నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో నిర్మించే శాసనసభ భవనం డిజైన్ దాదాపు ఖరారైంది. భవనంపై సైక్ టవర్‌తో సిద్ధం చేసిన డిజైన్ ఎక్కువ మందిని ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. దీనిని ఇవాళ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా ఖరారు చేయ్యనుంది.. ఈ స్పైక్ డిజైన్ వెనుక చాలా హోం వర్క్ చేశారు... చంద్రబాబు చెప్పినట్టు వన్ అఫ్ ది బెస్ట్ కాకుండా, ది బెస్ట్ కావలి అన్నట్టుగానే డిజైన్ లు ఇచ్చారు...నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ సంస్థ..
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన నిర్మాణాల్లో అమరావతి శాసనసభ భవనం మూడోది కానుంది. ప్రఖ్యాత నిర్మాణాలను పరిశీలించిన నిపుణులు అదే స్థాయిలో ఏపీ అసెంబ్లీ భవన ఆకృతిని రూపొందించారు. లండన్‌లో ది షార్డ్ టవర్‌ను 308 మీటర్ల ఎత్తులో 95 అంతస్థులతో...ప్యారిస్‌లోని సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్‌పై 301 మీటర్ల ఎత్తులో ఈఫిల్ టవర్‌ను నిర్మించారు. ఇప్పుడు భారత్‌లోని అమరావతిలో 250 మీటర్ల ఎత్తులో శాసనసభ భవనం టవర్ నిర్మాణ డిజైన్ ని రూపొందించారు.
విశేష మద్దతు పొందుతున్న టవర్ డిజైన్‌లో అసెంబ్లీ భవంతి 750 చదరపు అడుగుల వెడల్పు కలిగి ఉండాలని ప్రతిపాదించారు. సుమారు 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది.చుట్టూ ఉన్న తటాకంలో దీని ప్రతిబింబం కనపడుతుంది. ఈ టవర్‌లో 70 మీటర్ల ఎత్తు వరకు (70 అంతస్తులు) సందర్శకులు వెళ్లవచ్చు. అక్కడొక వ్యూయింగ్ ప్లేస్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నగరం మొత్తాన్ని వీక్షించవచ్చు. శాసనసభ భవనం సెంట్రల్హాల్లో రాజమౌళి సూచన మేరకు తెలుగుతల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. సూర్యకిరణాల వెలుగులో ఆ విగ్రహం మెరిసిపోయేలా తీర్చిదిద్దుతారు. తెలుగువారి సంస్కృతి, భాష, వారసత్వం, ఘన చరిత్ర ఇత్యాది అంశాలకు అద్దం పట్టే మ్యూజియంను ఈ టవర్‌లో ఏర్పాటు చేస్తారు. ఇలాంటి ప్రత్యేకతలతో కూడిన నిర్మాణం ప్రపంచంలో ఇదేనని ఫోస్టర్ ప్రతినిధులు తమ ప్రజెంటేషన్ సందర్భంగా పేర్కొన్నారు.