ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్, ఇవాళ తను నివాసం ఉంటున్న తెలంగాణా రాష్ట్రం నుంచి బయలుదేరి తిరుమల రానున్నారు.. రేపు ఉదయం శ్రీవారి దర్శనం చేసుకుంటారు... అయితే క్రితం సారి జగన్ తిరుమల వచ్చినప్పుడు చేసిన హంగామా గుర్తు తెచ్చుకుని, వెంకన్న భక్తులు ఆందోళన చెందుతున్నారు... ఎందుకంటే, అప్పుడు జగన్ తిరుమలలో చేసిన వీరంగం అలాంటింది... ఈ సారి, ఏమి చేస్తారో, ఎలా చేస్తారో అని ఆందోళన చెందుతున్నారు... నిజానికి జగన్ కు, ఆలయాల్లో ఎలా ఉండాలి అనే నియమాలు తెలీవు... తను క్రీస్టియన్ కనుకే, హిందువుల వోట్లు తనకి పడట్లేదు అని, అందుకే హిందువులను మంచి చేసుకోవటానికి, అలాగే ఆర్ఎస్ఎస్ నేతలను మచ్చిక చేసుకోవటానికి, జగన్ ఈ గుడులు, స్వామీజీల కాళ్ళ మీద పడటం లాంటి పనులు చేస్తున్నారు... భారత దేశంలో ఏ మతం వారైనా, వెంకన్నను దర్శించుకోవచ్చు కాని, అక్కడ కొన్ని నియమాలు ఉంటాయి, జగన్ పోయిన సారి అవన్నీ తప్పారు... అందుకే ఆందోళన....

jagan tirumala 03112017 2

ఇంతకీ అప్పుడు జగన్ ఏమి చేసారో తెలుసా... మార్చ్ 12, 2014న జగన్ తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్ళినప్పుడు చేసిన వీరంగం ఇది ... చెప్పులు వేసుకుని క్యూ కాంప్లెక్స్‌లోకి వెళ్లే యత్నం చేశారు.... అక్కడ ఉన్న వారు వారించటంతో, చెప్పులు తీసాడు... వెంకన్న నామస్మరణ మరోమోగాల్సిన లయం వద్ద అనుచరుల 'జై జగన్' నినాదాలు చేసారు, జగన్ అభిమానులు... జగన్ తో పాటు వచ్చిన అభిమానులు, సెక్యూరిటీ సిబ్బంది, టికెట్లు లేకుండానే దౌర్జన్యంగా క్యూల్లోకి వచ్చారు... జగన్ హిందూ మతస్తుడు కాదు... అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వస్తే, డిక్లరేషన్ ఇవ్వాలి... జగన్ అది కూడా చెయ్యలేదు... జగన్, ఆయన అనుచరులు, సామాన్యులని ఆపేసి, దాదాపు 25 నిమషాలు స్వామి వారి సన్నిధిలో ఉన్నారు... చివరకి రాష్ట్రపతి వచ్చినా, 10 నిమషాలకు మించి ఉండరు...

jagan tirumala 03112017 3

ఇక రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, తిరుమల ఏడు కొండలు కాదు, రెండు కొండలే అని జిఓ కూడా ఇచ్చారు... తరువాత విమర్శలు రావటంతో వెనక్కి తగ్గి, జిఓ సవరించారు... అసలు దేవుడంటేనే నమ్మకం లేదని.. విగ్రహాలను చెప్పుతో కూడతానంటూ.. వీరంగాలాడిన సూడో కమ్యునిస్టు…కరుణాకరరెడ్డిని ఛైర్మన్ గా చేశారు.... ఎవరి మతాలను వారు గావురవించటం తప్పులేదు కానీ, ఇతర మతాలను కావాలని కించపరచటం చులకన భావంతో చూడటం దారుణం.... హిందూ సంప్రదాయాలను చులకన చెయ్యటం వీరి ఉద్దేశమే ఏంటో కాని, ఈ సారైనా జగన్ సవ్యంగా దర్శనం చేసుకుంటాడు అని ఆశిద్దాం... ప్రతి హిందువు కలియుగ దైవంగా భావించే వెంకన్న దర్శనంలో ఈసారైనా, సాంప్రదాయాలు పాటిస్తాడు అని ఆశిద్దాం...

