మెగాస్టార్ చిరంజీవి ఈ నెల 13 వ తారీఖు ఆంధ్రప్రదేశ్ వచ్చి జగన్ ను కలిసిన విషయం తెలిసిందే. ఆ రోజు మీడియా ముందుకు వచ్చిన చిరంజీవిని, ఏపి ఎందుకు వచ్చారు అని అడిగిన ప్రశ్నకు, సినిమా పరిశ్రమకు ఉన్న సమస్యల గురించి చర్చించడానికే వచ్చాను అని, దీని పట్ల జగన్ కూడా సానికులంగా స్పందిచారని, మంచి భోజనం పెట్టారని, భారతి గారు స్వయంగా వడ్డించారని, త్వరలోనే శుభవార్త వింటారని, అలాగే ఇక్కడ జరిగిన విషయాలు అన్నీ కూడా మా సినిమా వాళ్లతో కూడా చర్చించి, మంచి జరిగేలా చూస్తానని చెప్పుకొచ్చారు. సినిమా టికెట్ల వివాదం ముదురుతున్న నేపధ్యంలో ఆ సమస్య గురిచి చర్చించడానికే జగన్ తనను తన నివాసానికి రమ్మన్నారని చెప్పుకొచ్చారు. తనను పండగ పూట విందుకు జగన్ ఆహ్వానించటం, చాలా సంతోషంగా ఉందని చిరు అన్నారు. అ సమావేశం తనకు చాలా సంతృప్తి ని ఇచ్చిందని, స్యయానా భారతీ గారే తనకు వడ్డించారని మీడియా దగ్గర మురిసిపోయారు. సినిమా వర్గానికి ఏ నష్టం జరగదని జగన్ చాల భరోసా ఇచ్చారని గొప్పగా చెప్పారు. తరువాత నాగర్జున కూడా స్పందిస్తూ, చిరంజీవి, జగన్ ఏమి మాట్లాడకున్నారో తనకు తెలుసు అని, అంతా మంచి జరుగుతుంది అంటూ చెప్పుకొచ్చారు. దీంతో ఈ విషయం పై అంతా మంచి జరుగుతుందని అందరూ భావించారు.

chiru 24012022 2

అయితే తాజాగా AP మంత్రి పేర్నినాని శుక్రవారం మీడియాతో మాట్లడుతూ చిరంజీవి, జగన్ భేటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసారు. సినిమా పరిశ్రమ సమస్యలు చర్చించడానికి అయితే ఆయన వచ్చినట్టు తెలియదని అన్నారు, అయన కేవలం మా సియం ఆహ్వానన్ని మన్నించి విందుకు మాత్రమే వచ్చారని, అంతే గాని సినిమా టికెట్ల గురించి ఎటువంటి చర్చ జరగలేదని చెప్పటం, అంతే కాకుండా ఏమైనా ఉంటే గింటే, ఇలాంటివి సెక్రటేరియట్ లో చర్చిస్తారు కానీ, ఇంట్లో భోజనం చేస్తూ ఎందుకు మాట్లాడుకుంటారు అంటూ బాంబు పేల్చారు. ఈ మీటింగు గురించి చిరంజీవి అబద్దం చెప్పరా? లేక పెర్ని నాని అబద్దం చెపారా? అనే చర్చ మొదలయింది. చిరంజీవి ఏమో స్పెషల్ ఫ్లైట్ వేసుకుని మరీ అమరావతి వచ్చి, ఉత్సాహంగా మీడియా దగ్గర జగన్ తనకు సినిమా వివాదం ముగిసి పోయేలా చాలా హామీలే ఇచ్చారని చెప్పుకొచ్చారు. మరి ఇప్పుడు మంత్రి పేర్ని నాని చిరంజీవి గాలి తీసిపడేసారు. చిరంజీవిని అవమానిస్తూ పేర్ని నాని మాట్లాడిన మాటలకు, చిరంజీవి స్పందిస్తారో లేదో చూడాలి మరి.