ఒక పక్క కేంద్రం ఈ బడ్జెట్ లో మాకు అన్యాయం చేసేంది అంటూ, రాష్ట్రంలోని చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా దుమ్మిత్తి పోస్తుంటే, ముఖ్యమంత్రి సహచరుడిగా, అదే మంత్రి వర్గంలో ఉన్న మంత్రి మాత్రం, కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ బ్రహ్మాండం అంటూ కితాబు ఇచ్చారు... ఆ మంత్రి గారే, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గారు... ఈయనే మొన్న, నా జోలికి వస్తే, ఏపి కట్ చేస్తా అన్నాడు... కట్ చేసే టైం వచ్చిందో ఏమో కాని, రాష్ట్రం అంతా ఆందోళనలో ఉంటే, ఈయాన మాత్రం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం కూడా బ్రహ్మాండం అంటూ, తన పార్టీకి భజన చేసుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల మనోభావాలని గాలికి వదిలేసారు... ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా...

manikyalarav 02022018

బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని మాణిక్యాలరావు కేంద్రంపై ప్రశంసల జల్లు కురిపించారు... దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాలు వేరు, ఏపీ వేరు అనడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని ప్రజల్లోకి వెళ్లి చెప్పగలమని మంత్రి అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందనేది మిత్రపక్షంలోని కొందరి వాదన మాత్రమేనన్నారు. ఏపీ నేతలు ఇంకా రికార్డ్స్ ఏమీ చూడలేదు, ఈ రెండు మూడురోజులు బడ్జెట్‌పై స్టడీ చేయాల్సిన అవసరముందని అన్నారు...

manikyalarav 02022018

అయినా మాణిక్యాలరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మిగతా రాష్ట్రాలతో సమానమా ? మిగతా రాష్ట్రాలతో సమానంగా చూస్తారా ? ఆ లాజిక్ ప్రకారం చూసినా, బెంగుళూరు పేరు చెప్పి 17 వేల కోట్లు, మహారాష్ట్ర పేరు చెప్పి 40 వేల కోట్లు ఇచ్చారుగా అండి ? దగా పడ్డ రాష్ట్రానికి కనీసం చెప్పిన వాటిల్లో సగం అయినా చెయ్యాలి కదా ? మీకు ఈ బడ్జెట్ లో అంత అద్భుతమైనవి ఏమి కనిపించాయి ? ఈ అద్భుతాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్తారా ? వెళ్ళండి సార్... కనీసం ప్రజల మనోభావాలు అర్ధం చేసుకోండి...

ఒక పక్క కేంద్ర బడ్జెట్ పై ప్రజల్లో అసంతృప్తి ఉంటే, దాన్ని పట్టించుకోకుండా, ప్రతిపక్షంగా ఉంటూ కూడా రాజకీయం చేస్తున్నాడు విజయసాయి రెడ్డి... ఒక పక్క కేవీపీ రామచంద్రా రావు ప్రతిపక్షంగా ఉంటూ రాజ్యసభలో నిరసన తెలుపుతుంటే, విజయసాయి మాత్రం, చంద్రబాబుని ఎలా ఇరికిద్దామా అంటూ ఆలోచనలు చేస్తున్నాడు... లిటిగేషన్ ప్రశ్నలు మాత్రమే అడిగి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూసే A2 విజయసాయి రెడ్డికి, ఇవాళ కూడా చాలా ఇబ్బందకర పరిస్థితులు ఎదురుయ్యాయి.. రాష్ట్ర నాసనాన్ని కోరుకుంటూ, ఉండే జగన్ పార్టీ, విజయసాయి రెడ్డి చేత రాజ్యసభలో ఇలాంటి లిటిగేషన్ ప్రశ్నలు మాత్రమే అడిగిస్తూ ఉంటుంది...

vijayasai 02022018 21

ఈ రోజు, రాజ్యసభ క్యూస్షన్ హౌర్ లో, విజయసాయి రెడ్డి, మన రాష్ట్రంలో అమలవుతున్న రేషన్ షాపులు, అదే విధంగా కొత్తగా ప్రవేశ పెట్టిన చంద్రన్న మాల్స్ పై అనుమానాలు వ్యక్తం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం కేవలం రిలయన్స్ లాంటి సంస్థలకు లబ్ది చేకూర్చేందుకే ఇలాంటి కార్యక్రమం చేస్తుంది అంటూ, దీని పై సమాధానం చెప్పమంటూ కేంద్రాన్ని అడిగారు... ఈ ప్రశ్న ఉద్దేశం, మన రాష్ట్రంలో రేషన్ షాపులు సరిగ్గా పని చెయ్యటం లేదు అని, అవినీతి జరుగుతుంది అని, పేదలకు బియ్యం మాత్రమే కాక, మిగతా వస్తువులు కూడా తక్కువ రేట్ కు ఇస్తున్న చంద్రన్నా విలేజ్ మాల్స్ దండగ అనే అభిప్రాయం కేంద్రం నుంచి సమాధానంగా రావాలి అని...