ప్రతిష్టాత్మక పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఎలా దోబుచులాడుతుందో చూస్తున్నాం... మరో పక్క ప్రతిపక్షం అడుగు అడుగునా అడ్డంకులు కలిగిస్తుంది... కోర్ట్ ల్లో కేసులు వేసి, ప్రాజెక్ట్ జాప్యానికి ప్రయత్నిస్తుంది...కేంద్రమేమో అంచనాలు పెంచడానికి ససేమిరా అంటోంది. విభజన తర్వాత రూ.12 వేల కోట్ల పనులు చేస్తే కేంద్రం ఇంకా రూ.3 వేల కోట్లు ఇవ్వాలి. నాబార్డు రుణం అన్నా అతీగతీ లేదు. కేంద్ర బడ్జెట్‌లో మాత్రం రూ.రెండు మూడొందల కోట్లు ప్రతిపాదిస్తున్నారు. పూర్తి నిధులిస్తామన్న కేంద్రం పాత లెక్కలను పట్టుకొని వేలాడుతుంది.... జగన్ పార్టీ వారు, ఇంత అంచనాలు ఎందుకు పెరిగాయి అంటున్నారు... మరి అప్పుడు మీ నాన్న గారు, ఏమి చేసారు అయ్యా అంటే, సమాధానం ఉండదు...

polavaram 03112017 2

పోలవరం అంచనా వ్యయం 2010-11లో రూ.16 వేల కోట్లు కాగా, 2013-14 లెక్క రూ.58 వేల కోట్లు. విద్యుత్‌ కేంద్రాన్ని తీసేస్తే రూ.54 వేల కోట్లు. ట్రాన్స్‌స్ట్రారుకి ఇచ్చిన హెడ్‌వర్క్స్‌ రూ.6 వేల కోట్ల నుంచి రూ.11 వేల కోట్లకు పెరిగాయి. నిర్వాసితుల పునరావాసం రూ.3 వేల కోట్ల నుంచి రూ.33 వేల కోట్లకు పెరిగింది. అంటే, అన్ని పనుల్లోకి నిర్వాసితుల పునరావాసానికే 70% అదనపు చెల్లింపులు చెయ్యాలి... అంచనా వ్యయం భారీగా పెరగటానికి కారణం, ఈ నిర్వాసితులకి చెల్లింపులే... మరి ఈ పాపం ఎవరది ? మా నాన్న ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేసాడు, చంద్రబాబు రిబ్బన్ కటింగ్ చేసి నీళ్ళు ఇస్తున్నాడు అని చెప్తున్న, జగన్ వీటికి ఏమి సమాధానం చెప్తాడు ? రాష్ట్రానికి డబ్బులు పుష్కలంగా ఉన్నప్పుడే రాజశేఖర్ రెడ్డి, నిర్వాసితులకి చెల్లింపులు ఎందుకు చెయ్యలేదు ? ఇప్పుడు లోటు బడ్జెట్ లో, చంద్రబాబు కేంద్ర సహయం కోసం నానా తిప్పలు పడుతుంటే, ప్రతిపక్షం సహకరించాల్సింది పోయి, ఎందుకు జాప్యం చెయ్యటానికి చూస్తుంది... కాంగ్రెస్ పార్టీ తెచ్చిన భూసేకరణ చట్టం వలన ఒక్క పునరావాసానికే, 33 వేల కోట్ల అదనపు ఖర్చు అవుతుంది... చంద్రబాబు కమిషన్ ల కోసం, అంచనాలు పెంచింది ఏంటి దీంట్లో ?

polavaram 03112017 3

అప్పట్లో రాజశేఖర్ రెడ్డి మొబిలైజేషన్ అడ్వాన్సు లు అని, కాలువల్లో మట్టి కోసం అని మాత్రమే పనులు చేసి, కాంట్రాక్టుర్ లు లబ్ది పొందేలా, ఈయనకి, ఈయన కుమారుడికి కమిషన్ ఎక్కువ వచ్చేలా చూసుకున్నారు... అప్పుడే ఈ నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే, ఇప్పుడు చంద్రబాబుకి ఈ బాధలు ఉండేవి కాదు... కేవలం కాలువల్లో మట్టి డబ్బులు నొక్కేయ్యటానికి మాత్రమే పనులు చేశారు.. అసలు ప్రాజెక్ట్ కాంక్రీట్ పనులు కాని, గేటులు కాని, ఇలాంటి వాటి జోలికే పోలేదు... ఇప్పుడు చంద్రబాబు నానా కష్టాలు పడుతుంటే, చంద్రబాబుని విమర్శిస్తారు జగన్ పార్టీ వారు... మరి ఆ రోజు, రాజశేఖర్ రెడ్డికి పోలవరం కట్టాలి అని ఉంటే,ఒక్క ఎకరా కూడా ఎందుకు నిర్వాసితుల దగ్గర తీసుకోలేదు అంటే సమాధానం ఉండదు...

