మనం ఒక సామాన్యుడిగా ప్రధానికి లేఖ రాస్తే, ప్రధాని కార్యాలయం స్పందిస్తుందా ? అదీ ఒక రాజకీయ ఆరోపణ చేస్తూ ఒక సామాన్యుడు లేఖలు రాస్తే, ప్రధాని కార్యాలయం అసలు అలాంటివి తీసుకుంటుందా ? చింపి చెత్త బుట్టలో పడేస్తుంది... కాని ఇక్కడ మాత్రం, ఒక అనామకుడు పోలవరంలో అన్యాయం జరిగిపోయింది అని లేఖలు రాస్తే వెంటనే స్పందిస్తుంది, ప్రధాని కార్యాలయం... రాష్ట్ర ప్రభుత్వం, సమాధానం ఆ అనామకుడికే చెప్పాలి అంటుంది... ఇలాంటి వింత ఎక్కడైనా చూసారా ? పోలవరం ఆపటానికి, పన్నిన మరో పన్నాగంలా ఇది ఉంది అంటున్నారు...

polavaram 17012018 2

తూర్పు గోదావరి జిల్లా సీతానగరం ప్రాంతానికి చెందిన వ్యక్తి... అతని పేరు చౌదరయ్య అంట.. రిటైర్డ్ లెక్చరర్... పోలవరం ప్రాజెక్ట్ లో అన్యాయం జరిగిపోతుంది అంటున్నాడు...భూసేకరణలో అన్యాయం జరిగిపోయింది అంటున్నారు... పట్టిసీమ దండుగ అంటున్నాడు... పురుషోత్తపట్నం దండుగ అంటున్నాడు... ఇవన్నీ మన రాష్ట్రంలో ఎవరు మాట్లాడతారో తెలుసుగా ? మరి ఈ చౌదరయ్య గారికి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ? సరే ఈయన పొలిటికల్ మోటివ్ తో పంపించాడు... కేంద్రానికి ఇవన్నీ తెలియవా ? అన్నీ తెలియకుండానే, పోలవారానికి చిల్లర విదులుస్తుందా ? ఆ చిల్లర ఇవ్వటానికి కూడా వారానికి ఒకడు వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తాడు... ఒకడు డిజైన్ మార్చమంటాడు... ఒకడు తొందరగా పూర్తి చెయ్యాలి అంటాడు.. ఒకడు అది కావిలి అంటాడు... ఇంకొకడు మరొకటి అంటారు.... ఇంత మంది ఓకే అంటే కాని ఆ చిల్లర ఇవ్వటం లేదు...

polavaram 17012018 3

ఒక పక్క ప్రధాన కాంట్రాక్టర్ దివాలా తీసాడు అని, అతని బ్యాంక్ ఎకౌంటు లో వేసిన నగదు, బ్యాంకులు ఇవ్వటం లేదు... ఇంకా అవినీతికి ఆస్కారం ఎక్కడ ? బిల్లులు చూపించి, కేంద్రం ఒకే చేస్తేనే అవి కాంట్రాక్టర్ ఎకౌంటులో పడేది... అయినా ఒక అనామకుడి లేఖకి, ఆఘమేఘాల మీద విచారణ చేయ్యమంటం ఏంటి ? మళ్ళీ పోలవరం డిలే చేసే కార్యక్రమమా ? ఈయనకు అన్ని ఆధారాలు ఉంటె కోర్ట్ కి ఎందుకు వెళ్ళరు ? ఆధారాలు కోర్ట్ లో ఇస్తే సరిపోతుందిగా ? ఈ డ్రామాలు ఏంటి ?చివరకి ఏది లేదు అని తేలుస్తారు... మరో రెండు నెలలు వేస్ట్ చేస్తారు... కాఫర్ డ్యాం విషయంలో ఇలాగే చేసారు.. చివరకి రెండు నెలలు సమయం వృధా చేసి, ఒకే అన్నారు... అయినా, మాకు విభజన సమస్యలు ఇన్ని ఉన్నాయని , కొన్ని వేల ఉత్తరాలు రాష్ట్ర ప్రభుత్వం రాస్తుంటే చెత్త బుట్టలో పడేస్తున్న కేంద్రం, ఒక అనామకుడి లేఖకి ఇంత హడావిడి ఏంటి ? ఆంధ్రులు అన్నీ గమనిస్తున్నారు... ఇప్పటికే మాకు అన్యాయం చేసినందుకు ఒక ఢిల్లీ పార్టీకి నామరూపాలు లేకుండా చేశాడు.. గుర్తు పెట్టుకుంటే మీకే మంచిది...

