ముఖ్యమంత్రి కావాలి అనే సంకల్పంతో, ప్రజా సంకల్పం అనే పేరుతో, ఈ నెల 6వ తేది నుంచి జగన్ పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే... ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన పాదయాత్ర, మొత్తానికి ప్రరంభంకానుంది.... ఇవాళ సాయంత్రం తిరుమలకు జగన్ చేరుకుంటారు. అనంతరం 4వతేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారు. అలాగే 5వతేదీన కడప పట్టణంలోగల దర్గాను దర్శిస్తారు. అనంతరం పులివెందులకు చేరుకుని చర్చిలో ప్రార్ధనలు చేస్తారు. అనంతరం నవంబర్ 6 నుంచి, ఇడుపులపాయకు చేరుకుని అక్కడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు.

jagan 03112017 2

అయితే తిరుమల శ్రీ వారి దర్శనం కంటే ముందే, ఇవాళ ఉదయం, నాంపల్లి కోర్ట్ దర్శనానికి జగన్ వచ్చారు... అక్రమ ఆస్థుల కేసులో, జగన్ 11 కేసుల్లో A1గా ఉన్న సంగతి తెలిసిందే... ఈ కేసుల విచారణ నిమిత్తం, ప్రతి శుక్రవారం జగన్ కోర్ట్ కి హాజరు కావాల్సి ఉంది... దాని కోసం, ఇవాళ సాయంత్రం తిరుమల టూర్ ఉన్నా, ఇవాళ శుక్రవారం కాబాట్టి, నాంపల్లి సిబిఐ కోర్ట్ దర్శనం చేసుకున్నారు...

jagan 03112017 3

జగన్ తో పాటు, 11 కేసుల్లో A2గా ఉన్న విజయసాయిరెడ్డి కూడా, కోర్ట్ కి హాజరయ్యారు... వీరికి ఇంకా పిలుపు రాకపోవటంతో, ఇద్దరూ కుర్చుని కోర్ట్ హాల్ లో, పాదయాత్ర గురించి చర్చించుకుంతునట్టు సమాచారం... మరి కొద్ది సేపట్లో ఇంకో విశిష్ట అతిధి అయిన, ఓబులాపురం మైనింగ్ డాన్, జగన్ కి దేవుడు ఇచ్చిన అన్నయ్య అయినటువంటి, గాలి జనార్ధన్ రెడ్డి కూడా కోర్ట్ కి రానున్నారు... గాలి కూడా వచ్చిన తరువాత, ముగ్గురూ మరోసారి కలుసుకోనున్నారు... మొత్తానికి, పాదయాత్ర మొదలు పెట్టే రెండు రోజుల ముందు, జగన్ నాంపల్లి కోర్ట్ లో హాజరు వేయుంచుకుని బయలుదేరనున్నారు...

కాంగ్రెస్ మాజీ నాయకుడు, విజయవాడ నుంచి గతంలో రెండు సార్లు ఎంపిగా గెలిచిన లగడపాటి రాజగోపాల్, సడన్ గా లోటస్ పాండ్ లో ప్రత్యక్షమవటం సంచలనం సృష్టించింది... లగడపాటి, జగన్ కలిసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది... ఏమన్నా రాజకీయ కోణం ఉందా అని అందరూ ఆరాలు తీస్తూ, ఎవరికీ తోచిన ఈక్వేషణ్ వాళ్ళు చెప్తున్నారు...