భన్వర్‌లాల్‌... 2014 ఎలక్షన్స్ దగ్గర నుంచి, మొన్నటి నంద్యాల ఎన్నికల వరకు, రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా తెలిసిన పేరు... భన్వర్‌లాల్‌, తన సర్వీస్ పూర్తి అవ్వటంతో, రిటైర్డ్ అయ్యారు... అయితే, ఆయన మీద ఆరోపణలు, జరిమానా కట్టకపోవటం లాంటి ఆరోపణలు ఉండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటీసు జరీ చేసేంది... ఇలాంటి నోటీసులు ఎంతో మందికి వస్తూ ఉంటాయి... కాని, వైసీపీ బ్యాచ్ తో పాటు, ఇంటి దొంగ అయిన ఐవైఆర్ కృష్ణా రావు మాత్రం, భన్వర్‌లాల్‌ విషయంలో మాత్రమే హడావిడి చేస్తూ స్పందిస్తున్నారు... ఆ నోటీసు ఎదో, వీళ్ళకి వచ్చినంత బాధగా ఫీల్ అయిపోతున్నారు... ప్రభుత్వం నోటీసులు తప్పు ఉంటే భన్వర్‌లాల్‌ ఈ పాటికి కోర్ట్ కి వెళ్ళటమో, లేక సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కు విన్నవించుకోవటమో చేసే వారు... అసలు ఇలాంటి విషయాలు ఐవైఆర్ కృష్ణా రావుకు ఎందుకు ? ఆయన వైసీపీ ఏజెంట్ గా ఎందుకు పని చేస్తున్నారు ? సాక్షి మాత్రమే, ఐవైఆర్ కృష్ణా రావు వార్తలకు అధిక ప్రాధాన్యత ఎందుకు ఇస్తుంది ? మరి వీరికి భన్వర్‌లాల్‌ మీద అంత ప్రేమ ఎందుకు ? తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు, భన్వర్‌లాల్‌ నిజంగానే వైసీపీకి అనుకూలంగా పని చేసే వారా ?

jagan bhanwar 03112017 2

ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తుంటే అవును అనే సమాధానం వస్తుంది... మొన్న నంద్యాల ఎన్నికల ప్రచారంలో, భన్వర్‌లాల్‌ తీరును సామన్య ప్రజలు కూడా తప్పు బట్టారు... సాక్షి ఛానల్ చెప్పింది అని, సాక్షాత్తు, ముఖ్యమంత్రికి ఆహరం తీసుకువెళ్ళే వాహనం బద్దలు కొట్టి హడావిడి చేశారు... ముఖ్యమంత్రిని కాల్చేస్తా, ఉరితీస్తా అని జగన్ అంటే, ఆ మాటలకు తెలుగుదేశం ఫిర్యాదు చేస్తే, అసలు దాని గురించి పట్టించుకోలేదు... వైసీపీ నేతలు ఏ ఫిర్యాదు చేసినా వెంటనే రియాక్ట్ అయ్యేవారు..

jagan bhanwar 03112017 2

ఇప్పుడే కాదు భన్వర్‌లాల్‌... 2014 ఎలక్షన్స్ టైంలో కూడా, ఇలాగే పక్షపాతంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.. 2014 ఎన్నికల్లో, నెల్లూరు ప్రకాశం జిల్లాలో, వైకాపా నాయకులు పంచిన, ల్తీ మద్యం తాగి, 8 మంది చనిపోయారు... దానికి కారణం అయిన వారి అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద ఏ చర్యలు తీసుకోలేదు.... ఇప్పుడు ప్రభుత్వానికి అద్దె కట్టకుండా ఎగ్గోట్టారని, ఆ డబ్బులు ఇవ్వండి అని నోటీసు ఇస్తే, సాక్షి వైకాపా ఐవైఆర్ కృష్ణా రావులు భుజాల మీద మొయ్యడం కృతజ్ఞతతోనే చేస్తున్నారా అనే అనుమానులు వస్తున్నాయి... నిజానికి భన్వర్‌లాల్‌ ఆ ఆద్దె డబ్బులు ఇస్తే, అవి చంద్రబాబు జేబులుకి వెళ్ళవు, అవి రాష్ట్ర ఖజానాకు వస్తాయి.. మరి, ఇలాంటి వాటి కోసం పోరాడకుండా, భన్వర్‌లాల్‌ ఆద్దె డబ్బులు ఇవ్వరు అని వీళ్ళు ఎందుకు మోస్తన్నారో, ప్రజలకి తెలియదు అనుకుంటున్నారా ?

