రాష్ట్రంలో జగన్ రెడ్డి పాలన అన్ని వర్గాల వారిని పట్టిపీడిస్తోందని, జగన్ రెడ్డి ఏ వర్గాన్ని వదిలిపెట్టలేదని, రైతులను, వ్యాపారులను, మహిళలు, యువత, బడుగు బలహీన వర్గాలను, కార్మికులు పై ఇప్పిటి వరకు రకరకాలు భారాలు మోపి కోతలకు గురిచేసి నేడు ఆ జాబితాలోకి ఉద్యోగస్తులను కూడా చేర్చారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం అన్నారు. శనివారం మంగళగిరిలోని టిడిపి ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... వైసీపీ ప్రభుత్వం ప్రజల జీవితాలను అన్ని రకాలుగా దుర్భరం చేసేసింది. ఈరోజు ఉద్యోగస్తులు ప్రత్యక్షంగా పడుతున్న బాధలను మనం చూస్తూ ఉన్నాం. ఉపాధ్యాయులు రోడ్లపైకి వచ్చి తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకోవడం కోసం ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా అమలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 6 లక్షల మంది ఉద్యోగులను నమ్మించి మోసం చేశారు జగన్ రెడ్డి. నాడు ప్రతిపక్ష నాయకుడిగా అనేక రకాల వాగ్దానాలను ఉద్యోగులకు ఇచ్చి, నమ్మించి నట్టేట ముంచారు. నిన్న పేర్ని నాని ఎప్పటిలాగే మీడియా ముందుకు వచ్చి ప్రజలకు అవాస్తవాలను వండి వార్చారు. అది చూసిన తర్వాత పేర్ని నాని గారిని సమాచార శాఖామంత్రి అనడం కంటే దుష్ప్రచార శాఖా మంత్రి అనడం సమంజసంగా ఉంటుంది. రాష్ట్రం తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, అయినా ముఖ్యమంత్రి గారు చాలా పెద్దమనసు చేసుకుని ఉద్యోగులకు 23 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని డప్పాలు కొట్టుకుంటున్నారు. 27 శాతం ఐ.ఆర్ ఉంటే అందులో 4 శాతం కోతపెట్టి 23 శాతం ఫిట్ మెంట్ ఇవ్వడాన్ని పెద్దమనసు అంటారా? 4 శాతం కోతపెట్టడాన్ని పెద్దమనసు అంటారనడానికి పేర్ని నాని సిగ్గుపడాలి. నాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతీ నెల ఒకటో తారీఖున టంచనుగా జీతాలు అందేవి. కానీ, నేడు ఆ పరిస్తితి లేదు. ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఎప్పుడు జీతాలు పడుతాయో అని గాలిలోకి చూసే పరిస్థితి దాపురించింది. ఉద్యోగస్తుల రివర్స్ పీఆర్సీ అమలు వల్ల నేడు రూ. 10 వేల కోట్ల భారం పడుతుందని ముసలి కన్నీరు కారుస్తున్న జగన్ రెడ్డి తన లూటీ, దుబారా తగ్గించుకుంటే ఎటువంటి భారం పడదని గుర్తుంచుకోవాలి. సిఏజీ లెక్కల ప్రకారం 2014-15 లో ఏడాదికి ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్లకు అయిన ఖర్చు 23,678 కోట్లు. ఇది చంద్రబాబు నాయుడు 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించక ముందు ఉన్న ఖర్చు. 2015-16 లో 43 శాతం ఫిట్ మెంట్ ప్రకటించిన తర్వాత అది రూ. 38,251 కోట్లకు చేరింది. అంటే తెలుగుదేశం ప్రభుత్వంపై ఒక్క ఏడాదిలోనే రూ.15 వేల కోట్ల అదనపు భారం పడింది. నాడు ఉద్యోగుల కోసం దాదాపు రూ.15 వేల కోట్ల భారం తెలుగుదేశం ప్రభుత్వం భరించింది.

