నిన్న చంద్రబాబు చెప్పిన విధంగానే, దేశ రాజధానిలో, మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం పై, తెలుగుదేశం ఎంపీలు, ఇక్కడ ప్రజల ఆక్రోశాన్ని, దేశం మొత్తం తెలిసేలా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు... పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. ముందుగా, మన ఎంపీలు పార్లమెంట్ ప్రారంభానికి ముందు, అక్కడ ఉన్న గాంధీ విగ్రహం ముందు నిరసన తెలియ చేసారు... అలాగే, విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులు సోమవారం లోక్‌సభలో నోటీస్‌ ఇచ్చారు. 193వ నిబంధన కింద టీడీపీ ఎంపీలు నోటీస్‌ ఇచ్చారు.

parliament 05022018 2

విభజన హామీలు నెరవేర్చేలా చర్యలు చేపట్టాలని లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌కు ఎంపీలు తోట నరసింహం, కేశినేని నాని, నిమ్మల కిష్టప్ప నోటీసు ఇచ్చారు. విభజన హామీల అమలుపై 193వ నిబంధన కింద చర్చ చేపట్టాలని నోటీసులో పేర్కొన్నారు. దీని ప్రకారం, కేంద్రం అన్నిటి పై సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది... ఇది అన్నీ రికార్డులలో ఉంటుంది కాబట్టి, కేంద్రం చెప్పిన సమాధానం పై, అవసరమైతే, కోర్ట్ కి కూడా వెళ్ళవచ్చు అనేది రాష్ట్రం ఆలోచన... అయితే ఒక బీజేపీ ఎంపీ చనిపోవటంతో, ఇవాళ సభ వాయిదా పడే అవకాసం ఉంది...

parliament 05022018 3

రాజ్యసభలో యధావిధగా ఆందోళన జరిగే అవకాసం ఉంది.. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు కావడం లేదంటూ గత కొద్దిరోజులుగా టీడీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తూ విచ్చారు. నిన్న జరిగిన సమావేశంలో, మిత్ర ధర్మాన్ని పక్కాన పెట్టి, బహిరంగంగా బీజేపీ ఎండగట్టాలని నిర్ణయించారు... తెలుగుదేశం ఎంపీల ఆందోళనకు, అకాళీదళ్‌ పార్టీ, శివసేన పార్టీ మద్దతు ప్రకటించాయి... కాని, మన సొంత వైసిపీ ఎంపీలు మాత్రం, మాద్దతు లేదు, ఆందోళన లేదు.. ఎక్కడ ఉన్నారో తెలీదు...

ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, కేంద్రాన్ని నిందిస్తూ, చంద్రబాబుకు మద్దతుగా జాతీయ స్థాయిలో సపోర్ట్ వస్తుంది... చంద్రబాబు ఏ విధంగా అయితే, దేశం మొత్తం, మన సమస్యల పై, మనకు అండగా నిలవాలి అనుకుని, వ్యుహ్యం పన్నారో, దానికి తగ్గట్టుగా, చంద్రబాబుకి సపోర్ట్ గా, జాతీయ స్థాయిలో ఫస్ట్ వాయిస్ వినిపించింది... ఈ వాయిస్ వినిపించింది కూడా, ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న పార్టీనే... మన రాష్ట్ర హక్కులనే కాదు, మోడీ వైఖరి, మిత్ర పక్షాలకు ఇస్తున్న గౌరవం గురించి కూడా ఎండగట్టారు...

gujral 04022018 2

ఆయన ఎవరో కాదు, శిరోమణి అకాలీదళ్‌ పరి ఎంపీ నరేశ్‌ గుజ్రాల్‌... ఈయన మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్‌ తనయుడు... ఇప్పుడు మన రాష్ట్రానికి అండగా నిలబడ్డారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇస్తాను అన్నారు... ఇవ్వలేదు... స్పెషల్ ప్యాకేజి అన్నారు... కనీసం అదన్నా ఇవ్వాలి కదా అంటూ, ఒక జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు... రాష్ట్రానికి రావాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నారు అని, మిత్రపక్షంగా, ఉంటూ, వారి వినతులు పట్టించుకోకపోతే ఎలా అని అన్నారు...

