అనంతపురం జిల్లలో ప్రజా ప్రతినిధుల తీరు పై ప్రజలు ఏకంగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్నారు. మాకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండటం లేదంటూ ప్రజలు రిలీజ్ చేస్తున్న పోస్టర్లు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సింగమనల MLA జొన్నలగడ్డ పద్మావతి స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ ఆ నియోజక వర్గ పరిధిలో ఉన్నటువంటి గుంజేపల్లి గ్రామస్తులు ఒక పోస్టర్ను రిలీజ్ చేసారు. ఎన్నికల్లో ఓటు అడగటానికి వచ్చారు. ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు ,గ్రామాల్లోకి వచ్చి పర్యటన చేయడం లేదు అంటూ ,ప్రజల సమస్యలు పరిష్కరిచ్తం లేదంటూ ,MLA ఆచూకి తెలపాలంటూ పోస్టర్ ను విడుదల చేయడం తీవ్ర చర్చనీయాంసంగా మారింది. ఏకంగా నియోజకవర్గ MLA అందుబాటులో లేదంటూ ఆ గ్రామ ప్రజలు పోస్టర్ రిలీజ్ చేయడం అనేది ,ఏ స్థాయిలో ప్రజా ప్రతినిధులు పట్ల ఆగ్రహంగా ఉన్నారో , వాళ్ళ పట్ల ప్రజలు ఎంత అసంతృప్తితో ఉన్నారని చెప్పడానికి ఈ ఘటన ఒక నిదర్సనంగా ఉందని చెప్పుకోవచ్చు.
news
ఉద్యోగుల సమ్మె గురించి అడగగా, ఇది చీఫ్ సెక్రెటరీ రియాక్షన్.. అవాక్కయిన ఉద్యోగులు...
ఇప్పటికే AP ప్రభుత్వం పై ఉద్యోగులు అందరూ కూడా సమ్మె బాట పడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కలక్టరేట్ల ముట్టడికి ఈ రోజు పిలుపు నిచ్చిన నేపధ్యం లో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాల నేతలను ముందస్తుగా అరెస్ట్లు చేసారు. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు కలక్టరేట్ల ముట్టడికి ఈ రోజు అన్ని ఉద్యోఘ సంఘాలూ కూడా తమ మద్దతు తెలిపిన పరిస్థితి అయితే ఉంది. దీనితో ఎక్కడికక్కడ ఉపాధ్యాయులు అందరిని కూడా ఎవరైతే కలక్టరేట్ల ముట్టడికి వస్తున్నారో వారందరిని కూడా ముందుగా అరెస్ట్ చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఉపాధ్యాయులను అరెస్ట్ చేయడ తో వారు ఈ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తున్నారు. అన్ని జిల్లాల కలక్టరేట్ల వద్దకు ఈ ఉదయన్నే చేరుకుని, ఉద్యోగస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఉద్యమాన్ని అణిచి వేసినా గాని ఎట్టి పరిస్థితుల్లో తమ ఉద్యమం ఆగదని కూడా వారు తేల్చి చెబుతున్నారు. వారిని అరెస్ట్ చేసేందుకు నిన్నటి నుంచి కూడా పోలీసులు ఉద్యమ నాయకులని అరెస్ట్ చేసేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. మరో వైపు ఏపి జేఎసి ,ఏపి జేఎసి అమరావతి సంఘాలు నేతలు రెవిన్యూ కావచ్చు, ఎపి NGO సంఘాలు కావచ్చు, ఇతర 9 సంఘాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ సమావేశం తరువాత సాయత్రం 7 గంటలకు ఒక మీడియా సమావేశం కూడా పెట్టి తమ యొక్క భవిషత్ కార్యాచరణ పై కూడా ఎనౌన్స్ చేస్తారని సమాచారం. మొత్తం మీద ఒక వైపు ఉపాధ్యాయ సంఘాలు, మరోవైపు ఇతర ఉద్యోగ సంఘాలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల కార్యక్రమాలను ప్రారంభించారు.