ఈ రోజు రూ.10 వేల కోట్ల భారం గురించి మాట్లాడున్న పేర్ని నాని నాడు రూ.15 వేల కోట్ల అదనపు భారం తెలుగుదేశం ప్రభుత్వం సునాయాసంగా మోసిన సంగతి తెలుసుకోవాలి. 23 శాతం ఫిట్ ఇచ్చి బీద అరుపులు అరుస్తున్న వైసీపీ మంత్రులు నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆర్ధిక మంత్రిగా ఉన్న యనమల గారి ఆర్ధిక క్రమశిక్షణ చూసి నేర్చుకోవాలి. నాడు తెలుగుదేశం లో ఏ మంత్రి కూడా వైసీపీ మంత్రుల్లా బీద అరుపులు అరవలేదు. పరిపాలన చేతగాక, పరిపాలన నైపుణ్యం లేక వైసీపీ నేతలు బీద అరుపులు అరుస్తున్నారు. వైసీపీ నేతలకు తెలిసిందల్లా ప్రజలను దోచుకోవడం....దాచుకోవడమే. రాష్ట్రానికి ఆదాయం తగ్గిపోయిందని చెబుతున్న పేర్నినానికి కాగ్ లెక్కల ఆధారాలతో సమాధానం చెబుతున్నాం. పేర్ని నానిలా ఎవరో రాసిచ్చిన కాగితం పట్టుకుని మీడియా ముందుకు రాలేదు. 2018-19 లో తెలుగుదేశం ప్రభుత్వ పరిపాలన ముగిసే నాటికి ఉద్యోగులు, పెన్షనర్ల జీత భత్యాల భారం రూ. 49,884 కోట్లు. అంటే దాదాపు రూ. 50 వేల కోట్లు. జగన్ రెడ్డి హయాంలో 2019-20 కి నాటికి అది రూ. 53,565 కోట్లు. అంటే పెరిగింది షుమారు 3,500 కోట్లు మాత్రమే. 2020-21 కి అది రూ. 57,462 కోట్లకు చేరింది. అంటే, వైసీపీ ప్రభుత్వంపై 2018-19 తో పోల్చుకుంటే పడిన ఉద్యోగుల జీతాల భారం అదనంగా రూ 7 వేల కోట్లు మాత్రమే. కానీ, నిన్న నిస్సిగ్గుగా పేర్ని నాని 2020-21 లో రూ. 67,340 కోట్లు జీతాల ఖర్చు భారం పడిందని పచ్చి అబద్దాలు ఆడారు. మంత్రి గారికి సి.ఏజీ రిపోర్టులోని అంకెలు మార్చడానికి కూడా ఏ మాత్రం సిగ్గులేదు. ఐ.ఆర్ రూపంలో రూ 17 వేల కోట్ల భారం వైసీపీ ప్రభుత్వంపై పడిపోయిందని అబద్దాలు ఆడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం చెబుతున్న లెక్కులు వాస్తవమైతే అవి సిఏజీ రిపోర్టుల్లో ఎందుకు కనపడటం లేదు?

