రేపు మన నవ్యాంధ్రకు, ఒక విశిష్ట అతిధి వస్తున్నారు... ప్రపంచంలోనే ఒక విప్లవం తీసుకువచ్చిన మైక్రోసాఫ్ అధినేత బిల్ గేట్స్ నవ్యాంధ్ర ఆర్ధిక రాజధాని విశాఖపట్నం వస్తున్నారు... ఈ సారి బిల్ గేట్స్ వస్తుంది సాఫ్ట్ వేర్ విప్లవానికి కాదు, వ్యవసాయం గతి మార్చటానికి వస్తున్నారు... రైతులను సాంకేతికంగా ముందంజలో నిలిపి, వారి జీవితాల్లో మార్పు తేవాలన్న లక్ష్యంతో విశాఖ సాగర తీరంలోని ఏపీఐసీసీ మైదానంలో మూడు రోజులపాటు 'ఏపీ అగ్రిటెక్‌ సమ్మిట్‌- 2017' ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది..

bill gates 16112017 1

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా నిన్న ఈ సమ్మిట్ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం - బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ), డాల్బెర్గ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ అగ్రి హ్యాకథాన్‌లో మైక్రోసాఫ్ అధినేత బిల్ గేట్స్ నవంబర్ 17న పాల్గుంటారు... వ్యవసాయం రంగంలో యాంత్రీకరణతో పాటు సాంకేతికతను జోడించాలన్న లక్ష్యంతో చంద్రబాబు పిలుపు మేరకు సహకరించటానికి బిల్ గేట్స్ ముందుకి వచ్చారు. సదస్సులో ప్రతిరోజూ 1500 మంది ప్రతినిధులు పాల్గొంటారు.

bill gates 16112017 3

రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి కూడా ప్రాధాన్యత పెరిగిందని, ఆ క్రమంలోనే ఈ రంగానికి సపోర్ట్ గా నిలవాలని కోరారు. సీఎం చంద్రబాబునాయుడుకు, బిల్ గేట్స్ కు మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల రాష్ట్రానికి వరాలజల్లు అనివార్యమే అనే ప్రచారం జరుగుతోంది. నవ్యాంధ్ర రాష్ట్ర నిర్మాణంలో బిల్ గేట్స్ పర్యటన మైలురాయిగా నిలిచిపోతుందనే అభిప్రాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో పరిణితి ప్రదర్శిస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ తో గత రెండు సంవత్సరాలుగా టచ్లో ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నారు. మన రైతుల బాగు కోసం రేపు మన రాష్ట్రానికి వస్తున్న బిల్ గేట్స్ కి సాదర స్వాగతం పలుకుతూ... వెల్కం మిస్టర్ బిల్ గేట్స్...

ఇంకో వన్ ఇయర్, నేనే కింగ్... నేనే ముఖ్యమంత్రి అంటూ, వీధి వీధి తిరుగుతూ వైసిపి అధినేత జగన్ మోహన్ రెడ్డి అంటున్న సంగతి తెలిసిందే... అయితే, జగన్ ముఖ్యమంత్రి అయిపోతాడు అనే కాన్ఫిడెన్సు లో ఉన్న కొంత మంది వైసిపి నేతలు, అప్పుడే మినిస్టరీల గురించి పంపకాలు మొదలు పెట్టేసారు... ముందుగా మనసులో మాట బయట పెట్టారు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా... ఎప్పుడూ విచక్షణ కోల్పాయి పిచ్చి మాటలు మాట్లాడే రోజాకు ఇప్పుడు మంత్రి పదవి పై, తన అధినేతతో కలిసి కలలు కంటుంది...

jagan roja 16112017 2

వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగేనే తనకు ఏ మంత్రి పదవి ఇచ్చినా చేస్తాను అని, హోంమంత్రి కట్టబడితే బాగుండు అంటుంది రోజా.. ఒకవేళ జగన్ తనకు హోంమంత్రిగా అవకాశం ఇస్తేమాత్రం మహిళలకు న్యాయం చేస్తానని గురువారం రోజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ మేరకు చెప్పుకొచ్చారు. మహిళలు కోసం తాను 2004 నుంచి తెగ పోరాడుతున్నాని చెప్పారు... తాను మహిళల కోసం చేసినన్ని ఉద్యమాలు ఇంత వరకు ఎవ్వరూ చెయ్యలేది అని చెప్పారు...

jagan roja 16112017 3

అయితే జగన్ ముఖ్యమంత్రి అవ్వగానే, హోం మంత్రి పదవి కోసం చాలా మంది ఇప్పటి నుంచే పోటీ పడుతున్నారు... కొడాలి నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంబటి రాంబాబు, లక్ష్మి పార్వతి నుంచి, రోజాకి తీవ్ర పోటీ ఉన్నట్టు, లోటస్ పాండ్ వర్గాలు చెప్తున్నాయి... అయితే జగన్ మాత్రం, చెవిరెడ్డికి అడవులు సంరక్షణ, అంబటికి స్త్రీ శిశు సంక్షేమం, బొత్సాకి ఎక్ష్సైజ్ శాఖ ఇవ్వనున్నట్టు చెప్తున్నారు.... హోం మంత్రి పదవి పై సస్పెన్స్ నెలకొంది... అయితే ఇవన్నీ జరగాలి అంటే, ఇంకా చాలా జరగాలి... ముందు డ్రీం మెషీన్ దిగమని వైసిపి కార్యకర్తలు అంటున్నారు...

