ఇప్పుడు ఏ టివిలో చూసినా, సోషల్ మీడియాలో చూసినా గుడివాడలో జరిగిన కాసినోనే హాట్ టాపిక్. గుడివాడ లో మంత్రి కొడాలి నాని ఆద్వర్యంలోనే ఈ కాసినో జరిగిందని ఆధారాలు వీడియోలతో సహా టిడిపి చూపిస్తున్నా, కొడాలి నాని మాత్రం అక్కడ ఎటువంటి కాసినోలు జరగలేదని అడ్డంగా వాదిస్తుండంతో, జనం అంతా ఆశ్చర్య పోతున్నారు. స్పష్టంగా వీడియోలు బయటకు వ్బచ్చినా కూడా ఈయన ఏమి జరగలేదని ఎలా వాదిస్తాడని, అంతే కాకుండా ఆయన ఒక మంత్రి స్థానంలో ఉండి ఇలాంటి బూతు భాష ఏంటని కూడా జనం సోషల్ మీడియాలో ఏకి పారేస్తున్నారు. నాని దీని పై మాట్లాడుతూ తన కే కన్వెషన్ ఎలాంటి కాసినోలు జరగలేదని, కేవలం ఎడ్ల పందేలు మాత్రమే జరగాయని అడ్డగోలుగా వాదించారు. అయితే తాజాగా ఏసెస్‌ క్యాసినో సంస్థ ఈ గుడివాడలో జరిగిన కాసినో ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో ఈ దుమారం మరింత రేగింది. ఈ ఏసెస్‌ సంస్థ కాసినో నిర్వహించటంలో పేరుపొందిన సంస్థ. అయితే దీని నిర్వాహకుడు ప్రేమ్ వాలా ముంబయికి చెందిన వ్యక్తి . ఈ ప్రేమ్ వాలా కు చీకోటి ప్రవీన్ కు చాలా స్నేహ సంబందాలు ఉన్నాయి. అయితే ఈ చీకోటి ప్రవీణ్ గుడివాడ లో జరిగిన కాసినోలో మాట్లాడిన వీడియోలు ఈ ఏసెస్‌ సంస్థ తన ఫేస్ బుక్ పేజ్ లో ఉంచింది.