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైనా ఎదురు చెప్తే, తన మన తేడా ఉండదు. చివరకు సొంత కుటుంబాన్ని కూడా జగన్ కోసం విమర్శిస్తూ ఉంటారు. వీరికి ముఖ్యంగా ఉండే అస్త్రాలు బులుగు మీడియా, పేటీయం సోషల్ మీడియా, వీరికి తోడు ఇప్పుడు కొత్తగా ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, వాలంటీర్ వ్యవస్థ. వీళ్ళని ఉపయోగించి, ఎవరు అయితే వీరిని ప్రశ్నిస్తారో వారిని టార్గెట్ చేస్తారు. వీళ్ళు సొంత మనుషులు అయినా, తమకు ఓటు వేసిన వారు అయినా, ఎవరైనా సరే. మొన్న జరిగిన సుబ్బారావు గుప్తా సంగతి కానీ, అలాగే సినిమా వాళ్ళని టార్గెట్ చేయటం కానీ, ఇలా ఏదైనా, ఎవరైనా సరే. ఇప్పుడు తాజాగా, రెండు చేతులతో, రెండు కాళ్ళతో ఓటు వేసిన, ఉద్యోగులు ఇప్పుడు వీరి టార్గెట్. గతంలోనే కాదు, అసలు ఏ రాష్ట్రంలో, ఎప్పుడు లేని విధంగా, ఏకంగా ఉద్యోగుల జీతాలు తగ్గించారు. ఐఆర్ 27 శాతం ఇచ్చి, పీఆర్సి 23 శాతం ఇస్తే, 4 శాతం తగ్గినట్టే కదా ? అదేమీ అంటే, పెండింగ్ డీఏలు కూడా ఇస్తున్నాం అంటున్నారు. పెండింగ్ డీఏలను, పీఆర్సీతో ఎలా కలుపుతారు అని అడిగితే మాత్రం, సారైన సమాధానం లేదు. ఇలా ఉద్యోగులు అడిగే అనేక ప్రశ్నలకు, ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. అందుకే, రాజకీయ వ్యూహాన్నే ఇక్కడ కూడా అమలు చేసింది. ప్రత్యర్ధి పార్టీల పై ఎలా ఎదురు దా-డి చేస్తారో, ఇక్కడ కూడా అదే చేస్తున్నారు.

prc 24012022 2

ఇందు కోసం, తమ బులుగు మీడియాని, అలాగే పేటీయం బ్యాచ్ ని, వాలంటీర్లను రంగంలోకి దించారు. టీచర్లు, ఉద్యోగులు పై విష ప్రచారం మొదలు పెట్టారు. బులుగు మీడియాలో, ఉద్యోగుల జీతాలు తగ్గలేదు, పెరిగింది అని ప్రచారం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఫేక్ ప్రచారం హోరెత్తిస్తున్నారు. ఉద్యోగులు లంచాలు తీసుకుంటున్నారు అని, అలాగే టీచర్లు పాఠాలు చెప్పకుండా నిద్ర పోతున్నారని, ఇలా వేరే రాష్ట్రాల్లో ఉన్న ఫోటోలు తీసుకుని వచ్చి, ప్రచారం చేస్తున్నారు. ఇక వాలంటీర్లకు కొన్ని కర పత్రాలు ఇచ్చి, ఇంటి ఇంటికీ వెళ్లి వాటిని పంచమని ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగులకు ఎంతో చేస్తున్నామని, వారు అడిగిన జీతాలు ఇవ్వాలి అంటే, పధకాలు ఆపివేయాలి అనే ప్రచారం మొదలు పెట్టారు. మొత్తంగా జగన్ మొహన్ రెడ్డి ఎంతో గొప్ప వారు, ఉద్యోగులే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు అనే ప్రచారం చేస్తున్నారు. సహజంగా ఉద్యోగుల పైన, సమాజంలో ఉన్న కోపాన్ని వాడుకుని, ఉద్యోగులను దోషులుగా చూపించి, వారికి మద్దతు లేకుండా చేయాలని, ప్రభుత్వం ప్లాన్ వేసింది.