ఆయన ఒక సామాన్య రైతు... కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా, మట్టినే నమ్ముకున్న రైతన్న... బిల్ గేట్స్ కూడా వస్తున్న అంతర్జాతీయ కాన్ఫరెన్స్ కు, వైజాగ్ వెళ్లారు... ఆ కాన్ఫరెన్స్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ కు, ముఖ్యమంత్రితో పాటు, అక్కడ ఉన్న ఫారన్ డెలిగేట్స్ కూడా ఆశ్చర్యపోయారు.... ఆయనే గుంటూరు జిల్లా రైతు మేకా రాధాకృష్ణ మూర్తి.. ఆయన ప్రసంగం ముఖ్యమంత్రి చంద్రబాబును విపరీతంగా ఆకర్షించింది. గురువారం రైతులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో రాధాకృష్ణమూర్తి మాట్లాడారు. సాగులో తన అనుభవాన్ని వివరించారు. 

cbn agri 16112017 2

రాధాకృష్ణమూర్తి ప్రసంగం ముఖ్యమంత్రిని ఆకట్టుకుంది. వెంటనే ఆయనను వేదికపైకి పిలిపించి సన్మానించారు. ఆయనకున్న తెలివి మంత్రికి, అధికారులకు లేదంటూ చమత్కరించారు. రైతు రాధాకృష్ణ వ్యాఖ్యలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మంత్రి, సెక్రటరీ, డైరెక్టర్, వైస్ ఛాన్పలర్ కంటే రాధాకృష్ణకు ఎక్కువ తెలివితేటలు ఉన్నాయని కొనియాడారు. నాలెడ్జ్ అంటే యూనివర్శిటీలో కాదని, క్షేత్రస్థాయిలో అమలు చేసి ఫలితాలు రాబట్టటమే నిజమైన నాలెడ్జ్ అని అన్నారు. రైతు రాధాకృష్ణమూర్తి చెప్పినట్లు అందరూ అలవాటు చేసుకుంటే మనకు సమస్యలు ఉండవని సీఎం అన్నారు.

cbn agri 16112017 3

విశాఖ అగ్రిటెక్ సదస్సులో భాగంగా రెండో రోజైన గురువారం రైతు మేకా రాధాకృష్ణ మూర్తి సభలో మాట్లాడుతూ పశువులు వేసిన 50 నుంచి 100 కిలోల పేడను పొలంలో స్ప్రేడ్ చేశామని, అదే వ్యవసాయమని, తర్వాత నారు పోయడంగానీ, తీయడంగానీ, దమ్ము చేయడంగానీ, గట్లు బాగుచేయడం గానీ, దుక్కు దున్నడంగానీ, పాయలు తీయడం.. ఏ పని లేకుండా డైరెక్టుగా సోయింగ్ చేశామని ఆయన చెప్పారు. ప్రభుత్వం లెక్క ప్రకారం ఒక ఎకరా మాగానికి 60 మంది కూలీలు కావాలని, అందులో 30 మందిని తగ్గించామని, దాంతో సగం డబ్బులు మిగిలాయని, ఆవు పేడ వేసిన తర్వాత ఏమీ చేయమని, వ్యవసాయంలో ముఖ్యంగా ఖర్చుండేది కలుపని, కలుపుని కలుపుతోనే నిర్మూలించవచ్చునని రాధాకృష్ణ మూర్తి చెప్పారు.

అవినీతి పై పోరాడతా, నేను వస్తే లా అండ్ ఆర్డర్ కరెక్ట్ గా ఉంటుంది అంటూ, నిన్న కడపలో పాదయాత్ర చేసిన జగన్, అలా కర్నూల్ లో అడుగుపెట్టాడో లేదో, ఇవాళ అదే కడపలో, వైసీపీ నేత రెచ్చిపోయాడు... కడప జిల్లాలోని వీఎన్‌‌ పల్లె మండలం వీరపల్లె దగ్గర టీడీపీ నేత భాస్కర్‌రెడ్డిపై, వైసీపీ నేత శ్రీనివాసుల రెడ్డి కాల్పులు జరిపారు. పొలం దగ్గర ఒకరికొకరు ఎదురుపడటంతో వైసీపీ నేత కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే రెండు రౌండ్లు కాల్పులు జరిగేసరికి, అప్రమత్తమైన భాస్కర్‌‌రెడ్డి పక్కన ఉన్న తోటలోకి పరుగులు తీశారు. 

ycp 16112017 2

దీంతో భాస్కర్‌‌రెడ్డికి ప్రాణాపాయం తప్పింది. తీవ్ర గాయాలపాలైన భాస్కర్‌‌రెడ్డి ఆయన్ను అత్యవసర చికిత్స కోసం కడప జిల్లా ప్రొద్దటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే సకాలంలో భాస్కర్‌‌రెడ్డిని ఆస్పత్రికి తరలించడంతో ప్రమాదం తప్పిందని వైద్యులు చెబుతున్నారు. ఎప్పటి నుంచో టీడీపీ నేతపై శ్రీనివాసులరెడ్డి స్కెచ్ వేసినట్టు తెలుస్తుంది... ఇద్దరూ మండల స్థాయి నేతలు కావటంతో, రాజకీయంగా కూడా ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉన్నాయి...

ycp 16112017 3

 ఇది వరకు, చిన్నపాటి ఘర్షణ జరగడంతో వైసీపీ నేత ఎప్పటి నుంచో చంపటానికి చూస్తున్నారు... గురువారం నాడు పొలం దగ్గర టిడిపి నేత ఎదురుపడటంతో, వైసీపీ నేత తన దగ్గర ఉన్న తుపాకి తీసుకుంది కాల్పులు జరిపారు. కాగా ఇటీవల కడప జిల్లాలో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఫ్యాక్షన్‌‌కు ఇప్పుడిప్పుడే దూరమవుతున్న కడపలో ఇలా వరుస కాల్పులు జిల్లా వాసులను కలవరపెడుతున్నాయి.

Advertisements

Latest Articles

Most Read