సమాజం లోని అన్ని వర్గాల ఆర్ధిక అభివృద్దికి కృషి చేయాలని, అందుకోసం అగ్రవర్ణ పేదలకు (ఈబీసీ) కూడా సమాన హక్కులు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చారిత్రాత్మక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ బీసీ కమిషన్ కు సారధ్యం వహించిన జస్టిస్ కె.ఎల్. మంజునాద్ ఆయిదారు రోజుల్లో తన నివేదికను విడిగా ఇవ్వనున్నారు. అగ్రవర్గాలన్నింటిలోనూ ఆర్థికంగా వెనకబడిన వారికి, చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి చూసుకుంటున్న వారికి ఎనిమిది శాతం రిజర్వేషను ఇవ్వాలని సిఫార్సు చేసే ఉద్దేశంలో ఆయన ఉన్నట్లు సమాచారం. ఎప్పటి నుంచో చంద్రబాబు ఆలోచన కూడా అగ్రవర్ణ పేదలను ఆదుకోవాలని ఉండటంతో, ఈ సిఫార్సు ప్రభుత్వం ఆమోదించనుంది...

reservation 02122017 2

ఆంధ్ర ప్రదేశ్ లో S.C , S.T. , B.C. , మైనారిటీ వర్గాలకు అనేక ప్రభుత్వ పధకాలు ఆయా కార్పొరేషన్ ల ద్వారా అందుబాటులో ఉన్నాయి. శతాబ్దాలు గా అభివృద్దికి నోచుకోని వర్గాలకు ప్రభుత్వం చేయూత ఇవ్వాలి అనే నిర్ణయంతో, గత కొన్ని సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలు, వీటిని అమలుపరిచి, ఆ వర్గాలకు అండగా నిలిచాయి. కాపుల రిజర్వేషన్ అంశం కూడా ఇవాళ అసెంబ్లీలో ఆమోదం పొందనుంది. అలాగే, బ్రాహ్మణులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. ఎన్టీఆర్‌ ఏర్పాటు చేసిన కార్పొరేషన్ల నుంచి ఇప్పుడు చంద్రబాబు ఏర్పాటు చేసిన బ్రాహ్మణ, కాపు కార్పొరేషన్ల వరకు, ఆయా వర్గాలకు చేయూతనిస్తున్నారు. అయితే, ఒక్కో కులానికి ఒక్కో సంస్థ ఏర్పాటు చేస్తూ పోతే... ‘విభజన’ భావన కనిపిస్తుందని, కులాలకు అతీతంగా, అన్ని వర్గాల్లోని పేదలకు (ఈబీసీ) సాయం చేద్దామనే ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కాపులకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసారు. కాపు కార్పొరేషన్ ద్వారా అనేక మందికి రుణాలు మంజూరు చేస్తున్నారు.

reservation 02122017 3

విదేశీ విద్యా పధకం ద్వారా అనేక మందిని విదేశాలకు పంపిస్తున్నారు. మిగతా కులాలలో ( రెడ్డి , కమ్మ , వైశ్య , వెలమ , క్షత్రియ ) కూడా పేదలు ఉన్నారు. ప్రభుత్వం తమను ఎందుకు పట్టించుకోవటం లేదన్న భావన వీరిలో రోజు రోజుకీ బలపడుతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ తరుణంలో, బలహీన వర్గాల తరహాలోనే ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలను కూడా ఆదుకోవాలని, అగ్రవర్ణ పేదలకు చేయూతనివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. అలాగే ఈబీసీ కార్పొరేషన్ కూడా పరిశీలనలో ఉంది... అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్థులు సైతం విదేశాల్లో చదువుకొనేందుకు సాయం అందిచటం, వీరికి కూడా బ్యాంకుల ద్వారా విద్యా , వ్యాపారాభివృద్ధికి రుణాలు , అగ్రవర్ణ పేద విద్యార్ధులకు ఫీజు రీఎంబెర్సుమెంట్, చిన్న , మధ్య తరహా వ్యాపారస్తులకు రుణాలు ఇప్పించే కార్యక్రమాలు లాంటివి ఈ కార్పొరేషన్ చెయ్యనుంది.

విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రంగాలలో వెనుకబడి ఉన్న వాల్మీకి, బోయ సామాజిక వర్గ ప్రజలను ఎస్టీ జాబితాలో కల్పించాలన్న డిమాండ్ కూడా, చంద్రబాబు తీర్చారు... స‌చివాల‌యంలో ఇవాళ సీఎం చంద్ర‌బాబు అధ్య‌క్ష‌త‌న జరిగిన ఏపి కేబినెట్ స‌మావేశంలో, వాల్మీకి బోయ‌ల‌ను ఎస్టీల్లో చేరుస్తూ మంత్రి వ‌ర్గం తీర్మానం చేసింది. ఈమేర‌కు కేంద్రానికి కేబినెట్ తీర్మానం పంప‌నుంది.

valimiki 01122017 2

1956వ సంవత్సరంలో, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా వచ్చిన అధికార కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నీలం సంజీవ రెడ్డి తన సామాజిక వర్గ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకూ ఎస్‌.సి. జాబితాలో ఉన్న మైదాన ప్రాంత వాల్మీకి బోయలను బీసీ జాబితాలో చేరుస్తూ 63/ 1956 యాక్టు తీసుకు వచ్చారు. దాంతో ఒకే రాష్ట్రంలో ఉన్న వాల్మీకి బోయలను ప్రాంతాల వారీగా బీసీలుగా, ఎస్టీలుగా విభజించి దారుణ అన్యాయం చేశారు. అప్పటి నుంచీ వాల్మీకి బోయ కుల సంఘాలవారందరూ ఈ అన్యాయాన్ని సరిచేయాలని, ఈ కులం మొత్తాన్ని ఎస్‌.టిలుగా మార్చాలనీ ఉద్యమాలు చేస్తున్నారు.

valimiki 01122017 3

ఈ పరిణామాలతో చంద్రబాబు పాదయాత్ర చేసేప్పుడు, తాను అధికారంలోకి వస్తే, వాల్మీకి, బోయలను ఎస్టీల్లో చేరుస్తా అని హామీ ఇచ్చారు... ఇప్పుడు ఆ హామీ నెరవేర్చారు... "నా రాజకీయ జీవితంలో కల నెరవేరింది"అని మంత్రి కాల్వ శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. ఇవాళ కేబినెట్ భేటీ అనంతరం మంత్రి మాట్లాడారు.. క్యాబినెట్ నిర్ణయంతో మంత్రి కాల్వ ఆనందం వ్యక్తం చేశారు. బోయల రిజర్వేషన్ల కోసం కాల్వ మొదటి నుంచి కృషి చేస్తున్నారని సహచర మంత్రులు అభినందించారు.

నవ్యాంధ్ర జీవనాడి పోలవరం పూర్తిచేయాలని ఎంతో ఓర్పుతో, కేంద్రం అన్నో ఇబ్బందులు పెడుతున్నా, బాధను దిగమింగి పోరాడుతున్నా... కొర్రీలుపెడుతూ సహకరించను అంటుంది కేంద్రం... మొన్న కాఫర్ డ్యాం ఆపెయ్యమంది... నిన్న స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్లు ఆపెయ్యమంది... ఈ వార్త తెలుసుకున్న ఆంద్ర రాష్ట్ర ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు... ఎప్పుడూ ఓర్పుగా ఉండే చంద్రబాబు కూడా, ఈ పరిణామాలతో తీవ్రంగా స్పందించారు... ఇవాళ మన రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ... కేంద్ర నయవంచన గురించి మాట్లాడుకుంటూ, పోలవరం ఎలా పూర్తి అవుతుంది అనే ఆందోళనలో ఉన్నారు...