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య గుడివాడ కేసినోలో పాల్గొన్న చీర్ గర్ల్స్ ప్రయాణ వివరాలు బయట పెట్టారు. ఆయన మాట్లాడుతూ "పేకాట రాయుడు, జూద బ్రహ్మ కొడాలి నానీ గుడివాడ నగరాన్ని అపవిత్రం చేశారు. రాష్ట్రమంతా అట్టుడికిపోయేలా చేశారు. ఇది తెలుగు సంస్కృతిపై దాడి జరిగినట్లే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కృష్ణా జిల్లాలోకి విష సంస్కృతిని తీసుకొచ్చారు. దీనికి ముఖ్య కారణం కొడాలి నానినే. ఈ విషయం రాష్ట్రమంతటికి, ఇతర రాష్ట్రాలకు తెలిసినా ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీస్ అధికారులకు తెలియకపోవడం ఆశ్చర్యకరం. వీరు క్యాసియో జరిగిందా లేదా అని ఇంకా అనుమానపడుతున్నారు. ముఖ్యమంత్రి ఈ విషయాన్ని పట్టించుకోవడంలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఇంకా అనుమానిస్తోంది. ఇంటలిజెన్స్ విభాగం, స్పషల్ బ్రాంచ్ ఆఫీసర్స అంతా ఏం చేస్తున్నారు? బాధ్యతాయుత మంత్రి ఏం చేస్తున్నారు? కేసినో జరిగినదాన్ని విచారణ చేయడానికి ఒక డిఎస్పీ ఇంకో డిఎస్పీని పెట్టడం హాస్యాస్పదం. కే కన్వెన్షన్ లో క్యాసినో జరగిందంటే పోలీసు వ్యవస్థ ఎందుకు అనుమానిస్తోంది? క్యాసినో జరిగిన విధానం, ఛీర్ గర్ల్స్ డ్యాన్సింగ్, రోలెట్ రన్నింగ్, తీన్ పత్తి ప్లేయింగ్, అందర్ బాహర్, జనాలు నానీ నానీ అని సినిమా పాటలా పాడటం, డ్యాన్సులు చేసిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రతి టీవీ ఛానల్ లో చూపించారు. ఆఖరికి టీవీ 9 లో కూడా చూపారు. అక్కడి వాతావరణమంతా వైసీపీ కలర్స్ తో డెకరేషన్ చేశారు. అక్కడ వైసీపీ జెండాలు రెపరెపలాడాయి. ఇవన్నీ చూసికూడా అనుమానమా? క్యాసినో జరగలేదని చెబితే డీజీపీ భవిష్యత్తులో దెబ్బతింటారు. ఎవరికో భయపడో, ఎవరికో సాయం చేయాలనో, ఎవరి మెప్పో పొందాలనో డైరెక్టర్ జనరల్ సవాంగ్ అబద్ధం చెబితే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడతారు. నా పై ఒక తప్పుడు కేసు కూడా పెట్టారు. గోవాలోని క్యాసినో రన్నర్స్ గుడివాడకు వచ్చారు. మూడు రోజులు వారి ఫేస్ బుక్కుల్లో క్యాసినో జరుగుతుందని వారి ఫేస్ బుక్కుల్లో పెట్టుకున్నారు. ధూళిపాళ్ల నరేంద్ర ప్రెస్ మీట్ లో ఇవన్ని వివరంగా చూపారు. ఆ కోణంలో దర్యాప్తు చేశారా? విచారించి నిజాలు చెప్పమని సీఎం ఎందుకు ఆదేశించడంలేదు? ఇంటలిజెన్స్ వారిని ఎందుకు అడగడంలేదు? ఇంత అభాసుపాలైన మంత్రి ఎక్కడ ఉండరు. సీఎం, డీజీపీకి తెలియని విషయాలు నేను ఇంట్లో ఉండే కనుక్కున్నాను. మీ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? క్యాసినో కార్యక్రమం నిర్వహించాలని నాలుగు నెలల నుంచి జరుగుతున్న తతంగం. రాష్ట్రంలోకి విష సంస్కృతి రావడానికి కారణం కొడాలి నానినే.

