ఆంధ్రప్రదేశ్ ఆర్దిక శాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఆయన పాత్ర ఏమీ కనిపించడం లేదు. అసలు అయితే ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీఆయనే చూసుకోవాలి. కాని ఈ మధ్య చాలా విషయాల్లో ఆయన అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అయితే ఈ వ్యవహారాలన్నీ సజ్జల లే చూసుకుంటున్నారు. AP ఉద్యోగుల పీఆర్సీ పై ఇంత ఎత్తున సమ్మె జరుగుతున్నా బుగ్గన దీని పై ఏమి స్పందిచకపోవడం గమనార్హం. ఒక్కసారి మాత్రం ఉద్యోగుల ను సమ్మె చేయకుండా నచ్చ చెప్పడానికని ఒక మీటింగు ఏర్పాటు చేస్తే ఆ మీటింగ్ కు వచ్చి ఊరికే అలా కూర్చొని వెళ్లి పోయారు. ఆ మీటింగులో కూడా కనీసం ఆయన ఏమి మాట్లాడక పోవడం పై ఉద్యోగులు కూడా అయోమయానికి గురయ్యారు. ఆ మీటింగులో కూడా సజ్జల రామకృష్ణ రెడ్డి దే డామినేషనగా కనిపించింది. అయితే వేరే మంత్రులు పేర్ని నాని, బొత్సలను ఉన్న కూడా సజ్జలే మీడియాతో మాట్లాడారు. ఇందంతా చూస్తుంటే AP లో అన్ని విషయాలపై సజ్జల దే ముఖ్య పాత్ర గా కనిపిస్తుంది. అయితే అసలు బుగ్గన ఈ ఉద్యోగుల పీఆర్సీ విషయంలో ఎందుకు కల్పించుకోవడం లేదో అర్ధం కావట్లేదంటున్నారు. మరో వైపు బుగ్గన మాత్రం ఎక్కువగా డిల్లి లోనే ఉంటున్నట్టు తెలుస్తుంది. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు తేవటంలో ఆయన బిజీగ ఆన్నారు. ఏపిలో ఉద్యోగుల విషయంలో బుగ్గన మాత్రం అ వివాదాలన్నీ తనకేందుకులే అని, ప్రభుత్వం డిల్లి లో ఎవర్ని కలిసి రమ్మంటే వారిని కలిసి వస్తున్నారట .ఈయన ఎందుకు ఇలా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు అనే విషయం పై స్పష్టత రావాల్సి ఉంది.
news
బీజేపీతో జగన్ స్నేహం వల్ల, నన్ను అంటున్నారు.. జగన్ పై బాంబు పేల్చిన ప్రశాంత్ కిషోర్..
ప్రశాంత్ కిషోర్... ఈ పేరు తెలియని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉండరు. జగన్ మోహన్ రెడ్డి కోసం పని చేస్తూ, ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్పి, ఫేక్ చేసి, ఇష్టం వచ్చినట్టు అస్తవ్యస్తం చేసి, కుల గొడవలు, ప్రాంతీయ గొడవలు, ఇలా రకరకాలుగా చేసి, జగన్ మోహన్ రెడ్డిని అందలం ఎక్కించిన వ్యక్తి. ఐప్యాక్ సంస్థతో కలిసి, ప్రశాంత్ కిషోర్ చేసిన రచ్చ ఏపిలో అంతా ఇంతా కాదు. ఇందు కోసం జగన్ మోహన్ రెడ్డి, పెద్ద మొత్తంలో డబ్బులు కూడా ఇచ్చారు. వందల కోట్లు అని ప్రచారం ఉంది కానీ, నిజం అయితే తెలియదు. ఇలా వందల కోట్లు ప్రశాంత్ కిషోర్ కి ఇచ్చిన జగన్, ప్రశాంత్ కిషోర్ కి సన్నిహితుడు అయిపోయారు. అయితే ప్రశాంత్ కిషోర్ ఈ మధ్య కాలంలో జాతీయ రాజకీయాల పై దృష్టి పెట్టారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటి వరకు బీహార్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పని చేసారు. అలాగే ప్రధాని మోడి కోసం కూడా గతంలో పని చేసారు. ఇప్పుడు తాను గెలిపించిన ఇన్ని రాష్ట్రాలు ఉండటంతో, ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలు పై ఫోకస్ పెట్టారు. ఎక్కడ చేడిందో ఏమిటో కానీ, మోడిని దించాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీ వద్దకు వెళ్లి ప్రతిపాదన పెట్టారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో మీటింగ్ పెట్టుకున్నారు.
