కేంద్రం పై తీవ్ర అసంతృప్తిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాజకీయ నిర్ణయం తీసుకుంటాం అంటూ, సంకేతాలు ఇవ్వటంతో, ఇప్పటికే బీజేపీ - టిడిపి పొత్తు పై నేషనల్ మీడియాలో హడావిడి మొదలైంది... ఒక పక్క చంద్రబాబు, అనూహ్యంగా శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేతో ఫోన్ లో మాట్లాడటం, చర్చనీయంసం అయ్యింది.. చంద్రబాబు ఇంత దూకుడుగా వెళ్తారని ఊహించని బీజేపీ, ఈ పరిణామంతో అవాక్కయింది... వెంటనే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, అమిత్ షా రంగంలోకి దిగారు.. చంద్రబాబుని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు...

amit shsah04022018 2

అమిత్ షా ఫోన్‌ చేసి, చంద్రబాబుతో మాట్లాడారు... తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశంలో తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని కోరారు. త్వరలోనే అన్ని విషయాలపై చర్చిద్దామని అమిత్‌షా అన్నారు... మీరు కోరినట్టే చేద్దాం అని, చర్చిద్దాం అని, తొందరపడవద్దు అంటూ, చంద్రబాబుని బుజ్జగించే ప్రయత్నం మొదలైంది... మొన్నటిదాకా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి, అపాయింట్మెంట్ కూడా ఇవ్వని బీజేపీ నేతలు, ఇప్పుడు భూమి పైకి వచ్చి, మనల్నే బుజ్జగిస్తున్నారు... ఇదే కర్మ సిద్దాంతం అంటే...

amit shsah04022018 3

బీజేపీతో ఇంకా కలిసుండాలా? తెగదెంపులు చేసుకోవాలా? అన్న అంశంపైనే చంద్రబాబు, ఎంపీలు, మంత్రులతో చర్చించనుండగా, చర్చల అనంతరం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకుంటారోనన్న తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పేరుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ సాగుతుందని చెబుతున్నా, విభజన చట్టాన్ని సక్రమంగా అమలు చేయక పోవడం, కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేరక పోవడంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తి, వీటి అన్నిటి పై వాడివేడిగా చర్చలు సాగుతున్నాయి...

బీజేపీ చంద్రబాబు గరంగరంగా ఉన్నారంటూ, నేషనల్ మీడియాలో ఇప్పటికే వార్తలు హల చల్ చేస్తున్నాయి... చంద్రబాబు థర్డ్ ఫ్రంట్ పెట్టబోతున్నారు అని ఒకరు, మోడీ మీద విపరీతమైన ఒత్తిడి పెట్టి పనులు సాధించుకుంటారని ఒకరు, చంద్రబాబే దేశంలో ప్రస్తుతం మోడీ హవాని ఎదురు తిరిగి, కాంగ్రెస్, బీజేపీ పార్టీలని ఏకాతాటి పైకి తేగలరని, ఇలా నేషనల్ మీడియా రకరకాల కధనాలు చూపిస్తుంది... తాజాగా, నేషనల్ మీడియాలో, చంద్రబాబు, శివసేన ఉద్ధవ్ థాకరే కు చంద్రబాబు ఫోన్ చేసారనే అనే న్యూస్ హైలైట్ చేస్తూ రిపోర్ట్ చేస్తున్నారు... దాదాపు 10 నిమషాల పాటు ఈ సంభాషణ సాగింది... ఇప్పటికే శివసేన, ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే...

cbn sivasena 04022018 2

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, శివసేన ప్రెసిడెంట్ ఉద్ధవ్ థాకరేకు శనివారం ఫోన్ చేసి, ఎన్డీయేలో నెలకున్న పరిస్థితులు, బీజేపీ చేస్తున్న అన్యాయం, ఇలా అన్ని విషయాలు గురించి ప్రస్తావించినట్టు, టైమ్స్ అఫ్ ఇండియా రిపోర్ట్ చేసింది.. ఈ కధనం ప్రకారం, మా రాష్ట్రంలో ప్రజలు, ఎన్డీయే నుంచి బయటకు వచ్చేయమంటున్నారు, మూడ్ అఫ్ ది స్టేట్, బీజేపీ ఒంటెద్దు పోకడలకు వ్యతిరేకంగా ఉంది అంటూ, మేము కూడా ప్రజల మాట వినే పరిస్థిది ఉంది అంటూ, చంద్రబాబు, ఉద్ధవ్ థాకరే తో అన్నట్టు, టైమ్స్ అఫ్ ఇండియా రాసింది...

cbn sivasena 04022018 3

అదే విధంగా ఇండియా టుడే కూడా, చంద్రబాబు, బీజేపీని వదిలి బయటకు వచ్చేయటానికే నిర్ణయించుకున్నారు అని, చివరి అవకాశంగా, మేము అడిగినివి అన్నీ ఇస్తేనే, మీతో ఉంటాం అంటూ, చంద్రబాబు, అమిత్ షా తో అన్నట్టు రిపోర్ట్ చేసింది... అమిత్ షా కూడా, తొందరపడకుండా, మీరు ఢిల్లీ వస్తే, అన్నీ మాట్లాడుకుందాం, మీరు అడిగినవి అన్నీ చేస్తాం, అన్నట్టు కధనం రిపోర్ట్ చేసింది.. చివరకు చంద్రబాబు, ఏ నిర్ణయం తీసుకొంటారో చూడాలి...