casino 24012022 2

ఈ వీడియోలన్ని సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఆ క్యాసినో సంస్థ అలాగే, ప్రేమ్ వాలా అనే వ్యక్తి ఫేస్బుక్ లో పెట్టిన వీడియోల లింకులు కూడా టిడిపి బయట పెట్టింది. అయితే అది కాస్త వైరల్ అవ్వటంతో, ఆ తరువాత ఫేస్ బుక్ లో ఆ ఫొటోలన్ని డిలీట్ చేపించారు. కాని అప్పటికే అవన్ని వైరల్ అవ్వటం తో బండారం మొత్తం బయటపడిందని, ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. బయటకు వచ్చిన ఆ వీడియోల్లో అశ్లీల డాన్సులు వేయడం, వైసిపి నేతలు వాళ్ల మీద డబ్బులు విసురుతూ డాన్స్ వేయడం లాంటివి చూసి జనం అవాక్కవుతున్నారు. అయితే అక్కడ డిలీట్ చేసేసారు కాబట్టి, ఇక ఏ ప్రూఫ్ ఉండదు అని అనుకున్నారు. అయితే మళ్ళీ టిడిపి రంగంలోకి దిగింది. ఇదే ఏసెస్‌ క్యాసినో సంస్థ instagramలో పెట్టిన వీడియోలను, వాటి లింకులను టిడిపి ఈ రోజు మళ్ళీ బయట పెట్టింది. ఫేసు బుక్ లో డిలీట్ చేసారు కానీ, instagramలో మర్చిపోయారు అంటూ పంచ్ ఇచ్చింది. మొత్తానికి ఇన్ని ట్విస్ట్ లు మధ్య నిజాలు బయట పడుతున్నా, కొడాలి నాని మాత్రం, అడ్డ దిడ్డంగా వాదిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న ఇంటి వద్ద హైటెన్షన్ నెలకొంది. ఈ రోజు ఉదయం పెట్టిన మీడియా సమావేశంలో, బుద్దా వెంకన్న, మంత్రి కొడాలి నానిని, అలాగే రాష్ట్ర డీజీపీ ని ఉద్దేశించి, కొన్ని వ్యాఖ్యలు చేసారని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశించి, ఆయన పైన కేసు నమోదు చేసి, బుద్దా వెంకన్నును పోలీస్ స్టేషన్ కు తీసుకుని వెళ్తామని చెప్పి, పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు బుద్దా వెంకన్న ఇంటికి చేరుకున్నాయి. దాదపుగా 60 మంది పోలీసులు, ఒక ఏసిపీ, సిఐలు కూడా బుద్దా వెంకన్న ఇంటికి వచ్చారు. వీరు అంతా కూడా, బుద్దా వెంకన్నను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు ఉదయం మీడియా సమావేశంలో, కొడాలి నని చంద్రబాబు ఇంటికి వద్దకు వస్తే మాత్రం, చంద్రబాబు గారి ఇంటి గేటు పట్టుకున్న తిరిగి వెళ్లలేడని, బుద్దా వెంకన్న పరుష వ్యాఖ్యలు చేసారు. అయితే కొడాలి నానిని శవం అయి పంపిస్తామని బుద్దా వెంకన్న చేసిన వ్యాఖ్యల పైనే కేసులు నమోదు చేసినట్టు చెప్తున్నారు. అలాగే డీజీపీ కూడా, జగన్ తొత్తుగా మారారని బుద్దా వ్యాఖ్యలు చేసారు. మంత్రిని బెదిరించటం, చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం అని పోలీసులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఆర్ధికశాఖా కార్యదర్శి, విదేశీ ఆర్ధిక శాఖల నుంచి వచ్చే రుణాలకు సంభందించి అడ్వాన్సు పంపించాలని కేంద్ర ఆర్ధిక శాఖకు రాసిన లేఖ పై కేంద్ర ప్రభుత్వం మండిపడింది . రాష్ట్ర ఆర్దికశాఖ కార్యదర్శికి కేంద్ర ఆర్ధిక శాఖ నుంచి, ఇటువంటి ఎడ్జెస్ట్ మెంట్లు, అడ్వాన్సులు ఇవ్వటం కుదరని లేఖలో తేల్చి చెప్పింది. అదే విధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ల నుంచి తీసుకున్న 500 కోట్ల రుణానికి సంబంధించి లెక్కలు చెప్పాలని కూడా అక్షింతలు వేసింది. ఈ డబ్బులను ప్రాజెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ కు వాడకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వేరే అవసరాలకు ఉపయోగించుకోవడం పట్ల  కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే విధంగా నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి రావాల్సిన రుణానికి సంబంధించి కూడా పలు షరతులు విధించింది. ఇటువంటి షరతుల కూడిన కేంద్ర ప్రబుత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ నుంచి వచ్చిన లేఖతో దాదాపుగా 8 వేల కోట్ల రుణం నిలిచిపోయే అవకాసం ఉంది. ఈ ఘాటు లేఖతో ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ అధికారులు తీవ్ర అయోమయానికి గురయ్యారు. ఒకవేళ ఈ 8 వేల కోట్ల రుణం నిలిచిపోతే  ఏం చెయ్యాలో కూడా అర్ధం కాక ఆర్ధిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

ఏపి ప్రభుత్వం ఉద్యోగస్తుల పట్ల వింత పోకడ చూపిస్తుంది. అన్ని వైపుల నుంచి జగన్ పై విమర్శలు వస్తున్న వేళ, జగన్ ను కాపాడటానికి, జగన్ ట్రబుల్ షూటర్,మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత రంగంలోకి దిగారు. ఆంధ్రపదేశ్ లో తాజాగా ఉద్యోగులకు వచ్చిన పరిస్తితి ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని చెప్తూనే, ఎక్కడైనా జీతాలు పెంచమని సమ్మె చేస్తారు కాని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కొత్త జీతాలు తమకు వద్దని పాత జీతాలే ఇవ్వమని సమ్మె చేయడం, చూస్తుంటే ఉద్యోగుల దయనీయ పరిస్తితి అర్ధమవుతుందని ఉండవల్లి ఆరోపించారు. మరోపక్క ఉద్యోగస్తులు మాత్రం PRC పై తాము ఎట్టి పరిస్తితుల్లో తగ్గేదే లేదని, ప్రబుత్వం తో కూడా ఎటువంటి చర్చలు జరపబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇదే సందర్బంలో ఉండవల్లి ఉదోగులకు ఒక లేఖ రాసారు. వైసిపి ప్రబుత్వం ఆర్ధిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఉద్యోగస్తులు దయ చేసి సమ్మె ను విరమించండి అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు . ఒకవేళ ఈ కొత్త PRC ఇస్తే జగన్ ప్రబుత్వం మీద అదనంగా రూ.10,247 కోట్ల భారం పడుతునందని , ఆ భారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించే పరిస్థితి లేదని ఉద్యోగస్తులకు లేఖ విడుదల చేసారు. మొత్తానికి జగన్ ఉద్యోగుల మీద చిమ్ముతున్న విషానికి, ఉండవల్లి కూడా రంగంలోకి దిగారు. ఉద్యోగులను దోషులుగా చూపించే విధంగా, సుతి మెత్తగా ప్లాన్ చేస్తూ, లేఖ విడుదల చేసారు.

Advertisements

Latest Articles

Most Read