vijayasai 02022018 3

దీని పై కేంద్ర మంత్రి స్పందిస్తూ, విజయసాయి రెడ్డికి, ఇక్కడ ఉన్న జగన్ బ్యాచ్ కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారు, కన్ష్యూమర్ ఎఫైర్స్ మంత్రి చౌదరి... చెప్పు దెబ్బ కొట్టినటువంటి జవాబుగా, చెప్పిందేమంటే, "పౌర సరఫరాల పంపిణీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దేశంలోనే మొదటి రాష్ట్రంగా, ప్రజాపంపిణీలో పారదర్శకత, సాంకేతికత వినియోగిస్తోందని ప్రశంసించారు... ఎక్కడ అవినీతి లేకుండా, ట్రాన్స్పరెంట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ షాపులు నిర్వహణ చేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది అంటూ, జావాబు ఇవ్వటంతో, విజయసాయి రెడ్డి, కిక్కురుమనకుండా కూర్చున్నారు... రాష్ట్రంపై దుమ్మెత్తిపోయడం మాని ఒక, రాష్ట్ర ప్రతినిదిగా హీనాతి హీనమైన బడ్జట్ కేటాయింపు గురించి కనీసం నిరసన తెలియజేసి, ఇక్కడ ప్రజల గొంతు వినిపించండి విజసాయి గారు...

కేంద్రం బడ్జెట్ పై, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర స్థాయిలో బీజేపీ పై విరుచుకుపడుతుంటే, నేతలతో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాత్రం, పుండు మీద కారం చల్లుతూ, వ్యాఖ్యలు చేసారు... నిన్న ఢిల్లీలో రాష్ట్ర బీజేపీ నేతలతో అమిత్ షా సమావేశం అయ్యారు.. ఏపీ బీజేపీ అధ్యక్షుడు హరిబాబు, శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు, పురందేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ లాంటి ఉద్దండులతో చర్చించారు... సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ సమావేశంలో అమిత్ షా, మాట్లాడుతూ, కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు భయపడాల్సిన పని లేదని అమిత్ షా అన్నారు...

amit shah 02022018 1

ఈ నేతలు అందరూ, బడ్జెట్‌ పై తెలుగుదేశం పార్టీ విమర్శలు చేస్తుంది అంటూ, అమిత్ షా కి కంప్లైంట్ చేసారు... దానికి అమిత్ షా మాట్లాడుతూ, "అదేమిటీ.. మనం రాష్ట్రానికి అడిగినవన్నీ ఇస్తున్నాము కదా... ఎన్నో చేసాం... ఎన్నో ఇచ్చాం... ఇలాంటి వ్యాఖ్యలకు మీరేమీ భయపడనక్కర్లేదు... బూత్‌స్థాయి నుంచీ పార్టీని బలోపేతం చేయండి. కేంద్రంపై టీడీపీ చేస్తున్న విమర్శలకు జవాబివ్వండి" అంటూ అమిత్ షా గీతోపదేశం చేసి పంపించారు... గతంలో రాజమహేంద్రవరం, తాడేపల్లిగూడెంలో తాను పర్యటించానని ఈసారి రాయలసీమలో పర్యటిస్తానని అమిత్‌ షా ప్రకటించి, ధైర్యంగా ముందుకెళ్ళమన్నారు...

amit shah 02022018 1

విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ ఏర్పాటు ఇప్పటికీ కేంద్రం పరిశీలనలో ఉందని, నాలుగేళ్ళ నుంచి పాడిన పాటే పాడారు... అమరావతి అభివృద్ధికి ఇంకా నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు.. వేయం పెంచకుండా పాత ధరలకే పోలవరం కాంట్రాక్ట్ ను నవయుగా అప్పజెప్పి గడ్కరీ ప్రజాదననాన్ని ఆదా చేశారు... అయ్యా, అమిత్ షా గారు, ఇది టీడీపీ వ్యవహారం కాదు, మీ మీద విమర్శలు చేస్తుంది, ఆంద్ర రాష్ట్ర పజలు... రాష్ట్ర ప్రజలకు కూడా మేము భయపడం అంటే, ప్రజలు తగిన సమాధానం చెప్తారు... చివరగా నవయుగకు పోలవరం అప్పచెప్పింది, మా ముఖ్యమంత్రి... తమరు పోలవరంలో ఎన్ని అడ్డంకులు సృష్టించారో అందరికీ తెలుసు...