విజయవాడ రాజకీయాల్లోనే కాక, రాష్ట్ర రాజకీయాల్లోనే రాధా పార్టీ మారుతున్నాడు అని వస్తున్న వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి... రాధా పార్టీ మారటం, అదీ తెలుగుదేశంలోకి వెళ్ళటంతో అంతా ఆశ్చర్యపోయారు... అయితే ఇప్పుడు రాధా ఒక్కడే కాదు, రాధాతో పాటు కోస్తా జిల్లాల నుంచి అనేక మంది పేరు ఉన్న నాయకులు, రాధాతో పాటు పార్టీ మారుతున్నరన్న సమాచారం జగన్ కు తెలియటంతో, జగన్ హడలి పోయారు... రాధా ఒక్కడే అనుకుని ఇప్పటి వరకు లైట్ తీసుకున్న జగన్, రాధా వేసిన స్కెచ్ తెలుసుకుని, తన సహజ ధోరణికి భిన్నంగా, రాధాని పార్టీ వీడి వెళ్ళనివ్వద్దు అంటూ, పార్టీ సీనియర్లకు బాధ్యతలు అప్పెచేప్పారు...

jagan 17012018 1 2

అంతే కాక, రాధాకి బాగా సన్నిహితంగా ఉండే కొడాలి నానిని కూడా రంగంలోకి దింపాడు జగన్... కాని రాధా మాత్రం, గౌతం రెడ్డి ఎపిసోడ్ దగ్గర నుంచి, నిన్న యలమంచలి రవిని పార్టీలోకి తీసుకోవటం, మల్లాదికి టికెట్ అని ప్రచారం చెయ్యటం, రాధా రాజకీయ భవిష్యత్తు ప్రణాలికాబద్ధంగా నాశనం చెయ్యాలని చూడటం గమనించి, బయటకు వెళ్ళిపోవటానికి సిద్ధం అయ్యారు.. ఎన్ని సార్లు జగన్ కు మోర పెట్టుకున్నా, నేను ముఖ్యమంత్రి అవ్వగానే నీ గురించి ఆలోచిస్తాను అని చెప్పటం కూడా రాధాని ఆలోచలనలో పడేసింది...

jagan 17012018 1 3

దీంతో రాధా కూడా, జగన్ కు కౌంటర్ గా గెట్టి దెబ్బ వెయ్యటానికి స్కెచ్ గీస్తున్నట్టు సమాచారం వస్తుంది... వంగవీటి రంగా అంటే ఇప్పటికీ కాపు సామజికవర్గంలో పేరు ఉంది... వంగవీటి రంగాకి కోస్తా జిల్లాల్లో, ఉభయ గోదావారి జిల్లాల్లో, చాలా మంది అనుచరులు ఉన్నారు... ఇప్పటికే కొంత మంది పెద్ద నాయకులుగా ఉన్న వారు కూడా ఉన్నారు... రాధా ఇప్పుడు తన పవర్ అంతా చూపించాలి అని అనుకుంటున్నారు.. వారి అందరినీ కూడగట్టి, తన బలం ఏంటో, జగన్ కు చూపించాలి అనే ప్రయత్నం చేస్తున్నారు... ఇప్పటికే కాపు సామజికవర్గంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల పట్ల సానుకూలతతో ఉన్నారు.. కాపుల మీద చిన్న చూపు చూస్తున్న జగన్ వైఖరి తో విసిగిపోయిన వాళ్ళు అదను చూసి పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారు... వీరందరినీ రాధా లీడ్ చేసి, టీడీపీలోకి తీసుకెళ్లేందుకు రాధా స్కెచ్ వేసారు.. మొన్నటిదాకా రాధా వెళ్ళిపోతాడు అంటే లైట్ తీసుకున్న జగన్, ఈ స్కెచ్ తెలిసి అవాక్కయ్యి, రాధాను వెళ్ళనివ్వకుండా బుజ్జగిస్తున్నారు... ఇది సఫలం అవుతుందో లేదో చూడాలి...

ప్రపంచ ప్రఖ్యాత ప్రముఖ వ్యాపార దిగ్గజం "టై " వ్యాపార సంస్థ ఇక నుంచి నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో కూడా పాలుపంచుకోనున్నది. దేశ విదేశాల్లో భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తూ తనదైన ముద్ర వేసిన "టై " సంస్థ అమరావతి అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం కాబోతున్నది. బుధవారం మంత్రి నారా లోకేశ్ చేతులు మీదుగా ప్రారంభంకాబోతున్న ఈ ఆధునిక వ్యాపార సంస అనేక దేశాలతో వ్యాపార సంబంధాలు కలిగి ఉన్నది. ఈ సంస్థ ఒక లాభాపేక్ష లేని సంస్థగా ప్రసిద్ధి చెందింది.

