ప్రత్యేక హోదా ఉంటేనే పెట్టుబడులు వస్తాయని ఒకడు... నీ మొఖం చూసి ఎవడూ పెట్టుబడులు పెట్టాడు అని ఒకడు... అప్పుడు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారంటే దాంట్లో చంద్రబాబు గొప్ప ఏముంది అని ఇంకొకడు... ఇలా ముఖ్యమంత్రి చంద్రబాబు స్థాయిని దిగజార్చి మాట్లాడిన మాటలు చూశాం... నిజానికి చంద్రబాబు అంటే గ్లోబల్ మార్కెట్ లో, కార్పొరేట్ ప్రపంచంలో ఎంత మంచి పేరు ఉందో అందరికీ తెలిసిందే... అసలు చంద్రబాబుని 2014లో ప్రజలు గెలిపించిందే ఇందుకు... చంద్రబాబు కూడా, ప్రజలు ఆకాంక్ష తగ్గట్టే పని చేస్తూ, ఆంధ్రప్రదేశ్ ని టాప్ లో నిలుపుతున్నారు...
చంద్రబాబు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి అని మరో సారి రుజువైంది... Union Ministry of Commerce & Industry వారి లెక్కల ప్రకారం, 2016లో...భారత దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన ప్రాంతాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది... అధికారిక లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో 11,395 కోట్ల ప్రాజెక్ట్ లు గ్రౌండ్ అయ్యాయి... అంతే కాదు, మరెన్నో సంస్థలు ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నాయి... ఇక ఈ పెట్టుబడుల లెక్కల్లోకి కాస్త లోతుగా వెళితే...Uninon Ministry నుంచి వెలువడిన సమాచారం ప్రకారం...భారతదేశంలో పెట్టుబడులకు అనువైన ప్రాంతాల్లో మన రాష్ట్రం మహారాష్ట్రతో పోటీ పడుతూ దూసుకెళ్తుంది... మన పొరుగు రాష్ట్రం అయితే తెలంగాణా సైతం ఈ లిస్ట్ లో 10వ స్థానంలో నిలిచింది... మహారాష్ట్రకు 2016లో 40588 కోట్ల పెట్టుబడులు వస్తే, మన రాష్ట్రము 11395 కోట్లతో రెండవ స్థానంలో, కర్నాటక 9162 కోట్లతో మూడవ స్థానంలో, గుజరాత 8267 కోట్లతో నాలుగవ స్థానంలో ఉన్నాయి... Source: dipp.gov.in/sites/default/files/Chapter1.4.pdf
ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ వరకు వచ్చిన లెక్కల్లో, పెట్టుబడుల అనువైన ప్రాంతాల్లో మన రాష్ట్రం 4వ స్థానంలో ఉంది. ఇప్పటివరకూ 24,013 కోట్ల పెట్టుబడులు వచ్చాయి..... తెలంగాణా రాష్ట్రము 6వ స్థానంలో నిలిచింది... చంద్రబాబు స్పీడ్ చూసి, మిగతా రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయి... రాజధాని లేదు, ఇన్ఫ్రా లేదు, అయినా ఆంధ్రప్రదేశ్ కు అన్ని పెట్టుబడులు వస్తున్నాయంటే, అది చంద్రబాబు వల్లే అంటున్నాయి... మొత్తంగా చూసుకుంటే అన్యాయం చేసి, అనాధలుగా నిలిపి రాజకీయ రణ సంగ్రామంలో భాదితులుగా నిలిపినా ఎక్కడా భయపడకుండా...వెను తిరగకుండా...వెన్ను చూపకుండా నేనున్నాను అంటూ భరోసా ఇచ్చి, ఉనికి కోల్పోయిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్దిలో ఉరకలు పెట్టిస్తున్న ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది... రాజకీయ రాక్షసత్వాన్ని శాసిస్తూ రాజ్య పాలన చేస్తూనే...ఆదుకుంటాం అన్న వాళ్ళ మాటలు అబద్దాలుగా మారినా...అండగా నిలబడాల్సిన ప్రతిపక్షం ప్రతీ క్షణం విషం చిమ్మినా....ఖంగు తినకుండా...కంగారు పడకుండా అడుగులో అడుగు వేసుకుంటూ...అభివృద్ధి అనే ఆశల హరివిల్లుని నిర్మించే యజ్ఞంలో యోధుడై ముందుకు సాగుతున్నాడు... అందుకే సర్వం కోల్పోయినా...సమర్ధ నాయకత్వం మాకు అండగా ఉంది అన్న నమ్మకమే మా ఆయుధంగా మా రాష్ట్రం అభివృద్ది చెందుతుంది... సమర్ధ నాయకత్వమా...నీకు లాల్ సలామ్!! Source: BangaloreTDPForum