నాలుగు నెలల నుంచి ప్లాన్ చేశారు. ఆ ప్లాన్ చేసిన వ్యక్తులెవరో ప్రభుత్వం కనుక్కోవాలి. క్యాసినో ఆడేవారికి 50 వేలు ప్యాకేజీ పెట్టారు. ఎయిర్ పోర్టులో దిగగానే కారు ప్రొవైడ్ చేశారు. విజయవాడ లాడ్జ్ లో పెట్టారు. అదే కారులో క్యాసినో ఆడే స్థలానికి తీసుకెళ్లారు. 3 రోజులు ఫ్రీ ఎంట్రీ. కొన్ని వేల మంది వచ్చారు. విజయవాడలోని అనేక లాడ్జీలు ఫుల్ అయ్యాయి. మంత్రి, అతని అనుచరుల ఆధ్వర్యంలో ఇదంతా జరిగింది. యదేచ్ఛగా వచ్చి క్యాసినో ఆడుకున్నారు. కొడాలి నానీ తనకు తెలియదని పచ్చి అబద్ధం చెబుతున్నాడు. ఫ్రెష్టేషన్ కు లోనై ఆత్మహత్య చేసుకుంటానన్నాడు. తప్పు చేసి కంగారు పడ్డాడు. నానీని ఇలాగే కొనసాగిస్తే ఈ బురద సీఎం కు కూడా అంటుకుంటుంది. కొడాలి నానీ, కొందరు పోలీసు అధికారులు ఫ్లడ్ లైట్ ల వెలుగులో క్యాసినో నిర్వహించి దాగుడు మూతలాడుతున్నారు. సీఎంకు కూడా ఇందులో భాగముంది. క్యాసినో జరగలేదని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. డీఎస్పీని పంపి ఆపించానని నాని చెప్పారు. డిఎస్పీ అక్కడికి వెళ్లి ఛీర్ గర్ల్స్ పై చర్యలు తీసుకున్నారా? అరెస్టు చేశారా? ఎక్కడైనా ఇద్దరు పేకాట ఆడుతుంటే అక్కడ పేకాట ఆడేవారిని, చుట్టు ఉన్నవారిని, వారి బండ్లను, వారి ఫోన్లను ఇతరత్రా అన్నింటిని స్వాధీనం చేసుకుంటారు. కానీ ఇక్కడ అలా జరగలేదే? డ్యాన్సులు జరుగుతున్నాయని తెలిసి డిఎస్పీని పంపానంటే యువతులతో ప్రదర్శన జరిగినట్లుగా నానీ ఒప్పుకున్నట్లే. అక్కడికి వెళ్లిన డిఎస్పీ అందరినీ ఎందుకు అరెస్టు చేయలేదు? క్యాసినోను ఎందుకు సీజ్ చేయలేదు? నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కవిరాజు త్రిపురనేని రామాస్వామి చౌదరి, హనుమాన్ చౌదరి, గంటశాల వెంకటేశ్వరరావు లాంటి మహామహులు పుట్టిన గుడివాడ పట్టణాన్ని ధనాశ, దురాశతో, దుష్ట ఆలోచనలతో కళంకం చేశారు. క్యాసినో ఆడేవారు ఎన్ని లాడ్జీల్లో దిగారు, ఎన్ని కార్లు వాడారు విచారణ చేయలేదు. నేను అసభ్యకరంగా మాట్లాడానని నాపై కేసు పెట్టారు. క్యాసినో నానిపై చర్యలు తీసుకోవాలి. మంత్రివర్గం నుంచి వెంటనే బర్తరఫ్ చేయాలి.మంత్రివర్గం నుంచి తొలగించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం షాక్ ఇస్తూ, నిధుల దారి మళ్లింపు, అలాగే ఇక నుంచి కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి, కేంద్రం , రాష్ట్ర ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయాన్ని, టిడిపి నేత పట్టాభి ఈ రోజు బయట పెట్టారు. ఆయన మాటల్లోనే, "రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా సాగిస్తున్న పరిపాలనలో రాష్ట్రం ఏ విధంగా దివాలా తీసిందో ప్రజలందరికీ తెలుసు. మూడు సంవత్సరాలుగా ఆర్థిక క్రమశిక్షణ లేక పోవడం వల్ల ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. రాష్ట్రంలో