gujral 04022018 3

చంద్రబాబు ఏమి గొంతెమ్మ కోర్కెలు కోరటం లేదు... మీరు చెప్పినవే అడుగుతున్నారు.. ఒక పక్క విభజన అన్యాయంగా జరిగింది... హైదరాబాద్ కి అన్నీ ఉన్నాయి... లోటు బడ్జెట్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత మీదే కదా అంటూ, నరేశ్‌ గుజ్రాల్‌ అన్నారు.. అంతే కాదు, మోడీ సంకీర్ణ ధర్మం పాటించటం లేదు అని, లోకల్ గా ఉన్న బీజేపీ నాయకులు అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు అని, ఇది ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో ఇలాగే ఉంది అంటూ, మోడీ పై విమర్శలు గుప్పించారు... నరేశ్‌ గుజ్రాల్‌, మనకు సపోర్ట్ గా మాట్లాడటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కృతజ్ఞత చెప్తున్నారు... సొంత రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు నోరు మూసుకుంటే, పక్క రాష్ట్రం వారు, మన హక్కుల కై, మన ముఖ్యమంత్రికి సపోర్ట్ ఇస్తూ మాట్లాడుతున్నారు...

కేంద్రం పై దశలవారి పోరాటానికి, తెలుగుదేశం పార్టీ సిద్దమైంది... ముందుగా పార్లమెంట్‌లో బీజేపీని ఎండగట్టాలని, నాలుగు రోజుల పాటు జరిగే బడ్జెట్ సమావేశాల్లో, ఒత్తిడి తేవాలని, బడ్జెట్ ఆమోదం పొందే లోపు, మన సమస్యలు బడ్జెట్ లో అడ్రస్ చేసే విధంగా ఒత్తిడి తెద్దాం అని చంద్రబాబు ఎంపీలతో అన్నారు... నాలుగు రోజుల పాటు జరిగే ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్రం పై యద్ధం లాంటిదే చెయ్యాలని ఎవరు ఏం చెప్పినా తగ్గొద్దని ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు... మనం తీసుకునే నిర్ణయం, రాజకీయ నిర్ణయం అయితే, ఈ పాటికి బయటకు వచ్చి, ప్రజలు మనసులు గెలుచుకోవచ్చు, కాని, మనకి రాష్ట్ర ప్రయోజనాలు కూడా ముఖ్యం, మన రాష్ట్రం ఉన్న పరిస్థుతుల్లో, ఆవేశంలో ఏ మాత్రం తప్పతడకు వేసినా, రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదం అంటూ చంద్రబాబు చెప్పుకొచ్చారు...

cbn meeting 04022018 2

కేంద్ర బడ్జెట్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, మనం మౌనంగా ఉంటే కుదరదని ఎంపీలకు ఆయన హెచ్చరించారు. పార్టీలకతీతంగా కేంద్ర బడ్జెట్‌ను అందరూ వ్యతిరేకిస్తున్నారని గుర్తుచేశారు. ఇప్పటి వరకు మిత్రపక్షంగా, మిత్ర ధర్మం పాటిస్తూ మన వినతులు ఇచ్చాం... ఇప్పుడు మిత్రపక్షంగా ఉంటేనే, మనకు జరిగిన అన్యాయం వినిపిద్దాం, ఇది మొదటి అడుగు మాత్రమేనని, ఏపీ ప్రయోజనాలను సాధించుకునే వరకు పోరాడతామని చంద్రబాబు స్పష్టం చేశారు. రేపటి నుంచే నిరసనలు, ఆందోళనలు చేపట్టండి చంద్రబాబు పిలుపునిచ్చారు...