polavaram cbn 01122017 1

అయితే మన రాష్ట్రంలో కొంత మంది మాత్రం, ఈ పరిణామాలతో చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నారు... ఈ పాటికే మీకు అర్ధమయ్యే ఉంటుంది.. వారినే సైకోలు అని ముద్దుగా పిలుస్తారు... వీరి స్వభావం ఎలా ఉంటుంది అంటే, వీరు మనం సంతోషంగా ఉంటే వీరు బాధపడతా ఏడుస్తూ కూర్చుంటారు... మనం బాధపడుతుంటే, వీరు సంతోష పడతారు... ఇప్పుడు పోలవరం విషయంలో కూడా అదే జరుగుతుంది... ఒక పక్క రాష్ట్రమంతా పోలవరం ఎలా ముందుకు వెళ్తుంది అని ఆందోళనలో ఉంటే, ఈ కొంత మంది సైకోలు మాత్రం మహదానందంగా చిందులు వేస్తున్నారు... సోషల్ మీడియాలో, బయట పండగ చేసుకుంటున్నారు... ఆ బ్యాచ్ మొత్తంలో, ఒక్కడికి అంటే ఒక్కడికి కూడా బాధలేదు... పైగా ఆనందంతో పరవసించిపోతున్నారు...

polavaram cbn 01122017 2

పోలవరం అనేది ఒక పార్టీదో ఒక ప్రభుత్వానికో సంబందించిందో కాదు.. లేకపోతే చంద్రబాబు వ్యక్తిగత పొలాలకో, ఒక సామాజిక వర్గం వాళ్ల కోసమో కట్టే ప్రాజెక్టు కాదు.. ఆంధ్రుల జీవధార.. పోలవరం పూర్తయితే బీళ్లు లేని పచ్చని బయళ్లు రాష్ట్రం అంతటా ఉంటాయి... ఉభయ గోదావరి,ఉత్తరాంధ్ర, కృష్ణ గుంటూరు మెట్ట ప్రాంతాలు మాగాళ్ళుగా మారతాయి.. ప్రకాశం,సీమ కరువు కష్టాలు తీరుతాయి.. ఎగువ పొలాలు పండ్ల తోటలతో పచ్చబడతాయ్... రైతు అనేవాడు సుభిక్షంగా ఉంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది.... పాదయాత్రలు చేస్తే పదవులు వస్తాయో రావో తెలియదుగానీ ఇటువంటి పరిస్థితుల్లో కలసి పోరాడితే ప్రజల్లో గుర్తింపువస్తుంది.... చేసిన పాపాలు కొంతవరకైనా కడుక్కోవచ్చు...

కాపు రిజర్వేషన్ల పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది... ఇవాళ జరిగిన క్యాబినెట్ సమావేశంలో, దీనికి సంభందించి ఆమోదం తెలిపింది.. జస్టిస్ మంజునాథన్ కమిషన్ పై ఇవాళ క్యాబినెట్ చర్చించింది... బీసీ కమిషన్‌ పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరణాత్మక ప్రకటన చేయనున్నారు... దీనిపై ఒక తీర్మానం చేసి త్వరలో కేంద్రానికి పంపిస్తారు. రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగుమం చేస్తారు... కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీర్మానం చేసింది. BC(F) గా గుర్తింపు ఇవ్వనుంది...

kapu 01122017 2

ఇది రాజకీయపరమైన రిజర్వేషన్ కాదని, విద్య, ఉపాధి రంగాలకు మాత్రమే రిజర్వేషన్ వర్తిస్తుందని కమిషన్ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఏపీలో రిజర్వేషన్లు 55 శాతానికి చేరనున్నాయి. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ అసెంబ్లీలో శనివారం తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ప్రభుత్వం భావిస్తోంది. కాపులను బీసీల్లో చేర్చుతామని చంద్రబాబు 2014 ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. దీన్ని నెరవేర్చాలన్న డిమాండ్ కాపుల నుంచి బలంగా వినిపిస్తోంది. దీంతో కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

kapu 01122017 3

కాపులను బీసీల్లో చేర్చాలన్న డిమాండ్‌కు మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జస్టిస్ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఇందులో ఛైర్మెన్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు మెంబెర్స్ ఇచ్చిన సిఫార్సుల ప్రకారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు రేపు అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించి, ఫైనల్ గా ఒక నిర్ణయం తీసుకుని, కేంద్రానికి ఆమోదం కోసం పంపించనుంది...

Advertisements

Latest Articles

Most Read