మంత్రి పదవి స్వీకరించిన అనంతరం మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నారా లోకేష్ ప్రసంగించారు. అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి రోజున మాట్లాడిన మంత్రి ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు శాసనసభ్యులు లేవనెత్తిన ప్రశ్నలపై సమాధానమిచ్చారు. ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణంపై ప్రశ్నోత్తరాల్లో భాగంగా లోకేష్ సమాధానమిచ్చారు.

lokesh 10112017 2

ఈ సందర్భంగా లోకేష్ మొదట మాట్లాడుతూ, "వేలాది రైతుల త్యాగాల పై నిర్మితమవుతున్న "మన రాజధాని - మన అమరావతి" గడ్డ మీద నుంచుని మాట్లాడటం గర్వంగా ఉంది" అంటూ ప్రసంగం ప్రారంభించారు... ఏపీలోని ప్రతి గ్రామపంచాయితీలో మౌళిక వసతుల కల్పనే లక్ష్యమన్నారు. 2019లోపు అన్ని గ్రామ పంచాయితీల్లో భవనాలు, ఎల్ఈడీ లైట్లు, సిమెంట్ రోడ్లు, తాగునీటి సమస్యలేకుండా చేయడం, అంగన్వాడీకు భవనాల నిర్మాణాలు పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు... పేదలకు పక్కా గృహాలు ఉండాలన్నది దివంగత నేత నందమూరి తారక రామారావు కల అని మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కాంగ్రెస్ హయాంలో 472 గ్రామ పంచాయితీ భవనాలు ఉంటే కేవలం మూడున్నరేళ్లలో 1628 భవనాలు నిర్మించామని మంత్రి స్పష్టం చేశారు. ఉమ్మడిగా రాజధానిగా హైదరాబాద్ పదేళ్లు ఉన్నప్పటికీ మన గడ్డ నుంచి మనమే పరిపాలించాలని అతి తక్కువ సమయంలో అసెంబ్లీని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు, సీనియర్ సభ్యుల సాహాచర్యంతో సభలో భాగస్వామ్యం కావడం అదృష్టమని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

నాలుగు రోజులు ఆపసోపాలు పడుతూ, నడుముకు బెల్ట్ వేసుకుంటూ, సాగిన పాదయత్రకు బ్రేక్ పడింది... నాలుగు రోజులు నుంచి జగన్ వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది... ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు పాదయత్రకు బ్రేక్ తీసుకుందామా అని ఆలోచిస్తున్న జగన్ ఎగిరి గంతేస్తూ, నాంపల్లి కోర్ట్ కు వెళ్లారు... అక్కడ తన పాత స్నేహితులు, దేవుడు ఇచ్చిన అన్నయ్య గాలి జానర్ధన్ రెడ్డిని కలిసి పాదయత్ర అనుభవాలు పంచుకుంటున్నారు... ప్రస్తుతం జగన్‌ పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అక్రంగా ఆస్తులు వెనకేసుకున్న కేసులో ప్రతి శుక్రవారం కోర్ట్ కి రావాలి... కోర్టు వాయిదా ఉన్నందున పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చి హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టుకు వచ్చారు...

jagan court 10112017 2

అయితే జగన్ షడ్యుల్ చూసిన పార్టీ వర్గాలు మాత్రం, సాఫ్ట్ వారే ఎంప్లాయిస్ కూడా ఇంతలా ఎంజాయ్ చెయ్యరు అంటున్నారు... ఎవరికైనా శనివారం సెలవు ఉంటుంది... జగన కు మాత్రం శుక్రవారం నుంచే లాంగ్ వీకెండ్ మొదలైంది అంటున్నారు... నిజానికి, జగన్ కు చిత్తసుద్ధి ఉంటే, పాదయత్ర నుంచి కోర్ట్ కి వెళ్లి, మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాడు.. కాని, హాయిగా లోటస్ పాండ్ వెళ్ళాడు, అక్కడ మస్సాజ్ లు చేపించుకుని, డాక్టర్ లకు చూపించుకుని, సకల సౌకర్యాలు అనుభవించి, కోర్ట్ కి వెళ్లారు... మధ్యానం కోర్ట్ అయిపోగానే, మళ్ళీ లోటస్ పాండ్ కి వెళ్తాడు.. హాయిగా అక్కడ స్పెండ్ చేసి, రేపు సాయంత్రానికి మళ్ళీ పాదయాత్ర మొదలు పెడతారు...

