పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి వైపు వేలు ఎత్తి చూపించే వారు ఉండరు... చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ విషయంలో అంత శ్రద్ధ తీసుకుని, కాంట్రాక్టర్ సరిగ్గా పని చెయ్యకపోతే, అతన్ని మార్చి, నవయుగ కంపనీకి ఇచ్చి, పనులు పరిగెత్తే విధంగా శ్రద్ధ తీసుకున్నారు... దీని కోసం కేంద్రంతో గెట్టిగా పోరాడారు... ఎందుకంటే, ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది, మన రాష్ట్ర జీవ నాడి.. ఇప్పుడు విజయవాడ ప్రజలు కూడా, ఆ ఒక్క ప్రాజెక్ట్ విషయంలో విసుగెత్తి పోయారు... ఇది పోలవరంలా జీవనాడి, కాకపోయినా, రోజు వారీ జీవితాలతో ముడి పడిన అంశం కాబట్టి, ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ ని కూడా మార్చమని విజయవాడ ప్రజలు, ముఖ్యమంత్రికి విన్నవించుకుంటున్నారు...

vijayawada 25012018 2

ఆ ప్రాజెక్ట్ ఏంటి అనుకుంటున్నారా... అదే కనకదుర్గ ఫ్లై ఓవర్... విజయవాడ ప్రజల చిరకాల కోరిక చంద్రబాబు నెరవేరుస్తున్నాడు అని ప్రజలు సంతోషించారు.. కాని, ఇప్పటికి ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టి, రెండున్నర ఏళ్ళు అవుతున్నా, ఇప్పటికీ పనులు జరుగుతూనే ఉన్నాయి... ఎప్పటికి అవుతుందో తెలియని పరిస్థితి.. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వెంట పడుతున్నా, కాంట్రాక్టర్ మాత్రం పనులు ముందుకు తీసుకువెళ్లటం లేదు... ఇది నేషనల్ ప్రాజెక్ట్ కావటంతో, కేంద్రం నిధులు ఇస్తుంది... రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో వాటా ఉంది.. ఈ ప్రాజెక్టులో కేంద్రం రూ.334కోట్లు భరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.114.60కోట్లు కేటాయించాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకి మించి ఖర్చు పెట్టింది... కేంద్రం మాత్రం, సాకులు చెప్తూ, డబ్బులు వదలటం లేదు.. దీంతో కాంట్రాక్టర్ పనులు సాగదీస్తున్నాడు...

vijayawada 25012018 3

అదనపు పనులకు సంబంధించిన నిధులను మంజూరుకు కేంద్రం నిరాకరించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ‘ఇస్తే కేంద్రం ఇస్తుంది.. లేకపోతే మనమే భరిద్దామ’ని సీఎం చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రహదారి పైవంతెనకు రూ.114.60 కోట్లు కేటాయిస్తే ఇప్పటికే రూ.170 కోట్లు చెల్లింపులు జరిపింది. ఈ పైవంతెన పనులు ప్రారంభం అయిన నాటి నుంచి ఇంత వరకు రూ.150 కోట్ల వరకు కేంద్ర పీఏఓ నుంచి బిల్లులు మంజూరు అయ్యాయి... తాజాగా కాంట్రాక్టర్ 20 కోట్లు కావాలి అని బిల్లులు పెట్టుకుంటే, కేంద్రం రెండు నెలల నుంచి డబ్బులు ఇవ్వటం లేదు... పని ఆపేస్తాను అని బెదిరించటంతో, రాష్ట్ర ప్రభుత్వమే, ప్రస్తుతానికి పనులు ఆగకుండా, 10 కోట్లు విడుదల చేసింది... అందుకే ప్రజలు, చంద్రబాబుని వేడుకుంటున్నారు... ఈ ప్రాజెక్ట్ పై కూడా, కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి, కాంట్రాక్టర్ ను మార్చటమో, ఒత్తిడి తెచ్చి కేంద్రం నిధులు విడుదల అయ్యేలా చెయ్యటమో చెయ్యాలని కోరుకుంటున్నారు...

