పార్లమెంటులో మూడో రోజూ తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు... ప్రస్తుతం పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే... విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ గత రెండు రోజులుగా టీడీపీ ఎంపీలు ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే... కాగా... బుధవారం మూడో రోజు కూడా పార్లమెంటు ఎదుట, అలాగే గాంధీ విగ్రహం ఎదుట ఎంపీలు ధర్నా నిర్వహించారు... సభ ప్రారంభం కాగానే, లోపల కూడా ఆందోళన చేస్తున్నారు...
ఇదిలా ఉండగా పార్లమెంటు నుంచి సస్పెండ్ చేసినా కూడా స్పష్టమైన హామీ లభించే వరకు ఆందోళన విరమించవద్దని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తమ పార్టీ ఎంపీలకు బుధవారం ఉదయం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సూచించారు... దీంతో కేంద్ర మంత్రులు రంగంలోకి దిగారు... ఇవాళ ప్రధాని మోడీ ప్రసంగం ఉంది అని, దాంట్లో ఒక ప్రకటన ఉంటుంది అని, ఎంపీల ఆందోళన విరమించుకోవాలని రాజ్ నాథ్ సింగ్ చంద్రబాబుకి ఫోన్ చేసి చెప్పారు... ఈ విషయాన్ని మీకు తెలియజేయాలని ప్రధాని స్వయంగా కోరారని అన్నారు. ఆందోళనలు విరమించాలని మీ ఎంపీలను కోరాలని చెప్పారు.
దీంతో చంద్రబాబు ఫైర్ అయ్యారు... ఇంకా ఎంత సేపు, ఇలా ప్రకటనలతో సరిపెడతారు అని, టైం బౌండ్ ప్రోగ్రాం ఇస్తేనే, మేము వెనక్కు తగ్గుతామని, ఇది మా ప్రజల బాధ అని, అదే మేము సభ లోపల వ్యక్తపరుస్తున్నామని, తగ్గేది లేదు అని చెప్పారు... దీంతో రాజ్ నాథ్ సింగ్, కనీసం ప్రధాని ప్రసంగించే సమయంలో అయినా, ఆందోళన విరమించి, ఆయన చేసే ప్రకటన వినాలని చెప్పారు... చంద్రబాబు మాత్రం, ఏ హామీ ఇవ్వలేదని సమాచారం...