అక్టోబర్ నెల దాకా చుక్క నీరు... కనీసం ఒక చుక్క నీరు కూడా ఎగువ రాష్ట్రాల నుంచి కృష్ణా ప్రవాహం రాలేదు... కాని కృష్ణా డెల్టా మొత్తం, చివరగా ఉన్న దివిసీమ దాకా ప్రతి ఎకరం ఎంత పచ్చగా ఉందో చూడండి... కాలువల్లో కృష్ణమ్మ ప్రవాహం కనపడదు... ఎర్రని గోదారామ్మ పారుతుంది.... వాస్తావాలను నమ్మాలి.. ఊహాగానాలకు తావులేదు... గత ఏడాది ఖరీఫ్ పండిందంటే, ఈ ఏడాది జూన్ లోనే కోస్తా రైతులు 11 లక్ష ఎకరాల్లో నాట్లు వేసుకుని, ఇక వరి కోతలు మొదలు పెట్టారు అంటే, అది పట్టిసీమ ఫలం ... పట్టిసీమతో, ఈ ఏడు సాగుచేసిన వరిపంట తొలిసారిగా కోతకొచ్చింది. గురువారం కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో వరి కోతలను ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్‌తో కలిసి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.

pattiseema 10112017 2

గతంలో ఎకరానికి 35 బస్తాలు వచ్చే దిగుబడి. నేడు పట్టిసీమ పుణ్యమా అని 45నుంచి 50 బస్తాలు వస్తుంది.. రైతన్న ఇంట ధాన్యం సిరులు కురిపిస్తోంది... సగటున 38 బస్తాలు తగ్గడం లేదు... సాగు సకాలంలో జరగడం అధిక దిగుబడులకు మరో కారణంగా పేర్కొనవచ్చు... పట్టిసీమ నుంచి వచ్చిన నీటితో నారుమళ్లు మొదలుపెట్టి ఖరీఫ్‌ ప్రారంభించిన రైతాంగం అదే పట్టిసీమ నీటితో సీజనను సకాలంలో ముగిస్తున్నారు... దీంతో ప్రకృతి వైపరీత్యాల బారిన పడకుండా పంట రైతుల చేతికి వస్తుంది... ఇప్పటి వరకు తుఫానులూ ఏమి రాకపోవటంతో రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు... అధిక దిగుబడులకు గోదావరి నీరు కూడా ప్రధాన కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పట్టిసీమ ద్వారా వచ్చే గోదావరి నీటిలో సారవంతమైన బురద మట్టి, జిగురు, ఒండ్రు ఉండటంతో పంట బాగా పండేందుకు దారి తీసిందని అనుభవజ్ఞులైన రైతులు చెబుతున్నారు....

pattiseema 10112017 3

ఏమిటి ఈ పట్టిసీమ ప్రాజెక్ట్ ? (కొంత మందికి ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ ఏంటో అర్ధం కాక, బుర్ర గోక్కుంటున్నారు.. వాళ్లకి మరో సారి వివరణ): ఈ పట్టిసీమ ఎత్తిపోతల పధకం - భారతదేశ సాగునీటి ప్రాజెక్ట్ లలోనే ఒక సంచలనం, అపూర్వం. దార్శనికత,ఉక్కు సంకల్పం వున్న నాయకుని పర్యవేక్షణలో పురోగతిని ఎలా సాధించవచ్చో ఘనంగా చాటిన వైనంఇది . విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నీటి అవసరాలకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం తప్పనిసరిగా మారింది. కాని పోలవరం పూర్తీ చేయాలంటే కనీసం 4 నుండి 6 సం కాలం పడుతుందని అంచనా . అదే సమయంలో ప్రతి ఏటా 3000 టీ ఎం సి ల వరద నీరు గోదావరి నుండి వృధాగా బంగాళాఖాతం లో కలుస్తున్నాయి. వృధాగా పోయే ఈ వరద నీటిలో కొంత భాగాన్ని మళ్ళించి కృష్ణా నదికి అనుసంధానం చేస్తే కృష్ణా జిల్లా మరియు పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాలకు నీరు అందించుతూ - తద్ద్వారా ప్రకాశం బ్యారేజ్ కు (కృష్ణా జిల్లా ) విడుదల చేయవలసిన కృష్ణా నికర జలాలను శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దనే నిలువ వుంచి అక్కడి నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా క్షామ పీడిత రాయలసీమ జిల్లాలకు నీరు అందించాలనే భగీరధ ప్రయత్నం లో భాగమే పట్టిసీమ ఎత్తిపోతల పధకం.

