విజయవాడ రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోనుంది... దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వంగవీటి కుటుంబం, జగన్ టార్చర్ భరించలేక తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్టు సమాచారం... చంద్రబాబు దావోస్ పర్యటన తరువాత, రాధా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు... జగన్, తనని వాడుకుని వదిలేసాడు అని, రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తీసి, కాపు సామాజిక వర్గాన్ని వాడుకుని, అన్యాయం చేస్తున్నాడు అని రాధా భావిస్తున్నారు... మల్లాది విష్ణు కి సెంట్రల్, వెల్లంపల్లి కి తూర్పు, యలమంచిలి రవి ని పార్టీ లోకి తెచ్చి పశ్చిమం టికెట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకుని, రాధాని రాజకీయంగా తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అని రాధా అనుచరులు వాపోతున్నారు...

radha 17012018 2

పార్టీ అధికారంలోకి వస్తే ఎదో ఒకటి చేస్తానులే అని జగన్ చెప్పటంతో రాధా అవాక్కయినట్టు సమాచారం.. అధికారంలోకి వచ్చేది లేదు, చేసేది లేదు అని రాధా అనుచరులు వద్ద వాపోతున్నారు... అలాగే గౌతం రెడ్డి విషయంలో కూడా, జగన్ ఎలా వ్యవహరించింది రాధా అనుచర వర్గం జీర్ణించుకోలేక పోతుంది... మరో పక్క చంద్రబాబు కాపు సామాజికవర్గానికి రాజకీయంగా పెద్ద పీట వెయ్యటం, ఆర్ధికంగా వెనుకబడిన కాపులని వివిధ పధకాలతో ఆదుకోవటం లాంటివి చేస్తూ ఉండటంతో, కాపుల్లో తెలుగుదేశం పట్ల సానుకూలత పెరిగిన విషయం కూడా గ్రహించిన రాధా, వైరం పక్కన పెట్టి, తెలుగుదేశం పార్టీలో చేరాలని దాదాపు నిర్ణయించుకున్నారు...

radha 17012018 3

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు ఆయనతో మాట్లాడి పార్టీలోకి ఆహ్వానించారన్న విషయం ఈ ఉదయం వార్తల్లోకి ఎక్కగా, ఇప్పుడు ఎక్కడ చూసినా వంగవీటి రాధ పార్టీ మార్పుపైనే చర్చ జరుగుతోంది. ఈ విషయంలో రాధ నోటి నుంచి అధికారికంగా ఏ విషయమూ బయటకు రానప్పటికీ, అటు తెలుగుదేశం వర్గాలు, ఇటు రాధ అనుచరులు పార్టీ మార్పు ఖాయమంటున్నారు. రాధాని రాజకీయంగా పైకి తెచ్చే బాధ్యత నాది అని, చంద్రబాబు చెప్పినట్టు రాధా అనుచరులు చెప్తున్నారు... ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తరుపున బలమైన ఎమ్మల్యే అభ్యర్ధులు ఉండటంతో, రాధాకి ఏదన్న కార్పొరేషన్ పదవి కాని, ఎమ్మల్సీ కాని ఇచ్చి, రాజకీయంగా పునర్జీవం పోసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది... మొత్తానికి, జగన్ పైత్యానికి, వంగవీటి రాధా లాంటి వాడు కూడా బయటకు వచ్చేస్తున్నాడు...

జగన్ బినామీ కంపెనీకి, నేషనల్ కంపెనీ లా టైబ్యనల్ రుణాలు ఎగ్గొట్టినందుకు నోటీసులు జరీ చేసింది... అథెనా ఇన్ఫ్రా సంస్థకు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ అనేది అనుబంధ సంస్థ... రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్, శ్రీకాకుళంలో, కాకరాపల్లి విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చెయ్యటానికి 2450 ఎకారాలు ఇచ్చారు... ఇక్కడ పవర్ ప్లాంట్ వద్దు అని ఎంత చెప్పినా వినలేదు... ఇప్పుడు ఈ ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్, రుణాలు ఎగ్గొట్టింది అని, దివాలా ప్రక్రియ చేపట్టాలని స్టేట్ బ్యాంక్ ఫిర్యాదు చేసింది... ఈ అథెనా ఇన్ఫ్రా కంపెనీ పుట్టుక వెనుక చాలా మతలబు ఉన్నట్టు, సిబిఐ అప్పట్లోనే గుర్తించింది... దీని వెనుక అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అనేక మేళ్ళు జరిగాయి అనే ప్రచారం ఉంది... జగన్ మోహన్ రెడ్డి ఈ కంపెనీ వెనుక ఉన్నారు అనే వార్తాలు కూడా వచ్చయి... సిక్కింలో జరిగిన పవర్ స్కాంలో కూడా ఈ కంపెనీ ఉంది... వైఎస్ సోదరుడు, వైయస్ రవీంద్రా రెడ్డితో పాటు, వైఎస్ అల్లుడు బ్రదర్ అనిల్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ లుగా ఉండి బయటకు వచ్చారు... తరువాత నిమ్మగడ్డ ప్రసాద్ కూడా ఈ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నారు.. తరువాత ఆయన బయటకు వచ్చారు...

