మే నెలలో చంద్రబాబు అమెరికా పర్యటనలో, గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని సందర్శించి రాష్ట్రంలో పెట్టుబడులు, రాష్ట్రానికి సహకారం అందించాలి అని కోరారు... ఆ లీడ్ ఫాలో అప్ చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ఐటి మంత్రి లోకేష్ అమరికా పర్యటనలో గూగుల్ ఎక్స్ కార్యాలయానికి వెళ్లి వారు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించారు... శాన్ఫ్రాన్సిస్కోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ ఎంవోయూ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ సెంటర్‌ను గూగుల్ ఎక్స్.ప్రారంభించనుంది.
అమెరికాలో మినహా గూగుల్ ఎక్స్ ఎక్కడా కార్యకలాపాలు ప్రారంభించలేదు. గూగుల్ ఎక్స్ మొదటిసారి ఇండియాలో అడుగుపెడుతోంది. త్వరలో విశాఖలో గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు కానుంది. ఫైబర్‌గ్రిడ్‌తో ఒప్పందంలో భాగంగా ఏపీ 13 జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్, (ఎఫ్సాక్) లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుంది. ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్‌తో అతి తక్కువ ధరకే గ్రామీణ ప్రాంతాలకు అత్యంత వేగవంతమైన బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ రానున్నాయి.
గూగుల్ ఎక్స్ రాకతో కమ్యూనికేషన్ రంగంలో భారీ మార్పులు సంభవిస్తాయని మంత్రి లోకేశ్ తెలిపారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ప్రజలకు అనేక సేవలు అందిస్తామన్నారు. సర్టిఫికెట్ లెస్ గవర్నెన్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్టు లోకేశ్ తెలిపారు. చంద్రబాబు అమెరికా పర్యటనలో ఏమి సాధించారు అని కూసిన వారికి, దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... గూగుల్ ఎక్స్ డెవలప్మెంట్ సెంటర్ రాకతో విశాఖ రూపు రేఖలు మారిపోనున్నాయి... అప్పట్లో చంద్రబాబు హైదరాబాద్ కు మైక్రో సాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకువచ్చి హైదరాబాద్ గతినే మార్చేసారు... ఇప్పుడు గూగుల్ డెవలప్మెంట్ సెంటర్ రాకతో, విశాఖ కూడా మంచి అవకాశాలు రావాలి అని ఆశిద్దాం...