మీరు ఏదన్నా ప్రభుత్వ సేవలు కోరుతూ దరఖాస్తు చేసుకున్నారా ? ఎన్ని రోజులు అయినా మీ సమస్య పరిష్కారం అవటం లేదా ? మీ మాట ఎవరూ వినట్లేదా ? ఇక నుంచి ఇలాంటివి అసలు కుదరవు... ఇక నుంచి ప్రభుత్వం నుంచి మీరు సేవలు పొందటం హక్కు.... ప్రభుత్వం చెప్పిన గడువు లోపు మీ సమస్య పరిష్కారం కాకపొతే, మీకు ప్రభుత్వం ఫైన్ కడుతుంది.. దీనికి సంబంధించి, 'ఏపీ ప్రజా సేవల సమకూర్చు హామీ చట్టం-2017'ను శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ చట్టం ద్వారా ప్రజలకు సేవలు అందించడంలో ప్రభుత్వ అధికారుల్లో జవాబుదారీతనం పెంచేలా దీన్ని రూపొందించారు.

cbn 23112017 2

ఇప్పటివరకూ ప్రజలు విన్నవించుకున్న సమస్యను పరిష్కరించడానికి నిర్ణీత గడువు మాత్రమే వుంది. గడువు ముగిసినా సమస్య పరిష్కారం కాకపోతే అధికార్లపై చట్ట బద్ధంగా ఫిర్యాదు చేసే అవకాశం పౌరులకు లేదు. ప్రజా సేవల చట్టం అమల్లోకి వస్తే ఏదైనా సమస్య పరిష్కారం కాకపోతే దానికి అధికార్లను భాద్యులను చేసే వీలు ఉంటుంది. ప్రతి దరఖాస్తునూ ఒక నిర్ణీత సమయంలో సంబంధిత అధికారి పరిష్కరించాల్సిందే. సరైన కారణాలు లేకుండా కొర్రీలు వేసినా, దరఖాస్తును పక్కన పడేసినా, సంబంధిత అధికారి అందుకు జరిమానా చెల్లించాల్సిందే.

cbn 23112017 3

పారదర్శక, సమర్థ, సకాలంలో సేవల బిల్లు మంగళవారం పరిశ్రమలశాఖ మంత్రి అమరనాథరెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ జరిగి సభ ఆమోదం పొందితే.. ఇక రాష్ట్రంలో ప్రతి దరఖాస్తూ నిర్ణీత కాల వ్యవఽధిలో పరిష్కారం కావాల్సిందే. ప్రజా సమస్యల పరిష్కారంపై రాష్ట్ర, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ కమిటీలను వేస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టరు, జిల్లా పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో కమిటీ ఉంటుంది. ఈ కమిటీలు దరఖాస్తులు ఎప్పటిలోగా పరిష్కరించారో పరిశీలిస్తాయి. సేవలు అందించలేకపోతే సంబంధిత అధికారి సహేతుకమైన కారణం చూపాలి. లేకపోతే సంబంధిత అధికారికి జరిమానా విధిస్తారు.

టైటిల్ చూసి ఖంగారు పడకండి... 19వ స్థానం అనే సరికి, అది సరిగ్గా అర్ధం చేసుకోలేని వాళ్ళు, 19వ స్థానంలో రాష్ట్రాన్ని నిలబెట్టిన చంద్రబాబు డౌన్ డౌన్ అంటున్నారు.... కాని, 19వ స్థానంలో రాష్ట్రం ఉంది, అవినీతిలో... చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటికి, అవినీతిలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది... ఈ ఇమేజ్ ఉంటే, పెట్టుబడులు రావని, ముందుగా అవినీతి లేకుండా చెయ్యాలి అని ముఖ్యమంత్రి సంకల్పించారు...ఏసీబీకి పూర్తి స్థాయి అధికారాలు ఇచ్చారు... సమర్ధవంతమైన అధికారిగా పేరు ఉన్న, ఠాకూర్‌ ని, ఏసీబీ డీజీగా నియమించారు... ఈ సంవత్సర కాలంలో, ఏసీబీ దూకుడు చూసి కేంద్రం కూడా శభాష్ అంది అంటే, మన ఏసీబీ ఎలా పని చేస్తుందో అర్ధమవుతుంది... గత ఏడాది నవంబరులో డీజీగా బాధ్యతలు స్వీకరించిన ఠాకూర్‌, ఈ ఏడాదికాలంలో ఏసీబీ సాధించిన ప్రగతి గురించి బుధవారం విజయవాడలో మీడియాతో పంచుకొన్నారు...