దీనికి సంభందించి జేఎసి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విరమించుకుని సాయత్రం తమ భవిషత్ కార్యాచరణ అన్నినిటిని కూడా ప్రకటిస్తామంటున్నారు . మరోవైపు సచివాలయ ఉద్యోగ సంఘాలు కూడా ఇప్పటికే నిరసనలు తెలియజేస్తున్నారు. కొంతమంది నల్ల బాడ్జీలతో ఈ రోజు మధ్యాన్న భోజన నిరసన కార్యక్రమం కూడా తెలిపారు. మరోవైపు ఏపి NGOలు, ఏపి జేఎసి ,ఏపి జేఎసి అమరావతి నేతలు కూడా నల్ల బాడ్జీలు దరించి నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే సాయత్రం జరిగే మీడియా సమావేశం తరువాతే ఒక క్లారిటీ రానుందని చెప్పొచ్చు. త్వరలోనే అన్ని సంఘల నేతలు కూడా సియస్ కు ఉద్యమానికి సంభందిచిన నోటీసులు ఇవ్వడంతో పాటు, అన్ని సంఘాలు ఒకే తాటి పైకి వచ్చి ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నారని తెలుస్తుంది . అయితే ఇప్పటికే AP గవర్నమెంట్ అసోసియేషన్ సంభందించి సూర్యనారాయణ "సాధన సమితి" అనే ఒక ప్లాట్ ఫాం ఏర్పాటు చేస్తారని కూడా అయన చెప్పినట్లు తెలుస్తుంది. మరోవైపు ఔట్ సోర్సింగ్ ఉదోగులు కూడా సమ్మె బాట పడతామని చెప్పడంతో, ప్రభుత్వానికి అన్ని వైపులా నించి కూడా ఉక్కబోత మొదలైంది. ఈ సమ్మె విషయాన్ని మీడియా వాళ్ళు నిన్న జరిగిన మీటింగులో సియస్ ను అడగ్గా తనకు ఆ సమ్మె విషయం అసలు తెలియదని ,మీడియా వాళ్ళు చెబితేనే తెలిసిందని చెప్పుకొచ్చారు. దీన్ని బట్టి ప్రభుత్వానికి ఉద్యోగులతో చర్చలు జరిపే ఉద్దేశమే లేదని స్పష్టం అవుతుంది. ఇటు ఉద్యోఘ సంఘాల నేతలు కూడా ప్రభుత్వం తో చర్చలకు విముఖంగానే ఉన్నట్లు తెలుస్తుంది.
హైకోర్టుకు చేరిన ఉద్యోగుల పంచాయతీ.. సూపర్ పాయింట్ తో, పిటీషన్ వేసిన ఉద్యోగులు...
ఉద్యోగుల పీఆర్సీ జీవో పై ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో పిటీషన్ దాఖలు అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పీఆర్సీ ఫిట్మెంట్ తగ్గించటం, అదే విధంగా hraలో కోత విధించటం పై, పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఉపాధ్యాయ సంఘాలు కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలక్టరేట్లను ముట్టడించటంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరసనలతో అట్టుడుకి పోయింది. ఈ నేపధ్యంలోనే పీఆర్సీ కు సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో పై, తమకు న్యాయం చేయాలి అంటూ, హైకోర్టులో ఏపి గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య పిటీషన్ దాఖలు చేసారు. సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించటం పై, ఈ పిటీషన్ లో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు. విభజన చట్టం ప్రకారం, ఎలాంటి బెనిఫిట్స్ కూడా తగ్గించకూడదని పిటీషన్ లో పేర్కొన్నారని, ఏపి విభజన చట్టంలోని సెక్షన్ 78 కు విరుద్ధంగా ఉన్న ఈ జీవో నెంబర్ వన్ ని రద్దు చేయాలని చెప్పి కూడా , ఆయన పిటీషన్ లో కోరారు. ఈ మేరకు ఆదేశాలు ఇవ్వాలని, ఆయన రాష్ట్ర హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసారు. ముఖ్యంగా జీవో నెంబర్ వన్ లో, పీఆర్సీకి సంబంధించి, రాష్ట్ర ప్రభుత్వం మొన్న జీవో విడుదల చేసింది. మొన్న అర్ధరాత్రి విడుదల చేసిన ఈ జీవో, విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయని, ఆ పిటీషన్ లో తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవోని వెంటనే రద్దు చేసి, ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి, ఆ పిటీషన్ లో ఆయన హైకోర్టు ధర్మాసనానికి విజ్ఞప్తి చేసారు. పిటీషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం, పిటీషన్ ను రేపు విచారణ చేస్తామని, పితీషన్ ను రేపటికి వాయిదా వేసింది. రేపు ఈ విషయం పై వాదనలు జరగనున్నాయి. మరో పక్క సచివాలయంలో రెండు ఉద్యోగ సంఘాల నేతల భేటీ అయ్యాయి. సచివాలయంలో వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ సమావేశం అయ్యారు. పీఆర్సీ కోసం ఉమ్మడి ఉద్యమంపై ఇప్పటికే ఐకాసలతో సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. షజాలకు తావులేదని, అందరం, అన్ని సంఘాలు కలిసి పోరాడేది ఉద్యోగుల కోసమే అని అంటున్నారు. ఎన్జీవోలు,రెవెన్యూ సంఘాలు ఇదే అభిప్రాయంతో ఉన్నాయని, రేపటిలోగా ఐక్య వేదికకు ఒక రూపం వచ్చే అవకాశం ఉందని, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ స్పష్టం చేసారు. ఈ ఉద్యమం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
సెల్ఫీ ఫోటోలు వైరల్.. గుడివాడ క్యాసినో వేనుకున్నది వాళ్ళేనా ? అడ్డంగా దొరికిన వైసీపీ నేతలు..
