‘‘ఎడారి ప్రాంతాలైన దుబాయ్,అబుదాబి అద్భుత ప్రగతి సాధించాయి. మత్స్యకార గ్రామం సింగపూర్ అభివృద్ధికి చిరునామా అయ్యింది.అన్ని వనరులు ఉన్న ఆంధ్రప్రదేశ్ మరింత ప్రగతి సాధించాలి. అందుకు అందరూ సహకరించాలి,భాగస్వాములు కావాలి.అభివృద్ధికి మారుపేరుగా ఆంధ్రప్రదేశ్ మారాలి.అధికారులు,ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషిచేయాలి’’ అని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. నీరు-ప్రగతి,వ్యవసాయం పురోగతిపై సోమవారం తన నివాసం నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

cbn review 31102017

‘‘మూడేళ్లు కష్టపడ్డాం, నీటి సమస్య అధిగమించాం. నీరు-చెట్టు, నీరు-ప్రగతి వంటి వినూత్న కార్యక్రమాలు చేపట్టాం’’ అంటూ, శాశ్వతంగా నీటి సమస్యను అధిగమించడమే మన ముందున్న తక్షణ కర్తవ్యంగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ సంక్షోభం పూర్తిగా సమసిపోవాలని ఆకాంక్షించారు. మిలిందా గేట్స్ ఫౌండేషన్, అయోవా విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్ విశ్వ విద్యాలయం మన రాష్రంతో కలిసి పనిచేస్తున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పట్ల పూర్తి సానుకూలత ఉందని తెలిపారు. 3దేశాల పర్యటనలో మనపై విశ్వాసం కనిపించిందని,దానిని నిలబెట్టుకోవాలని,మరింత ప్రగతి సాధించాలని అన్నారు.

‘‘ఒక విజయం మరో విజయానికి బాటలు వేస్తుంది. కిడాంబి శ్రీకాంత్, పి.వి.సింధు వరుస విజయాలే అందుకు ఉదాహరణ.ఇదే స్ఫూర్తితో అందరూ పనిచేయాలి,తమ రంగాలలో రాణించాలి’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గదర్శకం చేశారు. అప్పట్లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోపిచంద్ అకాడమీకి హైదరాబాద్ లో స్థలం కేటాయించి ప్రోత్సహించడం వల్లే మనరాష్ట్రం నుంచి అనేకమంది క్రీడాకారులు రాణిస్తున్నారని గుర్తుచేశారు.ఏ రంగంలోనైనా కావాల్సినంత ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అందిస్తే అద్భుత పురోగతి సాధించవచ్చనేదానికి ఇదే ఉదాహరణగా పేర్కొన్నారు.కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో అందుకే ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి గత 3ఏళ్లలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు నరేగాను సద్వినియోగం చేసుకోవడం వల్ల సత్ఫలితాలు వచ్చాయన్నారు. ‘‘మన గౌరవం కాపాడుకోవాలి, ప్రజల గౌరవం నిలబెట్టాలి. ఎవరూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించరాదు’’ అని అధికారులు,ప్రజాప్రతినిధులను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు.

సమాజంలో వివక్షకు గురవుతున్న హిజ్రాల పై, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా కోణంలో ఆదుకుంటుంది... వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి వారి సంక్షేమానికి కృషి చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం, ఇప్పుడు హిజ్రాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది... వారికి ఇళ్లు, పెన్షన్లు, రేషన్‌కార్డులు అందించేందుకు చర్యలు తీసుకుంది... ఈ మేరకు గత నెల 21వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు..

cbn 30102017 2

2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో, 4.87 లక్షల మంది ట్రాన్స్‌జెండర్లుగా ఉన్నారు.. వారిలో శాతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నారని సమాచారం... సామాజికంగా, ఆర్థికంగా దుర్భర జీవనం గడుపుతున్న హిజ్రాలకునెలనెలా పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా రేషన్‌కార్డులు, పక్కా ఇళ్లతో పాటు ఆర్థికంగా చేయూత అందించి స్వయం ఉపాధి కల్పన చేపట్టాలని యోచిస్తోంది... ఈ చర్యతో హిజ్రాలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు... తమను సమాజంలో ఏంతో వివక్షతో చూస్తారని, ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు మామ్మల్ని పట్టించుకోలేదు అని, చంద్రబాబుకి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు... ప్రతిపక్షం కూడా మా గురించి, అలోచించి మా సమస్యలను గుర్తించాలి అని కోరుతున్నారు...

