జగన్ మోహన్ రెడ్డి... విజయ సాయి రెడ్డి... వీరిద్దరూ ఎంత గొప్ప వాళ్ళు అనేది, వారు A1,A2 గా ఉన్న 11 సిబిఐ కేసులు, మరికొన్ని ఈడీ కేసులు చెప్తాయి... అయితే, వీరి ఇరువురి గొప్పతనం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైనా పడింది... పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి వైసీపీని వీడటం వెనుక ఇవే కారణాలు కనిపిస్తున్నాయి. టీడీపీకి బద్ద వ్యతిరేకి అయిన ఈశ్వరి ఆ పార్టీలో చేరుతారా అని వైసిపీ పార్టీ కార్యకర్తలే నమ్మలేకపోయారు ? కాని, పార్టీలో తనకు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలను నిర్దారించుకున్న తర్వాతే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది...

giddi 27112017 2

ఏజెన్సీ ప్రాంతంలో గిడ్డి ఈశ్వరి మంచి పట్టున్న నేత... అక్కడ జగన్ ఇమేజ్ కంటే, గిరిజన ప్రజల్లో గిడ్డి ఈశ్వరి ఇమేజ్ ఎక్కువ... సహజంగా తనకంటే ఎక్కువ పేరు ఉన్న వారిని టార్గెట్ చేసే జగన్, ఏజెన్సీ ప్రాంతంలో తన పట్టు కోసం, సొంత ఎమ్మల్యేకే ఎర్త్ పెట్టె ప్రయత్నం చేసాడు.... దీనికి అన్ని పనులకి ఉపయోగించినట్టే, విజయసాయిని ఉపయోగించాడు... అయితే ఇక్కడ కధ రివర్స్ అయ్యింది...

giddi 27112017 3

రాజ్యసభ ఎన్నికల అనంతరం గిడ్డి ఈశ్వరిని పక్కనపెట్టేయడమేనని, ఆమె పాడేరు ఎమ్మెల్యే సీటును మరొకరికి ఇస్తామని విజయిసారెడ్డి చెప్పినట్టు, అది కాస్త ఫోన్ రికార్డింగ్స్ రూపంలో గిడ్డి ఈశ్వరికి చేరినట్టు తెలుస్తోంది. అరకు ఇన్‌ఛార్జీగా తాను ప్రతిపాదించిన ఫల్గుణను కాదని, కుంభా రవిబాబును నియమించాలన్న వ్యాఖ్యలు కూడా ఆ టేపుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అదే రోజు, ఈశ్వరి విజయసాయిరెడ్డిని కలిసి తన వద్ద ఉన్న ఫోన్ రికార్డింగ్స్ వినిపించగా, ఆ టేపుల్లో ఉన్న వ్యాఖ్యలు విని విజయసాయిరెడ్డి నోటివెంట మాట రాలేదట. తాను ఎవరి వద్ద అయితే ఆ విషయాలు ప్రస్తావించానో.. వారిద్దరు తనను ఇరికించారని విజయసాయిరెడ్డి భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అడ్డంగా దొరికిపోవటంతో, విజయసాయి, జగన్, ఇద్దరూ ఆమెను బుజ్జగించాల్సింది పోయి, ఎదురు దాడి చేసి, ఉంటే ఉండు, పొతే పో, ఎలాగు సంవత్సరం తరువాత నేనే ముఖ్యమంత్రి అవుతాను అనే స్థాయిలో మాటలు రావటంతో, ఈశ్వరి ఆ పార్టీని వదలాల్సి వచ్చింది..

మొన్నా మధ్య పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టిక్కర్ అంటించి, ఎర్ర చందనం అక్రమ రవాణా చేస్తూ దొరికన ముఠాను పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే... అయితే అప్పట్లో, జగన్ పార్టీ, సాక్షి మాత్రం, ఇది అంతా చంద్రబాబు చేపిస్తున్నారని, చంద్రబాబు ఎర్ర చందనం డాన్ అని, హెరిటేజ్ పెట్టిందే స్మగ్లింగ్ చెయ్యటానికి అని ప్రచారం చేశారు... రంగంలోకి దిగిన పోలీసులు, అప్పుడే నిందితులని పట్టుకున్నారు... అందరూ అనుకునట్టే, 2004 నుంచి ఎర్ర చందనం అక్రమంగా స్మగ్గ్లింగ్ చేస్తున్న ముఠానే దీని వెనకాలా ఉంది అని పోలీసులు తేల్చారు. అంతే కాదు, నిందుతుదిని అరెస్ట్ కూడా చేసి పూర్తి వివరాలు రాబట్టారు...