బుధవారం రాత్రి దావోస్ లో మహీంద్ర సంస్థ గ్రూప్ అధిపతి ఆనంద్ మహీంద్రతో భేటీ అయ్యారు. భేటీ తరువాత ఆనంద్ మహీంద్ర ట్వీట్ చేస్తూ, "నా ప్రతి దావోస్ పర్యటనలో, చంద్రబాబుని కలవటమే హైలైట్... చంద్రబాబు భారత దేశంలోనే ఒక inspiring లీడర్.. ఆయనతో భేటీ ఎంతో కొత్త శక్తిని ఇస్తుంది అంటూ ట్వీట్ చేసారు... ఆంధ్రప్రదేశ్‌లో మహీంద్ర గ్రూపు మరింత శక్తిమంతంగా తన ఉనికిని చాటాలని, వ్యాపార, సేవా కార్యక్రమాలను విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. సెజ్ తరహాలో ప్రపంచ శ్రేణి పారిశ్రామిక నగరం నిర్మించాలని ప్రణాళికను రూపొందిస్తున్న మహీంద్ర గ్రూపు ప్రతిపాదనను సీఎం ముందుంచినప్పుడు ఆయన స్పందిస్తూ ఆ ఇండస్ట్రియల్ సిటీ సెజ్‌ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరారు. తాము అన్ని విధాలుగా సహకరిస్తామని అన్నారు.

cbn mahindra 2501208 2

సెజ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడానికి తమ రాష్ట్రానికి రావాలని ముఖ్యమంత్రి ఆనంద్ మహీంద్రకు విజ్ఞప్తి చేశారు. రాజధాని అమరావతి నిర్మాణం, ప్రణాళిక లో భాగస్వామి కావాలని ఆహ్వానించారు. అమరావతిలో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో సహకరించాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో నైపుణ్య శిక్షణాభివృద్ధిలో భాగస్వామి కావాలని సూచించారు. ఇదిలా ఉంటే ప్యానల్ చర్చలో ‘మీ విజన్ ఏమిటి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనంద్ మహీంద్ర ప్రశ్నించగా, ‘ఏపీని ప్రపంచానికే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్నది నా విజన్’ అని ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు.

‘భారత్‌కు ఆదర్శంగా కాదా?’ అని సమయస్ఫూర్తితో ప్రశ్నించగా ముఖ్యమంత్రి స్పందిస్తూ మూడు నాలుగేళ్లలో భారత్‌కు ఆదర్శంగా రూపొందిస్తామని చెప్పారు. ‘మా రాష్ట్రాన్ని ప్రపంచానికే ఒక ఆదర్శ నమూనాగా తీర్చిదిద్దటం నా స్వప్నం’ అని చంద్రబాబు వివరించారు. ఇదిలా ఉంటే మహీంద్ర కంపెనీ ఫ్రాన్స్ దేశానికి అరకు కాఫీ ఘుమఘుమలను అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాఫీని ప్యారిస్‌లో మార్కెటింగ్ చేస్తోంది. తాను నాంది ఫౌండేషన్ అధిపతిగా ఉంటూ ఏపీలో ఫౌండేషన్‌ను ముఖ్యమంత్రి సంతృప్తికి అనుగుణంగా నడుపుతున్నానని చెప్పారు.

తమది పసిపాపలా సాకాల్సిన నూతన రాష్ట్రమని, రాజధాని అమరావతిని కూడా నిర్మించుకోవాల్సి వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం దావోస్‌లో జరిగిన సీఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నారు. ఏపీని నాలెడ్జి హబ్‌గా, ఇన్నోవేషన్ సెంటర్‌గా మార్చాలనేదే తమ ధ్యేయమని చెప్పారు. సీఐఐతో తనకున్న సుదీర్ఘమైన అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ముఖ్యమంత్రి, ఏపీలో ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఐఐని ఆహ్వానించినట్టు తెలిపారు.

cbn raheja 25012018

ప్రాధాన్యతారంగాలను ఏడు మిషన్లుగా విభజించి తాము దార్శనికపత్రం రూపొందించుకున్నామని, ఐదు గ్రిడ్లు, ఐదు ప్రచార ఉద్యమాలు తీసుకుని ప్రగతికి దిశ నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. రియల్ టైమ్ గవర్నెన్స్‌, ఇ-ప్రగతి, ఏపీ ఫైబర్ గ్రిడ్‌లపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రతి ఇంటినీ ఫైబర్ గ్రిడ్‌తో అనుసంధానం చేశామని, ప్రస్తుతం మేం ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్ నెట్‌వర్క్ వున్న రాష్ట్రంగా అవతరించామని ముఖ్యమంత్రి అన్నారు. కేవలం నెలకు రెండు డాలర్ల ఖర్చుతో టెలిఫోన్, టెలివిజన్, వైఫై సదుపాయాలను కల్పిస్తున్నామని వెల్లడించారు.

