జలవనరులతో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు సంకల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అరుదైన ఘనతను సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి 50వ సారి వర్చువల్ రివ్యూ నిర్వహించారు. సోమవారం సచివాలయంలోని తన కార్యాలయంలో పోలవరం సహా ప్రాధాన్య ప్రాజెక్టుల పనులు ఎంతవరకు వచ్చాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టు 53 శాతం పూర్తయ్యిందని, కుడి ప్రధాన కాలువ 91%, ఎడమ ప్రధాన కాలువ 60% నిర్మాణం పూర్తి చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

polavarm 05022018 2

హెడ్ వర్క్స్ 39% పూర్తికాగా, డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 66% అయ్యిందని తెలిపారు. 71% వరకు స్పిల్‌వే, స్పిల్ చానల్ తవ్వకం పనులు, 14% మేర కాంక్రీట్ నిర్మాణం చేపట్టడం జరిగిందని వెల్లడించారు. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 58% పూర్తయ్యిందని చెప్పారు. అలాగే 82 వేల క్యూబిక్ మీటర్ల వరకు ఎర్త్‌వర్క్ తవ్వకం పనులు, 5,314 క్యూబిక్ మీటర్ల వరకు స్పిల్‌వే, స్టిల్లింగ్ బేసిన్ కాంక్రీట్ పనులు, 18.8 మీటర్ల మేర డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ వారం రోజుల్లో చేపట్టినట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం రూ. 12,915.38 కోట్లు ఖర్చు చేయగా, ఇందులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత ఖర్చు చేసిన మొత్తం రూ. 7,779.52 కోట్లుగా చేసినట్టు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ మొత్తంలో గతేడాది డిసెంబర్ 31 వరకు కేంద్రం రాష్ట్రానికి రూ. 4,329.06 కోట్లు ఇచ్చిందని చెప్పారు.

polavarm 05022018 3

వరద మళ్లింపునకు సంబంధించి స్పిల్‌వే, స్పిల్ చానల్, అప్రోచ్ చానల్, పైలెట్ చానల్, రేడియల్ గేట్ల ఏర్పాటు, డయాఫ్రమ్ వాల్ తదితర పనులకు రూ. 4,375.73 కోట్లు వ్యయం కానుందని అధికారులు అంచనా వేశారు. 2019 కల్లా పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఇప్పటికే రూ. 1,531.53 కోట్లు ఖర్చు చేయగా, మరో రూ. 2,844.20 కోట్లు అవసరం వుందని ముఖ్యమంత్రికి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు సాధనే ధ్యేయంగా మూడున్నరేళ్ల నుంచి అహోరాత్రులు అంకితభావంతో పనిచేస్తున్నారంటూ ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ అధికారులు అభినందించారు. గతంలో ఏ పాలకుడు చేయని విధంగా ప్రతి సోమవారం పోలవరం నిర్మాణం పురోగతిని పరిశీలిస్తూ, పనులను పర్యవేక్షిస్తూ, యంత్రాంగాన్ని నిర్దేశిస్తూ ప్రాజెక్టుపై తన చిత్తశుద్ధిని ముఖ్యమంత్రి చాటుకున్నారని కొనియాడారు.

నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న సోము వీర్రాజు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు... సోము వీర్రాజు వ్యాఖ్యలు అతని విజ్ఞతకే వదిలెయ్యాలి అని, సోము వీర్రాజు వ్యాఖ్యల పై ప్రతిస్పందించొద్దంటూ, టీడీపీ శ్రేణులకు చంద్రబాబు ఆదేశించారు... వారికి విజ్ఞత లేదు అని, మీరు కూడా అలా విజ్ఞత మరిచి మాట్లాడవద్దు అని అన్నారు... వ్యక్తిగత వ్యాఖ్యల విషయంలో సంయమనం పాటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. విమర్శల విషయంలో బీజేపీకి, టీడీపీకి తేడా ఉండాలన్నారు. సోము వీర్రాజు దిష్టిబొమ్మలు దహనం లాంటి కార్యక్రమాలు చేపట్టవద్దని శ్రేణులకు టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది....

cbn 05022018 2

మరో పక్క, చంద్రబాబు స్పందనకు ముందే, తెలుగుదేశం పార్టీ నేతలు, సోము వీర్రాజు పై ఫైర్ అయ్యారు... సోము వీర్రాజుపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విరుచుకుపడ్డారు.. సోము వీర్రాజు కనీసం వార్డుమెంబర్‌గా కూడా గెలవలేదని, అయినా.. టీడీపీ అతన్ని ఎమ్మెల్సీని చేసిందని బుద్దా గుర్తు చేశారు. టీడీపీ అవినీతి పార్టీ అని విమర్శిస్తున్న వీర్రాజు... అవినీతి పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవి ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు.

cbn 05022018 3

వీర్రాజు వైసీపీకి అమ్ముడు పోయాడన్నారు. పార్టీ పేరుతో ఎంత వసూలు చేశారో మీ నేతలే చెబుతున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేస్తే ఊరుకునేది లేదని బుద్దా వెంకన్న తీవ్రంగా హెచ్చరించారు. అలాగే సోము వీర్రాజు వ్యాఖ్యల పై బీజేపీ పెద్దలు స్పష్టత ఇవ్వాలన్నారు. జగన్‌ను సోము వీర్రాజు ఎందుకు విమర్శించడం లేదని, సోము వీర్రాజుది బీజేపీ అజెండానా? వైసీపీ అజెండానా? అని ఆయన అన్నారు.