2019-20 లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ. 1,11,034 కోట్లు. 2020-21 లో 1,17,136 కోట్లు, 2021-22 నవంబర్ నాటికి రూ. 88,618 కోట్లు. మూడు ఆర్దిక సంవత్సరాలలో (నవంబర్, 2021 వరకు) వైసీపీ ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం అక్షరాల రూ. 3,16,788 కోట్లు. దీనికి అదనంగా చేసిన అప్పు 2019-20 లో రూ. 46,205 కోట్లు, 2020-21 లో రూ. 55,161 కోట్లు, 2021-22 నవంబర్ నాటికి రూ. 49,976 కోట్లు. అనగా మొత్తం 1,51,342 కోట్లు. వీటికి అధనంగా కార్పొరేషన్ల ద్వారా తెచ్చిన అప్పు రూ. 1,21,761 కోట్లు. అంటే మొత్తం ప్రభుత్వ మరియు కార్పొరేషన్ల అప్పు 2,73,103 కోట్లు. అప్పులు, ఆదాయం రెండూ కలుపుకుని వైసీపీ ప్రభుత్వ ఖజానాలోకి వచ్చి చేరిన డబ్బు అక్షరాల రూ.5,89,891 కోట్లు (3,16,788+2,73,103). ఇక, జీతాలకు అయిన ఖర్చు 2019-20 లో రూ.53,565 కోట్లు, 2020-21 లో మరో రూ.57,462 కోట్లు, ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం 2021-22 నవంబర్ నాటికి మరో షుమారుగా రూ.40 వేల కోట్లు ఖర్చు చేశారు. అంటే మొత్తంగా జీతభత్యాల కోసం జగన్ రెడ్డి సర్కార్ నవంబర్ 2021 వరకు చేసిన ఖర్చు కేవలం రూ. 1,51,027 కోట్లు. జగన్ రెడ్డి ఖజానాకు చేరిన 5,89,895 కోట్లలో అది కేవలం 25 శాతం మాత్రమే. కానీ పేర్ని నాని రాష్ట్ర ఆదాయంలో 110 శాతం జీతభత్యాల కోసం ఖర్చు చేస్తున్నామని నిస్సిగ్గుగా అబద్దాలు ఆడుతున్నారు. రాష్ట్రానికి వచ్చే ఆదాయానికి మించి జీతాల కోసం ఖర్చు చేస్తున్నామని చెప్పడం దుర్మార్గం. నేను చెబుతున్న ఒక లెక్కైనా తప్పని రుజువు చేసే దమ్ము, ధైర్యం వైసీపీ నాయకులకు ఉందా అని సవాల్ విసురుతున్నాను.

వైసీపీ ప్రభుత్వ ఇప్పటి వరకు 7 డిఏలు పెండింగ్ పెట్టి ఇప్పుడు వాటిల్లో కూడా కోత పెడుతున్నారు. జూన్ 2019 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చామని గొప్పటు చెప్పుకుంటున్న జగన్ సర్కార్ రివర్స్ పీఆర్సీ ప్రకటించిన సంధర్బంలో ఏప్రిల్ 2020 నుంచి మానిటరీ బెనిఫిట్స్ వర్తింప చేస్తామని ప్రకటించి దానికి ముందున్న 9 నెలల కాలానికి చెల్లించిన అదనపు ఐఆర్ మొత్తాన్ని నిస్సిగ్గుగా డిఏలలో కోత పెడుతున్నారు. ఇది ఎంత వరకు సమంజసం. ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంచమని వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరడిగారు? రిటైర్ అవుతున్న ఉద్యోగులకు ఆ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని డ్రామాలు ఆడుతూ మోసం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రిటైర్ అయిన ఏ ఉద్యోగికి సక్రమంగా బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వలేదు. 2024 లో ఎన్ క్యాష్ చేసుకునేలా రిటైర్ అయిన ఉద్యోగులకు బాండ్స్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి సిగ్గులేదా? రిటైర్ అయిన ఉద్యోగులు వచ్చిన రిటైర్ మెంట్ బెనిఫిట్స్ తో తమ పిల్లలకు పెళ్లిళు చేసుకోవాలనో, ఒక ఇల్లు కట్టుకోవాలనో అనుకుంటారు. జగన్ రెడ్డి పుణ్యమా అంటూ వారు అది కూడా చేసుకునే పరిస్తితులలో లేరు. బాండ్స్ పేరుతో వారిని మూడు, నాలుగు యేండ్లు వేచిచూసేలా చేస్తున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రిటైర్ అయిన ఉద్యోగులకు నెల రోజుల్లో వారి క్లెయిములన్ని సెటిల్ చేసే పరిస్తితి ఉండేది. కానీ, నేడు రిటైర్ అయ్యే ఏ ఉద్యోగికి కూడా వారి బెనిఫిట్స్ దక్కనటువంటి పరిస్తితి.

జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాతా ఏ విధంగా కష్టాలు పడుతున్నారో కూడా ఉద్యోగస్తులు ఆలోచన చేయాలి. సి.పి.ఎస్ పరంగా ఏ విధంగా మోసపోయారో ఒకసారి ఆలోచించండి. పీఆర్సీ నివేదిక కూడా ఇవ్వకుండా తొక్కిపెట్టి జగన్ రెడ్డి ఏ విధంగా మోసం చేస్తున్నాడో కూడా ఆలోచన చేయాలి. కాంపెన్ సేటరీ సీటీ అలవెన్సు (సిసిఏ) అడిషనల్ బెనిఫిట్స్ ను ఏ విధంగా తొలగించారో గుర్తుచేసుకోండి. ఉద్యోగస్తులకు ప్లాట్లు ఇస్తామని వారితో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలని కొత్త ప్రణాళిక చేశారు జగన్ రెడ్డి. కాకి లెక్కలు, తప్పుడు లెక్కలు కట్టి పెట్టి ఉద్యోగస్తుల న్యాయమైన డిమాండ్లను అంగీకరించండి. రాష్ట్రాన్ని ఆర్ధికంగా దివాలా తీయించడానికి ప్రధాన కారణం మీ దోపిడీ, దుబారానే. కాబట్టి వైసీపీ నాయకులు తమ దోపిడీని అరికట్టి ఉద్యోగస్తులకు న్యాయం చేయండి. అర్ధరాత్రి విడుదల చేసిన ఉద్యోగస్తుల నడ్డివిరిచే జీవోలను తక్షణమే రద్దు చేయాలి. సంప్రదింపుల పేరుతో వేసిన కమిటీ కేవలం ఉద్యోగస్తులను బెదిరింపులకు గురిచేయడానికే.

రెండు రోజుల క్రితం ఇండియా టుడే సంస్థ మూడ్ అఫ్ ది నేషన్ పేరిట ఒక సర్వే విడుదల చేసింది. అందులో కేంద్రం స్థాయిలో ఎన్డీఏ, యుపీఏ బలా బలాలు, ఏ పార్టీలు ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తాయి, కేంద్ర స్థాయిలో ప్రతిపక్ష నేతగా ఎవరు ఉంటే బాగుటుంది ? సొంత రాష్ట్రంలో కాకుండా, బయట రాష్ట్రాల్లో ఏ సియంకు ఆదరణ ఉంది. సొంత రాష్ట్రాల్లో సియంలకు ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది, ఇలా అనేక అంశాలతో ఇండియా టుడే సమగ్రంగా కధనం ప్రసారం చేసింది. అయితే ఇందులో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, జగన్ మోహన్ రెడ్డి వన్ సైడ్ గా గెలుస్తాడని, ఆయనకు 25 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే చెప్పింది అంటూ, బులుగు మీడియా ఊదరగొట్టింది. బులుగు మీడియా, సోషల్ మీడియా, ఇలా మొత్తం, జగన్ మోహన్ రెడ్డి తిరుగు లేదు అంటూ డబ్బా కొట్టుడు మొదలు పెట్టారు. ఒక పక్క అన్ని వర్గాలు ఈ పాలనను అసహ్యించుకుంటుంటే, బులుగు మీడియా ఇలా ప్రచారం చేయటం, ఇండియా టుడే సర్వే పై పలువురు ఆశ్చర్య పోయారు. అసలు ఇండియా టుడే రిపోర్ట్ లో ఏముందో అంటూ, ఆన్లైన్ లో చూస్తే, అక్కడ డబ్బులు కట్టి subscribe చేస్తే కానీ రిపోర్ట్ ఇవ్వం అని వస్తుంది. అయితే ఈ రోజు ఇండియా టుడే ఎడిషన్ మార్కెట్ లోకి వచ్చింది.