heritage 27112017 2

అప్పుడే ప్రిలిమ్నరీ ఎంక్వైరీ విషయాలు మాత్రమే చెప్పిన పోలీసులు, నిన్న పూర్తి స్థాయి విచారణ జరిపి, పూర్తి వివరాలు చెప్పారు... సాక్షాత్తు టాస్క్ ఫోర్సు ఎస్.పి రవిశంకర్ పూర్తి వివరాలు చెప్పారు... పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టికర్ వేసి అక్రమ రవాణా చేసిన కేసులో ఆరుగురు స్మగ్లర్లను చిత్తూరు రెడ్ శ్యాండిల్ ట్రాక్స్ ఫోర్స్ కార్యదళం అరెస్ట్ చేసింది. వారిచ్చిన సమాచారంతో, ప్రధాన నిందితుడు రాజాశేఖర్ అలియస్ చిన్నాను పోలీసులు అరెస్ట్ చేశారు.. అయితే ఈ చిన్నా చెప్పిన వివరాలు ప్రకారం, మరో నిందుతుడు మురుగేసన్ ని కూడా పోలీసులు శనివారం అరెస్ట్ చేసారు... ఈ చిన్నా వైసీపీ కార్యకర్త, జగన్ వీరాభిమాని.. గత ఎన్నికల్లో కడప పోలింగ్ బుత్ లో దౌర్జన్యం చేసి, రిగ్గింగ్ చేస్తుంటే, అప్పుడు మూడు రౌండ్లు గాల్లో కాల్పులు కూడా జరిపారు పోలీసులు...

heritage 27112017 2

ఈ చిన్నా, మురుగేసన్ ఇద్దరూ కలిసి ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవారు... చంద్రబాబు వచ్చిన తరువాత వీరి ఆటలు సాగాకపోవటంతో, పాల వ్యాన్ కు హెరిటేజ్ స్టిక్కర్ అంటించి స్మగ్లింగ్ చెయ్యవచ్చు అని ప్లాన్ వేశారు... ఇక్కడ దొంగతనం చెయ్యటం ఒక ఎత్తు అయితే, ఒక వేళ పట్టుబడినా, అది హెరిటేజ్ కాతాలో తోసేసి, జగన్ కు రాజకీయంగా కూడా లబ్ధి చేకూరచ్చు అనే సైకో ఆలోచన అలోచించి ఇలా ప్లాన్ చేశారు... ఈ విషయాన్ని విచారణలో మురుగేసన్కూడా ఒప్పుకున్నాడు... ఇప్పుడు పోలీసులు రాజకీయ కోణంలో కూడా విచారణ చేసే అవకాసం ఉంది.. దీనిలో రాజకీయంగా దెబ్బ తియ్యటానికి, ఎవరన్నా వీళ్ళ చేత ఇలా చేపిస్తున్నారా అనేది కూడా పోలీసులు విచారించే అవకాసం ఉంది...

ఒక పక్క జగన్ నేనే సియం అంటూ, వీధి వీధి తిరుగుతున్నారు... జగన్ ముఖ్యమంత్రి అవుతాడో లేదో కాని, మంత్రి పదవులకి మాత్రం గిరాకీ బాగా పెరిగింది.... ఇప్పటి నుంచి, అడ్వాన్సు బుకింగ్స్ జరుగుతున్నాయి... మొన్నటికి మొన్న రోజా, జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే, తాను హోం మంత్రి అవుతాను అని ప్రకటించింది... చెవిరెడ్డి, బొత్సా, వాసిరెడ్డి పద్మ, అంబటి రాంబాబు లాంటి నేతలు, ఇప్పటికే జగన్, విజయసాయి దగ్గర, ఏ మంత్రి పదవులు కావాలో చెప్పి ఉంచారు.. అయితే దీనికి భిన్నంగా ప్రకటన చేసారు, గుడివాడ ఎమ్మల్యే కొడాలి నాని... జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే, నాకు మంత్రి పదవి వద్దు అంటూ, వేరే కోరిక కోరారు...

kodali nani 26112017 3

2019 ఎలక్షన్స్ లో, 137 సీట్లు వస్తాయిని జగన్ ప్రకటించారు... తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ కూడా రావు అని చెప్పారు... విషయం ఆరా తీస్తే, ప్రశాంత్ కిషోర్ సర్వేలో, ఇలా వచ్చింది అని తేలినట్టు లోటస్ పాండ్ వర్గాలు చెప్పటంతో, జగన్ పార్టీ ఎమ్మల్యేలు అందరూ కూడా అది నిజమే అని నమ్ముతున్నారు... అందుకే 2019లో మంత్రి పదవులు ఎవరికి కావలి, కాంట్రాక్టులు ఎవరకి కావలి, ఇలా లిస్టు తాయారు చేసుకుంటున్నారు... అయితే నంద్యాల, కాకినాడ రిజల్ట్ చూసినాక కూడా, జగన్ కాన్ఫిడెన్సు ఏంటో, వైసీపీ శ్రేణులుకు అర్ధం కావటం లేదు...

