వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండిటికి చెడ్డ రేవడి అయ్యింది... తన పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడాన్ని అటు హిందువులు, ఇటు క్రైస్తవులు కూడా విమర్శలు చేస్తున్నారు.... శ్రీ వారి సన్నిధిలో జగన్ బ్యాచ్ చేసిన హంగామాతో హిందువుల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిన సంగతి తెలిసిందే... అయితే ఇప్పుడు క్రైస్తవులు కూడా జగన్ ను అసహ్యించుకుంటున్నారు... ఒక పక్క బావ అనిల్ పాస్టర్ అని, విజయమ్మ ఎక్కడికి వెళ్ళినా బైబిల్ పట్టుకుని తిరుగుతూ, క్రైస్తవులకు మంచి పేరు తెస్తుంటే, జగన్ ఓట్లు కోసం హిందువుల గుళ్ళకి వెళ్తున్నారని విమర్శిస్తున్నారు.... తిరుమలలో ప్రసాదం తీసుకోకపోవటం మంచిదే అయినా, విగ్రహారాధన చెయ్యటం, క్రైస్తవ మతానికి వ్యతిరేకం అంటున్నారు...
తాజాగా, తిరుపతికి చెందిన పాస్టర్ డేవిడ్ కరుణాకర్ బహిరంగంగానే జగన్ పై విమర్శలు గుప్పించారు... విగ్రహారాధన చేసిన జగన్‌ని జీసస్ కచ్చితంగా శిక్షిస్తాడని తిరుపతికి చెందిన పాస్టర్ డేవిడ్ కరుణాకరన్ అన్నాడు... గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా ఇలా తిరుమల కొండకు వెళ్లినందుకే జీసస్ ఆగ్రహించారు. దాని పర్యవసానమే పావురాలగుట్ట ప్రమాదం... ఇప్పుడు జగన్ కూడా ఇలాగే చేస్తున్నాడు... క్రైస్తవుడై ఉండి తిరుమలేశుడిని పూజించడం పాపమని జీసస్ క్షమించడని వ్యాఖ్యానించాడు డేవిడ్.. జగన్ సీఎం కావాలని క్రైస్తవ సమాజం కోరుకుంటోంది. అయితే అందుకోసం ఆయన విగ్రహారాధన చేయడం వారికిష్టంలేదు. జీసస్ విగ్రహారాధనను అసహ్యించుకుంటున్నాడు అని చెప్పారు.. పాపం చేసే వారిని ఖండించకపోతే ఆ పాపం నీకూ అంటుతుందని దేవుడు చెబుతున్నాడు అని తన ప్రసంగంలో కరుణాకర్ పేర్కొన్నారు...
అయితే హిందువుల్లో కూడా ఇదే అభిప్రాయం ఉంది... ఇది వరకు చాలా సార్లు ఈ విషయాన్ని ప్రస్తావించినారు కూడా... తాజాగా జగన్ తిరుమల సందర్శనకు వచ్చినప్పుడు కూడా, ఈ విషయలు గుర్తు చేసుకున్నారు... రాజశేఖర్ రెడ్డి, వెంకన్న ఆగ్రహానికి గురయ్యాడు అని హిందువుల గెట్టి నమ్మకం... టిటిడి చైర్మన్ గా ఒక క్రైస్తవుడిని పెట్టటం, తిరుమల పవిత్ర దెబ్బతియ్యటం... 7 కొండలు కాదు, 2 కొండలే అని జిఓ ఇవ్వటం... వెంకన్న నగలు కొట్టేసే ప్రయత్నం చెయ్యటం.. ఇవన్నీ వెంకన్న ఆగ్రహానికి గురి చేసి పనులు అని, అందుకే రాజశేఖర్ రెడ్డికి తగిన శాస్తి జరిగింది అంటారు... ఇప్పుడు జగన విషయంలో కూడా, 2014 ముందు జగన్ శ్రీ వారి దర్శనానికి చెప్పులు వేసుకుని క్యూ లైన్ దాకా వెళ్ళటం, జై జగన్ నినాదాలు, ఇలా అప్పుడు చేసిన హడావిడితోనే జగన్ ఓడిపోయాడు అని అంటారు... మళ్ళీ ఈ సారి కూడా, తిరుమలకు మెట్ల పై నడుచుకుంటూ వస్తా అని మాట తప్పారు, శ్రీ వారి పై నమ్మకం ఉంది నాయి డిక్లరేషన్ పై సంతకం చెయ్యక పోవటం, తన మంది మార్బలంతో హంగామా ఇవన్నీ మళ్ళీ హిందువుల ఆగ్రహానికి గురయ్యాయి... ఇప్పుడు జగన్ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయ్యింది... అటు హిందువులు తిడుతున్నారు... ఇటు క్రైస్తవులు తిడుతున్నారు...