it 22012022 2

దీంతో అసలు గుట్టు బయట పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంపీ సీట్ల విషయంలో, ఇండియా టుడే బ్రేక్ అప్ ఇచ్చింది. అందులో ఎన్డీఏ కి సున్నా సీట్లు, యుపీఏకి సున్నా సీట్లు, ఇతరులకు 25 ఎంపీ సీట్లు అని ఉన్నాయి. అంటే, బీజేపీ, కాంగ్రెస్, బీజేపీతో పొత్తులో ఉన్న జనసేనకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదనీ, ఇతరులలో టిడిపి, వైసీపీ లను కలిపింది. ఎక్కడా కూడా వైసిపీకి ఇన్ని సీట్లు, టిడిపికి ఇన్ని సీట్లు, లేదా జగన్ పాలనకు తిరుగు లేదు అని, ఎక్కడా రాయలేదు. అక్కడ రాసింది జగన్ గ్రాఫ్ పడిపోతుందని. మూడు అంశాల్లో జగన్ గ్రాఫ్ పడిపోయిందని ఇండియా టుడే రాసింది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకుల ర్యాంక్ లో, జగన్ 4% నుంచి 1 % నికి పడిపోయారు. అలాగే రాష్ట్రం వెలుపల బెస్ట్ సియంగా, ఆరు శాతం నుంచి మూడు శాతానికి పడిపోయారు. సొంత రాష్ట్రంలో బెస్ట్ సియం ఎవరు అనే దాంట్లో, జగన్ ర్యాంక్ ఒకటో స్థానం నుంచి, పదో స్థానంలో కూడా లేకుండా, అడ్రస్ కూడా లేకుండా పడిపోయారు. సర్వేలో ఇలా స్పష్టంగా ఉంటే, బులుగు మీడియా ఎందుకు ఇంత హడావిడి చేస్తుందో మరి ?

గుడివాడని గబ్బు పట్టిస్తూ, కొడాలి నాని, గుడివాడలో క్యాసినో పెట్టించారు అంటూ, తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు, కొడాలి నాని కన్వేషన్ సెంటర్ లో క్యాసినో, అమ్మాయిలు, డ్యాన్స్ లు, ఇలా అనేక వీడియోలు సోషల్ మీడియాలో, మీడియాలో బయటకు వచ్చాయి. తరువాత ప్రతిపక్షాలు ఈ అంశం పై ఆందోళన చేసాయి. అయితే ఈ అంశం తేల్చటానికి, తెలుగుదేశం పార్టీ నిజ నిర్ధారణ బృందం, గుడివాడ వెళ్ళింది. అక్కడకు వెళ్ళకుండా, వైసిపీ నేతలు అడ్డుకున్నారు, రాళ్ల దా-డి చేసారు. బొండా ఉమా కారు కూడా పగలగొట్టారు. అయితే ఈ అంశం పెద్దది అయ్యింది. దీంతో కొడాలి నాని నిన్న స్పందించారు. అక్కడ క్యాసినో జరిగినట్టు నిరూపిస్తే, పెట్రోల్ పోసుకుని చస్తానని అన్నారు. అయితే దీనికి టిడిపి స్పందించింది. ఈ రోజు మరిన్ని విడియోలు విడుదల చేసింది. ACES Casino పేరిట గుడివాడలో క్యాసినో నడిపిన వీడియోలు విడుదల చేసింది. అలాగే రెండు రోజుల క్రితం ఆరోపణలు చేసిన ప్రవీణ్ చికోటి అనే వ్యక్తి అక్కడ ఉన్న ఆధారాలు కూడా విడుదల చేసింది టిడిపి. అంతే కాదు, క్యాసినో అయిపోయిన తరువాత, అక్కడ ఉన్న సెట్ అప్ అంతా తీసేస్తున్న వీడియో కూడా టిడిపి బయట పెట్టింది. ఇవన్నీ చూపించి, కొడాలి నాని, ఎప్పుడు పెట్రోల్ తెమ్మంటావ్ అంటూ ఛాలెంజ్ చేసింది టిడిపి.

