ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలన పై ఇటీవల అనేక మంది ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే... సాక్షాత్తు భారత రాష్ట్రపతి కూడా ముఖ్యమంత్రి పని తీరుని మెచ్చుకున్నారు... ఇప్పుడు లిస్టు లో మహారాష్ట్ర గవర్నర్‌ కూడా చేరారు... విజయవాడలోని కనకదుర్గమ్మను మహారాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు మాట్లాడారు...

cbn vidhyasagar rao 18012016 2

అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతోందని, ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు కూడా ఎంతో బాగా పని చేస్తున్నారు అని అన్నారు... కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు... గవర్నర్‌ విద్యాసాగర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చకు దారి తీసాయి...

cbn vidhyasagar rao 18012016 3

రాష్ట్రంలో బీజేపీ నేతలు, ప్రస్తుతం ఉన్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను మార్చమని కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు... నరసింహన్ ను మార్చేస్తారు అనే ప్రచారం కూడా జరుగుతుంది... ఆయన స్థానంలో తెలుగు వాడు అయిన విద్యాసాగర్‌రావు వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్తునంరు... ఇప్పుడు విద్యాసాగర్‌రావు విజయవాడలో మాట్లాడిన మాటలతో, ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సారి లాగా, ఈ సారి కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించింది... భవిష్యత్తు వ్యూహాన్ని, ఎలా పని చెయ్యాలి అనే దిశానిర్దేశం చేయ్యనున్నారు చంద్రబాబు... వివిధ అంశాలపై చంద్రబాబు ఒక ప్రజెంటేషన్‌ను కూడా ఇచ్చారు... రెండు రోజుల పాటు నిర్వహించే ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్లతో కూడిన యంత్రాంగమంతా పాల్గొననుంది. కలెక్టర్ల సదస్సులో నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు కూడా పాల్గున్నారు... అయితే, ఈ సారి నిర్వహించిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి...

cbn collectors conf 18012018 2

మొదటిది, ఈ సారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో కాకుండా, ప్రభుత్వ భావనల్లో నిర్వహించటం... మొన్నటి దాకా సరైన ప్రభుత్వ భావనలు లేక, విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో, కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహించే వారు... గతానికి భిన్నంగా కలెక్టర్ల సదస్సు ప్రభుత్వ భావనాల్లో జరగడం ఇదే తొలిసారి... గతంలో హైదరాబాద్ లో జూబ్లి హాలులో కలెక్టర్ల సదస్సుల జరిగేవి... రాష్ట్ర విభజన తర్వాత విజయవాడలో జరిగిన కలెక్టర్ల సదస్సులు ప్రైవేటు భవనంలో జరుగుతూ వస్తున్నాయి... ఆ సంప్రదాయానికి స్వస్తి చెప్పిన ప్రభుత్వం, ప్రభుత్వ భవనాల్లోనే కలెక్టర్ల సదస్సును నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

cbn collectors conf 18012018 3

రెండవది, కలెక్టర్ల సదస్సుకు గుంటూరు జిల్లా ప్రప్రథమంగా ఆతిథ్యం ఇచ్చింది... ఇప్ప టివరకు కలెక్టర్ల సదస్సుని విజయవాడలో నిర్వహిస్తూ వస్తున్న ప్రభుత్వం ఈ దఫా అమరావతి రాజధాని నగరంలో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబ ఆదేశాల మేరకు ఉండవల్లిలోని ఆయన నివాసం పక్కనే నూతనంగా నిర్మించిన స్టేట్‌ గ్రీవెన్స్‌ సెల్‌ బిల్డింగ్‌లో ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు... అలాగే ఈ సదస్సుని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కేంద్రాల్లోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ కూర్చుని ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగులు వీక్షించవచ్చు... జిల్లాలకు సంబంధించి ఏ అం శాలు కలెక్టర్ల సదస్సులో చర్చిస్తున్నారు, ఇతర జిల్లాల పనితీరు వంటివి తెలుసుకోవచ్చు.

ఆర్టీజీఎస్‌ చూస్తుంటే భారత్‌లో ఉన్నట్లుగా అనిపించడం లేదని, ఇదో అద్భుతం, అమోఘం అని నీతి అయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ అన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో ఉన్న ఆర్టీజీఎస్‌ (రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌) కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పనితీరు గురించి, దాని ద్వారా ప్రజలకు సకాలంలో ప్రభుత్వం ఏవిధంగా సేవలు అందిస్తున్నది ఆర్టీజీఎస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (ముఖ్య కార్యనిర్వహణాధికారి-సీఈఓ) అహ్మద్‌ బాబు వివరించారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఎప్పటికప్పుడు భూసార పరీక్షల ఫలితాలను ఆన్‌లైన్‌లో ఉంచడం, వాటి ద్వారా రైతులు వారి భూమి సారాన్ని బట్టి ఎలాంటి పంటలు వేసుకోవాలో సూచనలు ఇస్తున్న వైనాన్ని వివరంచారు.

rtgs 26112017 2

రాష్ట్ర వ్యాప్తంగా సర్వైలెన్స్‌ కెమెరాలను ఉపయోగించి నిఘా పర్యవేక్షణ, విపత్తలు, ప్రమాదాల సమయంలో ఎలా ప్రభుత్వం వేగంగా స్పందిస్తున్నది వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 20 వేల కెమెరాలను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు, పౌరులు ఇంటికి తాళం వేసి బయట ఊళ్లకు వెళ్లినప్పుడు ఆ ఇంటికి పోలీసులు కెమెరాల గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా కాపాడుతున్న తీరును వివరించారు. రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ పనితీరును ప్రత్యక్షంగా తిలకించిన నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ ఆయన బృందం ఆర్టీజీఎస్‌పై ప్రశంసల జల్లు కురిపించారు. తాను భారత్‌లో ఉన్నట్లుగా లేదని, ఇదో అద్భుతమని అన్నారు.