tie amarvati 17012018 2

కొత్త ఆలోచనలు, భవిష్యత్ అవకాశాలు నెట్వర్కింగ్ సెషన్స్ పెట్టుబడిదారులతో మాట్లాడడం, వర్క్ షాపులు నిర్వహించడం, ముఖాముఖి పరిచయ కార్యక్రమాలు నిర్వహించడం,సెమినార్లునిర్వహించడం, రోడ్ ట్రిప్స్ తదితర కార్యక్రమాలను టై అమరావతి సంస్న ఔత్సాహిక వ్యాపారవేత్తలతో నిర్వహిస్తోంది. 2,500 మందికి పైగా అనుభవం ఉన్న వ్యాపారవేత్తలు, వ్యాపార కార్యనిర్వాహకులు, చార్టర్ సభ్యులు ఈ టై అమరావతి సంస్థలో భాగస్వాములై ఉన్నారు. 8500 మంది ఔత్సాహికులు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు.18 దేశాల్లో 61 చాప్టర్లను కలిగి ఉంది. వ్యాపారంలో సంపదను సృషించడం పై దృష్టి పెట్టడడంలో దిట్టగా పేరుగాంచింది. నిరంతరం సభ్యులతో సమావేశాలు నిర్వహిస్తుంది. వందలకొద్ది అంకితమై పని చేసే వాలంటీర్లు ఇందులో ఉన్నారు.

tie amarvati 17012018 3

పంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సమాజం ఈ సంస్థకు ఆహ్వానం పలుకుతోంది. వ్యాపారం రంగంలో వస్తున్న నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టడడమే కాకుండా వ్యాపార దృక్పధాన్ని మార్చడం, కొత్త ఆలోచనలకు పునాది వేయడంలో టై అందే వేసిన చేయిగా చెబుతుంటారు. 1992లో సిలికాన్ వ్యాలీలో స్థాపితమైన ఈ టై వ్యాపార సంస్థ ఒక విజయవంతమైన ప్రముఖ వ్యాపార దిగ్గజంగా ప్రపంచ ప్రఖ్యాతిని పొందింది. ఆంధ్రప్రదేశ్ లో వేగంగా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం, నిధుల సమీకరణ సులభతరం చేయడం పై ప్రధానంగా దృష్టిపెడుతుంది.

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మరో విశిష్ట సౌకర్యం అందుబాటులోకి వచ్చింది... హూద్ హూద్ లాంటి విపత్తులు ఎదుర్కునేందుకు సాంకేతికత తోడుగా నిలావాలని నగర ప్రజలంతా బలంగా కోరుకుంటున్న తరుణంలో అలాంటి ఒక సర్వీస్ ఇప్పుడు విశాఖలో కులువుదీరింది.. స్మార్ట్ పోల్ గా పిలిచే ఈ స్తంబంలో ఏడు రకాల సేవలు అందుబాటులోకి వస్తాయి... నగరంలో ఇలాంటివి 50 పోల్స్‌ను ఏర్పాటు చేసేందుకు వీలుగా స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద టెండర్లు పిలవగా ఎల్‌ అండ్‌ టీ సంస్థ పనులు దక్కించుకుంది. దీంతో డైమండ్‌పార్కు వద్ద తొలి పోల్‌ ఏర్పాటు పనులను ఇటీవల ప్రారంభించింది...

vizag smart poles 17012018 2

1. స్మార్ట్ పోల్‌పైన 3 విద్యుత్‌ లైట్లు ఉంటాయి. ఇవి వాతావరణ పరిస్థితులను బట్టి లైటింగ్ ఇస్తాయి. అంటే రాత్రివేళ ఎక్కువ లైటింగ్ ఉంటే.. తెల్లవారుజాము నుంచి కాంతిని తగ్గించేస్తాయి. 2. స్మార్ట్ పోల్‌ కు వైఫై డివైజ్‌ అమర్చి ఉంటుంది. ఇది ఇంటర్నెట్‌ సిగ్నల్స్‌ ఇస్తుంది. 3. స్మార్ట్ పోల్‌ పైన రెండు సీసీ కెమెరాలు ఉంటాయి. ఇవి 180 డిగ్రీల పరిధిలో దృశ్యాలను రికార్డు చేసి జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ కి లైవ్ లో పంపిస్తాయి..

vizag smart poles 17012018 3

4.స్మార్ట్ పోల్‌ పై ఎన్విరాన్‌మెంటల్‌ సెన్సర్‌ ఒకటి ఉంటుంది. ఆ స్మార్ట్ పోల్‌ ఉన్న ప్రాంతంలో గాలి, వాయు కాలుష్య తీవ్రత, ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి వివరాలు కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు చేరవేస్తుంది. 5. స్మార్ట్ పోల్‌ పై నాలుగు స్పీకర్లు ఉంటాయి. విపత్తుల సమయంలో అక్కడ ప్రజలను అప్రమత్తం చేయడానికి, ఏదైనా అత్యవసర సమాచారం అందజేయడానికి ఇవి ఉపయోగపడతాయి. 6. ఒక ఆడ్ బోర్డు ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు బోర్డు పై ప్రకటనల కోసం కార్పొరేషన్ ను సంప్రదించవచ్చు. 7.పోల్‌పైన ఏదైనా టెలికాం సంస్థ సిగ్నల్‌ యాంటీనా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది. నెట్‌వర్క్‌ సిగ్నల్స్‌ ఆయా ప్రాంతాల్లో బలహీనంగా వున్నట్టయితే ఆ పోల్‌పై యాంటీనా ఏర్పాటుచేసుకుంటే సర్వీసును మెరుగుపరుచుకోవచ్చు.

Advertisements

Latest Articles

Most Read