సాక్షాలు చూపెట్టాం.. కొడాలి నానీ ఎప్పుడు ఆత్మ హ-త్య చేసుకుంటారు? ఎప్పడు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. శనివారం మంగళగిరిలోని టీడీజీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు మీకోసం.. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నానీ మాట్లాడుతూ తనకు సంబంధంచిన కే కన్వెన్షన్ లోను, తనకు సంబంధించిన స్థలాలలో ఎక్కడా జూదం జరగలేదని బుకాయించారు. పైగా నిరూపిస్తే తాను ఆత్మ-హ-త్య చేసుకుంటానని మాట్లాడారు. గుడివాడలో కొడాలి నానికి సంబందించిన స్థలంలో, కే కన్వెన్షన్ లో జరిగిన కార్యక్రమాలు ఏ సోషల్ మీడియాలో కొట్టినా వస్తాయి. నానీకి సంబంధించిన స్థలంలో ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి క్యాసినోలు, జూదాలు, డ్యాన్సులు నిర్వహించారు. ఇవాళ రాష్ట్ర ప్రజల సాక్షిగా మేం ప్రజల ముందు ఉంచాం. సోషల్ మీడియాలో కో కొల్లలుగా వీడియోలు చూడొచ్చు. కొడాలి నాని బాధ్యత గల ఒక మంత్రిగా ఉండి ఇలా చేయొచ్చా? ఆయనకు సంబంధించిన కన్వెన్షన్ లో, ఆయనకు సంబంధించిన స్థలంలో మూడు రోజులపాటు భారీ సెట్టింగులు వేసి, క్యాసినోలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జూదం, డ్యాన్సులు జరిగాయి. అందులో పాల్గొనాలంటే ప్రతి వ్యక్తి పది వేలు చెల్లించాలి. రాష్ట్ర మంత్రిగా ఉన్న వ్యక్తి బహిరంగంగా క్యాసినో నడిపిస్తే ముఖ్యమంత్రి, డీజీపీల మౌనం దేనికి సంకేతం? రాష్ట్ర రాజధానిలోని సీఎం డీజీపీలుండే కేంద్రానికి అతి సమీపంలో ఒక మంత్రి ఇంతగా బరితెగించి క్యాసినోలు, డ్యాన్సులు చేయిస్తే ప్రభుత్వ వ్యవస్థలకి తెలియకుండా పోతుందా? రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? లేదా? పరిపాలన సాగుతోందా? లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇన్ని అ-ఘా-యి-త్యా-ల-కు పాల్పడిన మంత్రిని ఎందుకు బర్తరఫ్ చేయరు? దీన్నిబట్టి చూస్తే ముఖ్యమంత్రి ఇందుకు సహకరిస్తూ, సమర్థిస్తున్నట్లుగా ఉంది. మా వాళ్లు మూడు రాజధానులే అంటున్నారు, కొత్తగా మాకు నాల్గవ రాజధాని వచ్చిందని వైసీపీ నాయకులే అంటున్నారు.