jagan court 10112017 3

ఇలాంటి పాదయాత్ర ఎక్కడా చూడలేదు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు... జగన్, కోర్ట్ కి వెళ్లి వచ్చేస్తే బాగుండేది అని, లోటస్ పాండ్ వెళ్ళటంతో, అతని చిత్తశుద్ది తెలుస్తుంది అని అంటున్నారు... రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, చివరకు షర్మిల పాదయాత్ర చేసినా, ఇలా ఎప్పుడూ చెయ్యలేదు అని అంటున్నారు... ఇలాంటి వెరైటీ పాదయాత్ర ఇప్పటివరకు మన దేశంలో చూడలేదు అని, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారని గుర్తు చేస్తున్నారు.. ఒక పక్క బెయిల్ మీద బయట తిరుగుతూ, ప్రతి వారం కోర్ట్ కి వెళ్తూ, రోజుకి ఒక అంతర్జాతీయ నిఘా సంస్థలో అక్రమాలు చేసాడని పేరు తెచ్చుకుంటూ, ఈయన అవినీతి మీద పోరాటం చేస్తాను అనటం, అన్నిటికి అంటే హైలైట్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు...

దక్షిణ కొరియాకు చెందిన బుసాన్‌ పారిశ్రామికవేత్తల బృందం, అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు... బుసాన్‌ నుంచి 200 కంపెనీలు తక్షణమే రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాయని, ఈ పెట్టుబడుల విలువ రూ.10,000 కోట్లు ఉంటుందని వివరించారు... ఈ బృందాన్ని, బుసాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌ సారధ్యం వచించారు... దాదాపు 30 మంది దక్షిణకొరియా పారిశ్రామికవేత్తల బృందం, ముఖ్యమంత్రితో పెట్టుబడుల పై చర్చించారు...

cbn korea 10112017 2

ఈ సందర్భంగా, బుసాన్‌ కాన్సుల్‌ జనరల్‌ జియాంగ్‌ డియోక్‌ మిన్‌ చంద్రబాబు పై ఇంటరెస్టింగ్ కామెంట్ చేశారు... పాలనాదక్షత కలిగిన ముఖ్యమంత్రిగా చంద్రబాబును కొరియా దేశీయులంతా గుర్తుపడతారని జియాంగ్‌ వెల్లడించారు. తెల్లని గడ్డం, గంభీరమైన చిరునవ్వు ఆయన ప్రత్యేకతలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి... సంప్రదాయాలకూ, కొరియన్‌ సంప్రదాయానికీ చాలా సారూప్యం ఉందని తెలిపారు. ఆంధ్రలో తల్లిని అమ్మా అని పిలుస్తారని.. తమ దేశంలోనూ అమ్మా అనే పిలుస్తామని.. నాన్నను అప్పా అని అంటామని చెప్పారు..

cbn korea 10112017 3

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కూడా వారికి తగిన భరోసా ఇచ్చారు... రాష్ట్రాన్ని రెండో రాజధానిగా మార్చుకుని ఇక్కడ భారీ సంఖ్యలో పరిశ్రమలను స్థాపించాలని ముఖ్యమంత్రి వారిని ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెడితే ప్రభుత్వం అన్నివిధాలా సహకరిస్తుందన్నారు. బుసాన్‌ తరహాలో అమరావతిలో గానీ, రాష్ట్రంలో అన్ని అనుకూలతలూ కలిగిన మరో ప్రాంతంలో గానీ కొరియన్‌ సిటీని ఏర్పాటు చేస్తామని, అక్కడ పారిశ్రామికాభివృద్ధి పార్కును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. డిజైన్‌, ఇతర అంశాలపై సమగ్ర ప్రతిపాదనలతో వస్తే అవగాహనా ఒప్పందాలు చేసుకుందామన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ.... ఇది ఒక రణరంగం... అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఇలాగే ఉంటాయి కాని, మన అసెంబ్లీలో ప్రతిపక్షం వల్ల, మనకు ఇంకా ఎక్స్ట్రా వినోదం... ఎప్పుడు చూడు, అగ్లీ సీన్స్ కనిపిస్తూనే ఉంటాయి... అగ్లీ సీన్స్ చేస్తాం అని చెప్పి మరీ, అసెంబ్లీ పరువు తీసిన మహానుభావులు ఉన్నారు... ఒక లేడి ఎమ్మల్యే అయితే, జుబుక్సాకరంగా, నాలుక లపలపలాడిస్తూ, ఈలలు వేస్తూ, బూతులు తిడుతూ చేసిన హంగామా కూడా చూసాం... మరి కొంత మంది, లారీ క్లీనర్లు కూడా వెయ్యని వేషాలు అసెంబ్లీలో వేసారు... మనకు తెలిసి ఒక్కసారైనా ప్రజలకు ఉపయోగపడే చర్చ జరగలేదు... ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రభుత్వ పక్షం కంటే, బాధ్యత ఎక్కువగా ప్రతి పక్షానికి ఉంటుంది... వారు ఆ బాధ్యత మర్చిపోయి, అగ్లీ సీన్స్ కు మాత్రమే ఇంపార్టెన్స్ ఇవ్వటంతో, అసెంబ్లీ అంటేనే చులకన భావం ప్రజల్లో వచ్చింది...