lagadapati 0212017 2

గురువారం మధ్యహ్నం జగన్ సీనియర్ నాయకులతో, పాదయాత్ర గురించి చర్చిస్తూ ఉండగా, లగడపాటి రాజగోపాల్ వచ్చారు అనే మసేజ్ జగన్ కు చెప్పారు.. అక్కడ ఉన్న నాయకులు ఒక్కసారి అవాక్కయ్యారు... ఒక పక్క పాదయాత్ర గురించి మాట్లాడుతుంటే, ఈయన ఎందుకు వచ్చాడు అంటూ షాక్ అయ్యారు... జగన్, బయటకు వెళ్లి లగడపాటి రాజగోపాల్ని కలిసారు... తీరా చుస్తే, లగడపాటి రాజగోపాల్ కుమారడు వివాహం త్వరలో జరగనుంది, ఆ వివాహానికి జగన్ ను ఆహ్వానించటానికి లగడపాటి రాజగోపాల్, లోటస్ పాండ్ వచ్చారు... దీనికి ఏ విధమైన రాజకీయ కోణం లేదు అని చెప్పారు...

lagadapati 0212017 3

నిజానికి లగడపాటి రాజగోపాల్, జగన్ కు వోట్ వెయ్యద్దు అంటూ, 2014 ఎలక్షన్స్ ముందు చెప్పారు.. ఇప్పటికీ చంద్రబాబుకు అనుకూలంగా, వ్యవహరిస్తున్నారు అని వార్తలు వస్తూ ఉంటాయి... నంద్యాల, కాకినాడ ఎలక్షన్స్ కి, లగడపాటి, తెలుగుదేశంకు అనుకూలంగా రిపోర్ట్ లు కూడా ఇచ్చారు... ఇప్పటికీ జగన్ మీద రాజాకీయంగా, లగడపాటి రాజగోపాల్ కి వ్యతిరేక అభిప్రాయం ఉంది కాని చెప్తారు... అలాంటి లగడపాటి, జగన ను కలిసే సరికి, రాజకీయంగా ఊహాగానాలు వచ్చినా, అది పెళ్లి పిలుపు కోసం అని తెలిసే సరికి, అందరు లైట్ తీసుకున్నారు...

నిన్న ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకులు ప్రకటించారు అంటూ, అన్నీ మీడియా, పత్రికలు హడావిడి చేశారు.. తెలంగాణా ఫస్ట్ అని, ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది అంటూ వార్తలు రాశాయి... అయితే ర్యాంకులు ప్రకటనకు ఇంకా చాలా టైం ఉన్నా, తెలంగాణా ప్రభుత్వ మెప్పు కోసం, హడావిడి చేశాయి... ఏ ఛానల్, ఏ పేపర్ ఎలా రాసినా పెద్దగా పట్టించుకునేవారు కాదు కాని, ఈనాడు రాసే సరికి, అందరూ అది నిజం అని నమ్మారు... చివరకి ఉప రాష్ట్రపతి వెంకయ్య కూడా అదే నిజం అనుకుని తెలంగాణాకు శుభాకాంక్షలు చెప్తూ ట్వీట్ చేశారు...

eenadu 02112017 2

అయితే ఈనాడు ఇలా చెయ్యటంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి... ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఈనాడు లాంటి క్రడిబిలిటీ ఉన్న పేపర్ ఇలా రాసింది అంటే, ఆశ్చర్యపోయారు... ఈనాడు తప్పు తెలుసుకుని సవరించుకుంటుంది అనుకున్నారు... కాని, ఈనాడు సవరణ అయితే చేసింది కాని, హైదరాబాద్ విషయంలో ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ లో, రెండవ ర్యాంకు అని చెప్పాం, అది 2009 లో ప్రకటించిన ర్యాంక్ అని చెప్పి, సవరణ అంటూ రాసింది.. కాని, మన ఆంధ్రప్రదేశ్ విషయంలో అత్యుత్సాహం ప్రదర్శించాం, ఇంకా ర్యాంకులు ప్రకటించాల్సి ఉంది అని మాత్రం సవరణ ఇవ్వలేదు...

