపే పోదాం అంటూ, ఎవరికి వారు వెళ్ళిపోయారు...

jagan 08022018 1

అంతకు ముందు జనాలు నిద్ర లేవక ముందే బస్సులు పంపి తెప్పించుకున్న కాలేజీ పిల్లల్ని పెట్టుకొని ఫోటో లకు ఫోజ్ లు ఇచ్చి, 7:50 కల్లా సిబరం నుంచి హైదరాబాద్ బయలుదేరాడు ఘనమైన ప్రతిపక్ష నాయకుడు... రేపు శుక్రవారం ఎలాగు కోర్ట్ కి పోవాలి, ఇవాళ రెస్ట్ తీసుకుందాం అనుకుని, లోటస్ పాండ్ కి వెళ్ళిపోయారు.. సామాన్య ప్రజలు రోడ్డు మీద ఉంటే, ప్రజల్లో ఉండాల్సిన ప్రతిపక్ష నాయకుడు, తుర్రు మంటూ పారిపోయాడు... ఒక పక్క, పార్లమెంట్ ఉభయ సభల్లో, వైసిపీ ఎంపీలు పారిపోతుంటే, ఫీల్డ్ లో ఉన్న జగన్ కూడా అలాగే పారిపోతున్నాడు...

ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకుడు సోమువీర్రాజు, గత కొన్ని రోజులుగా, ఎలా రెచ్చిపోతున్నాడో చూస్తూనే ఉన్నాం... రెండు రోజుల క్రితం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పై, తీవ్ర స్థాయిలో పర్సనల్ విమర్శలు కూడా చేసారు... ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులను చంద్రబాబు మాత్రం, సోము లాంటి వాళ్ళని అసలు పట్టించుకోవద్దు అంటూ వారించారు... ఇది ఇలా ఉండగానే, బీజేపీ నేత సోము వీర్రాజుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా చీవాట్లు పెట్టినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.

amitshash 08022018 2

సీఎం చంద్రబాబుపై విమర్శలు చేసే అధికారం నీకు ఎవరిచ్చారని... మిత్రధర్మం, పొత్తులపై ఎందుకు మాట్లాడుతున్నావ్? నోరు అదుపులో పెట్టుకోవాలని అమిత్‌షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలుంటాయాని అమిత్‌ షా హెచ్చరించినట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి. చంద్రబాబుపై వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని అమిత్‌షా ఆదేశించినట్లు తెలుస్తోంది. సోమువీర్రాజుకు అమిత్‌షా వార్నింగ్ ఇవ్వడం ఇప్పుడు బీజేపీలో చర్చనీయాంశమైంది.

amitshash 08022018 3

అసలుకే ఆంధ్రప్రదేశ్ హామీల పై బీజేపీ - టిడిపి సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న వేళ, సోము వీర్రాజు లాంటి వాళ్ళు, మరింత గ్యాప్ పెంచి, తొందరగా జగన్ ను, బీజేపీ నీ కలిపెయ్యాలి అనే ఆత్రుతలో సోము వీర్రాజు ఉన్నట్టు అందరూ అనుకుంటూ ఉన్నారు... తాజగా అయితే షా, తనకు వార్నింగ్ ఇచ్చారని వస్తున్నఈ వార్తలపై సోము వీర్రాజు ఇంత వరకూ స్పందించలేదు..

Advertisements

Latest Articles

Most Read