అప్ అండ్ డౌన్ అదిరపోవాలి... నంద్యాల దెబ్బ చంద్రబాబు అబ్బా... ఇలా మీడియా ముందు, మీటింగ్లలోనూ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడే రోజా, నంద్యాల, కాకినాడ ఫలితాలు తరువాత ఎక్కడా కనిపించటం లేదు అని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు... నంద్యాల ఓటర్ల దెబ్బకు చంద్రబాబు అబ్బా అంటాడు అని రోజా అన్న మాటలతో, నంద్యాల ప్రజలు రోజాకి తగిన స్థానం చూపించారు. విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న రోజాకి ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అప్పటి నుంచి కొన్ని రోజల పాటు రోజా ప్రజల ముందుకి రాలేక, కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టకుండా మొహం చాటేసే పరిస్థితి వచ్చింది. ప్రజలు కూడా ఆ బూతులు నుంచి విముక్తి పొందాం అని ఆనందపడ్డారు...

roja 03112017 2

మళ్ళీ ఏమైందో ఏమో, అమ్మగారు మళ్ళీ ప్రత్యక్షమైంది... పాదయాత్రకు అటెన్షన్ కావలి అనేమో, జగన్ మళ్ళీ రెచ్చిపోమని పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు... ఇక ఈవిడ మళ్ళీ అవే జుబుక్సాకరమైన మాటలతో విరుచుకుపడింది.... డిజిపి సాంబశివరావు మాట్లాడుతూ, జగన్ పాదయాత్రకు పర్మిషన్ తీసుకుంటే, పర్మిషన్ ఇస్తాం అని చెప్పారు... అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా, ఆయన దగ్గర ఉన్న ఇంటెలిజన్స్ రిపోర్ట్ చెప్తూ, పాదయాత్రలో ఏమైనా ఉద్రిక్తతలకు ప్లాన్ చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అన్నారు... దీనికి రోజా గారు, ప్రెస్ మీట్ పెట్టి రెచ్చిపోయారు... చంద్రబాబుకి కౌంట్ డౌన్ మొదలైంది, టీడీపీకి ఇక నుంచి అంతిమ యాత్రే... కుట్రలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ చంద్రబాబు... చంద్రబాబుకు నరనరాన రక్తానికి బదులు కుట్రలు, కుతంత్రాలే ప్రవహిస్తాయి... రాజధాని రైతుల భూముల్ని దోచుకున్న రాక్షసుడు... పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుది... చీక‌ట్లో చిదంబ‌రం కాళ్లు పట్టుకున్నాడు... అంటూ, ఇలా పిచ్చి పిచ్చి కూతలు కూస్తూ, జగన్ మెప్పు పొందే ప్రయత్నం చేసింది...

roja 03112017 3

నిజానికి, అసలు ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టిందో ఆమకే తెలీదు... పాదయాత్ర పెర్మిషన్ గురించి, చంద్రబాబు అన్న మాటలు గురించి, రాజకీయంగా ఇది ప్ర‌భుత్వం కుట్రే అని విమ‌ర్శించొచ్చు... అంతే కాని, ప్రతి దానికి ఇలా విరుచుకుప‌డితేనే ప్రజలు మన మాటలు వింటారు అనుకుంటే ఎలా ? విచక్షణ కోల్పోయి, చంద్రబాబు లాంటి స్థాయి నాయకుడిని, జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్లు చేసుకునే రోజా, పిచ్చి పిచ్చిగా విమర్శలు చేస్తుంటే, అది జగన్ పాదయాత్రకే ఇబ్బంది... ప్రజలు ఈ పిచ్చి వాగుడికే నంద్యాలలో లాచి లాచి కొట్టారు... అయినా బుద్ధి రాకపోతే ఎలా ? ఆ అరువు తెచ్చుకున్న బీహార్ సలహాదారుడి మాటలు అయినా కొంచెం వినండి...

Advertisements

Latest Articles

Most Read