గుడివాడలో నిర్వహించిన కాసినో వివరాలు ఒకొక్కటిగా బయటకు వస్తున్నాయి. దాని వెనకాల ఎవరున్నారు ,ఏంటి ,నిర్వాహుకులు ఎవరున్నారు అని పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అయితే దీనికి ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్ గోవా కేద్రంగా అక్కడ BIG daddy అనే కాసినో నిర్వహిస్తూ ఉంటాడని, ఇప్పుడు ఈయనే గుడివాడలో మొత్తం కుడా నిర్వహించినట్లు నిన్న తెలుగుదేశం పార్టీ ఆధారాలు బయట పెట్టింది. అయితే పోలీసులు మాత్రం దేనిని స్పష్టం చేయడం లేదు. దీని వెనుక చీకోటి ప్రవీణ్ ఉన్నడా, ఇంకా ఎవరు ఉన్నారు, అసలు ఈ చీకోటి ప్రవీణ్ ఎవరి అండదండలతో వచ్చాడు అనే అంశం పై కూడా పోలీసులు మొత్తం దర్యాప్తు చేస్తున్నారు. మరో వైపు చీకోటి ప్రవీణ్, MLA వల్లభనేని వంశీ, కలిసున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్నాయి. వీటన్నిటికి ప్రధాన కారకుడు ప్రవీణ్ ఎవరి ప్రోద్బలంతో ఇక్కడకు వచ్చి, ఇవన్నీ ఏర్పాటు చేసారు అని కూడా పోలీసులు దర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ప్రవీణ్ పూర్వ చరిత్ర కనిక చూస్తే గతం లో 2017 దీపావళి సమయంలో హైదరాబాద్ హోటల్ మారియట్ లో ఇటువంటి కాసినోనే నిర్వహించి పోలీసులకు చిక్కాడు. ఈ కోణంలో చూస్తే ఆయనే ఖచ్చితంగా ఇక్కడ కూడా పెట్టుంటాడు అని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే ఈ చీకోటి ప్రవీణే ఆంద్రాలోనే కాకుండా అన్ని చోట్లా కూడా ఎక్కువగా కాసినోలు పెడతాడని పోలీసులు ప్రాధమిక నిర్ధారణకు వచ్చారని తెలుస్తుంది.
ఆయన్ని ప్రశ్నిస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాసం ఉందని చెబుతున్నారు. అసలు చీకోటి ప్రవీణ్ ను తీసుకొచ్చింది ఎవరు, ప్రవీణ్ వెనకాల ఏ పొలిటికల్ లీడర్స్ హస్తం ఉంది అనే కోణంలో కూడ మొత్తం దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఈ చీకోటి ప్రవీణ్ కు , కొడాలి నాని, వల్లభనేని వంశీ కి అయితే చాలా పరిచయాలు ఉన్నాయని మాత్రం చాలా మంది చెబుతున్నారు. వీరి మద్య చాలా రోజుల నుంచి స్నేహం ఉందని కూడా సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే దీనికి సంభందించి న వాస్తవాలు అయితే మాత్రం పోలీసులు వెలుగులోకి తీయ్యాల్సిన అవసరం ఎంతైనా ఉందని వాపోతున్నారు. పోలీసులు మాత్రం ఈ రోజు నుంచి విచారణ అయితే ప్రారంభిస్తాం అని మాత్రం చెపుతున్నారు. నూజివీడు DSP బి. శ్రీనివాసరావు నేతృత్వం లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. అయితే అసలు నిజాలను వెలుగు తీసి దీనికి కారకులైన వారిని పోలీసులు తెరముందుకు తీసుకువస్తారా, అనేది వేచి చూడాల్సిందే. దీనికి సంబంధించిన వాస్తవాలన్ని బయట పెట్టాల్సింది మాత్రం పోలీసులే.
ఆ విచారణలో దీని వెనకాల ఎవరి హస్తం ఉంది, ప్రదానంగా మంత్రి కొడాలి నాని హస్తం ఉందా, లేక పోతే వల్లభనేని వంశీ సహకారంతోనే,కొడాలి నాని మొత్తం కూడా దీనిని ఏర్పాటు చేశాడా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే చీకోటి ప్రవీణ్ అనే వ్యక్తి ఇక్కడ వారి ఎవ్వరికీ తెలియదు, కేవలం ఆయన ఉన్నత వర్గాలతో లేదా పొలిటికల్ లీడర్స్ తో మాత్రమే సంబంధాలు పెట్టుకుంటారు. అయితే 2017 దీపావళి సమయంలో హైదరాబాద్ హోటల్ మారియట్ లో నిర్వహించినప్పుడు ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనే అంశం పై డేటా సేకరిస్తే కూడ ఈ విషయం పై మరింత క్లారిటీ వచ్చే అవకాసం ఉందని చెపుతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరితో ఈయనకు సంబంధాలు ఉన్నయా అని చూస్తే మాత్రం వంశీతో చాలా దగ్గర సంబందాలు ఉన్నాయని చెపుతున్నారు. వీళ్ళ ఫోటోలు చూస్తే మాత్రం కొంత మంది వైసిపి నేతల హస్తం తోనే ఇందంతా జరిగినట్లు తెలుస్తుంది. అందులోని కాసినో నిర్వహించిన k కన్వెన్షన్ హాల్ మంత్రి కొడాలి నాని కి సంబంధించింది. ఇంతపెద్ద ఎత్తులో నిర్వహించారంటే వాళ్ళ హస్తం లేకుండానే జరిగిందా అని కూడా విమర్శిస్తున్నారు.