అమరావతి వాసులకు నయా ఎంటర్‌టైన్‌మెంట్‌. భవానీ ఐలాండ్ లో ఏర్పాటు చేసిన డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్కీన్స్ , ఇవాళ క్రిస్మస్ కానుకగా ముఖ్యామంత్రి చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. దీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇటీవల నూతనంగా భవానీ ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ (బీఐటీసీ)ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భవానీ ద్వీపం అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఈ డ్యాన్సింగ్ మ్యూజికల్ ఫౌంటైన్ అండ్ లేజర్ షో ఆన్ వాటర్ స్క్రీన్ దేశంలోనే అతి పెద్దదని బీఐటీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు తెలిపారు. నది మధ్యలో, మూడు వాటర్ స్కీన్స్ పై మూడు ప్రాజెక్టర్లతో లేజర్ షో ప్రదర్శితమవుతుందని చెప్పారు. ప్రకాశం బ్యారేజి కంటే ఎత్తులో లేజర్ షో ఉంటుందని వివరించారు.

laser show 2512017 2

ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.16 కోట్లు ఖర్చు అయ్యింది... దుర్గమ్మ వైభవం, అమరావతి చరిత్ర, మన రాష్ట్రానికి చెందిన ఘనమైన చరిత్రను లేజర్ షో రూపంలో పర్యాటకులకు చూపించనున్నారు... మ్యూజిక్‌కు అనుగుణంగా లేజర్‌ షో వస్తుంది. ఆ వెలుగుల్లో ఫౌంటెయిన్లు విరజిమ్ముతుంటాయి. ఆ వెలుగుల్లో నది జిగేల్‌మని మెరిసిపోతోంది. చైనాలో కనిపించే లేజర్‌ షో డ్యాన్స్‌ ఇక్కడ ఏర్పాటు కావటం విశేషం.

laser show 2512017 3

ప్రతి రోజూ రెండు షో లు వేస్తారు... ప్రస్తుతానికి టికెట్ ఉచితంగా ఉంచారు... తరువాత సందర్శకులకు టికెట్ పెడతారు... టికెట్ రేట్ ఇంకా నిర్ణయించలేదు.. మ్యూజికల్ ఫౌంటైన్ 32 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేశారు. 200 మంది వరకు సందర్శకులు కూర్చునే వీలు ఉంటుంది. సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు ఫౌంటైన్ నిర్వహిస్తారు. సాయంత్రం నాలుగు గంటలకు మొదటి షో ప్రారంభమవుతుంది. మ్యూజికల్ షోతో పాటు, లేజర్ షో కూడా నిర్వహిస్తారు. ఇందు కోసం 460 లైట్లు అమర్చారు.

కర్నూల్ జిల్లలో ఒక వెలుగు వెలిగిన శిల్పా సోదరులు, ఇవాళ జగన్ మాట విని, తీవ్ర నైరాశ్యంలోకి వెళ్ళిపోయారు. జగన్ మాట విని, అటు డబ్బులు పోయి, ఇటు పదవులు పోయి, ఇటు జిల్లలో పట్టు పోయి, రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి దాకా వచ్చారు. నేను మొగోడిని... మీరు ఆడెంగులు... ఆట ఇప్పుడు మొదలైంది అంటూ, నంద్యలలో ఒక పెద్ద సభ పెట్టి, జగన్ పక్కన కుర్చిని రెచ్చిపోయిన శిల్పా చక్రపాణి రెడ్డికి, అటు ఉన్నదీ పోయింది, ఇటు ఉంచుకున్నది పోయింది అన్నట్టు అయ్యింది పరిస్థితి... భుమా నాగిరెడ్డి చనిపోయే రోజు వరుకు, శిల్పా చక్రపాణిని ఎమ్మల్సీ చెయ్యటం కోసం ప్రచారం చేశారు... భుమా చనిపోయినా, శిల్పా చక్రపాణి గెలిచారు... కాని, ఛాలెంజ్ ఛాలెంజ్ అంటూ హడావిడి చేసి, చివరకు ఛాలెంజ్ లేకుండా తోక ముడిచి పారిపోయాడు...

