అది అనంతపురం జిల్లా పెనుకొండ మండలం అమ్మవారిపల్లె గ్రామం... ఇప్పుడు ఇది టాక్ అఫ్ ది వరల్డ్... ఎందుకంటే ఇక్కడ నిర్మించే నిర్మిస్తున్న ‘కియ’ ప్రపంచంలోనే అతిపెద్ద కార్ల ప్లాంటుగా గుర్తింపు తెచ్చుకోనుంది... దేశంలోనే అతి పెద్ద విదేశి పెట్టుబడి ఇది... ఒక పక్క ‘కియ’ కార్ల పరిశ్రమ పనులు శరవేగంగా జరుగుతుంటే, ఇప్పుడు కియా మరో అద్భతమైన వార్తా చెప్పింది...

kia 29102017 2

కియాతో పాటు, మరో 20 అనుబంధ సంస్థలు వచ్చాయి. ఈ కొంపెనీలలో దాదాపు 20000 ఉద్యోగాలు రానున్నాయి. అయితే, ఇందులో సగం మందిని, స్థానికంగా ఉన్న మహిళలకే ఉద్యోగాలు ఇవ్వటానికి కియ నిర్ణయించుకుంది... మహిళలకు ఆటోమొబైల్‌ తయారీ పరిశ్రమకు సంబంధించి నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చి వారికే ఉద్యోగ అవకాశాలు ఇవ్వనుంది... కియా తీసుకున్న నిర్ణయంతో, ఆటోమొబైల్‌ రంగంలోని దిగ్గజాలు షాక్ అయ్యాయి... అనంతపురం లాంటి వెనుకబడిన జిల్లలో, అదీ మహిళలకు సమ ప్రాధాన్యత ఇవ్వటం, సాహసోపేత నిర్ణయం అని, సరైన శిక్షణ ఇవ్వాలి అని అంటున్నాయి... దీంతో స్థానికంగా ఉన్న మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు... ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు విజ్ఞప్తి ఉంది అని, అధికారవర్గాలు చెప్తున్నాయి... మహిళా సాధికారకత అనే మాటలు చెప్పే ప్రభుత్వాలే కాని, ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున నిజం చేసి చూపిన ప్రభుత్వాలు లేవు అని స్థానిక నాయకులు అంటున్నారు..

kia 29102017 3

2019 ద్వితీయార్థం నుంచి భారతీయ మార్కెట్లో కార్ల అమ్మకాలను ప్రారంభిస్తున్నామని ఆ సంస్థ పేర్కొంది. అనంతపురం జిల్లా పెనుకొండ మండలం ఎర్రమంచి గ్రామంలో దాదాపు 600 ఎకరాల విస్తీర్ణంలో రూ.13వేల కోట్ల పెట్టుబడితో కియా సంస్థ కార్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పుతున్న సంగతి తెలిసిందే. 2018 మార్చి నాటికి ట్రయల్‌ రన్‌, 2019 సెప్టెంబరుకల్లా ఉత్పత్తిని ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏడాదికి మూడు లక్షల కార్ల ఉత్పత్తి సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నారు. అంటే... రోజుకు దాదాపు 820 కార్లు! అంటే... గంటకు సుమారు 30 కార్లు బయటికి వస్తాయి. వీటిని ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తారు.

సిక్కోలు యువకెరటం ఐక్యరాజ్యసమితిలో, భారత దేశం తరుపున గర్జించింది... ఈ నెలఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు న్యూయార్కు లో జరుగిన ఐక్య రాజ్య సమితి సమావేశాలకు శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడు ,విద్యావేత్త అయిన కింజరాపు రామ్మోహనాయుడు పాల్గున్నారు... కేంద్రప్రభుత్వం, రామ్మోహనాయుడుని స్వయంగా ఎంపిక చేసి, దేశం తరుపున పంపించింది.. గతంలో కీర్తిసేసులు కింజరాపు ఎర్రన్నాయుడు గారు ఐక్యరాజ్య సమితి సమావేశాలలో పాలొన్నారు...

ram mohan 29102017 2

ఐక్యరాజ్య సమితిలో రామ్మోహనాయుడు స్పీచ్ అద్భుతం.. అంత చిన్న వయసులో ఇంత అద్భుతంగా మాట్లాడేసరికి, కేంద్రంలో ఉన్న పెద్దలు కూడా మెచ్చుకున్నారు... 'ఐక్యరాజ్య సమితి నిరాయుధీకరణ కమిషన్‌' ఆధ్వర్యంలో నిరాయుధీకరణ యంత్రాంగం అనే అంశంపై జరిగిన సదస్సులో రామ్మోహన్‌నాయుడు ప్రసంగించారు... ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన బహుపాక్షిక విధానానికి భారతదేశం కట్టుబడి ఉందని, దేశాల మద్య తలెత్తుతున్న సమస్యలు, శాంతిని నెలకొల్పడం వంటివి నిజమైన ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు...

ram mohan 29102017 3

అంతర్జాతీయ శాంతికి, రక్షణకు భారతదేశం పాటుపడుతోందన్నారు. ఐరాస సిద్ధాంతాలకు భారత్‌ ఎల్లవేళలా కట్టుబడి ఉంటుందని పేర్కొన్నారు. నిరాయుధీకరణలో ఐరాస కీలక బాధ్యత పోషించాల్సిన అవసరం ఉందన్నారు. పదేళ్ల క్రితం నిరాయుధీకరణ యంత్రాంగాన్ని ఏర్పాటుచేసినా ఇప్పటికీ చాలా దేశాలు ఆయుధాలను తగ్గించుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రపంచ శాంతికోసం ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్ని కృషి చేయాలని గౌరవంగా భారతదేశం తరుపన కోరారు... ఈ స్పీచ్ మీరూ వినండి...