ap assembly 10112017 2

అయితే ఇవాల్టి నుంచి మొదలైన అసెంబ్లీ సమావేశాల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది... ప్రభుత్వ పక్షంలో ఉన్న ఎమ్మల్యేలు, ప్రతి పక్ష పాత్ర పోషిస్తున్నారు... వారి సమస్యలు, తదితర మంత్రులకు చెప్తూ, మంత్రుల సమాధానాలు సంతృప్తి లేకపోతే, హామీ పొందే వరకు అడుగుతున్నారు... మిత్ర పక్షం అయిన బీజేపి ఎమ్మల్యే కూడా, ఇలాంటే మంత్రులకి సమస్యలు వివరిస్తూ, ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నారు... దానికి మంత్రులు తగిన పరిష్కారంతో కూడిన సమాధానాలు ఇస్తున్నారు... చంద్రబాబు కూడా, వారి ఎమ్మల్యేలకు హిత బోధ చేసారు... సీరియస్‌గా ప్రిపేరై అసెంబ్లీకి రావాలని, మీ నియోజకవర్గంలో ఎదుర్కుంటున్న అన్ని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తేవాలని చెప్పారు...ప్రతిపక్షం పాత్ర మనమే పోషించి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులతో సీఎం చెప్పారు. ఇందుకు స్పందించిన పయ్యావుల కేశవ్ మేం సిద్ధంగా ఉన్నామంటూ చమత్కరించారు...

ap assembly 10112017 3

దీనంతటికీ కారణం ప్రతి పక్ష ఎమ్మల్యేలు లేకపోవటం... తన పాదయత్ర జరుగుతున్నది కాబట్టి, తానూ లేకుండా ఎవరూ అసెంబ్లీలో కూర్చోవటం ఇష్టం లేని జగన్, వారి ఎమ్మల్యేలను కూడా సభకు వెళ్ళనివ్వలేదు... అసలు ప్రతిపక్షం లేకుండా అసెంబ్లీ జరగటం, ప్రపంచంలోనే ఇప్పటిదాకా ఎక్కడా లేదు.... ప్రజా సమస్యలు లేవనెత్తి, ప్రభుత్వం చేత పనులు చేపించుకోవటానికి, అసెంబ్లీ కంటే మరో వేదిక ఉండదు.. మరి అలాంటింది, ప్రజల గోల అక్కర్లేదు అనుకున్నారో, లేక ముఖ్యమంత్రి కుర్చీ సంకల్ప యాత్ర ముఖ్యం అనుకున్నారో, మొత్తనికి అసెంబ్లీకి డుమ్మా కొట్టి, నాంపల్లి కోర్ట్ కి వెళ్లి, అక్కడ సంతకం పెట్టి, మళ్ళీ పాదయత్రకు వెళ్తూ, అసెంబ్లీలో అగ్లీ సీన్స్ లేకుండా చేసింది ప్రతిపక్షం... ప్రతిపక్షం పాత్ర కూడా తామే పోషిస్తూ, అరుదైన గుర్తింపు పొందింది అధికార పక్షం...

Advertisements

Latest Articles

Most Read