cbn meeting 04022018 3

దీని పై జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, ‘‘నన్ను ఆవేశపరుడన్నారు. అందరూ నా అభిప్రాయంతో ఏకీభవించారు. నిరసనలు, ఆందోళనలకు దిగిరాకపోతే చివరి అస్త్రం రాజీనామా. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోపు నిర్ణయం. మా ఎంపీలందరూ నా అభిప్రాయంతో ఏకీభవించారు’’ అని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి చెప్పారు. పోరాటాలకు కేంద్రం దిగిరావాల్సిందేనని, దిగిరాకపోతే మాత్రం ఆందోళనలు ఉధృతం చేస్తామని ఎంపీ టీజీ వెంకటేష్ హెచ్చరించారు... ఆత్మగౌరవ నినాదం తమకు గుర్తుందని, ఊరుకోమని, తాడో పేడో తేల్చుకునే దిశగా చర్చలు జరిగాయని టీజీ వెంకటేష్‌ చెప్పారు. ఏపీ ప్రయోజనాల కోసం పోరాటం తప్పదని, కొనసాగుతూనే ఉంటుందని, వెనక్కి తగ్గేది లేదని ఎంపీ నిమ్మల కిష్టప్ప స్పష్టం చేశారు. తాడే పేడో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, పార్లమెంట్‌లో ఆందోళనలు, నిరసనలు ఉధృతం చేస్తామని క్రిష్టప్ప హెచ్చరించారు.

సోము వీర్రాజు.... కామెడీ ఆర్టిస్ట్ కి ఎక్కువ, వ్యాంప్ క్యారక్టర్ కి తక్కువ... విమర్శలకు కౌంటర్ ఇచ్చే స్థాయి కాదు, అలా అని వాగే వాగుడికి, మాట్లాడకుండా ఉండలేం... ఈయనగారు మూడేళ్ళ నుంచి ఒక కల కంటున్నాడు... ఆ కల కోసం, అన్ని విధాలుగా ప్రయత్నం చేసాడు... చివరకు మొన్న అమిత్ షా స్టేట్మెంట్ తో, ఏమి చెయ్యాలో తెలియక, రోడ్డు మీద పిచ్చోడు వాగినట్టు, వాగుతూ, లోటస్ పాండ్ స్క్రిప్ట్ చదువుతూ, విర్రవీగుతూ, రాష్ట్రంలో ఉన్న ఒక "జఫ్ఫా" బ్యాచ్ ని ఆనంద పరుస్తున్నాడు...

veerraju 04022018 2

ఇంతకీ ఈయన కల ఏంటో తెలుసా... ఈయన బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధక్షుడుగా ఎన్నిక కావలి అని... అధ్యక్షుడు అయిన వెంటనే, టిడిపిని దూరం పెట్టి, వైసిపీని బీజేపీతో కలిపేసి, విజయసాయి రెడ్డికి మంత్రి పదవి ఇప్పించాలని ప్లాన్ వేసాడు... ఇందుకోసం లోటస్ పాండ్ అన్ని విధాలుగా, సహకారం అందించింది... ఆ ప్లాన్ ప్రకారం, ఇన్నాళ్ళు విర్రవీగాడు వీర్రాజు... చివరకు రెండు రోజుల క్రిందట అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడుగా కంబంపాటి హరిబాబునే కొనసాగించటంతో, పాపం వీర్రాజు గారి ఆశలు ఆవిరి అయ్యాయి...

veerraju 04022018 3

ఈ దెబ్బతో, ఏమి చెయ్యాలో అర్ధం కాక, ఫ్రస్ట్రషన్ పీక్స్ కి పోయి, ఇవాళ చంద్రబాబు పై పిచ్చి వాగుడు వాగాడు వీర్రాజు... వైసిపీ స్క్రిప్ట్ ప్రకారం, రెండు ఎకరాలు, రెండు వేల కోట్లు, అవినీతి, ఇలా ఏది పడితే అది మాట్లాడుతూ, చివరకు మెంటల్ బాలన్స్ తప్పాడు అనే అభిప్రాయం కలిగించేలా ప్రవర్తించాడు... నిజానికి వీర్రాజు విపరీత ప్రవర్తనకు కారణం, అమిత్ షా, మూడేళ్ళ నుంచి పెట్టుకున్న ఆశల పై నీళ్ళు చల్లటమే... పాపం ఎన్ని రోజులు ఈ స్టేజిలో ఉంటాడో...

Advertisements

Latest Articles

Most Read