మాకు ఎన్టీఆర్ ఆదర్శం... అందుకే అసెంబ్లీని బహిష్కరిస్తున్నామని జగన్ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే... ఇవాళ ఎన్టీఆర్ ఆదర్శం అంటావ్, రేపు చంద్రబాబు ఆదర్శం అంటావ్ అని సొంత పార్టీ నేతలు అంటున్నా, జగన్ ఇదే వాదన ప్రజల్లోకి తీసుకువెళ్లమన్నారు... ఇదే విషయం పై, విదేశాలు నుంచి తిరిగివచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుని స్పందిచమనగా, ఆయన వ్యంగ్యంగా స్పందించారు...

cbn 29102017 2

"పులిని చూసి నక్క వాత పెట్టుకుందట. జగన్‌ వ్యవహారశైలి అలానే ఉంది... ఇంకా నయం ఎన్టీఆర్ ఆదర్శం అని వదిలిపెట్టారు, ఎన్టీఆర్ - జగన్ ఒక్కటే అనలేదు.. ఆయన అసెంబ్లీని బాయ్‌కాట్‌ చేయడమంటే... ఎవరో ఎందుకో... ఊరుమీద అలిగారన్న సామెతలా ఉంది" అంటూ చంద్రబాబు స్పందించారు... ఎవరైనా అసెంబ్లీ బహిష్కరిస్తారా ? ఆయన రాక పొతే పార్టీలో ఏ ఎమ్మల్యేని అసెంబ్లీకి రానివ్వడా ? దీనికి ఎన్టీఆర్ ఆదర్శం అంటాడా... ఆయనకు, ఈయనకు అసలు ఏమన్నా పోలిక ఉందా అంటూ, చంద్రబాబు వ్యాఖ్యానించారు....

cbn 29102017 3

జగన్ చేసిన ఈ వ్యాఖ్యల పై, బిజెపి నాయకులు కూడా స్పందించారు... చంద్రబాబు ప్రతి సోమవారాన్ని ‘పోలవారం’గా మార్చితే, ప్రతిపక్ష నేత జగన్‌ ప్రతి శుక్రవారం కోర్టుకు వెళుతూ శుక్రవారాన్ని కోర్టువారంగా మార్చేశాడని మంత్రి కామినేని శ్రీనివాస్‌ రాజమండ్రిలో ఎద్దేవా చేశారు.. కాగా, రాష్ట్రంలో వివిధ పార్టీల భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని, పాదయాత్రలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని విశాఖ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు నర్సీపట్నంలో వ్యాఖ్యానించారు...

పొంగూరు నారాయణ... మంత్రి నారాయణ అంటే త్వరగా అర్ధమవుతుంది... ఈయన పెద్దగా రాజకీయ విమర్శలు చెయ్యరు... ఎప్పుడూ పని పని అంటూ ఆయనకు అప్పగించిన పనిలోనే నిమగ్నమై ఉంటారు... అమరావతి బాధ్యతలు అన్నీ ఈ మంత్రి మీదే ఉన్నాయి... ఎప్పుడు పని అనే ఆలోచనలు చుట్టూ ఉండే నారాయణకు కూడా చిర్రెత్తించాడు... సైలెంట్ గా ఉండే నాయరణ కూడా ఇంత కౌంటర్ వేసేసరికి విలేకరులు అవాక్కయ్యారు... ఇంతకీ ఎవరా హీరో అంటారా...

narayana 29102017 2

ఇంకెవరు అండి... మన ప్రతిపక్ష నాయకుడు జగన్... జగన్ చేస్తున్న పనులు, ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరు పట్ల, ఎన్నాళ్ళ నుంచి దాచుకున్నారో ఏమో, ఇవాళ ఒక్క కామెంట్ తో, మొత్తం కక్కేశారు... ఆదివారం ఇయన నెల్లూరులోని చిల్డ్రన్స్‌పార్క్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ... నవంబర్ 6వతేదీ నుంచి జగన్ ప్రారంభించే పాదయాత్రపై ఆయన పలు విమర్శలు చేశారు...

narayana 29102017 3

పెద్దగా స్పందిచాకపోయినా, ఒక్క కామెంట్ తో, ఆయనలో ఉన్న ఫీలింగ్స్ అన్నీ బయటపెట్టారు..."వైఎస్ జగన్‌ది పాదయాత్ర కాదని... వైసీపీ అంతిమయాత్ర అని" సింపుల్ గా తేల్చేశారు... దీంతో అక్కడ ఉన్న విలేకరులు గెట్టిగా నవ్వేశారు...ఇంకా చెప్పండి సార్ అంటే, అంతకు మించి ఆయన గురించి ఏమి చెప్తాం, అంటూ, నెల్లూరులో జరుగుతున్న పనులు చెప్తా అంటూ చిల్డ్రన్‌ యాంఫీ థియేటర్‌, చిల్డ్రన్స్‌ లైబ్రరీ ఏర్పాటు, బేబీ స్విమ్మింగ్‌పూల్‌ అభివృద్ధి, అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్‌ లైన్‌ పనుల గురించి చెప్పారు... మొత్తానికి, సైలెంట్ గా ఉండే నాయరణ కూడా కౌంటర్ వేశారు అంటే, జగన్ మామూలోడు కాదంటూ అక్కడ ఉన్నవారు నవ్వుతూ మాట్లాడుకున్నారు...

Advertisements

Latest Articles

Most Read