silpa jagan 25122017 3

చంద్రబాబు భుమా నాగిరెడ్డి బ్రతికి ఉన్నప్పుడే, శిల్పా సోదరులకి, భుమా కుటుంబానికి మధ్య సంధ్య కుదిరించారు. కలిసి పని చేసి, జిల్లా అభివృద్ధి కోసం పటు పడమన్నారు. చెప్పినట్టే, భుమా నాగి రెడ్డి కూడా, శిల్పా చక్రపాణి MLC కోసం, కష్టపడి గెలిపించారు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో, భుమా నాగి రెడ్డి మరణించటం, శిల్పా మోహన్ రెడ్డి, ఆ టికెట్ అడగటం, సాంప్రదాయం ప్రకారం చనిపోయిన వారి కుటుంబానికే టికెట్ ఇస్తాను అని చంద్రబాబు చెప్పటంతో, శిల్పా మోహన్ రెడ్డి తొందర పడి, జగన్ పార్టీలో చేరారు.

silpa jagan 25122017 2

నంద్యాల ప్రజల నాడి పట్టటంలో శిల్పా సోదరులు ఫెయిల్ అయ్యారు. జగన్ మాట విని, గెలిసేస్తున్నాం అని, ఇష్టం వచ్చినట్టు డబ్బులు పెట్టారు. చివరకి ఘోరంగా పిల్లల చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు ఎమ్మల్సీగా పోటీ చెయ్యటానికి కూడా భయపడి పారిపోయారు. ప్రజల నాడి తెలుసుకోకుండా, జగన్ చెప్పిన మాటలు విని, ఇటు ఆర్ధికంగా దెబ్బ తినటం, బంగారం లాంటి పదవులు పోవటం, అన్నిటికీ మించి ప్రజల్లో చులకన అవ్వటం, జగన్ మీద వ్యతిరేకత వీళ్ళ మీద కూడా పడటంతో, భవిషత్తు ఏంటి అనేది అర్ధంకాక తీవ్ర ఆవేదనలో ఉన్నారు. పైకి ఎన్ని కబుర్లు చెప్తున్నా, జగన్ ను నమ్మి, రాజకీయ ప్రతిష్టను చేజేతులారా నాశనం చేసుకుని, అవమానం పాలయ్యామని బాధ పడుతున్నారు శిల్పా సోదరులు.

హార్వర్డ్‌ యూనివర్సిటీ మన అమరావతి రైతుల త్యాగాన్ని గుర్తించింది... అమరావతి ల్యాండ్‌పూలింగ్‌ విధానం ప్రపంచాన్ని ఆకర్షించింది... 34 వేల ఏకరాలు, ఎక్కడా ఆందోళన లేకుండా, ప్రభుత్వం ల్యాండ్‌పూలింగ్‌ ద్వారా తీసుకోవటం, ఒక్క మనిషి పై నమ్మకం ఉంచి రైతులు ఆ భూములు ఇవ్వటం ఇప్పుడు హార్వర్డ్‌ వర్సిటీకి కేస్‌ స్టడీ అయ్యింది... ఈ విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న అధికారులతో చెప్పారు... అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా కేస్ స్టడీగా తీసుకుంది. ఇది మనకెంతో గర్వకారణం’ అని ఆయనన్నారు...

amaravati 25122017 2

‘రూపాయి కూడా ఖర్చు చేయకుండా రాజధాని నిర్మాణానికి అవసరమైన 34వేల ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించిన విధానంపై రాష్టప్రతికి ప్రత్యేకంగా వివరించాలి. రాష్ట్ర ప్రభుత్వ పిలుపుకి స్పందించి తమ విలువైన భూములను స్వచ్ఛందంగా అందించారు. వారిని చరిత్ర గుర్తుంచుకుంటుంది. అమరావతి ప్రజల రాజధాని. రైతులు నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయబోను. రాజధాని కోసం రైతులు ప్రాణప్రదంగా చూసుకునే భూములిచ్చారు. కేవలం ప్రభుత్వంపై నమ్మకంతో అన్నదాతలు చేసిన ఈ త్యాగాలను ఎన్నటికీ మరువబోం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘అమరావతిని ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన, హాయిగా జీవించగలిగే నగరంగా తీర్చిదిద్దుదాం. రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూముల్లో ప్రపంచ శ్రేణి రాజధాని నగరాన్ని నిర్మిస్తాను. అమరావతిలో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని హార్వర్డ్ యూనివర్సిటీ కూడా కేస్ స్టడీగా తీసుకుంది. ఇది మనకెంతో గర్వకారణం’ అని చంద్రబాబు అన్నారు.