jagan binami 17012018 2

అథెనా ఇన్ఫ్రా సంస్థకు, ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ అనేది అనుబంధ సంస్థ... శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం కాకరపల్లిలోని ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ కు మంగళవారం నేషనల్ కంపెనీ లా టైబ్యనల్ (ఎన్సీఎల్టీ) హైదరాబాద్ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. "రుణ బకాయిలు చెల్లించకపోవడంతో ఈస్ట్ కోస్ట్ ఎనర్జీ లిమిటెడ్ పై దివాలా ప్రక్రియ ప్రారంభించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వేర్వేరుగా దరఖాస్తు చేశాయి. వీటిపై మంగళవారం నేషనల్ కంపెనీ లా టైబ్య నల్ జ్యడిషియల్ సభ్యుడు రాజేశ్వరరావు విచారణ చేపట్టారు.

jagan binami 17012018 3

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియాకు రూ. 952 47 కోట్లు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కు రూ.1407 కోట్ల చెల్లించలేదని ట్రిబ్యునల్ కు తెలిపాయి... తాము ప్రధాన రుణదాతగా ఉన్నామని, హామీదారుగా ఎథెనా ఎనర్జీ వెంచర్ ఏసియన్ జెన్కో పీటీఈ లిమిటెడ్, ఏఐపీ పవర్ లిమిటెడ్ ఏబీఐఆర్ హైడ్రో పవర్ అబిర్ ఇన్ఫ్రా, కోబాల్డ్ పవర్ లిమిటెడ్ తదితర కంపెనీలున్నాయన్నారు. వెయ్యి ఎకరాల దాకా భూమిని హామీగా చూపినట్లు పేర్కొన్నారు. వాదనలను విన్న సభ్యులు రాజేశ్వరరావు ఈస్ట్ కోస్ట్ ఎనర్జీకి నోటీసులు జారీ చేసూ తదుపరి విచారణను ఈనెల 29కి వాయిదా వేశారు...

మూడు రోజుల సంక్రాంతి పండుగ విరామం అనంతరం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లి చేరుకున్నారు... తన స్వగ్రామం, చిత్తరు జిల్లా, నారా వారి పల్లిలో సంక్రాంతి పండుగ చేసుకున్న విషయం తెలిసిందే... ఇవాళ సాయంత్రం, ముఖ్యమంత్రి అక్కడ నుంచి అమరావతి వచ్చారు... వచ్చీ రావటంతోనే రివ్యూ చేసారు... ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు అమ్మకంలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి తక్షణం ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పౌరసరఫరాల శాఖను ఆదేశించారు.

cbn 16012018 2

పట్టిసీమ నీటితో అధిక దిగుబడులు వచ్చినప్పటికీ పౌరసరఫరాల శాఖ ఆంక్షల మూలంగా రైతులు కల్లాల్లోనే ధాన్యాన్ని నిల్వ ఉంచుకోవాల్సిన దుస్థితి నెలకొందన్న విషయం తెలిసి సీఎం చంద్రబాబు ఆవేదనకు గురయ్యారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు విధించి ఇబ్బందులు గురు చేస్తున్న కృష్ణాజిల్లా రెవిన్యూ యంత్రాంగంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు, రైస్ మిల్స్ అసోషియేషన్ నాయకులు ఉండవల్లిలో నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ధాన్యం కొనుగోలులో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో పౌరసరఫరాల శాఖ ఆంక్షలుతో ఎదురవుతున్న సమస్యలను వివరించారు.