సోషల్ మీడియాలో మొన్నటి వరకు, ఫేక్ బ్యాచ్ ఎవరు అంటే గుర్తొచ్చేది, లోటస్ పాండ్ బ్యాచ్... ఈ లోటస్ పాండ్ బ్యాచ్ సరిగ్గా ఫేక్ చెయ్యటం లేదు అని, బీహార్ నుంచి దేశంలోనే టాప్ ఫేక్ బ్యాచ్ గా పేరు ఉన్న, ప్రశాంత్ కిషోర్ ని కిరాయికి పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్... ప్రజల్లో భరోసా నింపి, తద్వారా ప్రజా బలంతో రాజకీయాలు చెయ్యల్సింది పోయి, ఇలాంటి ఫేక్ బ్యాచ్ తో, రాజకీయాలు చేసి, ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు చూపించి, ప్రజలని కన్ఫ్యుస్ చేసి, లబ్ది పొందాలి అని జగన్ ప్లాన్... కాని ఈ ప్లాన్ లో, ఒకటికి పది సార్లు, దొరికిపోయినా, ప్రజలు ఛీ కొడుతున్నా, జగన్ మాత్రం ఈ పంధా వదలటం లేదు...

lagadapati 05022018 2

తాజాగా, ఈ ఫేక్ బ్యాచ్ చేసిన మరో ఉదంతం, బోగస్ అని తేలిపోయింది... ఒక పక్క, ఎన్ని కిలోమీటర్లు నడిచినా, మైలేజి రావటం లేదు... ప్రజల్లో జగన్ అనే వాడు ఒకడు ఉన్నాడు అనే గుర్తింపు కూడా లేదు... అందుకే కిరాయి బ్యాచ్ ని ఎదో ఒకటి చెయ్యమని, జగన్ ఆదేశించాడు... ఇంకేముంది, ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ రంగంలోకి దిగింది... సర్వేలు పర్ఫెక్ట్ గా చెప్పే, మాజీ పార్లిమెంట్ సభ్యుడు, లగడపాటి రాజగోపాల్ ని ఎంచుకున్నారు.. లగడపాటి రాజగోపాల్, ఏదన్నా సర్వే చెప్పారు అంటే, అది అటు ఇటుగా, నిజం అవుతుంది అనే అభిప్రాయం చాలా మందికి ఉంది... ఇదే నమ్మకాన్ని వాడుకుంది జగన్ బ్యాచ్...

lagadapati 05022018 3

లగడపాటి రాజగోపాల్ ఒక సర్వే చేసారు అని, వచ్చే ఎన్నికల్లో, వైసిపీకి 105 సీట్లు, తెలుగుదేశం పార్టీకి 55 సీట్లు, జనసేనకు 15 సీట్లు వస్తాయి అంటూ, ఒక ఫేక్ సర్వే పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రమోట్ చేసింది... చివరకు జగన్ అనుకూల మీడియాలో కూడా ఈ వార్త రావటంతో, స్వయంగా లగడపాటి రాజగోపాల్ స్పందించారు... ప్రశాంత్ కిషోర్ బ్యాచ్ చేసిన పని గురించి మాట్లాడుతూ "అసలు నేను ఎక్కడా సర్వే చేయించలేదు... ఈ మధ్య కాలంలో ఏ సర్వే చేయలేదు... ఒక వేళ నేనంటూ చేయిస్తే మీడియాకు చెబుతా కదా.. నా పేరుతో వచ్చే సర్వేలు నమ్మవద్దు... నేను ఏ సర్వే చేసినా, ప్రెస్ మీట్ పెట్టి చెబుతాను" అంటూ రాజగోపాల్, జగన్ బ్యాచ్ చేసిన అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టారు...

ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. నెల్లూరు రూరల్ మండలం దేవరకొండ దగ్గర ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలు జగన్ పాదయాత్రను అడ్డుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతుపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేస్తారు. దీనికి స్పందించిన జగన్.. ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని, దానికి మద్దతు ఇవ్వలేమని జగన్ స్పష్టం చేశారు. వినతిపత్రం కూడా తీసుకోలేదని నిరసిస్తూ జగన్‌కు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

jagan 0502208 2

మరో వైపు, పాదయాత్రలో భాగంగా ఆర్యవైశ్యులతో జగన్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగర డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్‌ అనుచరుడు అమరా సునీల్‌ కుమార్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారు. అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నా, బూతులు తిడుతున్నా, జగన్ నవ్వుతూ ఎంజాయ్ చేశాడే కాని, అతన్ని ఆపలేదు... ఆ వ్యాఖ్యలను నిరసిస్తూ నెల్లూరు పట్టణాభివృద్ధి సంస్థ(నుడా) చైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఆదివారం రాత్రి నెల్లూరు రూరల్‌ పోలీ్‌సస్టేషన్‌ ఎదుట బైఠాయించారు.

jagan 0502208 3

పాదయత్ర చేస్తూ, ప్రజల కోసం పోరాడాలి, చంద్రబాబు తప్పు చేస్తే ఆ విధానాలను ఎండగట్టాలి, లేకపోతే చంద్రబాబు తప్పు చేసాడు అని ప్రజల్ని కన్విన్సు చెయ్యాలి.. అంతే కాని, నోటికి వచ్చినట్టు తన చెంచాల చేతే బూతులు తిట్టించటం, దాన్ని తన ఛానల్ లో లైవ్ ఇవ్వటం, సోషల్ మీడియా కిరాయి బ్యాచ్ దాన్ని ప్రచారం చెయ్యటం, ఇదేనా రాజకీయం ? సాక్షాత్తు జగనే, కాల్చాలి, ఉరి వెయ్యాలి, చెప్పులతో కొట్టాలి అని అంటే, చదువు సంధ్యా లేని మూర్ఖులు, కుల పిచ్చతో విర్రవీగే వారు, ఇలాగే బరి తెగించి మాట్లడతారు...

Advertisements

Latest Articles

Most Read