ఈ పెన్షన్స, ఇల్లు, రేషన్ కార్డులు ఇచ్చేందుకు, హిజ్రాలను గుర్తించేందుకు ప్రభుత్వం నిర్ధిష్టమైన ప్రమాణాలను రూపొందించనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచన ప్రకారం జన్మించినప్పుడు ఉన్న జెండర్‌కు వ్యతిరేకంగా వారి ప్రవర్తన తీరు ఉంటే వారిని ట్రాన్స్‌జెండర్‌గా పేర్కొన్నారు. ట్రాన్స్‌జెండర్‌గా గుర్తింపు చెందాలంటే జిల్లా కలెక్టర్‌ ఏర్పాటుచేసిన స్ర్కీనింగ్‌ కమిటీ సర్టిఫికేట్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కమిటీలో మెడికల్‌ ఆఫీసర్‌, సైకాలజిస్టు లేక సైక్రియాట్రిస్టు.. జిల్లా సంక్షేమాధికారి, ఒక ప్రభుత్వ అధికారి, ఒక ట్రాన్స్‌జెండర్‌ సభ్యులుగా ఉండాలి.

ఆంధ్రప్రదేశ్ లో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కు, అందాల అరకు ఆతిధ్యం ఇవ్వనుంది... నవంబర్ 14 నుండి 16 వరకు, దేశంలోని అత్యుత్తమమైన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కు అరకు అందాలకు, రంగురంగుల హాట్ ఎయిర్ బెలూన్స్ తోడవ్వనున్నాయి... ప్రముఖ తాజ్ బెలూన్ ఫెస్టివల్ నిర్వచించిన ఈ – ఫాక్టర్ మరియు స్కై వాల్ట్ సంస్థలతో కలిసి ఆంధ్రప్రదేశ్ టూరిజం ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఈ ఫెస్టివల్ లో, పదిహేడు దేశాలు పాల్గొంటాయి.

hot air 29102017 2

ఢిల్లీ నుండి ఒక బృందం ఈవెంట్ స్థానాన్ని ఖరారు చేసేందుకు అరకు వ్యాలీకి రెండు రోజుల క్రితం వచ్చి వెళ్ళింది... క్యాంపింగ్ సైట్ తో పాటు, బెలూన్ ఫెస్టివల్ వేదిక గుర్తించి వెళ్లారు. ఈ ఫెస్టివల్ అంతర్జాతీయ ప్రమాణాలతో సమానంగా నిర్వహించనున్నారు... అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతి ఏటా ఈ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

hot air 29102017 3

U.K., స్విట్జర్లాండ్, యుఎస్, జపాన్, మలేషియా, తైవాన్ వంటి దేశాల నుండి 17 దేశాల నుంచి వచ్చి ఈ ఫెస్టివల్ లో పాల్గుంటారు. నిర్వాహకులు మెగా ఈవెంట్ కోసం వివిధ నగరాలలో ప్రచారం చేయ్యనున్నారు . ఆకుపచ్చ అరకు వ్యాలీ, రంగురంగుల బెలూన్లతో మరింత శోభాయమానంగా కనిపించనుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ కు ముందు, విశాఖపట్నం ఆర్కే బీచ్ లో 'సౌండ్ ఆన్ సాండ్' అనే మెగా సంగీత కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. నవంబర్ 10 నుండి 12 వరకు జరిగే ఈ మెగా సంగీత కార్యక్రమంలో ఉషా ఉతుప్, బెన్నీ దయాల్, బైజూ ధర్మజన్, అమాయ దబ్లీ, మొహమ్మద్ ఇర్ఫాన్, రేవంత్, అసీస్ కౌర్లు పాల్గుంటారు...