కేంద్ర బడ్జెట్ పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన అన్యాయం పై, రాష్ట్రంలోని ప్రజలందరూ, కేంద్ర వైఖరి పై విరుచుకుపడుతున్నారు... ఇదే సందర్భంలో, ఎన్డీయే లో భాగస్వామ్యం అయిన, అధికార తెలుగుదేశం పార్టీ కూడా గుర్రుగా ఉంది... ‘‘విభజన చట్టంలో అనేక హామీలిచ్చారు. వాటిలో అనేకం ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. కానీ... వాటి గురించి బడ్జెట్‌లో ఒక్క మాటైనా ప్రస్తావించలేదు. రాష్ట్రానికి ఏమిటీ దురదృష్టం ? ఇప్పటికే అభివృద్ధి చెందిన అహ్మదాబాద్‌, ముంబై, బెంగళూరు నగరాలకు నిర్దిష్ట కేటాయింపులు చేశారు... రాజధాని నగరం లేకుండా ఏర్పడిన నవ్యాంధ్ర గురించి పట్టించుకోలేదు. అమరావతికి చిన్నపాటి కేటాయింపులూ చేయలేదు. చట్టబద్ధ హామీలు, పార్లమెంటులో ఇచ్చిన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదు" అంటూ తన బాధ, ఆవేదన, అసంతృప్తిని వ్యక్తం చేశారు....

republic 02022018 2

మన కష్టానికి వారి సాయం కూడా జత కలిస్తే నిలబడగలమని మనం ప్రయత్నిస్తున్నామని, కానీ... నిరాశే ఎదురవుతోందని అన్నారు. ‘‘ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మిత్రపక్షమైనప్పటికీ మాట్లాడకుండా ఎలా ఉండగలం!’ అని ప్రశ్నించారు. ‘‘రాష్ట్రం చిన్నది కావడం వల్లే ఢిల్లీకి మనం కనిపించడం లేదా అనే అనుమానం కలుగుతోంది’’ అని అన్నారు... ఎన్డీయే భాగస్వామిగా ఉంటూ, చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలతో, నేషనల్ మీడియాలో కూడా, ఈ విషయం పై విస్తృతంగా ప్రచారం జరుగుతుంది... తెలుగుదేశం బడ్జెట్ పై అసంతృప్తిగా ఉంది అని, ఎన్డీయే నుంచి బయటకు వచ్చేస్తుంది అంటూ కధనాలు వస్తున్నాయి...

republic 02022018 3

ఇదే సందర్భంలో, తాను ప్రవేశపెట్టిన బడ్జెట్ పై, అరుణ్ జైట్లీ, నేషనల్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు... రిపబ్లిక్ టీవీ అర్నబ్ గోస్వామికి ఇచిన ఇంటర్వ్యూలో జైట్లీ, ఆంధ్రప్రదేశ్ లో ప్రజల అసంతృప్తి, చంద్రబాబు ఆగ్రహం పై, అర్నబ్ అడిగిన ప్రశ్నలకు స్పందించారు... ఎదావిధిగా, పాడిన పాటే పాడారు... ప్రజలు ఇంత ఆందోళన చెందుతున్నా, వాటిని పట్టించుకోకుండా జైట్లీ మాట్లాడుతూ "మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బాగానే చేసాం... విభజన తరువాత రాష్ట్రం నష్టపోయింది అని తెలుసు... మేము చెప్పిన ప్రతి మాటకు కట్టుబడి ఉన్నాం... పోలవరానికి నిధులు ఇస్తున్నాం... చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఇచ్చాం" అంటూ పాడిన పాటే పాడారు... చంద్రబాబు కోపంగా ఉన్నారుగా అని అడితితే, అదేమీ లేదు, ఎందుకు ఉంటుంది, మేము చాలా చేసాం కదా అని జైట్లీ అన్నారు...

Advertisements

Latest Articles

Most Read