eenadu 02112017 2

ఆంధ్రప్రదేశ్ ప్రజలను గందరగోళనని గురి చేసి, కనీసం సవరణ కూడా ఇవ్వకపోవటంతో అందరూ, ఈనాడు విలువలు వదిలేసింది ఏమో అంటూ వ్యాఖ్యానిస్తున్నారు... చివరకి నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ వార్తా చూసి, నిజం అనుకుని, సమీక్షకు పిలిచారు అంటే, ఈనాడు వార్త, ఈనాడు మీద ఉన్న నమ్మకం అలాంటింది... అలాంటి ఈనాడు, ఎందుకో కాని, ఈ మధ్య కాలంలో తప్పులు చేస్తుంది, కాని తెలంగాణా తప్పులు ఒప్పుకుంటుంది కాని, ఆంధ్రప్రదేశ్ తప్పులు మాత్రం అసలు పట్టించుకోవటం లేదు... ఈనాడు అంటే, ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా మందికి అనుబంధం ఉంది... ఇలాగే తప్పుడు వార్తలు రాస్తూ ఉంటే, ఆదరణ కోల్పాతారు... ఏదైనా ఎవరి ప్రయోజనాలు వాళ్ళవి, ఎవరి ప్లాన్ లు వారికి ఉంటాయి.. ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారు...

మన రాష్ట్ర ప్రతిపక్షమేమో, మేము అసెంబ్లీని బహిష్కరించాం, చంద్రబాబు ప్రభుత్వం అన్నిట్లో ఫెయిల్ అయ్యింది అంటుంటే, పక్క రాష్ట్ర అసెంబ్లీలో మన విధానాలను ప్రశంసిస్తూన్నారు... అదీ మనలను అన్ని విషయాల్లో వ్యతిరేకించే తెలంగాణా అసెంబ్లీలో మన ప్రభుత్వం గురించి, చంద్రబాబు చేస్తున్న పనులు గురించి, మన అమరావతి గురించి ప్రశంసించారు... తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్, కాంగ్రెస్ పార్టీ ఎమ్మల్యే జీవన్ రెడ్డి, మన గురించి తెలంగాణా అసెంబ్లీలో గొప్పగా చెప్పారు...

t assembly 02112017 2

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ అయితే, మన అమరావతి రాజధాని డిజైన్ లు గురించి మెచ్చుకున్నారు.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిజైన్ లు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశారా అంటూ, అసెంబ్లీలో అన్నారు... మనం కూడా అంత గొప్పగా సెక్రటేరియట్ కట్టుకోవాలని, అమరావతి సెక్రటేరియట్ అంత గొప్పగా మనమూ నిర్మించుకుందాం అన్నారు.. ఒక పక్క, మన ప్రతిపక్షం మన కలల రాజధానిని భ్రమరావతి అంటూ హేళన చేస్తుంటే, కెసిఆర్ మాత్రం, మన అమరావతి గురించి, మన సెక్రటేరియట్ డిజైన్ ల గురించి గొప్పగా చెప్పారు...

t assembly 02112017 3

మరో సందర్బంలో సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, మిర్చి రైతులని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భ్రమ్మండంగా ఆదుకుంది అని, మన రాష్ట్ర ప్రభుత్వం కూడా అలా ఆదుకుంటే బాగుండేది అన్నారు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిర్చికి ప్రకటించిన సబ్సిడీతో అక్కడ రైతాంగం గట్టెక్కింది అని, వారి కళ్ళలో ఆనందం నేను స్వయంగా చూసాను అంటూ తెలంగాణా అసెంబ్లీలో చెప్తూ, తెలంగాణ ప్రభుత్వం కూడా అలా ఆదుకోవాలి అని చెప్పారు... మొత్తానికి మన ప్రతిపక్షం అన్నిటికీ అడ్డుపడుతుంటే, అక్కడ ప్రభుత్వంతో పాటు, అక్కడి ప్రతిపక్షం కూడా మనల్ని, మన ముఖ్యమంత్రిని ప్రశంసిస్తూన్నారు...

Advertisements

Latest Articles

Most Read