ఒకటి కాదు, రెండు కాదు, అక్కడ సర్వం ఫేక్... ఉన్నది లేనిది, లేనిది ఉన్నది చేసే మాస్టర్ ఆర్ట్స్ లోటస్ పాండ్ పైడ్ బ్యాచ్ సొంతం... సన్నీ లియోన్ కు వచ్చిన జగన్ కూడా, ఫోటోషాప్ చేసి జగన్ కు వచ్చారు అనే చెప్పే ఘనులు ఉన్నారు అక్కడ... బీహార్ లో రోడ్లు చూపించి, ఇది చంద్రబాబు పాలన అంటారు.... తమిళనాడులో ఫోటోలు తమిళ్ రాసి ఉన్న ఫోటోలు చూపించి, చూసారా మా రాజశేఖర్ రెడ్డి పాలనలో, ఎంత మందికి చదువు చెప్పించామో అంటారు... ఈ పైడ్ బ్యాచ్ కి తోడు, సాక్షి ఛానల్ ఉండనే ఉంది. ఈ లోటస్ పాండ్ పైడ్ ఆర్టిస్ట్ బ్యాచ్ కి తోడు, 250 కోట్లు ఇచ్చి తెచ్చుకున్న బీహార్ గ్యాంగ్ కూడా లోకల్ జఫ్ఫా గాళ్ళకి తోడైంది...
సోషల్ మీడియా మొత్తం ఫేక్ చేసి పడేస్తున్నారు. దీని కోసం వందల, వేలు దొంగ అకౌంట్స్ రెడీ చేశాడు ప్రశాంత్ కిషోర్. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇలా అన్నీ ఫేక్ ఎకౌంటులతో నింపేసి, విష ప్రచారం చేస్తున్నాడు... ఇదే స్ట్రాటజీతో అప్పుడు మోడీని గెలిపించిన ప్రశాంత్ కిషోర్, ఇక్కడ అదే ఫార్ములా ఉపయోగించి, ఇప్పటికే బొక్క బోర్లా పడ్డాడు. చాలా మందికి వీరి ఘనకార్యాలు తెలిసాయి. అయినా సరే, వారు ఆ స్ట్రాటజీ వదిలి పెట్టలేదు, రోజుకి కొన్ని వందల సోషల్ మీడియా అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. అయితే, ఇప్పుడు వీరికి ఫేస్బుక్ తీసుకుంటున్న నిర్ణయం షాక్ కి గురి చేసింది.
సాధారణంగా ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే ఫోన్ నెంబర్ లేదా మెయిల్ ఐడీ అవసరం. కాని ఇప్పుడు ఫేస్బుక్ ఆధార్‌కార్డ్ నెంబర్ కూడా అడగనుంది. ప్రస్తుతం ప్రయోగ స్థాయిలో ఉన్న ఈ ఫీచర్.. మరికొంతకాలంలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందని ఫేస్‌బుక్ ప్రతినిధులు తెలిపారు. అయితే మొదట్లో, సైనప్‌కు ఆధార్ నంబర్ అవసరం లేదని, ఆధార్ ప్రకారం పేరు మాత్రమే అవసరం అని స్పష్టం చేశారు. తరువాత, ఆధార్ కూడా తప్పనిసరి చెయ్యనుంది. ఈ నిర్ణయంతో ప్రశాంత్ కిషోర్ టీంలో గుబులు మొదలైంది. ఎందుకు అంటే, ప్రశాంత్ కిషోర్ టీం పని చేస్తుందే, ఈ ఫేక్ స్ట్రాటజీతో. ఇప్పుడు ఫేస్బుక్ ఆధార్ తప్పని సరి చేస్తే, ఇక ప్రశాంత్ కిషోర్ ఈ వ్యాపారం మానేసుకుని, వేరే పని చూసుకోవాల్సిందే.. అందుకే ముందుగానే, ఫేస్బుక్ తీసుకున్న నిర్ణయం జగన్ కు చేర వేసింది ప్రశాంత్ కిషోర్ టీం... ఈ నిర్ణయంతో అవాక్కయిన జగన్, వేరే వాటి పై కూడా దృష్టి పెట్టమన్నారని సమాచారం.