బడ్జెట్‌లో అన్యాయం పై పార్లమెంట్‌లో నినదించిన ఏపీ ఎంపీలకు మద్దతు పెరుగుతోంది.... ఎంపీల ఆందోనళలో నిజముందని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత అన్నారు... లోక్‌సభలో మాట్లాడిన కవిత... పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీల్ని నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా ఎంపీలు నిరసన చేస్తున్నారని... ఏపీలో తమ సోదరులు ఆందోళనలు చేస్తున్నారని, వారికి మద్దతిస్తున్నానని చెప్పారు. .. వారికి తమ మద్దతు తెలుపుతున్నామన్నారు. ఇలా కేంద్రంలో మితపక్షం ఆందోళన చేస్తే... బయటకు తప్పుడు సంకేతాలు వెళతాయని అభిప్రాయపడ్డారు. ఏపీ ఎంపీల సమస్యల్ని అర్థం చేసుకోవాలని కోరారు.

trs 08022018 2

విభజన సమయంలో ఏపీ, తెలంగాణలకు ఇచ్చిన హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. విభజన సమయంలో హామీలు ఇచ్చినప్పుడు అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా కేంద్రంలో ప్రభుత్వం కొనసాగుతుందని చెప్పారు. సుమారు 10 నిమిషాల పాటు కవిత ఏపీ సమస్యల గురించి మాట్లాడారు. చివరగా ‘జై ఆంధ్రా’ అంటూ కవిత తన ప్రసంగాన్ని కవిత ముగించారు...

trs 08022018 3

కాగా బుధవారం రోజు టీఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి పార్లమెంట్‌లో మాట్లాడుతూ..ఏపీ ఎంపీలకు మద్దతిచ్చారు... బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి నుంచి ఏపీకి చెందిన వైసీపీ, టీడీపీ ఎంపీలు పార్లమెంట్ బయట, లోపల నినాదాలు, ఆందోళనలతో హోరెత్తిస్తున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే తెలుగుదేశం ఎంపీలు చేస్తున్న ఆందోళనకు, శివసేన, అకాళీదాల్, మమతా బనేర్జీ మద్దతు ఇచ్చాయి... ఇప్పుడు తాజాగా టిఆర్ఎస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చింది...

బడ్జెట్‌పై చర్చకు ఆర్థికమంత్రి జైట్లీ సమాధానం ఇస్తున్న సమయంలో, తెలుగుదేశం ఎంపీలు జైట్లీని చుట్టుముట్టి, ముందు మా రాష్ట్రం గురించి మీరు మాట్లాడండి... మా సమస్య గురించి చెప్పే, మీరు మిగతా స్పీచ్ ఇవ్వండి అంటూ, జైట్లీని చుట్టుముట్టారు... దీంతో జైట్లీ, నేను మీ గురించి చెప్తాను, ఒక్క 15 నిమషాలు మీరు ఓపిక పట్టండి అంటూ, మీ గురించే చెప్తాను నాకు టైం ఇవ్వండి అంటూ, సముదాయించారు... దీంతో మన ఎంపీలు జైట్లీ పక్కనే నుంచున్నారు... జైట్లీకి మధ్య మధ్యలో గుర్తుచేస్తూనే ఉన్నారు.. చివరకు జైట్లీ ప్రకటన చేసారు... పాడిందే పాట పాడారు జైట్లీ...

parliament 08022018 2

పీ గురించి మాట్లాడిన ఆయన.. ఏపీకి నిధులు ఇవ్వాలని అడుగుతున్నారు కానీ కొద్దిగా భారం తగ్గితే ఏపీలాంటి రాష్ట్రాలకు నిధులు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఏపీ విభజన సమస్యలపై తనకు సానుభూతి ఉందన్నారు. పోలవరానికి ఇస్తున్నాం, ఆర్ధిక లోటు గురించి చర్చిస్తున్నాం, విద్యా సంస్థలకు ఎన్నో నిధులు ఇచ్చాం, ఇంకా ఇస్తాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తాం అంటూ, పాడిన పాటే పాడారు.... జైట్లీ ఇవాళ ఎదో ఒక ప్రకటన చేస్తారు అని, ప్రజలు కూడా బంద్ చేసారు కాబట్టి, ప్రజలకు కూడా సమాధానం చెప్తారని అందరూ అనుకున్నారు... బీజేపీ కూడా అలాగే లీక్లు ఇచ్చింది...

parliament 08022018 3

చివరకు జైట్లీ మాటలు విన్న ప్ర్జాలు, పార్లమెంట్ లు ఉన్న ఎంపీలు భగ్గుమన్నారు... వెంటనే ఆందోళన బాట పట్టారు... నినాదాలు, ఆందోళన మధ్యనే, పార్లమెంట్ వాయిదా పడింది... ఓ వైపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగిస్తుండగా ఏపీ ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ జైట్లీ మాత్రం చెప్పాల్సినవన్నీ చెప్పేశారు.... ఎంపీల నిరసనల మధ్య లోక్‌‌సభ రేపటికి వాయిదా పడింది. ...

