దగ్గుబాటి పురందేశ్వరి... ఎన్టీఆర్ కూతురుగా గుర్తింపుతో, చంద్రబాబుని సాధించటానికి రాజకీయాల్లోకి వచ్చి, కాంగ్రెస్ పార్టీలో చేరి, ఏకంగా కేంద్ర మంత్రి అయిపోయారు... కాంగ్రెస్ ఓడిపోగానే, బీజేపిలో చేరారు.. ఇంత వరకు బాగానే ఉంది... కాని ఆవిడ వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి కామెంట్, చంద్రబాబుని టార్గెట్ చెయ్యటమే... మిత్రపక్షం అని కూడా మర్చిపోయి, చంద్రబాబుని ఎలా ఇబ్బంది పెట్టాలి అనేదే ఆవిడ టార్గెట్... మరి బీజేపి అధిష్టానం కూడా, ఆవిడకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిందో ఏమిటో కాని, ఈ మధ్య మరింత దూకుడు పెంచారు...

ck babu 01112017 2

అందులో భాగంగా, చంద్రబాబు వ్యతిరేకులు ఎవరు అనేది లిస్ట్ అవుట్ చేసుకుని, వారిని బీజేపిలోకి తీసుకువచ్చి, చంద్రబాబుకి చికాకులు తెప్పించాలి అనే ప్లాన్ వేసారు... ఆలోచన వచ్చిందే తడవు, చంద్రబాబు సొంత జిల్లా చిత్తూర్ మీద ఫోకస్ చేసారు... ముందుగా ఆవిడ ఎంచుకున్న టార్గెట్ చూసి, పురందేశ్వరి మరీ ఇంతలా దిగజారిపోయారు ఏమిటి అని సొంత పార్టీ నేతలే అనుకునేలే ఆవిడ వ్యవహరించారు...

ck babu 01112017 3

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు ఇంటికి వెళ్లి మరీ, భారతీయ జనతా పార్టీలోకి ఆహ్వానించారు... ఈ సీకే బాబు ఎలాంటి వారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... వైసీపీ పార్టీలో ఉన్నా, జగన్ అసలు పట్టించుకోవట్లేదు... ఏమైందో ఏమో, అతనికి మాకు సంబంధం లేదు అని, వైసీపీ పార్టీ ప్రకటించింది. తెలుగుదేశంలో ఇలాంటి వారికి అసలు చోటు ఉండదు... ఇక మిగిలింది కాంగ్రెస్, లేక బీజేపి.. తన వర్గం చెదిరిపోకుండా చూసుకునేందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే, ఇలాంటి వ్యక్తి కోసం, పురందేశ్వరి రంగంలోకి దిగటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది... పురందేశ్వరి కూడా, అధిష్టానం దగ్గర మార్కులు కొట్టేయటానికి, ఇలాంటి పాట్లు పడుతున్నారు...

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైజాగ్ గెదెల రాజు, పద్మలతల హత్య వ్యవహారం మలుపులు తిరుగుతోంది. ఈ కేసుల్లో కీలక ప్రాత్రధారి, వైసీపీ నేత దామా సుబ్బారావును పోలీసులు అరెస్ట్ చేశారు. కేసులో ఏ 1 గా వున్న ఆర్టీసీ విజిలెన్స్ డిఎస్పీ రవిబాబు లొంగిపోయాడు. ఏ 2 గా వున్న భూపతిరాజును కూడా పట్టుకున్నారు. విశాఖపట్నంలో పలు రౌడీ షీటర్లు, గెదెల రాజు, డిఎస్పీ రవిబాబు, భూపతిరాజులతో కలసి వైసీపీ నేత దామా సుబ్బారావు పలు సెటిల్ మెంట్లు చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ysr 01112017 2

గేదెల రాజు హత్యలో 70 లక్షల వ్యవహారం, పద్మలత హత్య కుసు సుపారీలో కుడా దామా సుబ్బారావు కీలక పాత్ర పోషించాడని పోలీసులు గుర్తించారు. అంతకుముందు, రెండు రోజులు విచారించిన అనంతరం పోలీసులు దామాను విడిచిపెట్టారు. అప్పటి నుంచి దామా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసుల్లో ఆందోళన మొదలైంది. అనవసరంగా విడిచిపెట్టామనే చర్చ పోలీసు వర్గాల్లో జరుగుతోంది. ఈ రెండు మర్డర్లకు సంబంధించి ఫైనాన్స్ వ్యవహారాలన్నీ దామా సుబ్బారావు చేశాడనేది పోలీసులు విచారణలో తేలింది.