భూమన కరుణాకర్ రెడ్డి ... వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు... వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి... చనిపోయిన రాజశేఖర్ రెడ్డి తాయారు చేసిన ఆణిముత్యం... దేవుళ్ళ విగ్రహాలు కనపడితే కాలు పెట్టి తంతా అనే నాస్తికుడు, రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని టిటిడి చైర్మన్ అయ్యి, వెంకటేశ్వర స్వామిని కాపాడిన ఘనుడు... తునిలో ట్రైన్ కాల్చటానికి ప్లాన్ వేశాడు అనే అభియోగాలు కూడా ఉన్నాయి... ఈయన గారు, ఇవాళ భారత దేశంలోనే అతి శక్తివంతమైన దగ్గ, నిఘా సంస్థ సిబిఐ అధికారులని అనరాని మాటలు అన్నాడు...

bhumana 09112017 2

వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో, సీబీఐ రాకాసి కుక్కలను జగన్‌పైకి ఉసికొల్పారు అంటూ, పిచ్చి వాగుడు వాగాడు.. అంతకి ఆ జగన్ ఎదో పెద్ద స్వాతి ముత్యం అయినట్టు, ఈ సారు సర్టిఫికేట్ ఒకటి... అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రజల సొమ్ము నొక్కేసిన 420 గాళ్ళని, సిబిఐ పరిగెత్తించి కొట్టిన విషయం తెలిసిందే... 11 కేసుల్లో, A1 గా ఉండి, 16 నెలలు జైలులో ఉండి, షరతుల పై బెయిల్ పై తిరుగుతున్నాడు అంటే, అలాంటి వాడిని వెనకేసుకు వస్తూ, సీబీఐ అధికారులని పిచ్చి కుక్కలు అంటున్నాడు అంటే, ఈయన గారి సైకో, సాడిస్ట్ మెంటాలిటీ ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు...

bhumana 09112017 3

సీబీఐ రాకాసి కుక్కలను వైసీపీ అధినేత జగన్‌పైకి ఉసికొల్పి ఆయనని జైల్లో పెట్టించారు అంట... మరి కోర్ట్ లో ఎందుకు చెప్పలేకపోతున్నారు ? దేశంలోనే కాస్టలీ లాయర్లని పెట్టుకుని, కింద కోర్ట్ నుంచి సుప్రీం కోర్ట్ దాకా ఎందుకు ఒక్కసారి కూడా, మాది తప్పు అని వాదించి కోర్ట్ ని నమ్మించ లేక పోయారు ? 2012 నుంచి, విచారణ ఎందుకు ఎదుర్కుంటున్నారు ? ఈ భూమన కరుణాకరరెడ్డి గారు ఒకసారి శాసన సభ్యులుగా గెలించిన వ్యక్తి ఇలా బజారు భాషను అధికారులపై ఉపయోగించడం చూస్తే వీరికి పిచ్చి పట్టి ఐన ఉండాలి,లేక మదం ఎక్కి ఐన ఉండాలి.. ఇలాంటి నీచులు రాజాకీయాల్లో ఉన్నందుకు, మన మధ్య రోజు తిరుగుతున్నందుకు మనం సిగ్గు పడాలి... సమర్ధవంతంగా పని చేసే ఆఫీసర్స్ రాకాసి కుక్కలు అయితే, రాష్ట్రాన్ని దోచేసిన మీరు ఎవరు ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేసినా వ్యతిరేకించాలి అని, కేంద్ర ప్రభుత్వం వైఖరి తీసుకున్నట్టు ఉంది... చివరకు యూపీఎస్సీ నిర్ణయం తీసుకోవాల్సిన నిర్ణయాలు కూడా కేంద్రమే తీసుకుంటూ, చంద్రబాబుని చికాకు పెడుతుంది... డీజీపీ ఎంపిక విషయంలో, కేంద్రం జోక్యం చేసుకోవటంతో చంద్రబాబుకి చిర్రెత్తుకు వచ్చి, కేంద్రానికి ఘాటు లేఖ రాసింది... మీకు ఫలానా వారు ఉండొద్దని చెప్పే అధికారం లేదు అంటూ కేంద్ర హోంశాఖకు లేఖలో ఏపీ స్పష్టం చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలుంటే యూపీఎస్సీకి చెప్పుకోవచ్చని లేఖలో సూచించింది.

ap govt letter 10112017 2

ఇన్చార్జ్ డీజీపీగా ఉన్న నండూరి సాంబశివరావును పూర్తి స్థాయి డీజీపీగా నియమించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. సమర్ధవంతమిన అధికారిగా పేరు ఉండటంతో, రాష్ట్ర ప్రభుత్వం, ఏడుగురు సీనియర్ ఐపీఎస్ అధికారుల జాబితాను కేంద్రానికి ఏపీ ప్రభుత్వం పంపింది. సహజంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆ జాబితాను యూపీఎస్సీకి పంపాలి. కానీ కేంద్రహోంశాఖ ఏపీ ప్రభుత్వం పంపిన జాబితాలో ఉన్న ఐపీఎస్ అధికారులు ఎస్.వి.రమణమూర్తి, మాలకొండయ్య, ఎన్.సాంబశివరావులు ఏడాదిలోపే పదవీ విరమణ చేస్తున్నారని అటువంటి పేర్లను డీజీపీ ఎంపిక కోసం పంపడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధమంటూ తిప్పి పంపింది.