rtgs 26112017 3

దేశంలో మరెక్కడా కూడా ఇలాంటి వ్యవస్థ లేదని, ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్ని తాను అభినందిస్తున్నట్లు తెలిపారు. ఇదో మంచి ఆలోచన, ఆర్టీజీఎస్‌ నిజంగా కళ్లు తెరిపిస్తోంది. ఏపీ సాధించిన ఒక గొప్ప అద్భుతమైన విజయం ఆర్టీజీఎస్‌ అన్నారు. ప్రతి రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్‌ తరహాలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌ ఏర్పాటు చేసుకుని డిజిటల్‌ బాట పట్టాలని సూచించారు. ప్రతి రాష్ట్రానికి తాము ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీజీఎస్‌ను చూడాలని సిఫారసు చేస్తామని చెప్పారు. త్వరలోనే దేశ రాజధాని ఢిల్లీలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాల చీఫ్‌ సెక్రటరీ (ప్రధాన కార్యదర్శి)ల సదస్సు జరుగుతోందని, అందులో ఆర్టీజీఎస్‌ గురించి ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వానికి నీతి ఆయోగ్‌ ఆహ్వానించిందని, దీనివల్ల మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీని గురించి తెలుసుకోగలుగుతాయని చెప్పారు.

నవ్యాంధ్ర రాజధాని, గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ పై, భారీ స్థాయిలో కుట్ర జరుగుతుందా ? కొన్ని అదృశ్య శక్తులు, దీని వెనుక ఉన్నారా ? ఇక్కడ ఎయిర్ పోర్ట్ డెవలప్ అయితే, వారికి బిజినెస్ పోతుంది అని, ఢిల్లీ పెద్దలతో కలిసి, హైదరాబాద్ లో కుట్ర చేస్తున్నారా ? గత మూడు సంవత్సరాలుగా దేశంలోని మెట్రోపాలిటన్‌ నగరాల ఎయిర్‌పోర్టుల కంటే వృద్ధి రేటులో అగ్రస్థానంలో ఉన్న గన్నవరం ఎయిర్ పోర్ట్, ఎదగనియ్యకుండా ఎవరు తొక్కి పెడుతున్నారు ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, ఎదో జరుగుతుంది అనే అనుమానాలు కలుగుతున్నాయి...

gannavaram 18012018 2

గన్నవరం ఎయిర్ పోర్ట్ కు ప్రైవేటు విమానయాన సంస్థలు రాకుండా, భారీ కుట్ర జరుగుతుంది అనే ఆరోపణలు వస్తున్నాయి... కొద్ది రోజుల క్రిందట విజయవాడ నుంచి కాశీకి విమానం నడిపింది స్పైస్‌జెట్‌... ఈ రూట్ సూపర్ హిట్ అయ్యింది... ప్రతి రోజు 70 - 80 శాతం ఆక్యుపెన్సీ ఉండేది... ఏమైందో ఏమో, కారణం చెప్పా పెట్టకుండా అర్ధంతరంగా స్పైస్‌ జెట్‌ సంస్థ తన సర్వీసును రద్దుచేసుకుంది. అలాగే పోయిన ఏడాది, ముంబైకి చెందిన జూమ్‌ ఎయిర్‌లైన్స్‌, గన్నవరం నుంచి ముంబై, జైపూర్‌లకు ఫ్లైట్ లు నడుపుతుంది అని ప్రచారం జరిగింది... ఈ దిశగా చాలా ప్రయత్నాలు జరిగాయి కూడా, మరో 15 రోజుల్లో మొదలు పెడతాం అని చెప్పారో లేదో, మరుసటి రోజే, జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ మేము నడపటం లేదు అని వెనక్కు తగ్గింది...

gannavaram 18012018 3

ఈ సంస్థలు అర్ధంతరంగా తమ ప్రతిపాదనలు విరమించుకున్నాయి. దీని వెనుక కూడా అదృశ్య శక్తులు ఉన్నాయన్న ప్రచారం ఉంది. అయితే, ప్రైవేటు విమానయాన సంస్థలు ఈ అదృశ్య శక్తులకు తలొగ్గి వెనక్కు తగ్గుతున్నా, కేంద్ర ప్రభుత్వ విమానయాన సంస్థ ‘ఎయిర్‌ ఇండియా’ మాత్రం, సర్వీసులు పెంచుకుంటూ పోతుంది... హైదరాబాద్, ఢిల్లీ, రేపటి నుంచి ముంబై కూడా ధైర్యంగా ఫ్లైట్ లు నడుపుతుంది... ప్రయాణీకులు కూడా ఎప్పుడూ ఫుల్ అవుతూనే ఉన్నారు... ప్రస్తుతం ఇండిగో అనే ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చింది... విచిత్రంగా తిరుపతి, రాజమండ్రి నుంచి సర్వీసులు ప్రారంభించింది కాని, ఇప్పటి వరకు గన్నవరం నుంచి సర్వీసులు మొదలు పెట్టలేదు.. అమరావతి రోజు రోజుకీ అభివృద్ధి చెందుతూ, ఎక్కువ ఆక్టివిటీ జరుగుతుంటే, దానికి తగ్గట్టు ప్రైవేటు విమాన సంస్థలు ఆపరేషన్స్‌ లేవు... ఇక్కడ కనుక ఆక్టివిటీ పెరిగితే, తమకి నష్టం అని కొంత మంది పవర్ఫుల్ అదృశ్య శక్తులు భావించి, ఈ కధ నడిపిస్తున్నారని సమాచారం... మరి ఈ విషయం చంద్రబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి...

Advertisements

Latest Articles

Most Read