ysr 01112017 3

దామా విదేశాలకు పారిపోయే ప్రయత్నాల్లో ఉన్నాడని తెలీడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తానికి పోలీసులు వైసీపీ నేత దామా సుబ్బారావును అరెస్ట్ చేశారు. నిన్న సాయంత్రం పోలీస్‌ స్టేషన్‌కు ఈ కేసుతో సంబంధం వున్న అందరినీ పిలిపించి స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు. చార్జిషీట్‌ దాఖలు చేశాక పోలీసులు చేసిన నేరారోపణలన్నీ తగిన సాక్ష్యాలతో కోర్టు ముందుంచాల్సి వుంటుంది.

అధినాయకత్వం ఆశీస్సుల కోసం ఓ నియోజకవర్గ కన్వీనర్ ప్రయత్నించారు. అందరికీ సన్నిహితంగా మెలిగారు, చివరకు పెద్ద నాయకుడిని కలుసుకున్నారు. మీ వద్ద పార్టీ బాగానే ఉంది. మీరు కాస్త డబ్బులు రెడీ చేసుకోవాలి. మేము చెప్పిన ఫిగర్ మీ ఆర్థిక స్తోమతకు దగ్గరగా ఉండాలి. ఈ విషయాలన్నీ ఫలానా ఆయనతో మాట్లాడండి' అని చెప్పటంతో, ఆ కన్వీనర్ కాస్త విస్తుపోయినట్టు సమాచారం. ఇది వైసిపి పార్టీ తీరు... వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఎదుర్కోవాలి అంటే, మనకు కూడా కొంత స్తోమత ఉండాలి. అందుకనే మీ అంతట మీరుగా ఇంత భరించాలి. దానికి మీరు సిద్ధమేనా? అంటూ వైసీపీ సీనియర్ నేతల నోట వెలువడుతున్న సవాల్ కు ఆ పార్టీ నేతలు అవాక్కవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో సీటు గ్యారెంటీ అనుకున్న వారికి కూడా ఇలాంటి ప్రశ్నే ఎదురవుతుండటంతో వారి నోట మాట రావడం లేదు. వచ్చే ఎన్నికలు పార్టీకి ప్రాణం పోసినా ఊపిరి తీసినా మనకు మనం కష్టపడాల్సిందే. నియోజకవర్గంలో పోటీ చేయాలంటే పది కోట్లకు పైగానే ఖర్చు చేయాల్సి ఉంటుంది. దీనిని భరించడానికి మీరు సిద్ధంగా ఉంటే సరేసరి. లేకుంటే వేరొకరికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది' అంటూ పార్టీ వర్గాల నుంచి కన్వీనర్లకు అందుతున్న సంకేతాలతో బెదిరిపోతున్నారు.

jagan vijasaayi 01112017 2

వాస్తవానికి ఇప్పటికే ఎన్నికల వేడి ప్రారంభమైంది. తెలుగుదేశంతో డీ కొనేందుకు వైసీపీ దాదాపు సిద్ధమైంది. అభ్యరుల గుణగణాలకంటే వారికి ఉన్న ఆర్ధిక స్తోమత పై గురిపెట్టారు. ఇంతకు ముందు అంతా మేం చూసుకుంటాం. క్షేత్ర స్థాయిలో పార్టీని బలపడేలా చేయండంటూ పదేపదే చెప్పే సీనియర్లు ఈ మధ్యన గళం మార్చారు. పార్టీ దృష్టంతా ఇప్పడు శ్రీమంతులపై పడింది. ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాలంటే ఆర్థికంగా పటిష్టమైన వ్యక్తుల కోసం గాలింపు ప్రారంభమైంది. ఆఖరుకి ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో కూడా అంతో ఇంతో చేతి చమురున్న వారికే ప్రాధాన్యత దక్కేలా ఉంది.