దీంతో రాష్ట్ర ప్రభుత్వం న్యాయనిపుణులతో సంప్రదించి, అవే పేర్లు మళ్ళీ కేంద్రానికి పంపి, ఘాటు లేఖ రాసింది. జాబితాలో ఫలానా పేరు ఉండొద్దని చెప్పడానికి కేంద్ర హోంశాఖకు ఎలాంటి అధికారాలు లేవని లేఖలో ఏపీ స్పష్టం చేసింది. మీకు ఏమైనా అభ్యంతరాలుంటే యూపీఎస్సీకి చెప్పుకోవచ్చని లేఖలో సూచించింది. మరో పక్క తెలంగాణలో అనురాగ్ శర్మను రిటైర్డ్ మెంట్ కొద్ది రోజుల ముందే ప్యానల్ ద్వారా ఎంపిక చేసి, మరో రెండేళ్లు కొనసాగించిన విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావిస్తోంది. తెలంగాణ ఆదికారిని కొనసాగించడంలో లేని అభ్యంతరం ఏపీ ఆధికారి విషయంలోనే ఎందుకని కేంద్రాన్ని నిలదీసింది...రాష్ట్ర ప్రభుత్వ లేఖతో కేంద్రహోంశాఖ దిగి వచ్చింది. ఈ నెల ఇరవై రెండో తేదీన డీజీపీ ఎంపిక కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

ఒకే వేదిక పై చంద్రబాబు, బొత్స, హరీష్ రావు, రఘువీరా... ఏంటి ఈ కాంబినేషన్ అనుకుంటున్నారా ? వేరే పార్టీ నేతలు... వేరే రాష్ట్రం నేతలు.. నిత్యం కత్తులు దూసుకునే నేతలు... అందరూ ఒకే వేదిక పైన కనిపించనున్నారు... దీనికి వేదిక విజయవాడ "ఏ కన్వేషన్ " కానుంది... నవంబరు 10, సాయంత్రం 6.30 గంటలకు, ఎపి 24/7 ఛానల్‌ అధికారికంగా ప్రారంభం కానుంది... ఆంధ్ర ప్రదేశ్‌ తొలి న్యూస్ శాటిలైట్‌ ఛానల్‌ గా, ఎపి 24/7 ఛానల్ రానుంది...

ap 24 7 09112017 2

అన్నపూర్థా బ్రాడ్‌కాస్టింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట మొదలవుతున్న ఎపి 24/7 ఛానల్‌ యజమాని వ్యాపారవేత్త నరసింహరాజు గారు... కాగా ఆపరేషన్స్ హెడ్ తో సహా, లీడ్ చేసేది మాత్రం ప్రముఖ జర్నలిస్ట్ వెంకటకృష్ణ... మరో సీనియర్ జర్నలిస్ట్ సాయి కూడా, ప్రముఖ పాత్ర పోషించనున్నారు... ఈ ఛానల్ అధికారికంగా, రేపు ప్రారంభం కానుంది.. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రానున్నారు...స్పీకర్‌ కోడెలతో పాటు తెలంగాణ మంత్రి హరీశ్‌ రావు, వైసీపీనేత బొత్స, పిసిసిఅద్యక్షుడు రఘువీరాలను ఆత్మీయ అతిధులుగా రానున్నారు... వీరంతా ఒకే వేదిక మీద ఉండే అవకాసం ఉండటంతో, అందరు ఆతృతగా ఎదురు చూస్తున్నారు...

ap 24 7 09112017 3

అడుగుజాడల,జైహింద్‌, స్టార్‌ షో, కలర్స్‌, ప్రజా క్షేత్రం, నమస్తే ఎన్‌ఆర్‌ఐ, కీచురాళ్లు, అదీ మ్యాటర్‌ వంటి వినూత్నమైన కార్యక్రమాలు రానున్నాయి. రెండు రాష్ట్రాల రాజధానుల లోగోలతో క్యాపిటల్‌ టైమ్స్‌ రూపంలో ఒక ప్రత్యేక కార్యక్రమం రానుంది. ఇప్పటికే ఈ ఛానెల్ టెస్ట్‌ సిగల్‌ ప్రారంభమయింది... మరో పక్క, ఇప్పటికే మహాటీవీ, త్వరలోనే అమరావతి నుంచి ఆపరేషన్స్ మొదలు పెట్టనున్నట్టు ప్రకటించింది... వీరితో పాటు, మరిన్ని న్యూస్ చానల్స్ హైదరాబాద్ నుంచి కాకుండా, మన అమరావతి నుంచే ప్రారంభం అవ్వాలి అని, మన రాష్ట్రానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వాలి అని కోరుకుందాం...

Advertisements

Latest Articles

Most Read