మీ వల్ల, మా సమస్యలు అన్నీ పరిష్కారం అవుతున్నాయి... మా ఇంట్లో నుంచే సమస్యలు చెప్పే అవకాశం ఇచ్చారు... అవినీతి చేసినా చెప్పమన్నారు... మీ పుణ్యమా అని, మా సమస్యలు అన్నీ పరిష్కరమావుతుంది అంటూ, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాన్ని ప్రజలు మెచ్చుకుంటూ, ధన్యవాదాలు చెప్తున్నారు.... అదేంటి, ప్రతిపక్షం అయిన జగన్ పార్టీ ఇప్పటివరకు ఏ ఒక్క ప్రజా సమస్య పై పోరాడకుండా, కేవలం ముఖ్యమంత్రి కావాలి అనే ఆకాంక్షతోనే ఉంది కదా, ఇంకా వీళ్ళని ప్రజలు ఎందుకు మెచ్చుకుంటారు అంటారా ? అవును... అసల ఆ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించటం ఎప్పుడో మర్చిపోయింది... ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతిపక్షం అంటే 1100 మాత్రమే...

call center 30102017 2

ప్రజలు ఏ సమస్య అయినా ఫిర్యాదు చెయ్యటానికి, క్షేత్ర స్థాయి వాస్తవాలు తెలుసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతుంది... ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే, సంబంధిత అధికారుల నుంచి సమగ్ర సమాచారం కోసం, మళ్ళీ ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకుని, సమస్య పరిష్కరించి, ఫిర్యాదు చేసిన వారికి,మళ్ళీ ఫోన్ చేసి, వాళ్ళు సరే అంటేనే, ఆ ఫిర్యాదు క్లోజ్ చేస్తున్నారు... దీంతో ప్రజలు కూడా తమ సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్లీ కాల్ సెంటర్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి కాల్ సెంటర్ అధికారులను, ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. కాల్ సెంటర్ ద్వారా ప్రభుత్వం నుంచి సహాయం పొందడంతోనే, ఊరుకోకుండా తమ కష్టం తీర్చిన వారికి కృతజ్ఞతలు చెప్పకునే సంస్కారాన్ని కూడా ప్రదర్శిస్తున్నారు జనం..

call center 30102017 3

సమస్య చిన్నదైనా, పెద్దదైనా దాని పరిష్కారం మన చేతుల్లో లేనప్పడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం, పరిష్కారం కోసం ఎందరినో ఆశ్రయిస్తాం. తెలిసిన వాళ్లందరినీ సలహాలడుగుతాం...అధికారులు, రాజకీయ నాయకులు ఇలా అందరి దగ్గరకూ వెళ్తాం... అయినా పరిష్కారం కానరాని ఎన్నో సమస్యలకు, ఎందరో బాధితులకు వరప్రదాయినిగా మారింది పరిష్కార వేదిక 1100... సమస్యలు పరిష్కారంతో పాటు, లంచాలు తదితర ఫిర్యాదులు కూడా చెయ్యవచ్చు... అలా ఫిర్యాదు చేసిన వాళ్ళలో, లంచాల తిరిగి ఇచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం... నిజానికి, ఇది ఒక అద్భుతమైన ఆలోచన... ఫోన్ ద్వారా ప్రజల సమస్యలు పరిష్కారం చెయ్యటం అంటే మామూలు విషయం కావలి... ఏంతో పర్ఫెక్ట్ నెట్వర్క్ ఉండాలి... ఫిర్యాదు ప్రతి స్టేజి రిపోర్ట్ అవ్వాలి... చివరకు సమస్య పరిష్కారం అవ్వాలి... ఇదంతా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు కాబట్టే, ప్రజలు మన్ననలు పొందుతుంది... అంతే కాదు, దీని పని తీరు, సక్సెస్ స్టొరీ తెలుసుకున్న కిరణ్ బేడీ లాంటి వారు కూడా అభినందించి, ప్రధాని మోడీతో, ఇలాంటిది దేశం అంతా పెట్టాలి అని సిఫార్సు చేసారు...

Advertisements

Latest Articles

Most Read