ఆర్థిక అరాచక పాలన నడుస్తోంది. వరల్డ్ బ్యాంక్, ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్ మెంట్ బ్యాంక్ మరియు విదేశీ ఫైనాన్షియల్ ఇన్సిటిట్యూషన్స్, ఆర్థిక సంస్థలు, బ్యాంకులు పైసా కూడా రాష్ట్రానికి నిధులు విడుదల చేయని పరిస్థితులు ఉన్నాయి. ఇందుకు పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్ రెడ్డిదే. నాలుగు రోజుల క్రితం జనవరి 17,2022న కేంద్ర ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరి డాక్టర్ ప్రసన్న మినిష్టరీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి రావత్ గారికి వివిధ ప్రపంచ బ్యాంకుల నిధుల దుర్వినియోగం, దారి మళ్లింపుకు సంబంధించి ఘాటైన లేఖ రాశారు. ఇటువంటి లేఖలు కేంద్ర ఆర్థిక శాఖ నుండి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. చంద్రబాబునాయుడు గారి హయాంలో ఇటువంటి పరిస్థితులు ఏనాడు లేవు. జగన్ నిర్వాకం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరంగా చాలా గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. రాష్ట్రంలో ఒకరకమైన ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొనివుంది. రాష్ట్రంలో రోడ్లు మరియు వివిధ రకాల అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి పలు అంతర్జాతీయ బ్యాంకుల నుండి మంజూరైన రుణాలకు సంబంధించి అడ్వాన్సులు పొందడం కోసం అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రిన్సిపుల్ సెక్రటరి రావత్ గారు డిసెంబర్ 16, 2021న ఒకసారి, మరలా డిసెంబర్ 21, 2021న మరోసారి కేంద్ర ఆర్థిక శాఖకు లేఖలు రాయడం జరిగింది. గతంలో నారా చంద్రబాబునాయుడు గారు రాష్ట్రంలో వివిధ రోడ్లు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపట్టుట కొరకై ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెన్ట్‌మెంట్ బ్యాంకు (ఏఐఐబి) నుండి 455 మిలియన్ యుఎస్ డాలర్లు అనగా సుమారు 3,300 కోట్ల రూపాయలు మరియు న్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి దాదాపు 6,400 కోట్ల పైచిలుకు నిధులు మంజూరు చేయించారు. (70 : 30) దామాషాలో ప్రాజెక్టు వ్యయంలో అంతర్జాతీయ బ్యాంకులు మరియు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా రూపకల్పన చేసి తద్వారా పొందే నిధులను రాష్ట్రంలో కీలకమైన ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ (ఏపీఆర్ఆర్‌పి), ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జస్ రీకన్‌స్ట్రక్షన్ ప్రాజెక్ట్ (ఏపీఆర్ బిఆర్‌పి), ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూమెంట్ ప్రాజెక్ట్ (ఏపీఎంసీఆర్‌సీఐపీ) వంటి అనేక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఆనాడు చంద్రబాబునాయుడుగారు చేశారు."