kodali nani 26112017 3

ప్రశాంత్ కిషోర్ మూడో విడత పేమెంట్ కోసం, ఎదో పిచ్చి సర్వేలు జగన్ ముందు ఉంచి, ఇదే నిజం అని నమ్మించి, జగన్ తో పాటు, జగన్ ఎమ్మల్యేలను కూడా చిటారు కొమ్మన ఎక్కిస్తున్నారని, వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి... అయితే గుడివాడ ఎమ్మల్యే కొడాలి నాని మాత్రం, జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అవ్వగానే నాకు మంత్రి పడవు వద్దు అంటూ వింత కోరిక కోరారు... జగన్ అన్న గుండెల్లో ఇంత స్థానం ఉంటే చాలు అని, అది మంత్రి పదవి కంటే ఎక్కువ అని అంటున్నారు... జగన్ మాటలు, ప్రశాంత్ కిషోర్ సర్వే, కొడాలి నాని మాటలు వింటున్న జనం మాత్రం, పగలబడి నవ్వుతున్నారు...

విలక్షణ నటుడు తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ ఇప్పుడు పూర్తి దృష్టంతా రాజకీయాలపైనే.. శనివారం ఢిల్లీలో జరిగిన "టైమ్స్ నౌ" నేషనల్ ఛానల్ నిర్వహించిన, టైమ్స్ లిట్‌ఫెస్ట్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తన రాష్ట్రం కోసం పనిచేయడానికి తాను సిద్ధపడ్డానని, దానికి తగిన గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందని అన్నారు... ఇలా చాలా ప్రశ్నలు మీద చర్చ జరిగింది... ఈ సందర్భంలో, చర్చలో భాగంగా, ఈ దేశంలో మీకు ఇష్టమైన లీడర్ ఎవరు అని అడిగిన ప్రశ్నకు కమల్ హసన్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు...

kamal 27112017 2

"ఐ యాం ఏ ఫ్యాన్ అఫ్ చంద్రబాబు నాయుడు" అని అనగానే, అక్కడ వారందరూ చప్పట్లు కొట్టారు.... అక్కడ చర్చలో ఉన్న యాంకర్, చంద్రబాబు మీరు వ్యతిరేకించే బీజేపీతో, చంద్రబాబు జత కట్టారు, మీరు ఆయన్ని పొగుడుతున్నారు.. చంద్రబాబు, బీజేపీ స్నేహితులు అన్న విషయం మీరు మర్చిపోయారు అని అంటే, దానికి కమల్ హాసన్, అవన్నీ నాకు తెలుసు, కాని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచిస్తే, అన్ని విషయాలు గుర్తుకువస్తాయి.... ఆయన ఇది వారకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతాలు సృష్టించారు... ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లాంటి నూతన రాష్ట్రానికి, మళ్ళీ అద్భుతాలు చేస్తున్నారు.... ఆయన పనితనం అద్భుతం (హీ ఈజ్ కమెండబుల్)... ఆయనకు చేతనైన దాంట్లో, ఆయన చెయ్యదగ్గ వరకు, ఆయన చేస్తున్నారు... హి ఈజ్ డూయింగ్ హిస్ బెస్ట్ అంటూ, అందుకే నాకు చంద్రబాబు అంటే ఇష్టం, అందుకే నేను చంద్రబాబుకి ఫ్యాన్ అంటూ, కమల్ హసన్ చెప్పారు...

kamal 27112017 3

కమల్ హాసన్ ప్రస్తుతం, కేంద్రంలోనే బీజేపి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.... అయితే, ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుని మాత్రం, విజనరీ అంటూ, ది బెస్ట్ లీడర్ అంటూ, ఐ యాం హిస్ ఫ్యాన్ అంటూ కమల్ ఆకాశానికి ఎత్తారు.... కమల్ హసన్ సంవత్సరం క్రితం అమరావతి కూడా వచ్చారు...అమరావతి శంకుస్థాపన పురస్కరించుకుని, అప్పుడు రావటం కుదరలేదు అని, అందుకే సీఎం చంద్రబాబు నాయుడుకి తన అభినందనలు తెలిపేందుకు వచ్చానని కమల్ అప్పుడు చెప్పారు...

Advertisements

Latest Articles

Most Read