అయితే ఈ ప్రతిపాదన మాత్రం వర్క్ అవుట్ అవ్వలేదు. ఈ క్రమంలోనే ప్రత్యామ్న్యాయం వైపు ప్రశాంత్ కిషోర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ కిషోర్, నిన్న ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూ లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుత రాజకీయాలు గురించి, అడిగిన యాంకర్, మీరు బీజేపీ అజేంట్ అని అందరూ అంటున్నారు, దీని పై మీ సమాధానం ఏమిటి అని అడగగా, అలా ఎందుకు అంటున్నారు ? నేను గెలిపించిన జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ పై ఎలాంటి పోరాటం చేయటం లేదు కాబట్టి, నేను బీజేపీ అజేంట్ అనుకుంటున్నారా అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. జగన్ మోహన్ రెడ్డి, బీజేపీ పై ఎలాంటి పోరాటం చేయటం లేదు అని చెప్పటమే కాదు, జగన్ వల్ల తనని బీజేపీ అజెంటు అనుకుంటున్నారు అంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ప్రశాంత్ కిషోర్ చెప్పకపోయినా, జగన్ మొహన్ రెడ్డి, ఎలాంటి పోరాటాలు చేయటం లేదు అని తెలుసు అనుకోండి.
నిన్న సాయంత్రం హడావిడిగా లీకులు.. క్యాసినో, ఉద్యోగుల సమ్మె డైవెర్ట్ చేయటానికి, అదిరిపోయే వ్యూహం పన్నిన జగన్..
ఒక సమస్యకు పరిష్కారం, మరో సమస్యను సృష్టించిటమే అని వైసిపీ ప్రభుత్వం భావిస్తుంది. నిజానికి ఇది వైసిపీ ప్రభుత్వం వ్యూహం అని, వారి పరిపాలన స్టైల్ చూస్తేనే అర్ధం అవుతుంది. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, దాన్ని ఎలా పరిష్కరించాలి అని మాత్రం వైసిపీ ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్ కు ఉండదు. నా నిర్ణయమే ఫైనల్, ఏమి చేస్తారో చేసుకోండి అని అహంకారం కనిపిస్తుంది. ఆ సమస్య ప్రజలు మర్చిపోవాలి అంటే, వేరే సమస్యతో ముందుకు వస్తే, సరిపోతుందని జగన్ మోహన్ రెడ్డి భావిస్తూ ఉంటారు. మొన్నటి వరకు రాష్ట్రంలో ఉన్న హాట్ టాపిక్ సినిమా టికెట్ల వ్యవహారం. దాని చుట్టూ వార్తలు తిరుగుతున్న సమయంలో, ఉద్యోగుల పీఆర్సి అంశం తెర పైకి వచ్చింది. సినిమా టికెట్ల కంటే ముందు అధ్వానమైన రోడ్డుల గురించి, అలాగే ఓటిఎస్ గురించి, కరెంటు చార్జీల పెంపు గురించి, పెట్రోల్ బాదుడు గురించి, ఇలా ఒక సమస్య తరువాత మరో సమస్య వచ్చింది. అంతే కాని ఒక్క సమస్య కూడా పరిష్కారం కాదు. ప్రస్తుతం ఉద్యోగులు , ప్రభుత్వం పై ఎదురు తిరిగారు. మరో వారం పది రోజుల్లో సమ్మెకు కూడా వెళ్తున్నారు. తమకు రెండు చేతులా ఓట్లు వేసిన ఉద్యోగులనే జగన్ మోహన్ రెడ్డి ముంచేశారు అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ సమస్య నుంచి బయట పడాలని ప్రభుత్వం భావిస్తుంది.