cbn 16012018 3

ఆ విషయంపై పౌరసరఫరాల కమిషనరు రాజ శేఖర్, కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ విజయ కృష్ణను పిలిపించి మాట్లాడారు. రైతుల వద్ద నున్న ధాన్యాన్ని తక్షణం కొనుగోలు చేసి సమస్య పరిష్కరించాలి సీఎం చంద్రబాబు సూచించారు. ధాన్యానికి మద్దతు ధర చెల్లించాలని కూడా ఆదేశించారు. ముఖ్యమంత్రి వచ్చీ రావటంతోనే రివ్యూ చెయ్యటంతో అధికార యంత్రాంగం మొత్తం అలెర్ట్ అయ్యింది... రేపు ఢిల్లీ పర్యటన ఉంది కాబట్టి, రేపు కూడా రిలాక్స్ అవ్వచ్చు అనుకున్నారు.. కాని ముఖ్యమంత్రి ఇవాళ సాయంత్రం నుంచే పనిలోకి దిగటం, అందరూ అలెర్ట్ అయ్యారు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క రంగానికి అవార్డుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. రాష్ట్ర విభ‌జ‌న అనంత‌రం 13 జిల్లాల ప‌రిధిలో ప‌ర్యట‌క రంగ ప‌రంగా చేప‌డుతున్న ప్రాజెక్టులు ఇప్ప‌టికే ఫ‌లితాల‌ను ఇస్తూ రాగా, వివిధ జాతీయ‌, అంత‌ర్జాతీయ స్ధాయి సంస్ధ‌లు ప‌ర్యాట‌క శాఖ‌కు అవార్డులు అందిస్తున్నాయి. తాజాగా ప‌సిఫిక్ ప్రాంత ప‌ర్యాట‌క ర‌చ‌యితల సంస్ధ ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజంకు అవార్డు ప్ర‌క‌టించింది. మార్చి తొ్మ్మిదో తేదీన బెర్లిన్ వేదిక‌గా జ‌రిగే అవార్డుల ప్ర‌దానోత్స‌వంలో అతిరధ మ‌హార‌ధుల స‌మ‌క్షంలో రాష్ట్ర ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా అవార్డును అందుకోనున్నారు.

ap award 17012018 2

సాగ‌ర‌తీర ప‌ర్యాట‌కంలో ఉత్త‌మ ఆగ‌మ‌న కేంద్రం విభాగంలో ఈ అవార్డును అందిస్తున్న‌ట్లు, ప‌ట్వా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాగ‌ర్ ఆహ్లువాలియా రాష్ట్ర ప‌ర్యాట‌క శాఖ‌కు స‌మాచారం అందించారు. అవార్డుల ప్ర‌ధానోత్స‌వం సంద‌ర్భంగా బెర్లిన్ వేదిక‌గా ఫ‌సిఫిక్ ఏరియా ట్రావెల్ రైట‌ర్స్ అసోసియేష‌న్ ప‌లు కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతుండ‌గా, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క శాఖ అయా కార్య‌క్ర‌మాల‌లో భాగ‌స్వామ్యం కాబోతుంది. వ‌ర‌ల్డ్ టూరిజం, ఏవియేష‌న్ లీడ‌ర్స్ స‌మ్మిట్‌తో పాటు, సుస్దిర ప‌ర్యాట‌కం అనే అంశంపై అంత‌ర్జాతీయ స్ధాయి సెమినార్ జ‌ర‌గ‌నుంది.

ap award 17012018 3

ఈ సంద‌ర్భంగా ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ కార్య‌ద‌ర్శి ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ విభ‌జ‌న అనంత‌రం ఎదుర‌వుతున్న ఇబ్బందుల‌ను సైతం అధిక‌మించి స‌మ‌గ్ర అభివృద్దికి అవ‌స‌ర‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను అమ‌లు చేస్తుండ‌గా, దీనిని జాతీయ‌, అంత‌ర్జాతీయ స్ధాయి సంస్ధ‌లు గుర్తించ‌టం ముదావ‌హ‌మ‌న్నారు. రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయిడి నుండి త‌మ‌కు ల‌భిస్తున్న ప్రోత్సాహంతో ఈ విజ‌యాల‌ను సాధించ‌గ‌లుగుతున్నామ‌ని, ఈ క్ర‌మంలో ప‌ర్యాట‌క శాఖ ఉద్యోగుల ప‌నితీరు ప్ర‌శంస‌నీయ‌మైన‌ద‌ని మీనా వివ‌రించారు. అవార్డు సాధ‌న‌లో గ‌ణ‌నీయ‌మైన భూమిక‌ను పోషించిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క అభివృద్ది సంస్ధ, ఆంధ్ర‌ప్ర‌దేశ్ టూరిజం అధారిటీ అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌క్షాన అభినంద‌న‌లు తెలుపుతున్నామ‌న్నారు.

Advertisements

Latest Articles

Most Read