ఎమిరేట్స్ హెడ్‌క్వార్టర్స్‌లో ఎమిరేట్స్, దుబాయ్ నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (D NATA) చైర్మన్ షేక్ అహ్మద్ బీన్ సయీద్ అల్ మక్దూమ్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు... ఈ సమావేశంలో యుఏఈలో భారత రాయబారి నవ్‌దీప్ సూరి కూడా పాల్గున్నారు... హైదరాబాద్ నుంచి తొలి ఎమిరేట్స్ విమాన సర్విసును ఆరంభించడానికి, ఆ తరువాత భారత్ అంతా తమ సర్వీసులను విస్తరించడానికి అప్పుడు ఉమ్మడి రాష్ట్రానికి సీయంగా ఉన్న చంద్రబాబు తమకు ఎలా సహకరించిందీ షేక్ అహ్మద్ సయీద్ అల్ మక్దూమ్ గుర్తు చేసుకున్నారు..

emirates 08022018 2

ఏపీ, అమరావతికి తమ సర్వీసులను ఆరంభించడానికి ఎమిరేట్స్ సన్నాహాలు చేస్తున్నామని, అయితే భారత ప్రభుత్వ నియమ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని వివరించారు.. భారత ప్రభుత్వం ఈ నిబంధనలను సడలిస్తే వెంటనే తమ సర్వీసులను నడపడానికి ఇబ్బంది ఉండబోదని తెలిపారు... భారత్ నుంచి దుబాయ్ రావడానికి ఇప్పుడు కేటాయిస్తున్న సీట్ల సంఖ్య పరిమితంగా ఉన్నాయని, పాత అగ్రిమెంటును భారత ప్రభుత్వం సవరించాల్సిన అవసరం ఉందని చెప్పారు... అమరావతి సందర్శించాలని మక్దూమ్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు...

emirates 08022018 3

ఇదే సందర్భంలో, ఎమిరేట్స్ గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి మండలి అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది... ఒప్పందం ప్రకారం ఉభయులు కలిసి వర్కింగ్ గ్రూపులను ఏర్పాటు చేసుకుంటారు... ఏరోస్పేస్ సంబంధిత మౌలిక సదుపాయాలు, తయారీ పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, వాటిల్లో ఎమిరేట్స్ పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తారు. ... ఒప్పందం ప్రకారం ఏపీలో మెయింటెనెన్స్ రిపేర్ అండ్ ఓవర్‌హాల్ (ఎమ్ఆర్ఆర్) సదుపాయాన్ని ఏర్పాటుచేస్తారు. ఏవియేషన్ శిక్షణ కోసం ఒక అకాడమీని కూడా నెలకొల్పుతారు. ... అలాగే, ఎయిర్ క్రాఫ్ట్స్ తయారీ, విమానాల ఇంటీరియర్, డ్యూరబుల్స్ తయారీ కేంద్రం ఏర్పాటు చేస్తారు.... ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా ఏపీలో నైపుణ్యాభివృద్ధి, సామర్థ్యం పెంపునకు కృషిచేస్తారు....

ఈ రోజు రాజ్యసభలో కేంద్ర మంత్రి సుజాన చౌదరి ప్రసంగిస్తూ, విభజన హామీల పై కేంద్రం అన్యాయం చేస్తుంది అని, ఇన్ని రోజులు నుంచి ఆందోళన చేస్తున్నా, కేంద్రం స్పందించలేదు అంటూ ప్రసంగించారు... అయితే సుజనా చౌదరికి ఒక ఆంధ్రా ఎంపీగా సపోర్ట్ చెయ్యల్సింది పోయి, వైసిపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి, సుజనా చౌదరినే విమర్శించారు... కేంద్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉండి రాష్ట్రపతి ప్రసంగాన్ని ఎలా వ్యతిరేకిస్తారంటూ, అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన ఎలా వ్యక్తం చేస్తారంటూ కేంద్రమంత్రి సుజనా చౌదరిని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

vijayasayi 08022018 2

కేంద్రంపై విశ్వాసం లేకపోతే సుజనా చౌదరి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో విజయసాయి పాయింట్‌ ఆఫ్‌ ఆర్డర్‌ లేవనెత్తారు.. రాజ్యసభలో రూల్ 238-1, రూల్ 238-2, రూల్ 238-ఏ కింద పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తామని అన్నారు. ... ఒక పక్క క్యాబినెట్ లో ఎందుకు వ్యతిరేకించలేదు అంటూనే... ఇంకో పక్క రాజ్యసభలో ఎందుకు వ్యతిరేకిస్తున్నావ్ అంటూ, విజయసాయి మాట్లాడారు... అయితే ఇదే విషయం పై రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు, అసలు విషయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, సీట్లో కూర్చోవాలని విజయసాయికి సూచించారు...

vijayasayi 08022018 3

తరువాత బయటకు వచ్చి మీడియా ముందు, విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, వెంకయ్య తీరును తప్పుబట్టారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ పై రాజ్యసభ ఛైర్మన్ తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన ఛైర్మనే... నిబంధనలను అమలు చేయకపోతే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. ఛైర్మన్ తీరుపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని అన్నారు... ఒక నిజాయితీ గల వ్యక్తికి, కష్టపడి ఉప రాష్ట్రపతి స్థాయి దాకా వచ్చిన వ్యక్తి పై, విజయసాయి లాంటి A2 కేసులు ఉన్న వాళ్ళు, ఫిర్యాదు చేస్తా అనటం వింతగా ఉంది...

Advertisements

Latest Articles

Most Read