"నేడు వీటికి మరియు ఇతర రుణాలకు సంబంధించి అడ్వాన్సులు పొందడం కోసం రాష్ట్రం కేంద్ర ఆర్థిక శాఖని తన లేఖల ద్వారా అనుమతి కోరగా జనవరి 17, 2022న కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చిన జవాబులో రాష్ట్ర ప్రభుత్వ విన్నపాన్ని నిర్ద్వందంగా తోసిపుచ్చడం జరిగింది. అంతేకాకుండా ఆయా రుణాలకు సంబంధించి నిధులు రాష్ట్రం పొందాలంటే తాను విధిస్తున్న అనేక షరతులుకు లోబడి పనిచేయాల్సివుంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖపై కొరడా ఝుళిపించింది. కేంద్రం తన లేఖ ద్వారా విధించినటువంటి అనేక షరతులలో ముఖ్యమైనది విదేశీ బ్యాంకుల నుండి రుణాలు మంజూరైన వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సిన 30 శాతం నిధులను తక్షణమే చెల్లించాలని, ఆ తదుపరి మాత్రమే బ్యాంకు రుణాల నిధులు పొందే ఆస్కారం ఉంటుందని తేల్చి చెప్పింది. ఇంతవరకు ఈ రుణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఒక్క రూపాయి కూడా జమచేయలేదు. పై బ్యాంకుల నుండి నేటి వరకు అడ్వాన్సుగా వచ్చిన నిధులన్నింటిని రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్ళించి దిగమింగుతోంది. ఆ కోవలోనే గ్రామీణ ప్రాంత రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టు (ఏపీఆర్‌ఆర్ పి- ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు) కిగాను గతంలో ఏఐఐబి బ్యాంకు నుండి అడ్వాన్సుగా తీసుకున్న 70 మిలియన్ డాలర్లు దారి మళ్లించి దోపిడీ చేశారు. ఇప్పుడు కేంద్రం తన లేఖలో ఆ 70 మిలియన్ డాలర్లకు సంబంధించి లెక్కలు కూడా తక్షణమే అప్పజెప్పాలని షరతు విధించింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎంత అధ్వాన్నంగా మారిందో మనందరికి తెలుసు. కనీసం గుంటలు కూడా పూడ్చలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వముంటే వచ్చిన నిధుల్ని దారి మళ్లించి రోడ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. "

"దోచిపెట్టిన డబ్బంతా మళ్లీ వెనక్కి తెచ్చి సంబంధిత శాఖలకు మీరు చెల్లింపులు చేస్తేనే భవిష్యత్తులో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నుండి ఇంకా ఏసియన్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ బ్యాంక్, ఎన్డీపీ, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బులు డ్రా చేయడానికి అనుమతి లభిస్తుందని తేల్చి చెప్పింది. అలా చేయకపోతే రాష్ర్ట ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా భవిష్యత్‌లో రాదు. అదేవిధంగా ఇకమీదట వివిధ అంతర్జాతీయ బ్యాంకుల ద్వారా పొందే రుణాలకు సంబంధించిన డబ్బు వారం రోజులలోపు సంబంధిత పీడీ అకౌంట్స్ లలో జమ చేసి తీరాల్సిందేనని నిబంధన విధించారు. దీనకి తోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇకమీదట ప్రతినెల రుణాలు పొందిన వివిధ ప్రాజెక్టుల అమలుకు సంబంధించి ఆర్థిక పరమైన మరియు భౌతిక పురోగతికి సంబంధించిన నివేదికలు తప్పక కేంద్ర ఆర్థిక శాఖకు సమర్పించాలని షరతు విధించింది. ప్రతి నెల ఏ ప్రాజెక్టు పని ఎంత పురోగతి సాధించింది, ఏ కాంట్రాక్టర్లకు ఎంతెంత నిధులు చెల్లించారన్న విషయాలు తప్పనిసరిగా ఇకమీదట ఒక నివేదిక రూపంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖకి సమర్పించాలి. డిఇఏ (డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్) ఇకపై మన రాష్ట్రంలో వివిధ ప్రపంచ బ్యాంకు రుణాలతో చేపడుతున్న ప్రాజెక్టుల అమలు మరియు నిధుల వినియోగంపై నిత్యం పర్యవేక్షణ చేస్తుందని, ఎటువంటి లోపాలున్నాకూడా ఉపేక్షించబోదని ఈ లేఖ ద్వారా తేల్చి చెప్పింది. తక్షణమే తాము కోరిన విధంగా అన్ని విషయాలపై డాక్యుమెంటరీ ఈవిడెన్స్ తో కేంద్ర ప్రభుత్వానికి వివరాలు తెలియజేయాలని... ఆ విధంగా తెలియపరచిన తరువాతనే బ్యాంకు రుణాల అడ్వాన్సు విడుదల గురించి తాము ఆలోచన చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఒక క్రెడిబులిటి లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ విధమైన సమస్యలు ఉత్పన్నమవుతాయో నేడు కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖలోని అంశాలను పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం రాసినటువంటి ఈ ఘాటు లేఖ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో అమలవుతున్న అన్ని ఇఏపీ ప్రాజెక్టులకు సంబంధించిన రుణాలు మరియు నిధుల వినియోగంపై తక్షణమే ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం."

Advertisements

Latest Articles

Most Read