కొత్తగా జూద రాజధానిగా గుడివాడ అని చెప్పుకోవచ్చేమో. నిరూపించండి పెట్రోల్ పోసుకొని ఆ-త్మ-హ-త్య చేసుకుంటా, రాజకీయాలు మానేస్తాను, సన్యాసం పుచ్చుకుంటా అని నాని అన్నారు, అదెప్పుడు చేస్తారు. ఏసిస్ క్యాసినోతో వైసీపీ నాయకులు బేరం కుదుర్చుకున్న మాట వాస్తవం కాదా? అఫిషియల్ గా నానీ నిర్వాహకుడు కాదా? ఏసిస్ క్యాసినో ప్రేమల్ టోపీవాలా వైసీపీ మనిషి కాదా?. అఫిషియల్ పేజీలో పేర్కొనలేదా? కళ్లముందు నిలువెత్తు నిజాలు కనబడుతున్నాయి. ఏఎస్ఎస్ క్యాసినోవారితో ఒప్పందం చేసుకొని వారిని గుడివాడకు తీసుకొచ్చి మూడు రోజులపాటు గుడివాడలో క్యాసినో నిర్వహించారు. మేం నిరూపించాం. చిత్తశుద్ధి ఉంటే రాజీనామా మీరెప్పుడు చేస్తారు? నాని నిరూపించండి పెట్రోల్ పోసుకొని ఆ-త్మ-హ-త్య చేసుకుంటా, రాజకీయాలు మానేస్తాను, సన్యాసం పుచ్చుకుంటా అని నాని ఎప్పడు చేసుకుంటారు? ఒక మంత్రిగా ఉన్న వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా క్యాసినోలు నిర్వహిస్తూ మహిళల్ని విలాస వస్తువులగానో, ఆట వస్తువులుగానో చేసిన మంత్రికి క్యాబినెట్ లో ఉండే అర్హత లేదు. నీతులు చెబుతుంటే వినాల్సిన దౌర్భాగ్యం మనది. చాలా బరితెగింపుగా మాట్లాడుతున్నారు. జరిగినదాన్ని దేశమంతా చూశారు. అందరికీ తెలుసు అది బహిరంగ రహస్యం. పైగా బరితెగించి మాట్లాడటం సిగ్గుచేటు. మంత్రి మాట్లాడే భాష జుగుప్సాకరంగా ఉంటోంది. సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆయన భాషలో మార్పు రావాలి. ధైర్యంగా క్యాసినో జూదం, అశ్లీల నృత్యాలు నేనే నిర్వహించానంటే సంతోషించేవాళ్లం. విషయాన్ని పక్కదారి పట్టించారు.

చంద్రబాబు, లోకేష్ లను విమర్శిస్తే మీరు చేసిన తప్పులు ఒప్పులైపోతాయనుకోవద్దు. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉండి పౌరులకు ఉపయోగపడాల్సివారు ఆ పనిని గాలి కొదిలేశారు. క్యాసినోలు నడింపించడంలో ఉన్న శ్రద్ధ రైతుల మీద, ఆ శాఖ నిర్వహణ మీద లేకపోవడం బాధాకరం. ఫొటోలు, వీడియోలు బహిరంగంగా కనపడుతుంటే ఇంకా సాక్ష్యాలు కావాలా? మూడు రోజులుగా గుడివాడ నడిబొడ్డులో క్యాసినో, జూదాలు, డ్యాన్సులు నిర్వహిస్తుంటే పోలీసులు ఆవైపు కన్నెత్తి కూడా చూడలేదు. సామాన్యులు పేకాట ఆడితే దాడి చేసి పట్టుకొని కేసులు నమోదు చేస్తారు. ఫైన్లు వేస్తారు. ఇంత పబ్లిక్ గా ఫేస్ బుక్ లలో, సోషల్ మీడియాల ద్వారా ప్రచారం చేసి, బహిరంగంగా డబ్బులు వసూలు చేశారు. అయినా చర్యలు లేవు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడో లేడో అర్థం కావడంలేదు. టీడీపీ నిజనిర్ధారణ కమిటి గుడివాడకు వెళ్లడంలో కుట్ర కోణం దాగివుందనడంలో అర్థంలేదు. ఆంధ్రప్రదేశ్ ను జూద నిలయంగా మార్చినా, ఏపీ ప్రతిష్ట దిగజారినా ముఖ్యమంత్రి మౌనంగా ఉన్నాడంటే ఇంతకంటే దారుణం ఇంకొకటి లేదు. ఎవరిమీద లేని జూదము, డ్యాన్సులు, అశ్లీల నృత్యాలు కేవలం కొడాలి నానీపైనే వచ్చాయంటే అర్థం చేసుకోవచ్చు. జరిగాయి కాబట్టే వచ్చాయని. వీరు ఆంధ్రప్రదేశ్ ని జూదాంధ్రప్రదేశ్ గా మార్చినా ఆశ్చర్యపోనక్కరలేదని మాజీ మంత్రి ధూళిపాళ్ల నరేంద్ర తెలిపారు.

Advertisements

Latest Articles

Most Read