amaravati 25122017 3

అమరావతిని ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెపుతూ, నవ్యాంధ్ర నూతన రాజధాని ఇప్పటికే ప్రపంచం దృష్టిని ఆకర్షించిందన్నారు. పలు దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర పర్యటనకు వస్తున్న రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్‌కు వివరించాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 27న రాష్టప్రతి విజయవాడ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆయన అధికారులతో సమీక్షించారు. రాష్టప్రతికి అమరావతి చారిత్రక నేపథ్యాన్ని సమగ్రంగా వివరించడంతో పాటు రాజధాని నగరాన్ని ప్రభుత్వం ఎలా అభివృద్ధి చేయబోతోందనే విషయాన్ని కూడా తెలియజేయాలన్నారు.

పోలవరం ప్రాజెక్టు పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సాంకేతిక సలహాదారు సంజయ్ కొలాహపుల్కర్‌ పోజిటివ్ రిపోర్ట్ ఇచ్చారు... ఒక పక్క రాష్ట్ర బీజేపీ నాయకులు రెచ్చిపోతుంటే ఈయన మాత్రం వారిని నిరుత్సాహపరిచే రిపోర్ట్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల జరుగుతోన్న తీరు పై సంజయ్ సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు పోలవరం డ్యామ్ సైట్లో పర్యటించిన ఆయన పోలవరం పనులను, డిజైన్లను పరిశీ లించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ఒక స్టార్ హోటల్లో ఆదివారం పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు, జల వనరుల శాఖ ఇంజనీర్లు, తదితరులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రణాళికకు అనుగుణంగానే పనులు జరిగి 2019 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

polavram 25122017 2

అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తున్న కాఫర్‌ డ్యాం పై కూడా పోజిటివ్ గా స్పందించారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులో ప్రధాన డ్యాంకు ఎగువన విడిగా కాఫర్‌ డ్యాం నిర్మించడం అవసరమని అభిప్రాయపడ్డారు. దీన్ని ప్రధాన డ్యాంలో అంతర్భాగంగా నిర్మిస్తామని కొంత మంది కేంద్రం నుంచి వచ్చిన వారు చెప్పటం సరికాదని వ్యాఖ్యానించారు. పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టులో ఖర్చు కోసం చూసుకోకూడదని, ప్రధాన డ్యాంకు ఎగువన విడిగా కాఫర్‌ డ్యాం నిర్మించకుండా ప్రధాన డ్యాం నిర్మాణం చేపడతామనడం సరికాదని అన్నారు. ఈ అంశంపై కమిటీ నిర్ణయం రావాల్సి ఉందని గుత్తేదారు సంస్థ ప్రతినిధులు చెప్పగా... కమిటీ నిర్ణయం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. ఇది త్వరగా ఖరారయ్యేలా చూడాలన్నారు.

polavram 25122017 3

జాతీయ జలవిద్యుత్తు పరిశోధన సంస్థ చిన్న చిన్న ప్రాజెక్టులే చేపడుతుందని, గోదావరి వంటి మహానదిలో ఎగువ కాఫర్‌ డ్యాం లేకుండా ప్రధాన డ్యాం నిర్మించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై దృష్టి సారించాలని పోలవరం అథారిటీ అధికారులకు సూచించారు. జాతీయ జలవిద్యుత్తు పరిశోధన కేంద్రం కమిటీతో సంప్రదింపులు జరిపి ఎగువ కాఫర్‌ డ్యాంపై త్వరగా నిర్ణయం వచ్చేలా చూడాలని సూచించారు. మరి ఈయన రిపోర్ట్ పై, కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..

Advertisements

Latest Articles

Most Read