సరిగ్గా ఇదే టైంలో క్యాసినో వ్యవహారం గందరగోళం చేసి పడేసింది. దీంతో రాజకీయం మొత్తం దీని చుట్టూ తిరుగుతున్న సమయంలో, జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఈ సమస్యల నుంచి డైవర్ట్ చేయటానికి, అద్భుతమైన ప్లాన్ వేసారు. అదే కొత్త జిల్లాల వ్యవహారం. ఇది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది. నిజానికి దేశ స్థాయిలో జన గణన అయ్యే దాకా, ఇది చేపట్ట కూడదని కేంద్రం చెప్పినా, ప్రస్తుతం ప్రజలను ఇప్పుడు ఉన్న సమస్యల పై , దృష్టి మళ్ళించాలి అంటే, ఇదే కరెక్ట్ అని వైసిపీ భావించింది. అందుకే సడన్ గా ఇది నిన్న సాయంత్రం తెర మీదకు తెచ్చారు. వెంటనే రెండు రోజుల్లో నోటిఫికేషన్ కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ ఇది ఇంపాక్ట్ అవుతుంది. మ్మమ్మల్ని ఈ జిల్లాలో కలపాలని, లేదా మా జిల్లాకు ఈ పేరు పెట్టాలని, ఇలా రకరకాలుగా ప్రజలు మళ్ళీ ఆందోళన పడతారు. ఇప్పుడున్న సమస్యలు అన్నీ పక్కకు వెళ్ళిపోతాయి. అందుకే వైసిపీ ఇప్పుడున్న సమస్యల నుంచి బయట పడటానికి, మరో సమస్యని సృష్టించే పనిలో ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
జగన్ తప్ప, కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయాన్ని వ్యతిరేకించిన బీజేపీయేతర సియంలు...
కేంద్ర ప్రభుత్వం తీసుకునే అనేక నిర్ణయాలు, ఈ మధ్య కాలంలో వివాదాస్పదం అవుతున్నాయి. దీనికి ముఖ్య కారణం, ఫెడరల్ వ్యవస్థలో కీలకమైన రాష్ట్రాల హక్కులను, కేంద్రం నెమ్మదిగా తమ అధీనంలోకి తెచ్చుకోవటం. ఈ మధ్య కాలంలో అనేక నిర్ణయాలు రాష్ట్రాలు విమర్శలు చేస్తున్నాయి. వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. అలాంటి నిర్ణయమే ఇప్పుడు కేంద్రం మరొకటి తీసుకుంది. అదే ఐపిఎస్, ఐఏఎస్ అధికారులను కేంద్రం గుప్పిట్లోకి తీసుకోవటం. దీని కోసం కేడర్ రూల్స్ ని మార్చేస్తున్నారు. ఐపిఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులను ఎప్పుడు కావలి అంటే అప్పుడు కేంద్ర ప్రభుత్వం వెనక్కు పిలిపించుకోవచ్చు. అయితే కేంద్రం తీసుకునే ఈ నిర్ణయాన్ని, బీజేపీ, దాని మిత్ర పక్షాలు పాలించే రాష్ట్రాల్లో ఎలాగూ వ్యతిరేకించరు. కేవలం మిగతా బీజేపీయేతర రాష్ట్రాలు వ్యతిరేకిస్తాయి. కీలకమైన సివిల్ సర్వీస్ అధికారులు కేంద్రం చేతుల్లోకి వెళ్తే, ఇక రాష్ట్రాల్లో తమకు ఇష్టం వచ్చినట్టు కేంద్రం చేసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా బీజేపీ బలంగా లేని చోట, అంటే మమతా బెనర్జీ, కేజ్రివాల్, స్టాలిన్, ఇలాంటి చోట్ల, కేంద్రం ఇష్టం వచ్చినట్టు చేసే అవకాసం లేక పోలేదు. అందుకే బీజేపీయేతర రాష్ట్రాలు అన్నీ కూడా ఈ ప్రతిపాదనను వ్యతికేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేసాయి కూడా.
బీహార్, తమిళనాడు తో పాటుగా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ జార్ఖండ్, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు ఇప్పటికే కేంద్రం నిర్ణయం పై ఎదురు తిరిగాయి. తాజాగా తెలంగాణా రాష్ట్రం కూడా, కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పైన తమ అసంతృప్తి వ్యక్తం చేసింది. అయితే ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకత చెప్పినా, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జగన్ మోహన్ రెడ్డి, ఎలాంటి ప్రకటన కాని, లేఖ కాని కేంద్రానికి రాయలేదు. అంటే కేంద్రం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకత చెప్పటం లేదు. మరీ ముఖ్యంగా ఇది కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శాఖ కావటంతో, జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి వ్యతిరేకంగా సాహసం చేయలేదు. కేంద్రం గుప్పిట్లోకి వెళ్ళిపోతుందని తెలిసినా కూడా జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారో అర్ధం కావటం లేదు. రాష్ట్రాల హక్కులు కేంద్రానికి ఇచ్చేస్తూ పొతే, ఇప్పుడు జగన్ సొంత నిర్ణయాలు కోసం చేసే ఈ పనులు, రేపు ప్రభుత్వాలు మారిన తరువాత ఎంత ఇబ్బంది అవుతుందో ఆలోచన చేయకుండా, ఇలా చేయటం పై విమర్శలు వస్తున్నాయి.