కేంద్రం పై చంద్రబాబు స్వరం మారుతుంది... ఎన్ని తక్కువ కేటాయింపులు చేసినా మిత్ర ధర్మం పాటిస్తూ వస్తున్న చంద్రబాబు, పోలవరం విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయం తట్టుకోలేకపోతున్నారు... తాను స్వయంగా వచ్చి, కలిసి, నాలుగు ప్రత్యామన్యాలు చెప్పినా, కేంద్రం వాటిని పట్టించుకోకుండా, మేము కాంట్రాక్టర్ ని మార్చేది లేదు అని తెగిసే చెప్పటంతో, కేంద్రానికి పోలవరం త్వరగా పూర్తి చెయ్యాలి అనే ఉద్దేశం లేదు అని అర్ధమవుతుంది...
ఇక చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగారు... పోలవరం విషయంలో అన్యాయం చేస్తే, మిత్ర ధర్మం కూడా పక్కన పెట్టేస్తాను అనే సంకేతాలు ఇచ్చారు...నిన్న ప్రెస్ మీట్ లో కేంద్రం పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేసారు... ముందుగానే డబ్బు సర్దుబాటు చేస్తే తప్ప ప్రాజెక్టును నిర్మించలేమంటూ ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ట్రాయ్ చెబుతుంటే.. కేంద్ర జల వనరుల మంత్రి నితిన్ గడ్కరీ నిధులు ఇవ్వనంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు... అలాగే అమరావతి మీద గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు వెయ్యటం పై కూడా మండిపడ్డారు... నాపై కక్ష ఉంటే నేరుగా తీర్చుకోవాలే గాని, రాష్ట్ర ప్రజలేం పాపం చేశారు అంటూ ప్రతిపక్షాలకి విజ్ఞప్తి చేసారు...
ఈ సంక్లిష్ట పరిస్థుతుల్లో, చంద్రబాబు మరోసారి కేంద్రం దగ్గరకు వెళ్ళటానికి నిశ్చయించుకున్నారు.... ఆదివారం దయం 10 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులపై తన నివాసం నుంచి వర్చువల్ ఇన్స్పెక్షన్ నిర్వహిం చనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తన నివాసం నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుని అక్క డ్నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లి బయలుదేరి వెళ్ళనున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదల, కడప ఫాతిమా మెడికల్ విద్యార్ధుల అం శంపై కేంద్ర మంత్రులతో చర్చించనున్నారు. ప్రతి సోమవారం జరిగే పోలవరం రివ్యూ, ఈసారి ఆదివారం నాడే పెట్టుకుని, వాస్తవ పరిస్థితి తెలుసుకుని, కేంద్రం దగ్గర సమర్ధవంతమైన వాదన వినిపించాలి అని చంద్రబాబు ఉద్దేశం... మరి కేంద్రం తన మొండి పట్టు వీడుతుండా, లేక రాష్ట్రానికి సహకరిస్తుందా అనేది చూడాలి...