ap state 23112017 2

ఏసీబీ డీజీ ఠాకూర్‌ మాట్లాడుతూ, అభివృద్ధిలో ఏపీని నంబర్‌ వన్‌గా నిలపాలన్న చంద్రబాబు ఆశయానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాం. ప్రజల సహకారంతో ముందుకు వెళుతున్నాం. ఏపీలో ఏసీబీ దూకుడు చూసి ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి వ్యతిరేకులు తమకు సమాచారం ఇచ్చి సహకరించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 1100 ద్వారా విలువైన సమాచారం ఇచ్చిందని, సోషల్‌ మీడియాలోను యువత బాగా స్పందించిందని ఠాకూర్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా రాష్ట్రంలో పెద్ద పెద్ద అవినీతిపరులను అరెస్టు చేయగలిగాం. లంచం అడిగే వారికి గాలం వేసి పట్టుకున్నాం అని వివరించారు.

ap state 23112017 3

ఏడాది కాలంలో, లంచం తీసుకొంటూ 146మంది దొరికారు అని, ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 47 మందిని పట్టుకున్నామని, ఇతరత్రా కేసులు, ఆకస్మిక తనిఖీలు, విచారణలను కలుపుకొని 303 కేసులు నమోదు చేశామన్నారు. అవినీతి కేసుల్లో 39మందికి జైలు శిక్ష పడిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అవినీతికి పాల్పడిన 17మంది ఉద్యోగం నుంచి డిస్మిస్‌ అయ్యారని, పదవీ విరమణ చేసిన తొమ్మిది మందికి పెన్షన్లు, ఇతరత్రా చెల్లింపులు ఆగిపోయాయని చెప్పారు... అవినీతి అధికారులని రెడ్‌... ఆరెంజ్‌... గ్రీన్‌... క్యాటగిరీగా పెట్టామని, ప్రజల్ని పీడించే అత్యంత అవినీతి పరులను రెడ్‌జోన్‌ గా, ప్రతి పనికీ లంచం అడిగే వారిని ఆరెంజ్‌ జోన్‌లో, ఆరెంజ్‌ జోన్‌ లో ఉన్నవారు మంచిగా మారితే గ్రీన్‌ జోన్‌లోకి పెడుతున్నామని చెప్పారు... రెడ్‌ క్యాటగిరీ నుంచి ఏ మాత్రం కదలని వారి ఇంటి తలుపు తడుతున్నామన్నారు.

గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి త్వరలోనే అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభం కావటానికి, అవసరమైన ఇమ్మిగ్రేషన్‌ కార్యకలాపాలకు ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ లభించింది... అత్యాధునికంగా రూపుదిద్దుకుంటున్న అంతర్జాతీయ టెర్మినల్‌లో ఇమ్మిగ్రేషన్‌ సేవలు ప్రారంభించడానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది. మరో రెండు రోజుల్లో ఈ సేవలు అందించటానికి వీలుగా కేంద్రం నోటిఫికేషన్‌ వెలువరించటానికి రంగం సిద్ధమైంది...

gannavaram 23112017 2

పోయిన వారం, ఇమ్మిగ్రేషన్‌ డైరెక్టర్‌ ప్రవీణ్‌ బోరాసింగ్‌తో కూడిన బృందం విజయవాడ ఎయిర్‌పోర్టుకు వచ్చింది. చెన్నై నుంచి ఎయిర్‌పోర్టు అథారిటీ జనరల్‌ మేనేజర్‌, జాయింట్‌ పోలీసు కమిషనర్‌ రమణకుమార్‌, డీసీపీ గజరావు భూపాల్‌ ఈ బృందంలో ఉన్నారు. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనావుతో వీరు భేటీ అయ్యారు. ఆ తర్వాత అంతర్జాతీయ టెర్మినల్‌ భవనాన్ని పరిశీలించారు. ఇమ్మిగ్రేషన్‌ కౌంటర్స్‌, కార్యాలయాలను పరిశీలించారు. ఎంతో చక్కగా తీర్చిదిద్దిన కార్యాలయాల పట్ల బృందం పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది.