cbn raheja 25012018

ఇదే సమావేశంలో రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజా పాల్గున్నారు... ఆయన మాట్లాడుతూ, ‘ఇరవై ఏళ్ల క్రితం మొదటిసారి నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశాను. అప్పట్లో నాకంత విశ్వాసం కలుగలేదు. కానీ ‘రహేజా మైండ్ స్పేస్ సెంటర్’ ఏర్పాటుకు చంద్రబాబు నాయుడు చూపిన చొరవ, అందించిన సహకారం, చేసిన కృషి ఆయనపై నా అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేసింది. ఇప్పుడు విజయవంతమైన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నేను చంద్రబాబు నాయుడు పేరే చెబుతాను.’ అంటూ రహేజా గ్రూప్ ప్రతినిధి రవి రహేజా బుధవారం దావోస్‌లో జరిగిన సిఐఐ రౌండ్ టేబుల్ సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి పాలనా సామర్ధ్యాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

ఎన్నాళ్ళుగానో గన్నవరం ఎయిర్ పోర్ట్ ఎదురుచూస్తున్న గజెట్ నోటిఫికేషన్ వచ్చింది... ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టును కేంద్ర హోం మంత్రిత్వశాఖ మంజూరు చేసింది. ఇక కస్టమ్స్ సెంటర్ ఏర్పాటు ఒక్కటే ఇంటర్నేషనల్ సర్వీసులకి అడ్డంకి... దాని కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు.... ఇటీవలే ఇమ్మిగ్రేషన్ విభాగం ఉన్నతాధికారులు గన్నవరం ఎయిర్పోర్టును సందర్శించి ఇక్కడి మౌలిక సౌకర్యాలు, సెక్యూరిటీ తదితర వాటిని పరిశీలించారు... వాస్తవానికి ఈ నెల రెండో తేదీనే ఈ సమాచారం రాష్ట్రానికి వచ్చింది... దీని పై అఫిషియాల్ గా ఎయిర్ పోర్ట్ అధారిటీ అఫ్ ఇండియా నోటిఫికేషన్ జరీ చేసింది...

gannvaram 25012018 2

గన్నవరం ఎయిర్ పోర్ట్ లో విదేశీ విమాన ప్రయాణికులు రాకపోకలు కోసం ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది... దీని కోసం విజయవాడ డిప్యూటీ పోలీస్ కమీషనర్ గజరావు భూపాల్ ను సివిల్ అధారిటీగా నియమిస్తూ హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు... గన్నవరం ఎయిర్ పోర్ట్ కు విదేశీయులు రావాలన్నా ఇక్కడ నుంచి వెళ్లాలన్నా విధిగా సివిల్ అథారిటీ అనుమతి ఉండాల్సిందే. 1948 ఫారినర్స్ చట్టంలో 3( 1)(ఏ), 5( 1)(ఏ) ప్రకారం విదేశీ విమాన ప్రయాణికులు ఇమ్మిగ్రేషన్ అనుమతి పొందాల్సి ఉంటుంది...

gannvaram 25012018 3

గన్నవరం ఎయిర్పోర్టు నుంచి విదేశాలకు విమాన సర్వీసులు నడపాలంటే విధిగా ఇమ్మిగ్రేషన్ తో పాటు కస్టమ్స్ విభాగం ఉండాలి. వాటిలో ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుకు గ్రీన్ సిగ్నల్ లభించగా, త్వరలోనే కస్టమ్స్ సెంటర్ కూడా ఏర్పాటు కానుంది. రాజధాని అమరావతికి విదేశీయులు రాకపోకలు జరిపేందుకు వీలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుపుతామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఇటీవలే ముంబై విమాన సర్వీసు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే గన్నవరానికి ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టు మంజూరవ్వటం, సివిల్ అథారిటీగా డీసీపీ-1 గజరావు భూపాల్ను ప్రభుత్వం నియమించింది. ఇమ్మిగ్రేషన్ విభాగానికి అవసరమైన చెక్ పాయింట్, లగేజీ తనిఖీ విభాగానికి అవసరమైన అన్ని సౌకర్యాలు సిద్దంగా ఉన్నాయి....

Advertisements

Latest Articles

Most Read