jagan vijasaayi 01112017 3

ఎంపీ టికెట్లు కోరుకుంటున్న వారిలో ఎవరైనా పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోయే అభ్యర్దులకు అంతో ఇంతో ఆర్ధిక బాసట ఇవ్వాలి. ఇది మరో కండీషన్ గా చెబుతున్నారు. ఇప్పడు వైసీపీలో ఇదొక వైరల్గా మారింది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేసే వారంతా పార్టీ ఆశించినట్టుగా శ్రీమంతులై ఉండాలనే సంకేతం వీరిని కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. వాస్తవానికి 2014 ఎన్నికల్లో పోటీచేసిన అనేక మంది అప్పుడు చేసిన ఖర్చులు, అప్పలు తీరక దిగాలు పడిన వారు ఉన్నారు. కాని మరోసారి పార్టీ నుంచి టికెట్ ఖాయమని చెప్పకుంటున్నా వీరందరినీ ఆర్థిక బెంగ కుంగతీస్తోంది. అంతో ఇంతో పార్టీ నుంచి సపోరు రాకపోదా ? అని ఇప్పటి వరకు ఆశతో ఉన్న వారందరూ తాజా పరిణామాలపై బిక్క చచ్చిపోయారు.

తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని, అక్రమ ఆస్థులు సంపాదించారని, సిబిఐ, ఈడీ జగన్ పై 11 కేసులు పెట్టిన సంగతి తెలిసిందే... అన్నిట్లో జగన్ A1గా ఉన్నారు... 16 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి, ఇప్పుడు బెయిల్ పై బయట తిరుగుతూ, ప్రతి శుక్రవారం కోర్ట్ కి వెళ్తూ, ఎక్కడకి వెళ్ళాలి అన్నా కోర్ట్ పర్మిషన్ తీసుకుంటూ వెళ్తున్న సంగతి తెలిసిందే... ఈ 11 కేసుల్లో, 3 కేసులు విచారణ త్వరలో ముగియనుంది అనే సమాచారం కూడా వస్తున్న తరుణంలో, ఎలక్షన్ కమిషన్ సుప్రీమ్ కోర్ట్ లో వేసిన పిటీషన్ చూసి, జగన్ కు వణుకు మొదలైంది...

jagan 01112017 2

రాజకీయ నేతలు నేరానికి పాల్పడినట్టు రుజువైతే... ఎన్నికల్లో పోటీ చేయకుండా వారిపై జీవితకాల నిషేధం విధించాలంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఈ రోజు సుప్రీంకోర్టుకు చెప్పింది ఈసి... నేరం రుజువైన రాజకీయ నేతలను జీవితకాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని చెప్పింది. మరోవైపు ఈ విచారణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. దీన్ని అమలు చెయ్యటం సాధ్యం కాదని కోర్టుకు తెలిపింది. పిల్ ను తోసిపుచ్చాలని కోరింది. అయితే సుప్రీం కోర్ట్ దీని మీద నిర్ణయం చెప్పాల్సి ఉంది... సుప్రీం కోర్ట్ కనుక, ఈసి నిర్ణయాన్ని సమర్ధిస్తే, ఇక జగన్ రాజకీయల్లో పోటీ చెయ్యటం కుదరదు... నేనే సియం.. నేనే సియం.. అనటం కూడా కుదరదు...

jagan 01112017 3

అసలు ఈ కేసు పూర్వా పరాలు ఇలా ఉన్నాయి... సీనియర్ న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ కొన్ని నెలల క్రిత్రం ఈ విషయం పై సుప్రీంకోర్టులో ఓ పిల్ వేసారు... ఆ తర్వాత విచారణ సమయంలో తమ వాదనలు వినిపించేందుకు మరికొందరు చేరారు. అయితే ఈసీ నుంచి మాత్రం సరైన స్పందన రాలేదు. దీంతో, జూలై 12న విచారణ సందర్భంగా ఈసీపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. నేరం రుజువైన నేతలను జీవితకాలం నిషేధించే విషయంలో స్పష్టమైన వైఖరిని తెలయజేయడం లేదంటూ మండిపడింది. దీంతో, ఈరోజు తన వైఖరిని సుప్రీంకోర్టుకు తెలిపింది ఈసీ...

Advertisements

Latest Articles

Most Read