gannavaram 23112017 3

ఇమ్మిగ్రేషన్స్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, వర్కింగ్‌ స్టాఫ్‌ కావాలని, ఈ బృందం డీజీపీ సాంబశివరావుని కోరింది.. సానుకూలంగా స్పందించిన డీజీపీ మొత్తం 55 మందితో కూడిన డెడికేటెడ్‌ ఇమ్మిగ్రేషన్‌ స్టాఫ్‌ను అందిస్తామని చెప్పారు... ఈ నేపధ్యంలో, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్యాలయానికి కేంద్రహోంశాఖ కార్యదర్శి, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ఇమ్మిగ్రేషన్‌ కార్యాలయానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో విజయవాడ విమానాశ్రయంలో ఇమిగ్రేషన్‌ కేంద్రం ఏర్పాటుపై అధికారిక ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం.

పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి గుర్తున్నారా... సంవత్సరం క్రితం, ముఖ్యమంత్రి చంద్రబాబు తల నరికేస్తా అన్న వీర వనిత... అప్పట్లో ఈవిడ గిరిజన ఎమ్మల్యే కాబట్టి, ఆవిడ మీద చర్యలు తొందరగా తీసుకోలేరు అనే ఉద్దేశంతో, జగన అలా ఎగదోసారు... ఈ స్టేట్మెంట్ ఒక సెన్సేషన్.... ముఖ్యమంత్రి తల నరికేస్తా అని బహిరంగంగా అంటే, చంద్రబాబు నైజం తెలిసిందేగా, నవ్వి ఊరుకున్నరు... కాలమే అన్నిటికి పరిష్కారం అన్నారు... ఇప్పుడు ఆ కాలమే వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సమాధానం చెప్తుంది... అప్పుడు ఎగదోసి ఆ తీవ్ర వ్యాఖ్యలు చేపించన వారు, ఇప్పుడు ఈవిదిని తొందరగా వదిలించుకోవటానికి చూస్తున్నారు...

giddi 23112017 2

ఎమ్మెల్యే ఈశ్వరి విశాఖ ఏజెన్సీలో వైసీపీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తున్నారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు పార్టీని వీడి టీడీపీలో చేరిపోవడంతో, ఈశ్వరి సహకారంతో శెట్టి ఫాల్గుణ నియోజకవర్గ పరిధిలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ టికెట్‌ రాక టీడీపీలో చేరిన కుంభా రవిబాబు తిరిగి వైసీపీ వైపు చూస్తున్నారు. ఈనెల 19న కొంతమంది అనుచరులతో పాడేరులో సమావేశం ఏర్పాటుచేసి నగరానికి చెందిన కొందరు వైసీపీ నేతలను ఆహ్వానించారు. ఆ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త సత్తి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో అరకులోయ టికెట్‌ రవిబాబుకేనని ప్రకటించారు...

giddi 23112017 3

దీంతో ఈశ్వరి విజయసాయిరెడ్డి మీద ఫైర్ అయ్యారు... పార్టీలో కొంతమంది నేతలు తమకు బాగా ఇబ్బంది కలిగిస్తున్నారంటూ వాపోయారు... ఏంటి సార్‌ మమ్మల్ని పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెడుతున్నారా..? పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జికి సమాచారం ఇవ్వకుండా అరకులో పార్టీ సమావేశం ఎలా పెట్టారు? జగనే సర్వస్వం అని నమ్ముకుని పనిచేస్తున్న మాకు మాటమాత్రంగానైనా చెప్పకుండా అరకులోయ అసెంబ్లీ టికెట్‌ రవిబాబుకేనని ఎలా ప్రకటించేస్తారు’ అని విజయసాయిరెడ్డిని నిలదీశారు. మొత్తానికి ఇప్పుడు గిడ్డి ఈశ్వరి పరిస్థితి పూర్తి కన్ఫ్యూజన్ లో ఉంది...

Advertisements

Latest Articles

Most Read