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తక్కువ కేటాయింపులు ఇచ్చింది అని, రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు, అధికారులు, మంత్రులు, సమీక్షలు మీద సమీక్షులు చేస్తున్నారు... కేంద్ర బడ్జెట్ పేపర్లు అన్నీ తిరగేసి, మన కేటాయింపుల పై సమీక్షలు చేస్తున్నారు... మనం అడిగింది ఎంత, ఇన్నాళ్ళు కేంద్రం ఇచ్చింది ఎంత, మనకు కేంద్రం ఎందుకు నిధులు ఇవ్వటం లేదు, ఎక్కువ నిధులు ఎలా తెచ్చుకోవాలి, ఏ మార్గాల్లో ఒత్తిడి తేవాలి, రాజకీయ నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఖటిన నిర్ణయాలు తీసుకుంటే, రాష్ట్రం పై ఎలాంటి ఆర్ధిక భారం పడుతుంది లాంటి వాటి పై, సమీక్షలు చేస్తున్నారు...

vijaysai 03022018 2

అయితే, స్వతహాగా ఆడిటర్ అయ్యి, దొంగ లెక్కలతో జగన్ కు మేలు చేసి, 11 కేసుల్లో A2గా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం అసలు కారణం నాకు తెలుసు అంటూ, ఇవాళ మీడియాకు చెప్పారు...రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు పూర్తి అవగాహన ఉందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. నిధులు దుర్వినియోగం అవుతాయనే.. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి కేటాయింపులు తగ్గించారన్నారు.

vijaysai 03022018 3

శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు తన స్వలాభం కోసం రాష్ట్రానికి దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైసీపీ ఎంపీలు రాజీనామాలకు సిద్ధం అని విజయసాయి పునరుద్ఘాటించారు. రైల్వే జోన్‌ ఏర్పాటుకు చట్ట సవరణ అవసరం లేదని, ఏపీ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం అని పేర్కొన్నారు.

మన రాజధాని అమరావతి అని, ఇప్పటి వరకు నేషనల్ మీడియా గుర్తించలేదు... కనీసం ఒక్క వార్త కూడా మన రాష్ట్రం నుంచి ఉండదు... చంద్రబాబు పరిపాలనలో ఎన్ని విప్లవాత్మక మార్పులు తీసుకోవచ్చినా, ఏ నాడు అవి దేశానికి చూపించిన పాపాన పోలేదు నేషనల్ మీడియా... చివరకు సాక్షాత్తు భారత రాష్ట్రపతి, మీరు దేశానికి ఆదర్శం అని చెప్పినా, ఒక్కరు కూడా రిపోర్ట్ చెయ్యలేదు... మన రాష్ట్రంలో ఏదన్నా నెగటివ్ న్యూస్ ఉంటే మాత్రం, హైదరాబాద్ నుంచి రిపోర్ట్ చేసేవారు... చంద్రబాబు "నమస్కారం" పుణ్యమా అని, ఈ రోజు నేషనల్ మీడియా మొత్తం అమరావతిలో వాలి పోయింది...

amaravati 04022018 2

కేంద్ర బడ్జెట్ పై గుర్రుగా ఉన్న చంద్రబాబు, ఈ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారా అని ఎదురు చూస్తున్నాయి... అందుకోసం హైదరాబాద్ నుంచి కాకుండా, మొత్తం అమరావతిలో వాలిపోయారు... ఇది రాజకీయ పరిణామమే అయినా, మన అమరావతిని ఈ రకంగా అయినా, నేషనల్ మీడియా గుర్తించినందుకు ధన్యవాదాలు... ఇప్పుడు మన అమరావతి, మన సచివాలయం, మన రోడ్లు మీద శుభ్రత, టెక్నాలజీ వినియోగం, వీటన్నటి మీద ఇప్పటికైనా నేషనల్ మీడియా కన్ను పడుతుంది...

amaravati 04022018 3

మొత్తానికి, ఇవాళ ఉదయం 10 గంటలకు టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం పై నేషనల్ మీడియా మొత్తం ఫోకస్ పెట్టింది... ఉండవల్లి గ్రీవెన్స్ హాల్ లో ముఖ్యమంత్రితో, ఎంపీలు సమావేశం కానున్నారు... కేంద్రం పై ఎలా ఒత్తిడి పెంచాలి, అసలు కేంద్రంతో కలిసి ఉండాలా వద్దా, ప్రజల నుంచి బీజేపీ పై వస్తున్న తిరుగుబాటు, వైసిపి - బీజేపీ బంధం, బయటకు వచ్చేస్తే, ఈ 14 నెలలు కేంద్రం ఆసరా లేకుండా, ఎలా నెట్టుకురావాలి, ఇలా అన్ని విధాలుగా చర్చించి, ముఖ్యమంత్రి ఒక నిర్ణయం ప్రకటించనున్నారు... ఈ నిర్ణయం కోసం, నేషనల్ మీడియా మొత్తం ఎదురు చూస్తుంది...

Advertisements

Latest Articles

Most Read